
ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో గృహిణులకు చమురు కంపెనీలు కొంత ఊరట కల్పించాయి. నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తిస్తుంది.
తాజా తగ్గింపుతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ 54 వరకూ దిగిరాగా, 5 కిలోల చిన్న సిలిండర్ రూ 15 తగ్గింది. ప్రతి కుటుంబానికి ఏటా 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లను 12 వరకూ సమకూర్చుతున్నారు. ఈ పరిమితిని దాటితే మార్కెట్ రేటు (నాన్ సబ్సిడీ)కే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.