Slashed
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్‌కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
బాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌కు మరో షాక్.. జీతంలో భారీ కోత
చంద్రబాబు స్నేహితుడు, భారతీయ మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఈశ్వరన్ జీతంలో కోత విధిస్తున్నట్లు తాజాగా సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈశ్వరన్ అవినీతి, అక్రమాస్తులపై దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంట్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ జీతంలో 82 శాతం కోత విధించినట్లు పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎస్ ఈశ్వరన్ జీతం నెలకు 8,500 డాలర్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. చదవండి: ఇంటిదొంగ – ఈశ్వరన్! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేవారిలో సింగపూర్ రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు. సింగపూర్ ప్రజా సేవల విభాగం 2023 ఏడాది గణాంకాల ప్రకారం ఒక మంత్రికి జీతభత్యంగా నెలకు 41వేల డాలర్లు(సుమారు రూ.34 లక్షలు) చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 8,20,000 డాలర్లు(సుమారు రూ.6.8 కోట్లు) జీతంగా పొందుతారు. ఈశ్వరన్ వేతనం 46,750 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) కాగా.. 82% తగ్గిన తర్వాత 8,500 సింగపూర్ డాలర్లకు(రూ. 5,24,338) పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణల కేసులో జూలై 11న ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సింగపూర్ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అనంతరం మంత్రి పదవి బాధ్యతల నుంచి ఆయన్ను సింగపూర్ ప్రధాని తప్పించారు. దీంతో బెయిల్‌పై ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే 650 మిలియన్ డాలర్ల కుంభకోణంలో ఈశ్వరన్ ప్రధాన పాత్ర వహించారని విపక్షాల ఆరోపిస్తున్నాయి. చదవండి: ఈశ్వరన్.. అమరావతి స్టార్టప్ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ -
విండ్‌ఫాల్ టాక్స్ మూడు రెట్లు కోత: ఇక జాలీగా విమానాల్లో!
న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా తగ్గించింది. జెట్ ఇంధనం (ఏటీఎఫ్), డీజిల్ ఎగుమతులపై కూడా విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ సెస్ టన్నుకు రూ. 4,900 నుంచి రూ.1,700కు తగ్గించింది. జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విధించే విండ్‌ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి లీటరుకు రూ. 5 నుండి రూ. 1.5 కు కోత విధించింది. డీజిల్ ఎగుమతిపై సెస్ లీటర్‌కు రూ. 8 నుండి రూ. 5 కు తగ్గించింది. కేంద్రం పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని జీరో శాతం వద్దే ఉంచింది. సవరించిన రేట్లు అన్నీ డిసెంబర్ 16, 2022 నుండి అమల్లో ఉంటాయి. (వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!) భారతదేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో ఇంధన ఖర్చే 30-40 శాతం దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా విండ్‌ఫాల్ టాక్స్ కోత వాటి లాభాల మార్జిన్లను పెంచుతుంది. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2022 నవంబరు నుంచి దాదాపు 15 శాతం గ్లోబల్ క్రూడ్ ధరలు క్షీణిస్తున్న సమయంలో ఈ తగ్గింపు వచ్చింది. కాగా జూలై 1, 2022 నుంచి ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగిన కారణంగా చమురు కంపెనీలు పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, చమురు ఉత్పత్తిపై, అలాగే గ్యాసోలిన్, డీజిల్ , విమాన ఇంధనాల ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం సవరిస్తోంది. -
వినియోగదారులకు ఊరట: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
న్యూడిల్లీ: వంట గ్యాస్ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలో రూ.91.50 తగ్గింది. ఈ రోజు (సెప్టెంబర్ 1, 2022) నుంచి ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. (Zomato: నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్) తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) National Oil Marketing companies have reduced commercial 19-kg LPG cylinder cost by Rs 91.50 effective from today, 1st February. 19 kg commercial cylinder will cost Rs 1907 in Delhi from today: Sources — ANI (@ANI) February 1, 2022 -
మహీంద్రాకు కూడా తప్పని పాట్లు..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా నవంబర్-2021లో ఎస్యూవీ కార్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్ నెలలో 5.3 శాతం మేర ఎస్యూవీ కార్ల ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 2020లో ఉత్పత్తి చేసిన ఎస్యూవీ 18119 వాహనాలతో పోలిస్తే ఈ ఏడాదిలో 0.7 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2021లో ఉత్పత్తి చేసిన ఎస్‌యూవీల సంఖ్య 19,286 గా ఉండగా గత నెలలో 18,261 ఎస్‌యూవీలను మాత్రమే ఉత్పత్తి చేసింది. సెమీ కండక్టర్స్ కొరతతో.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత మహీంద్రాను కూడా తాకింది. సెమీకండక్టర్స్ కొరత అధింకగా ఉండటంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 32,000 యూనిట్ల ఉత్పత్తి నష్టాన్ని చవిచూసినట్లు కంపెనీ ప్రకటించింది. త్రీవీలర్, లైట్ వేట్ వాణిజ్య వాహనాల విషయానికొస్తే...కంపెనీ గత నెలలో 420 యూనిట్లను తయారు చేసింది, 2020లో ఇదే నెలలో 4,046 యూనిట్లతో పోలిస్తే గణనీయంగా 89.6 శాతం రెండంకెల తగ్గుదల నమోదు చేసింది. అమ్మకాల విషయానికొస్తే...నవంబర్ 2021లో మహీంద్రా మొత్తం ఆటో అమ్మకాలు (ప్యాసింజర్ వాహనాలు+ వాణిజ్య వాహనాలు+ ఎగుమతులు) గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 42,731 వాహనాలతో పోలిస్తే 40,102 యూనిట్లుగా ఉన్నాయి, 2020తో పోల్చుకుంటే 6.15 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: వాహన విక్రయాలకు చిప్ సెగ -
డాలర్ దెబ్బతో రూపీ ఢమాల్
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 34 పైసలు క్షీణించింది. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలరు పుంజుకోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలరుతో పోలిస్తే రూపాయి 34 పైసలు తగ్గి 72.85 స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగి 92.94 కు చేరుకుంది. శుక్రవారం రూపాయి 72.51 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 870 పాయింట్లు ఎగియగా,నిఫ్టీ 263పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. హోలీ కారణంగా ఫారెక్స్ మార్కెట్ సోమవారం పనిచేయని సంగతి తెలిసిందే. (మెటల్ షైన్ : సెన్సెక్స్ 800 పాయింట్లు జంప్) -
పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి కాలం దాకా ధరల మోతతో వాహనదారులకు బెంబేలెత్తించిన ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాహనదారులకు ఊరట లభించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం (సెప్టెంబర్ 17) పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో, పెట్రోల్ ధర లీటరుకు. 81.55 నుండి 81.40 రూపాయలకు, డీజిల్ లీటరుకు 72.56 రూపాయల నుండి 72.37కు దిగి వచ్చింది. (రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!) దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ లోపెట్రోలు 81.40, డీజిల్ 72.37 రూపాయలు కోల్‌కతాలో పెట్రోలు రూ. 82.92, డీజిల్ 75.87రూపాయలు ముంబైలో పెట్రోలు రూ. 88.07, డీజిల్ 78.85 రూపాయలు చెన్నైలో పెట్రోలు రూ. 84.44, డీజిల్ 77.73 రూపాయలు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.60, డీజిల్ ధర 78.88 రూపాయలు అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ 80.07 రూపాయలు -
గుడ్‌న్యూస్ : తగ్గిన వంటగ్యాస్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో గృహిణులకు చమురు కంపెనీలు కొంత ఊరట కల్పించాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తిస్తుంది. తాజా తగ్గింపుతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ 54 వరకూ దిగిరాగా, 5 కిలోల చిన్న సిలిండర్ రూ 15 తగ్గింది. ప్రతి కుటుంబానికి ఏటా 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లను 12 వరకూ సమకూర్చుతున్నారు. ఈ పరిమితిని దాటితే మార్కెట్ రేటు (నాన్ సబ్సిడీ)కే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
గ్యాస్ సిలిండర్ల రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు హోలీ కానుక అందించాయి. ఎల్పీజీ లేదా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. సబ్సిడీ, నాన్ సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ల ధరపై తగ్గింపును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన రేట్లు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ లో గ్యాస్ సిలిండర్ ధరలు పట్టిక కూడా వెల్లడించింది. నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై తగ్గిన సిలిండర్ల ధరలు ఇలా ఉండనున్నాయి. నాన్ సబ్సిడీ డొమెస్టిక్ సిలిండర్ రూ. 47 ధర తగ్గింపు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ రూ.45.50 నుండి 47 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర రూ.47 తగ్గి రూ. 689కి దిగివచ్చింది. కోలకతాలో రూ.45.50 తగ్గి రూ.711.50కు గా ఉండనుంది. ముంబైలో రూ.47 తగ్గి రూ.661కు చేరుకుంది. చెన్నైలో రూ. 46.50 తగ్గింపు అనంతరం ప్రస్తుతధర రూ. 699.50కుగా ఉంటుంది. సబ్సిడీ సిలిండర్ల ధర సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ఇండియన్ ఆయిల్ రెండున్నర రూపాయలకు పైగా తగ్గించింది. మార్చి 1 నుంచి సబ్సిడీ సిలిండర్లకు ఢిల్లీలో రూ.493.09 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రూ.495.63 చెల్లించాల్సి ఉండేది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.2.53 తగ్గి రూ.496.60కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.2.48 తగ్గి రూ.481.21కు చేరుకుంది. కమర్షియల్ సిలిండర్ల ధర 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు 77 నుంచి 80 రూపాయలవరకు తగ్గించింది. ఢిల్లీలో 78.50 రూపాయలు తగ్గి రూ.1230 గాను, కోల్‌కతాలో 77 రూపాయలు తగ్గి రూ. 1270.50 , ముంబైలో రూ.79 తగ్గి రూ.1181కు , చెన్నైలో రూ.80 తగ్గి రూ.1307కు గా ఉంటుంది. -
ఫ్లిప్‌కార్ట్ విలువకు భారీగా కోత!
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఫిడెలిటీ మ్యూచువల్ ఫండ్ మరోసారి షాకిచ్చింది. ఫ్లిప్‌కార్ట్ షేర్ల విలువను 36.1శాతానికి తగ్గించేసింది. భారత్‌లో అత్యంత విలువైన ఇంటర్నెట్ కంపెనీగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ను 5.56 బిలియన్ డాలర్లకు విలువ కట్టింది. 2016 ఆగస్టులో 81.55 డాలర్లగా ఉన్న ఒక్కో షేరు విలువను 2016 నవంబర్‌కు 52.13 డాలర్లకు తగ్గించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద తగ్గింపు. మొత్తంగా నాలుగుసార్లు ఫ్లిప్‌కార్ట్ విలువను ఫిడెలిటీ తగ్గించింది. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఒకటిగా ఉన్న మోర్గాన్ స్టాన్లీ కూడా ఫ్లిప్‌కార్ట్ షేర్ల విలువను సెప్టెంబర్ క్వార్టర్లో 52.13 డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇతర మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా దేశీయ అతిపెద్ద ఈ ఈ-కామర్స్ విలువకు కోతపెడుతున్నాయి.. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ స్పందించడం లేదు. ఇటీవలే సీఈవోగా బిన్నీ బన్సాల్‌ను తొలగిస్తూ కొత్త సీఈవోగా కల్యాణ్ కృష్ణమూర్తిని నియమిస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. టాప్ లెవల్ మేనేజ్మెంట్ మార్పుల అనంతరం ఈ కంపెనీ విలువకు కోత పెట్టడం గమనార్హం. -
ఈ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గాయోచ్!
ముంబై: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ లెనోవో రెండు స్మార్ట్ ఫోన్(రెండు వేరియంట్ల) ధరలను తగ్గించింది. జెడ్ 2ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరలను భారత్ మార్కెట్ లో తగ్గించిన ధరలనుప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12 తరువాత నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. లాంచింగ్ ధరనుంచి 2-3 వేలకు తగ్గించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బ్లాక్ అండ్ వేరియంట్లలో వీటిని అందుబాటులో ఉంచింది. జెడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్ 32జీబీ మోడల్ తగ్గింపు ధర రూ.14,999. లాంచింగ్ ధర రూ.17,999 (తగ్గింపు రూ.3వేలు) జెడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64జీబీ మోడల్ తగ్గింపు ధర రూ.17,499. లాంచింగ్ ధర ధర రూ.19,999, (తగ్గింపు రూ.2500) లెనోవో జెడ్ 2 ప్లస్ ఫీచర్లు డ్యూయల్ సిమ్ 4జీ + 3జీ, 5 హెచ్ డీ స్క్రీన్ 1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ 64 జీబీ 13 ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3500ఎంఏహెచ్ బ్యాటరీ కాగా లెనోవా జెడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లను గత ఏడాది సెప్టెంబర్ లో భారత మార్కట్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
భారీగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
-
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డిజీల్ ధరలను తగ్గిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోలుపై రూ.1.46, లీటరు డీజిల్ పై రూ.1.53లను తగ్గించింది. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నెల 5వ తేదీన పెట్రోల్ పై రూ.0.89, డీజిల్ పై రూ.0.86లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి పెట్రోలు, డీజిల్ రేట్లను మార్చడం ఇది ఆరోసారి. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ రేట్లు మారుతుండటంతోనే పెట్రోలు, డీజిల్ రేట్లలో తరచూ మార్పులు సంభవిస్తున్నాయి. -
భారీగా తగ్గనున్న 2000 మెడిసిన్ల ధరలు
దాదాపు రెండు వేల మెడిసిన్ల ధరలు కిందకి దిగిరానున్నాయి. అమృత్ పథకం కింద ఆ మెడిసిన్ల రేట్లను మాక్సిమమ్ రిటైల్ ధర(ఏంఆర్పీ) కంటే 90 శాతం వరకు తగ్గించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. జబల్పూర్ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ శంకుస్థాపన వేడుకకు హాజరై, ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా సుమారు రెండు వేల మెడిసిన్ల ధరలను ఎంఆర్పీ కంటే 60 నుంచి 90 శాతం రేట్లను తగ్గిస్తామని తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో రిటైల్ షాపులను మరిన్ని ప్రారంభించినున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం అవసరమైన సహాయ సహకరాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సహకారాలను అందించడానికి ఉపయోగపడాలని తెలిపారు. ఈ ఫంక్షన్లో భాగంగా రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను రూ.120 కోట్లతో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. జబల్పూర్లో ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మించిన అనంతరం, స్థానిక ప్రజలు, సమీపంలోని జిల్లాల ప్రజలు చికిత్స నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినవసరం లేదని ఈ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఏ ప్రభుత్వమైనా నిర్వహించాల్సిన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. -
హెచ్‌టీసీ10 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది..!
ముంబై: తైవాన్ కు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ 10 ధర తగ్గించింది. పండుగ సీజన్ సందర్భంగా ఆ స్మార్ట్ ఫోన్ ధరను సుమారు 5వేలుతగ్గించినట్టు ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ సిరీస్ గా పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 52,990 వద్ద లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్ డేట్ తో విడుదలై ఈ హెచ్‌టీసీ 10 ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ తో ప్రస్తుతం రూ.47,990లకే లభించనుంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్‌టీసీ10 ఫీచర్లు 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే 1440x2560 పిక్సెల్స్ రిజల్యూషన్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ 128 జీబీ ఇంర్ననల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా. 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు అమర్చడంతోపాటూ, చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ తో హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని సొంతమైన ఈ హై ఎండ్ మోడల్ ఫోన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో లాంచ్ చేసింది. అలాగే రూ.15,990గా రేంజ్ లో 'హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ' పేరుతో సెప్టెంబర్ లో మరో నయా ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
భారీగా తగ్గిన ఆ కారు ధర!
ఓ వైపు కార్ల ధరలు పెంచుతూ వినియోగదారులకు కాక పుట్టిస్తుంటే .. ఆశ్చర్యకరంగా ఫోర్డ్ కంపెనీ కార్ల ధరలను భారీగా తగ్గించేసింది. ఎంత అనుకుంటున్నారా..? ఏకంగా రూ.2.82 లక్షల మేర తన ఎండీవర్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించేసింది. ఈ ధరల తగ్గింపును ట్రెండ్ వేరియంట్ కొనుగోలుదారులు వినియోగించుకునేలా అవకాశం కల్పించింది. టైటానియం వేరియంట్స్ ధరలను మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచేసింది. ఆగస్టు మొదట్లోనే ఈ అమెరికా కారు తయారీదారి ఫిగో హ్యాచ్, ఆస్పైర్ సెడాన్లపై రూ.91వేల వరకు ధరను తగ్గించింది. అదేనెలల్లో ఎండీవర్లపై రూ.1.72లక్షల వరకు కోత విధించింది. కానీ అదే సమయంలో పరిమితంగా టైటానియం వెర్షన్లపై ధరలను పెంచింది. కొత్తగా ఎండీవర్ ట్రెండ్ వేరియంట్లపై రూ.2.82 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎస్‌యూవీల అమ్మకాలను విపరీతంగా పెంచడానికి ఫోర్డ్ ఎండీవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ధరల తగ్గింపు కేవలం అమ్మకాలను పెంచడానికి మాత్రమే కాక, తన ప్రత్యర్థి టయోటా ఫార్చ్యునర్ నవంబర్‌లో తీసుకు రాబోతున్న కొత్త వాహనాలకు పోటీ ఇవ్వడానికి కూడా ఓ కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో ధరల తగ్గింపు అనంతరం ఎండీవర్ కార్లు సరసమైన ధరల్లో మార్కెట్లో లభించనున్నాయి. ఫోర్డ్ ఎండీవర్ ట్రెండ్ 4x4 మాన్యువల్, ట్రెండ్ 4x2 ఆటోమేటిక్ వేరియంట్లపై ఈ ధరల తగ్గింపు ఎక్కువగా ఉండటం విశేషం. ఎండీ ఫాలోవర్స్‌కు కానుకగా తీసుకొచ్చిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్, వినియోగదారులు కార్ల కొనుగోలుకు మంచి అవకాశంగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. -
ఆ ఫోన్ ధరపై 6 వేలు కట్
క్రియో సంస్థ 'క్రియో మార్క్ 1' పేరుతో విడుదల చేసిన తన నూతన స్మార్ట్ ఫోన్‌పై ధరలు తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. లిమిటెడ్ పీరియడ్‌లో ఈ ఫోన్‌పై 6వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గించిన ధరతో రూ.19,999గా ఉన్న ఈ ఫోన్ ఇక నుంచి మార్కెట్లో రూ.13,999కే లభ్యంకానున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ లిమిటెడ్ ఆఫర్ ఆగస్టు 15తో ముగుస్తుందని పేర్కొంది. క్రియో మార్క్1 ఫోన్‌పై ధరలు తగ్గడం ఇదే మొదటిసారీ కాదు. గత నెలలో కూడా ఇదేమాదిరి పరిమిత కాలంలో ఈ ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. క్రియో మార్క్1 ఫీచర్లు.. 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్డీ(1440 x 2560 పిక్సల్స్) రిజల్యూషన్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ డ్యుయల్ సిమ్(మైక్రోసిమ్, నానో సిమ్) 1.95 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 21 మెగాపిక్సల్ రియర్ ఆటోఫోకస్ కెమెరా 4కే వీడియో రికార్డింగ్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ 4జీ ఎల్టీఈ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ కారు ధర రూ. లక్ష తగ్గింది..!
రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీని కొనాలనుకుంటున్నారా..అయితే మీకు శుభవార్త. రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీ ధరను ఏకంగా లక్ష రూపాయల వరకూ తగ్గిస్తూ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకీ ఎర్టిగాలకు పెరుగుతున్న జనాదరణతో, రెనాల్ట్ ఇండియా తన లాడ్జీ ఎంపీవీ ధరను తగ్గించేసింది. ఓల్డ్ ఎంపీవీ అమ్మకాలు పెంచడానికి రెనాల్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో 84బీహెచ్ పీ వేరియంట్ ధరల్లో మార్పులు రాగా.. 108బీహెచ్ పీ వేరియంట్ ధర మాత్రం అదేమాదిరి ఉన్నాయి. రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీ కొత్త ధరలు(ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) : లాడ్జీ ఎస్ టీడీ - రూ.7,58,831( తగ్గింపు రూ.96వేలు) లాడ్జీ ఆర్ఎక్స్ఈ - రూ.8,56,831( తగ్గింపు రూ.80వేలు) లాడ్జీ ఆర్ఎక్స్ఎల్ - రూ.9,43,831(తగ్గింపు రూ.55వేలు) లాడ్జీ ఆర్ఎక్స్ జడ్ - రూ.10,99,000(తగ్గింపు రూ.34వేలు) రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీను 2015 ఏప్రిల్ లో ఆవిష్కరించారు. 1.5 లీటర్ కే9కే డీజిల్ యూనిట్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, గరిష్ట అవుట్ పుట్ శక్తి 84 బీహెచ్ పీ.. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, గరిష్ట అవుట్ పుట్ శక్తి 108 బీహెచ్ పీని ఈ కారు కలిగి ఉంది. ఆటో పోర్టల్ డేటా ప్రకారం... లాడ్జీ ఎంపీవీ ఆవిష్కరణ నుంచి రెనాల్ట్ ఇండియా అమ్మకాలు కేవలం1252 యూనిట్లు మాత్రమే. 2016 మే లో 730 యూనిట్లు అమ్ముడుపోయాయి.