Tecno Spark Series Smartphone With 6GB RAM Launch in February - Sakshi
Sakshi News home page

6జీబీ ర్యామ్‌, పవర్‌ఫుల్‌ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌..!

Published Fri, Feb 11 2022 6:49 PM | Last Updated on Fri, Feb 11 2022 7:37 PM

Tecno Spark Series Smartphone With 6GB RAM Price Below Rs 8000 To Launch In February - Sakshi

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ టెక్నో మొబైల్స్‌ భారత్‌లో మరింత విస్తరించేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్‌ చేయనుంది. టెక్నో స్పార్క్‌ సిరీస్‌లో భాగంగా త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

ఫ్లాగ్‌షిప్‌ గ్రేడ్‌తో అతి తక్కువ ధరలో..!
టెక్నో మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే మరో​ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్‌తో, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. టెక్నో స్పార్క్‌ సిరీస్‌లో భాగంగా లాంచ్‌ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ రూ. 8000 కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్‌ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మొబైల్‌ ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.  

ఈ ఏడాదిలో టెక్నో మొబైల్స్‌  భారత్‌లో పదుల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. Tecno Pova 5G ఫిబ్రవరి 8న లాంచ్‌ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్‌ 8GB RAMతో జత చేయబడింది. Tecno Pova 5G 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. 

చదవండి: రూ.14వేల‌కే యాపిల్ ఐఫోన్‌!! ఇక మీదే ఆల‌స్యం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement