సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ ఒక రోజు విరామం తర్వాత మే 16న ఆదివారం పెరిగాయి. మే 4 నుండి పెరుగుతూ వస్తున్న ధరలు ఆదివారం తొమ్మిదవసారి పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ ధరలు 30 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కూడా కొట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.92.34 నుంచి రూ.92.58కు పెరిగితే, డీజిల్ ధర లీటరుకు రూ 82,95 నుంచి రూ.83.22 చేరుకుంది.
ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్ ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ లీటరుకు 98.88 రూపాయలకు, డీజిల్ లీటరుకు రూ.90.40 చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల సమయం ముగిసిన తర్వాత మే 4 నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు చమురు ధరలను పెంచుతూ పోతున్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. ఇంధన ధరలలో ఏవైనా మార్పులు జరిగితే ఆ ధరలు 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. నేడు హైదరాబాదులో పెట్రోలు ధర రూ.96.22,డీజిల్ ధర రూ.90.73గా ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment