flagship smartphone
-
మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. రూ.27వేల స్మార్ట్‌వాచ్..కేవలం రూ. 3 వేలకే
క్రిస్మస్, న్యూయర్కు వెల్ కమ్ చెబుతూ పలు దిగ్గజ ఈకామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ ఆయా ఫోన్లను భారీ డిస్కౌంట్లకే కొనుగోలు దారులు దక్కించుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ డివైజ్‌లపై శాంసంగ్ ఆఫర్లు పెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ధర రూ.1,54,999 ఉండగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 8,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ.1,46,999కే కొనుగోలు చేయొచ్చు. అదనంగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4ని కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ బీటీ 46ఎంఎంపై రూ. 2,999 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అన్ని ఉత్పత్తులపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, రూ. 89,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4పై రూ. 7వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 82,999 కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లు ప్రముఖ ఈ కామర్స్ సైట్లతో పాటు అన్నీ రిటైల్ స్టోర్లలో లభిస్తాయని శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో పాటు రూ.1,09,999 ఖరీదైన గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా పై రూ. 5వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ. 1,02,999కి కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రాని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.26,999 విలువైన స్మార్ట్ వాచ్ గెలాక్సీ వాచ్ 4 బీటీ 44ఎంఎంను కేవలం రూ.2,999కే పొందవచ్చు. రూ. 72,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్22ని రూ. 54,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ బడ్స్2ని కేవలం రూ. 2,999కే పొందవచ్చు. రూ.84,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్ 22 ప్లస్ రూ. 59,999కే అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 13,000 అప్‌గ్రేడ్ బోనస్, అలాగే రూ. 10,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 20,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4 బీటీ 44 ఎంఎం స్మార్ట్ వాచ్‌ను రూ. 2,999కే పొందవచ్చు. ఇక, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ . 84,999 ఉండగా.. ప్రత్యేక సేల్‌లో రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15వేలు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి.గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని రూ . 39,999 నుండి కొనుగోలు చేయొచ్చు. ఇందులో రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 7,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ రూ. 5,000 క్యాష్‌బ్యాక్, రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 32,999 నుండి అందుబాటులో ఉంటుంది. -
తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లలోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొద్దిరోజుల క్రితమే రియల్మీ 9 సిరీస్‌లో భాగంగా రియల్మీ 9 5జీ, రియల్మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్మీ 9ఐ, రియల్మీ 9 ప్రో 5జీ, రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ మోడల్స్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా రియల్మీ 9 సిరీస్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రియల్మీ 9 4జీ ను తీసుకువచ్చింది. ధర ఎంతంటే..? హైఎండ్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు అందించేందుకుగాను రియల్మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది రియల్మీ. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రానుంది. రియల్మీ 9 4జీ (6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.17,999 కాగా, రియల్మీ 9 4జీ (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.18,999 గా ఉంది. సన్ బరస్ట్ గోల్డ్, స్టార్‌గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో రానుంది. రియల్ మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సందర్భంగా...హెచ్డీఎఫ్సీ కార్డుపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుదారులకు రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఏప్రిల్ 12న అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్, రీటైల్ స్టోర్ల కొనుగోలు చేయవచ్చును. రియల్మీ 9 4జీ స్పెసిఫికేషన్స్ 6.4 అంగుళాల 90Hz అమొలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 108 ఎంపీ Samsung ISOCELL HM6 సెన్సార్ + 8ఎంపీ సూపర్ వైడ్ కెమెరా + 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...! -
194 ఎంపీ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మోటోరోలా నుంచి సూపర్ ఫ్లాగ్షిప్ మొబైల్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ ను లాంచ్ చేయనుంది. మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించిన పలు ఫీచర్స్ లీకయ్యాయి. మోటోరోలా ఫ్రంటియర్ మొబైల్ 194 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానునుట్లు సమాచారం. తొలుత 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అలాగే 144హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో రానుంది. ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వెల్లడించారు. Motorola Frontier స్పెసిఫికేషన్లు (అంచనా) 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ+ OLED డిస్ప్లే విత్ 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్ చిప్సెట్ LPDDR5 12జీబీ ర్యామ్ 194 ఎంపీ+50 ఎంపీ +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4500mAh బ్యాటరీ 125వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ 50 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు వైఫై 6ఈ యూఎస్బీ టైప్-సీ బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ -
6జీబీ ర్యామ్, పవర్ఫుల్ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్..!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో మొబైల్స్ భారత్‌లో మరింత విస్తరించేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్ చేయనుంది. టెక్నో స్పార్క్ సిరీస్‌లో భాగంగా త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్‌తో అతి తక్కువ ధరలో..! టెక్నో మొబైల్స్ అతి తక్కువ ధరలోనే మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్‌తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. టెక్నో స్పార్క్ సిరీస్‌లో భాగంగా లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ రూ. 8000 కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాదిలో టెక్నో మొబైల్స్ భారత్‌లో పదుల సంఖ్యలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. Tecno Pova 5G ఫిబ్రవరి 8న లాంచ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్ 8GB RAMతో జత చేయబడింది. Tecno Pova 5G 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. చదవండి: రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం! -
వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌లో...!
Realme GT 2 Pro to Get Three World First Innovations Company Claims: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ మరో అద్భుతమైన ఆవిష్కరణను నెలకొల్పనుంది. ప్రపంచంలోనే మొదటి ఇన్నోవేటివ్ ఫీచర్స్‌ను రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లను రియల్మీ అధికారిక యూట్యూబ్‌లో ఖాతాలో సోమవారం రోజున ప్రత్యక్ష ప్రసారం చేసింది. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫోటోగ్రఫీ, కమ్యూనికేషన్ విషయాల్లో వరల్ట్ ఫస్ట్ ఇన్నోవేషన్స్‌గా నిలుస్తోందని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ 2 ప్రో డిజైన్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో పేపర్ నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ కంపెనీ అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌కోసం ప్రఖ్యాత జపనీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawa కంపెనీతో రియల్మీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ SABIC ద్వారా బయో-పాలిమర్ మెటీరియల్‌తో నిర్మించనుంది. దీని ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లాస్టిక్ నిష్పత్తి 21.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గనుంది. రియల్మీ జీటీ 2 ప్రో కెమెరా ఫీచర్ రియల్మీ నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు న్యూ అల్ట్రావైడ్ సెన్సార్‌ను కూడా అందించింది. ఈ కొత్త సెన్సార్ 150-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూస్‌తో రానుంది. ప్రైమరీ వైడ్ సెన్సార్‌లోని 89-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ కంటే 273 శాతం ఎక్కువగా ఉంది. ఈ "అల్ట్రా-లాంగ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్"తో ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీయవచ్చుని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ 2 ప్రో కమ్యూనికేషన్ ఫీచర్ కొత్త రియల్మీ జీటీ 2 ప్రోలో యాంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి "అల్ట్రా వైడ్ బ్యాండ్ హైపర్‌స్మార్ట్ యాంటెన్నా స్విచింగ్" సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతో అన్ని దశల నుంచి ఒకే సిగ్నల్ బ్యాండ్లకు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఉత్తమ నెట్వర్క్ బ్యాండ్‌ని ఎంచుకోవడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది.యాంటెన్నా స్విచింగ్ సిస్టమ్‌తో పాటు, రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సామర్థ్యాన్ని పెంచేందుకు, 360-డిగ్రీ ఎన్ఎఫ్సీ మద్దతుతో రానుంది. చదవండి: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్ అమలులోకి వస్తే..! -
రూ.30-40 వేల బడ్జెట్లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే!
ఐక్యూ7 సిరీస్(ఐక్యూ7,ఐక్యూ7 లెజెండ్) స్మార్ట్ఫోన్లు ఆగస్టు నెలలో భారతదేశంలో రూ.30,000 నుంచి రూ.40,000 సెగ్మెంట్ లో ఎక్కువగా అమ్ముడైన 5జీ స్మార్ట్ఫోన్లుగా నిలిచాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ దేశంలోని మొబైల్ గేమింగ్ కమ్యూనిటీలో విజయవంతమైంది. ఆగస్టు నెలకు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్ వివరాలను వెల్లడిస్తూ ఇటీవల కౌంటర్ పాయింట్ నివేదికలో ఈ గణాంకాలు పంచుకుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ లో లాంచ్ చేశారు. ఈ ఐక్యూయూ మొబైల్స్ విమర్శకులు, వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ పొందాయి. ఐక్యూ 7 లెజెండ్ రూ.40,000 ధరలో అత్యుత్తమ మొబైల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. దీనిలో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ అమోల్డ్ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 66డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 లెజెండ్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,990 ధరకు, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.43,990 ధరకు మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఐక్యూ 7 రెండు వేరియెంట్లు 8జీబీ ర్యామ్, విభిన్న స్టోరేజీలతో వచ్చింది. ఇందులో ప్రస్తుతం రిటైల్ ధర రూ.29,990గా ఉంది. (చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!) -
ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మార్కెట్లలోకి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 3, హానర్ మ్యాజిక్ 3 ప్రో, హానర్ మ్యాజిక్ 3 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. అద్బుతమైన ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. హనర్ మ్యాజిక్ 3 మోడల్ ధరలు సుమారు రూ. 52,800 నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లలో రిలీజ్ కానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్ఫోన్లు 8జీబీ, 12 జీబీ ర్యామ్‌తో, 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో మార్కెట్లలోకి రానుంది. హానర్ మ్యాజిక్ 3 బ్రైట్ బ్లాక్, డాన్ బ్లూ, గ్లేజ్ వైట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.76-అంగుళాలు (1344x2772) డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్ 13ఎంపీ ఫ్రంట్ కెమెరా రియర్ కెమెరా 50ఎంపీ వైడ్ సెన్సార్ + 64 ఎంపీమోనోక్రోమ్ సెన్సార్+ 64 ఎంపీ+ 64 ఎంపీ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4600mAh బ్యాటరీ టైప్ సీ పోర్ట్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.2 50వాట్స్ చార్జింజ్ సపోర్ట్ -
2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో చైనీస్ కంపెనీ రియల్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కేవోఐగా నామకరణం చేసిన ఈ ఫోన్‌ను ప్రధాన బ్రాండుగా విడుదల చేసే వీలుంది. చైనా, జపాన్లలో సుప్రసిద్ధమైన కేవోఐ చేప పేరుతో స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. శుభప్రదంగా భావించే కేవోఐ చేపను పోలి విభిన్న కలర్స్, అందమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల కంపెనీ మోటో.. డేర్ టు లీప్ రైటప్తోపాటు.. రెండు కోయి చేపలతో అలంకరించిన పోస్టర్‌ను రియల్మీ విడుదల చేసినట్లు వెల్లడించాయి. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) ఫీచర్స్ ఇలా! ఫ్లాగ్షిప్ బ్రాండుగా 2021లో రియల్మీ తీసుకురానున్న కేవోఐ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరికల్లా మార్కెట్లో ప్రవేశించవచ్చని టెక్ నిపుణుల అంచనా. ఫోన్ ఫీచర్స్ పూర్తిగా వెల్లడికానప్పటికీ వెనుకభాగంలో చతురస్రాకారంలో కనీసం మూడు సెన్సర్స్‌తో కూడిన 64 ఎంపీ లెన్స్ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫ్లాస్క్ షేపుతో మూడు రంగుల కలయికతో కోత్త ప్యాటర్న్‌లో వెనుక కవర్ ఉండవచ్చని చెబుతున్నారు. డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ ఏర్పాటుకానుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తోపాటు.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ అంతర్గత మెమొరీకి చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత యూజర్ ఇంటర్ఫేస్తో ఫోన్ విడుదల కావచ్చు. ఇతర వివరాలు వెల్లడికావలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
