ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మార్కెట్లలోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 3, హానర్ మ్యాజిక్ 3 ప్రో, హానర్ మ్యాజిక్ 3 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. అద్బుతమైన ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. హనర్ మ్యాజిక్ 3 మోడల్ ధరలు సుమారు రూ. 52,800 నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లలో రిలీజ్ కానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్‌ఫోన్లు 8జీబీ, 12 జీబీ ర్యామ్‌తో, 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో మార్కెట్లలోకి రానుంది. హానర్ మ్యాజిక్ 3 బ్రైట్ బ్లాక్, డాన్ బ్లూ, గ్లేజ్ వైట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
- 6.76-అంగుళాలు (1344x2772) డిస్‌ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్
- 13ఎంపీ ఫ్రంట్ కెమెరా
- రియర్ కెమెరా 50ఎంపీ వైడ్ సెన్సార్ + 64 ఎంపీమోనోక్రోమ్ సెన్సార్+ 64 ఎంపీ+ 64 ఎంపీ
- 8 జీబీ, 12 జీబీ ర్యామ్
- ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్
- 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4600mAh బ్యాటరీ
- టైప్ సీ పోర్ట్
- 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.2
- 50వాట్స్ చార్జింజ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment