
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కు 1.69 రూపాయిలు పెరిగింది. డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు పెంచారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి.
ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక కఠిన నిర్ణయాలు తప్పవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రైల్వే చార్జీలను భారీగా పెంచగా, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రజలపై నేరుగా భారం పడనుంది.