శాంసంగ్ మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్
సియోల్ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తరువాత తరం గెలాక్సీ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఫిబ్రవరి 11 న శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న కార్యక్రమంలో విడుదల చేయ బోతున్నట్లు సమాచారం. ‘ఎస్ 20’ పేరుతో లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కొ ఎస్ 11 కు బదులుగా దీన్ని విడుదల చేసేందుకు యోచిస్తోంది. ఎస్ 10కు సంబంధించిన ఒక ఫోటోను టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ట్వీట్ చేసింది. ఎస్ 11 ఇ, ఎస్ 11 ,ఎస్ 11ప్లస్ కు బదులు, గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌కు కొనసాగింపుగా ఎస్ 20, ఎస్ 20 ప్లస్, ఎస్ 20 అల్ట్రా సిరీస్‌ను లాంచ్ చేయనుందని తెలిపింది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే కొన్ని మార్కెట్లలో ఎక్సినోస్ 990 ప్రాసెసర్, మెజారిటీ మార్కెట్లలో స్నాప్‌డ్రాగన్ 865 ను జోడించింది. బేస్ వేరియంట్‌గా గెలాక్సీ ఎస్ 20 6.2-అంగుళాల స్క్రీన్‌ను, ఎస్ 20 + 6.7అంగుళాల స్క్రీన్‌ను, గెలాక్సీ 20 అల్ట్రా 6.9 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20, ఎస్ 20 ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌లో 108 ఎంపీ మెయిన్‌గా, క్వాడ్ కెమెరాఫీచర్ ప్రధాన ఆకర్షణగా వుండనుంది. 4000, 4400, 5000 ఎంఏహెచ్‌బ్యాటరీని అమర్చినట్టు తెలుస్తోంది. -
అదరగొట్టే ఫీచర్లతో వన్‌ప్లస్ 7 ప్రొ : ప్రీబుకింగ్ ఆఫర్
సాక్షి, ముంబై : చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయ బోతోంది. వన్‌ప్లస్ 6 కు సక్సెసర్‌గా వన్‌ప్లస్ 7ను ఈ నెలలో ఆవిష్కరించనుంది. ఫాస్ట్ అండ్ స్మూత్ ట్యాగ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ వన్‌ప్లస్ 7 టీజర్‌ను విడుదల చేశారు. వన్‌ప్లస్ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్టును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఫాస్ట్ అండ్ స్మూత్ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఇది చాలా అందంగా ఉంటుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఫైనల్ గా వన్ ప్లస్ 7 ఫోన్ల లాంచింగ్ ను కంపెనీ బెంగుళూరులో మే 14న జరిగే ఈవెంట్లో లాంచ్ చేయనుంది. సీఈఓ విడుదల చేసిన టీజర్ వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 ప్రో 5జీపేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుందన్న అంచనాలకు బలాన్నిస్తోంది. వన్‌ప్లస్ 7 ప్రొ ఫీచర్లపై అంచనాలు 6.7 ఇంచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 3120x1440 పిక్సెల్స్ రిజల్యూషన్ 6/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 48+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారికి కంపెనీ ఓచర్లను అందిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఓచర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది. అలాగే మే 4నుంచి వెయ్యి రూపాయలతో ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ బుకింగ్ ద్వారా 15వేల రూపాయల స్ర్కీన్ రిప్లేస్మెంట్ సదుపాయం ఆరు నెలలవరకు ఉచితం. -
వన్‌ప్లస్ బంపర్ ఆఫర్ : ఈ ఫోన్‌పై రూ.10 వేలు తగ్గింపు
సాక్షి, ముంబై : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు, ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ మేకర్‌గా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్ తన లేటెస్ట్ స్టార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా వన్‌ప్లస్ 6టీ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9వేల తగ్గింపు ధరతో అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై మరో 1500 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే మొత్తం రూ.10500ల భారీ తగ్గింపు లభిస్తోందన్న మాట. గతంలో అమెజాన్ ఫ్యాబ్ సేల్‌లో రూ.3వేలు తగ్గించిన సంస్థ తాజాగా మరో తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ రూ.31,499లకు లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో గత అక్టోబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా మే 14న వన్‌ప్లస్ 7 పేరుతో మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది వన్‌ప్లస్. -
ఈ స్మార్ట్‌ఫోన్ ధర బాగా తగ్గింది
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ ఒప్పో తన లేటెస్ట్ మొబైల్ ఒప్పో ఆర్ 17 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. స్టన్నింగ్ ఫీచర్స్‌తో మూడు నెలల క్రితం (2018, డిసెంబర్) లాంచ్ అయిన ఫోన్ ధరన ఏకగా రూ.6వేలు తగ్గింపుతో అమెజాన్శ లో లభ్యమవుతోంది. దీంతో ఒప్పో ఆర్17 ప్రొ ధర రూ. 45,990 నుంచి ప్రస్తుతం రూ.39,990 లకు దిగి వచ్చింది. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కొనుగోలు చేసే కస్టమర్స్ అందరికీ ఈ ఆఫర్ లభిస్తుంది. ఎమరాల్డ్ గ్రీన్, రేడియంట్ మిస్ట్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యమవుతోది. ఒప్పో ఆర్17 ప్రో ఫీచర్లు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12+20+ T 3డీ స్టీరియో ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
ఐఫోన్ ఎక్స్‌కు పోటీగా షావోమి స్మార్ట్‌ఫోన్
షావోమి.. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ కంపెనీ పేరు మారుమోగుతోంది. ప్రతి సెగ్మెంట్లోనూ ఈ కంపెనీ స్మార్ట్ఫోన్లు తమ హవా సాగిస్తున్నాయి. కానీ ఫ్లాగ్షిప్ల దగ్గరికి వచ్చేసరికి షావోమి తన మార్కును చూపించుకోలేకపోతుంది. ముఖ్యంగా భారత్‌లో హైఎండ్ వేరియంట్ల విషయంలో వన్‌ప్లస్, హువాయ్ నుంచి గట్టి పోటీ, ఈ కంపెనీ తన సత్తాను చాటలేకపోవడం ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై షావోమి దృష్టి సారించింది. షావోమి ఎంఐ 7 పేరుతో వచ్చే ఏడాది ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. బెజెల్-లెస్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఇది రూపొందుతుంట. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్, వన్‌ప్లస్ 5టీకి గట్టిపోటీ ఇవ్వగలదని తెలుస్తోంది. మైడ్రైవర్స్ రిపోర్టు ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తారని, క్వాల్కామ్ అప్‌కమింగ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్సెట్తో రూపొందుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6.01 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే కూడా ఉంటుందట. 6జీబీ ర్యామ్, 16ఎంపీ సెన్సార్లతో వెనుకవైపు రెండు డ్యూయల్ కెమెరాలు, తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోగ్రఫీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ దీనిలో ఫీచర్లుగా ఉండబోతున్నాయని మైడ్రైవర్స్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.26,600గా ఉండబోతుందని అంచనా. దేశీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి షావోమికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో సహకరిస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. -
హెచ్‌టీసీ10 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది..!
