హెచ్ టీసీ '10' ప్రత్యేకతలు
హెచ్ టీసీ 10 స్మార్ట్ ఫోన్ ఈరోజు(మంగళవారం) సాయంత్రం మన ముందుకు రాబోతుంది. ఆన్ లైన్ ఈవెంట్ గా ఈ ఫోన్ ఆవిష్కరణ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆన్ లైన్ ఈ ఫోన్ ఆవిష్కరణ తర్వాత ఏప్రిల్ 12 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాల చెబుతున్నాయి. ఈ ఫోన్ ఆవిష్కరణకు ముందే హెచ్ టీసీ 10 ఫీచర్స్ తెలుపుతూ 50 సెకండ్ల వీడియో, ఫోటోలు లీకయ్యాయి. ఈ లీక్ లు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే మార్కెట్లోకి విడుదల కాబోతున్న హెచ్ టీసీ 10 ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
1. గతేడాది విడుదలైన ఏ9ను పోలిన విధంగా మొత్తం మెటల్ డిజైన్ తో హెచ్ టీసీ 10 రూపొందింది. చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ కలిగిఉంది.
2. పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు ఉన్నాయి.
3. 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే కలిగి ఉన్న హెచ్ టీసీ 10 ఫోన్ 1440x2560 ఫిక్సల్స్ ను ఆఫర్ చేస్తుంది.
4. ఈ ఫ్లాగ్ షిప్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇంటర్ నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది.
5. హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని ఇది కలిగి ఉంది.
6. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 12 మెగాఫిక్సల్, ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా ఈ ఫోన్ కు ఉంది. డ్యూయల్ టోన్ ఫ్లాస్ ఈ కెమెరా ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాఫిక్సల్ ఉందని సమాచారం.
7. 3,000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోన్ కలిగి ఉంది.
8. ఛార్జింగ్ ను, డేటా ఎక్సేంజ్ మార్పిడి వంటివి దీనిలో కొత్త ఫీచర్లు
9. ఈ ఫోన్ ను మెరుగైన హెచ్ టీసీ సెన్స్ 8 స్కిన్ తో రూపొందించారు.
10. గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో హెచ్ టీసీ10 వినియోగదారుల ముందుకు రాబోతుంది.