హెచ్టీసీ10 స్మార్ట్ఫోన్ ధర తగ్గింది..!
ముంబై: తైవాన్ కు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హెచ్టీసీ 10 ధర తగ్గించింది. పండుగ సీజన్ సందర్భంగా ఆ స్మార్ట్ ఫోన్ ధరను సుమారు 5వేలుతగ్గించినట్టు ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ సిరీస్ గా పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 52,990 వద్ద లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్ డేట్ తో విడుదలై ఈ హెచ్టీసీ 10 ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ తో ప్రస్తుతం రూ.47,990లకే లభించనుంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.
హెచ్టీసీ10 ఫీచర్లు
5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే
1440x2560 పిక్సెల్స్ రిజల్యూషన్,
4జీబీ రామ్
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్
128 జీబీ ఇంర్ననల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా.
3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు అమర్చడంతోపాటూ, చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ తో హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని సొంతమైన ఈ హై ఎండ్ మోడల్ ఫోన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో లాంచ్ చేసింది. అలాగే రూ.15,990గా రేంజ్ లో 'హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ' పేరుతో సెప్టెంబర్ లో మరో నయా ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.