
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధర
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్‌పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది.
ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది.