నవంబర్ నెల ముగిసింది. రేపటి (డిసెంబర్ 1) నుంచి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్ ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎల్పీజీ ధరలు
ప్రతి నెల మాదిరిగానే ఆయిల్ మార్కెట్ కంపెనీలు 1వ తేదీ ఎల్పీజీ సిలిండర్ (కమర్షియల్, డొమెస్టిక్) ధరలను సవరిస్తాయి. ప్రతి నెలలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలలో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ 1న జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
TRAI గడువు
డిసెంబర్ 1, 2024న.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్‌బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ నిబంధనలు ఓటీపీ సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది.
SBI క్రెడిట్ కార్డ్
డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు.. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లను పొందలేరు.
ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్
ఆధార్ వివరాలకు ఉచిత అప్‌డేట్ చేసుకోవడానికి గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. కాబట్టి కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్‌డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండే అవకాశం ఉంది.
ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు
జూలై 31 గడువులోగా 2023-24 (FY 24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు.. డిసెంబర్‌లోగా తమ ITRని సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment