LPG prices
-
రేపటి నుంచి ఇవన్నీ మారుతాయి: తప్పక తెలుసుకోండి
నవంబర్ నెల ముగిసింది. రేపటి (డిసెంబర్ 1) నుంచి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్ ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎల్పీజీ ధరలుప్రతి నెల మాదిరిగానే ఆయిల్ మార్కెట్ కంపెనీలు 1వ తేదీ ఎల్పీజీ సిలిండర్ (కమర్షియల్, డొమెస్టిక్) ధరలను సవరిస్తాయి. ప్రతి నెలలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలలో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ 1న జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.TRAI గడువుడిసెంబర్ 1, 2024న.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ నిబంధనలు ఓటీపీ సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది.SBI క్రెడిట్ కార్డ్డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు.. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ వివరాలకు ఉచిత అప్డేట్ చేసుకోవడానికి గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. కాబట్టి కార్డ్ హోల్డర్లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండే అవకాశం ఉంది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుజూలై 31 గడువులోగా 2023-24 (FY 24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు.. డిసెంబర్‌లోగా తమ ITRని సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయవచ్చు. -
రోడ్డుపై కట్టెలపొయ్యితో నిరసన
-
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధరలు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్‌పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
2021లో కొత్త మార్పులు- మీరు రెడీనా?
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో ప్రజా జీవనానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలలో మార్పులకు తెరలేవనుంది. వీటిలో ప్రధానంగా చెక్కుల జారీ ద్వారా జరిగే చెల్లింపుల నిబంధనలు మారనున్నాయి. ఇదేవిధంగా యూపీఐ చెల్లింపులలో అదనపు చార్జీలతోపాటు.. కార్లు, ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగే వీలుంది. ఇక పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ కలిగిన కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు చెల్లింపుల పరిమితి రూ. 5,000కు పెరగనుంది. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేయాలంటే నంబర్‌కు ముందు 0ను జత చేయవలసి రావచ్చు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొన్ని అంశాలను చూద్దాం.. 1. చెక్ చెల్లింపులు సానుకూల చెల్లింపుల వ్యవస్థలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని సవరణలు చేపట్టింది. దీంతో రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల్లో కస్టమర్ల వివరాలను బ్యాంకులు తిరిగి ధృవ పరుచుకోవలసి ఉంటుంది. రూ. 5 లక్షలకు మించిన చెక్కుల చెల్లింపులకు ఇవి తప్పనిసరికాగా.. కొన్ని విషయాలలో కస్టమర్ల ఆసక్తిమేరకు బ్యాంకులు ఈ నిబంధనను అమలు చేసే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్) 2. పిన్‌తో పనిలేదు బ్యాంకులు జారీ చేసిన కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు రూ. 5,000వరకూ పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి రూ. 2,000గా అమలవుతోంది. రక్షణాత్మక విధానంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కోవిడ్-19 నేపథ్యంలో కస్టమర్ల భద్రతరీత్యా కూడా డిజిటల్ చెల్లింపుల పరిమితిని పెంచినట్లు తెలియజేశాయి. (పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్) 3. యూపీఐ చెల్లింపులు అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే తదితర యాప్‌ల ద్వారా వినియోగదారులు చేపట్టే చెల్లింపులపై అదనపు చార్జీల భారం పడనుంది. థర్డ్‌పార్టీ నిర్వహించే యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలను విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. జనవరి 1నుంచి థర్డ్‌పార్టీ యాప్స్‌పై 30 శాతం పరిమితిని విధించినట్లు తెలుస్తోంది. 4. ఫాస్టాగ్ తప్పనిసరి జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీల్ వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరికానుంది. ఇందుకు కేంద్ర రోడ్ రవాణా శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989కు సవరణలు చేపట్టింది. ఈ అంశంపై నవంబర్ 6నే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 5. నో.. వాట్పాప్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడిచే స్మార్ట్ఫోన్లలో ఇకపై వాట్సాప్‌కు వీలుండదు. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 వెర్షన్‌తో నడిచే స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇదేవిధంగా ఐవోఎస్9 వెర్షన్ ఐఫోన్లలోనూ వాట్సాప్ నిలిచిపోనుంది. ఈ జాబితాలో కేఏఐవోఎస్ 2.5.1 వెర్షన్‌తో నడిచే కొన్ని ఎంపిక చేసిన జియో ఫోన్లు సైతం ఉన్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. 6. ఎల్పీజీ, కార్ల ధరలు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతీ నెలా మొదటి రోజున అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సగటు ధరల ఆధారంగా వంట గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఇటీవల విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌తోపాటు, ఎల్పీజీ ధరలను సైతం పెంచిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఆటో రంగ దిగ్గజాలు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితరాలు జనవరి నుంచి వాహనాల ధరలను పెంచేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 7. 0తో మొదలు ల్యాండ్ లైన్ నుంచి దేశీయంగా మొబైల్‌కు కాల్ చేయాలంటే నంబర్‌కు ముందు 0ను జత చేయవలసి రావచ్చని టెలికం వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశాయి. తద్వారా మొబైల్ టెలికంలు తగిన మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. -
గుడ్‌న్యూస్ : తగ్గిన వంటగ్యాస్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో గృహిణులకు చమురు కంపెనీలు కొంత ఊరట కల్పించాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తిస్తుంది. తాజా తగ్గింపుతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ 54 వరకూ దిగిరాగా, 5 కిలోల చిన్న సిలిండర్ రూ 15 తగ్గింది. ప్రతి కుటుంబానికి ఏటా 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లను 12 వరకూ సమకూర్చుతున్నారు. ఈ పరిమితిని దాటితే మార్కెట్ రేటు (నాన్ సబ్సిడీ)కే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ఎల్పీజీ ధరలపై ప్రభుత్వం ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎల్పీజీ ధరల పెంపుపై ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ప్రతి నెల ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.4 ధర పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సబ్సిడీలను ఎత్తివేసే క్రమంలో 2017 జూన్ నుంచి ప్రతి నెలా ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.4 ధర పెంచాలని ప్రభుత్వం, అంతకముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆర్డర్‌ను అక్టోబర్ నుంచి ఎత్తివేసినట్టు ప్రభుత్వ టాప్ వర్గాలు చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియా, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు అక్టోబర్ నుంచి ఎల్పీజీ ధరలను పెంచడం లేదని పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ రేట్లను 10 సార్లు పెంచాయి. ఏడాదిలో ప్రతి గృహ వినియోగానికి సబ్సిడీ ధరలో 12 సిలిండర్లను అందిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2017 జూన్ నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.4 పెంచుతూ.. 2018 మార్చి నాటికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే లోపల వీటిపై ప్రభుత్వం అందించే సబ్సిడీని జీరో చేయాలని భావించింది. కానీ ధరల పెంపుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఒకవైపు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ... మరోవైపు ధరలు పెంచడం సబబు కాదని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ధరల పెంపు ఆర్డర్‌ను ప్రభుత్వం ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. -
తెలుగు రాష్ట్రాల్లో ఆ ధరలు యథాతథం
హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ విషయంలో తెలుగురాష్ట్రాల ప్రజలకు కొంత ఊరట కలుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యథాతథంగా ఉంటున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులు అంతకముందు పన్ను విధానంలో 5 శాతం వ్యాట్ చెల్లించేవారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన జీఎస్టీ కింద కూడా ఎల్పీజీ సిలిండర్‌దారులు 5 శాతం పన్ను పరిధిలోకే వస్తున్నారు. దీంతో తెలుగురాష్ట్రాల ప్రజలకు ధరల్లో పెద్ద తేడా కనిపించడం లేదు. వ్యాట్ స్థానంలో ఈ జీఎస్టీ వచ్చిందని, అంతేతప్ప మరే తేడా లేదని తెలంగాణ ఎల్పీజ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే.జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. వ్యాట్ లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలిపారు. అయితే వ్యాట్ లేని రాష్ట్రాల్లో మాత్రం జీఎస్టీతో ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధరపై 32 రూపాయల మేర పెరిగింది. ఢిల్లీలో ఎలాంటి వ్యాట్ లేకపోవడంతో అంతకముందు 446.65 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం 477.46 రూపాయలకు ఎగిసింది. ఢిల్లీ, ఛండీగర్, జమ్ముకశ్మీర్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, కొన్ని ఉత్తర రాష్ట్రాల్లో వ్యాట్ లేదా విక్రయపన్ను జీరోగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో 1 శాతం నుంచి 5 శాతంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర 613.50 రూపాయలుండగా.. దీనిలో 482 రూపాయలు వినియోగదారులు భరిస్తున్నారు. మిగతా 131 రూపాయల సబ్సిడీ కింద ప్రభుత్వం కన్జ్యూమర్ అకౌంట్లలోకి జమచేస్తోంది. -
రేటు రెట్టింపు.. గ్యాస్ ఫుల్లు!
