రేటు రెట్టింపు.. గ్యాస్ ఫుల్లు!
గ్యాస్ ధర రెట్టింపు చేసిన కేంద్రం
ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో గ్యాస్ ఇస్తామన్న రిలయన్స్
సాక్షి, హైదరాబాద్
2014 ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధర పెంపు: కేంద్రం ప్రకటన
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మీకు ఫుల్లుగా గ్యాస్ ఇస్తాం, ఆ మేరకు విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేసుకోండి : ట్రాన్స్‌కోకు రిలయన్స్ వర్తవూనం!
పై అంశాలను గమనిస్తే చాలు.. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాస్ ఉత్ప త్తి విషయంలో రిలయన్స్ అనుసరిస్తున్న వైఖరేమిటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇంతకాలం కేజీ బేసిన్‌లో గ్యాస్ వెలికితీస్తోంటే ఇసుక వస్తోందని, ఇతరత్రా సాంకేతిక కారణాలు చెబుతూ ఉత్పత్తిని తగ్గించి రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యు త్ ప్లాంట్లకు సరఫరాను గణనీయంగా తగ్గించిన రిలయన్స్.. గ్యాస్ ధరను కేంద్రం రెట్టింపు చేసిన నేపథ్యంలో పూర్తిస్థారుులో సరఫరా చేస్తాననడం గమనార్హం.
11 ఎంసీఎండీలకు దిగజారిన ఉత్పత్తి: కేజీ బేసిన్‌లో అపారమైన సహజవాయు నిక్షేపాలు ఉన్నట్టు తొలినాళ్లలో రిలయన్స్ ప్రకటించింది. 2009లో రోజుకు 40 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. 2010 మొదట్లో ఇది ఏకంగా 60 ఎంసీఎండీల వరకు చేరింది. 2010 సెప్టెంబర్ నుంచి మాత్రం క్రమంగా గ్యాస్ ఉత్పత్తి తగ్గిస్తూ వస్తోంది. గ్యాసు వెలికితీసే సమయంలో ఇసుక వస్తోందని, ఇతర కారణాలను రిలయన్స్ చెప్పింది. అయితే రిలయన్స్ వైఖరిపై మొదట్నుంచీ అనుమానాలున్నాయి. 2009లో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర 4.2 డాలర్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ ధరను ఐదేళ్ల తర్వాత సవరిస్తామని అప్పట్లోనే ప్రకటించింది. ఆ మేరకు 2014 ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను 4.2 డాలర్ల నుంచి ఏకంగా 8.42 డాలర్లకు పెంచింది. ఈ కొత్త ధర కోసమే రిలయన్స్ 2010 నుంచి క్రమంగా గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గ్యాస్ ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే రిలయన్స్ ఉత్పత్తిని పెంచుతోందని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. కొత్తగా గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నట్టు ప్రకటించిన రిలయన్స్.. రెండు నెలల క్రితం రోజుకు 11 ఎంసీఎండీలున్న ఉత్పత్తిని ప్రస్తుతం 14 ఎంసీఎండీలకు పెంచింది. దీనిని క్రమంగా పెంచుకుంటూ 2014 ఏప్రిల్ 1 నుంచి 40 నుంచి 50 ఎంసీఎండీలకు కూడా రిలయన్స్ పెంచవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.