ముంబై: తైవాన్ కు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ 10 ధర తగ్గించింది. పండుగ సీజన్ సందర్భంగా ఆ స్మార్ట్ ఫోన్ ధరను సుమారు 5వేలుతగ్గించినట్టు ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ సిరీస్ గా పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 52,990 వద్ద లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్ డేట్ తో విడుదలై ఈ హెచ్‌టీసీ 10 ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ తో ప్రస్తుతం రూ.47,990లకే లభించనుంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్‌టీసీ10 ఫీచర్లు 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే 1440x2560 పిక్సెల్స్ రిజల్యూషన్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ 128 జీబీ ఇంర్ననల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా. 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు అమర్చడంతోపాటూ, చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ తో హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని సొంతమైన ఈ హై ఎండ్ మోడల్ ఫోన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో లాంచ్ చేసింది. అలాగే రూ.15,990గా రేంజ్ లో 'హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ' పేరుతో సెప్టెంబర్ లో మరో నయా ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్ టీసీ '10' ప్రత్యేకతలు
హెచ్ టీసీ 10 స్మార్ట్ ఫోన్ ఈరోజు(మంగళవారం) సాయంత్రం మన ముందుకు రాబోతుంది. ఆన్ లైన్ ఈవెంట్ గా ఈ ఫోన్ ఆవిష్కరణ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆన్ లైన్ ఈ ఫోన్ ఆవిష్కరణ తర్వాత ఏప్రిల్ 12 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాల చెబుతున్నాయి. ఈ ఫోన్ ఆవిష్కరణకు ముందే హెచ్ టీసీ 10 ఫీచర్స్ తెలుపుతూ 50 సెకండ్ల వీడియో, ఫోటోలు లీకయ్యాయి. ఈ లీక్ లు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే మార్కెట్లోకి విడుదల కాబోతున్న హెచ్ టీసీ 10 ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 1. గతేడాది విడుదలైన ఏ9ను పోలిన విధంగా మొత్తం మెటల్ డిజైన్ తో హెచ్ టీసీ 10 రూపొందింది. చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ కలిగిఉంది. 2. పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు ఉన్నాయి. 3. 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే కలిగి ఉన్న హెచ్ టీసీ 10 ఫోన్ 1440x2560 ఫిక్సల్స్ ను ఆఫర్ చేస్తుంది. 4. ఈ ఫ్లాగ్ షిప్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇంటర్ నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది. 5. హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని ఇది కలిగి ఉంది. 6. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 12 మెగాఫిక్సల్, ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా ఈ ఫోన్ కు ఉంది. డ్యూయల్ టోన్ ఫ్లాస్ ఈ కెమెరా ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాఫిక్సల్ ఉందని సమాచారం. 7. 3,000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోన్ కలిగి ఉంది. 8. ఛార్జింగ్ ను, డేటా ఎక్సేంజ్ మార్పిడి వంటివి దీనిలో కొత్త ఫీచర్లు 9. ఈ ఫోన్ ను మెరుగైన హెచ్ టీసీ సెన్స్ 8 స్కిన్ తో రూపొందించారు. 10. గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో హెచ్ టీసీ10 వినియోగదారుల ముందుకు రాబోతుంది. -
టెరిఫిక్ ఫీచర్స్ తో 'యుటోపియా' స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 'యుటోపియా'ను విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ యూ టెలివెంచర్స్ గురువారం విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను విప్లవాత్మక ఉత్పత్తిగా, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా పేర్కొంది. ఇందులో 'అరౌండ్ యూ' అనే కొత్త ఆప్షన్ పొందుపరిచామని యూ టెలివెంచర్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ట్రావెల్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిన సమాచారం దీనిద్వారా సులవుగా పొందవచ్చన్నారు. దీంతో వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నీరు. ఇలాంటి ఫోన్ తేవాలంటే ఇతర కంపెనీలకు కనీసం ఐదేళ్లు పడుతుందని చెప్పారు. ఫింగర్ ప్రింట్ స్కాన్ తో అర సెకను కంటే తక్కువ సమయంలో లాక్ ఓపెనవుతుందని తెలిపారు. అమెజాన్ లో ప్రిబుకింగ్స్ ప్రారంభించారు. ఈనెల 26 నుంచి డెలివరీ చేస్తారు. 'యుటోపియా' స్పెసిఫికేషన్స్ 21 ఎంపీ రియర్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 5.2 ఇంచ్ షార్ప్ డబ్ల్యూక్యూహెచ్ డీ ఐపీఎస్ డిప్లే 810 క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 4 జీబీ డీడీఆర్ 4 ర్యామ్ 32జీబీ మైక్రో ఎస్డీ ఎక్స్ పాన్సన్ 5.1 ఆండ్రాయిడ్ లాలిపాప్ ధర రూ. 24,999.