గ్యాస్ ధర రెట్టింపు చేసిన కేంద్రం ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో గ్యాస్ ఇస్తామన్న రిలయన్స్ సాక్షి, హైదరాబాద్ 2014 ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధర పెంపు: కేంద్రం ప్రకటన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మీకు ఫుల్లుగా గ్యాస్ ఇస్తాం, ఆ మేరకు విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేసుకోండి : ట్రాన్స్‌కోకు రిలయన్స్ వర్తవూనం! పై అంశాలను గమనిస్తే చాలు.. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్ప త్తి విషయంలో రిలయన్స్ అనుసరిస్తున్న వైఖరేమిటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇంతకాలం కేజీ బేసిన్లో గ్యాస్ వెలికితీస్తోంటే ఇసుక వస్తోందని, ఇతరత్రా సాంకేతిక కారణాలు చెబుతూ ఉత్పత్తిని తగ్గించి రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యు త్ ప్లాంట్లకు సరఫరాను గణనీయంగా తగ్గించిన రిలయన్స్.. గ్యాస్ ధరను కేంద్రం రెట్టింపు చేసిన నేపథ్యంలో పూర్తిస్థారుులో సరఫరా చేస్తాననడం గమనార్హం. 11 ఎంసీఎండీలకు దిగజారిన ఉత్పత్తి: కేజీ బేసిన్లో అపారమైన సహజవాయు నిక్షేపాలు ఉన్నట్టు తొలినాళ్లలో రిలయన్స్ ప్రకటించింది. 2009లో రోజుకు 40 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. 2010 మొదట్లో ఇది ఏకంగా 60 ఎంసీఎండీల వరకు చేరింది. 2010 సెప్టెంబర్ నుంచి మాత్రం క్రమంగా గ్యాస్ ఉత్పత్తి తగ్గిస్తూ వస్తోంది. గ్యాసు వెలికితీసే సమయంలో ఇసుక వస్తోందని, ఇతర కారణాలను రిలయన్స్ చెప్పింది. అయితే రిలయన్స్ వైఖరిపై మొదట్నుంచీ అనుమానాలున్నాయి. 2009లో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర 4.2 డాలర్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ ధరను ఐదేళ్ల తర్వాత సవరిస్తామని అప్పట్లోనే ప్రకటించింది. ఆ మేరకు 2014 ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను 4.2 డాలర్ల నుంచి ఏకంగా 8.42 డాలర్లకు పెంచింది. ఈ కొత్త ధర కోసమే రిలయన్స్ 2010 నుంచి క్రమంగా గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గ్యాస్ ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే రిలయన్స్ ఉత్పత్తిని పెంచుతోందని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. కొత్తగా గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నట్టు ప్రకటించిన రిలయన్స్.. రెండు నెలల క్రితం రోజుకు 11 ఎంసీఎండీలున్న ఉత్పత్తిని ప్రస్తుతం 14 ఎంసీఎండీలకు పెంచింది. దీనిని క్రమంగా పెంచుకుంటూ 2014 ఏప్రిల్ 1 నుంచి 40 నుంచి 50 ఎంసీఎండీలకు కూడా రిలయన్స్ పెంచవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. -
'వంటగ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని సిఫారసు'
వంట గ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని కిరీట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువగా పడుతోందని, దీంతో ధరలు పెంచకతప్పదని సూచించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ మేరకు నివేదిక సమర్పించింది. వంటగ్యాస్‌పై 250 రూపాయలు, డీజల్‌పై ఐదు, కిరోసిన్‌పై నాలుగు రూపాయల చొప్పున పెంచాలని పారిఖ్ కమిటీ సూచించింది. పెట్రోలియం వనరుల సబ్సిడీ భారం 80 వేల కోట్ల నుంచి 1.30 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వానికి తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, డాలర్‌తో రుపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని కమిటీ పేర్కొంది.