న్యూఢిల్లీ: గత ఏడాది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బి మోడళ్లను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా ఇన్ సీరిస్ నుంచి మూడో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మొబైల్ ఫోన్‌ను వర్చువల్‌గా కంపెనీ వెబ్‌సైట్ మైక్రోమాక్స్‌ఇన్‌ఫో.కామ్‌లో మార్చ్ 19 న మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్‌చేయబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది.
‘తయార్ హోజావో.. ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ ,ఇన్1 కమింగ్ సూన్!, మేడ్ ఇన్ ఇండియా, ఇండియన్ డైరక్ట్ చేసిన, సూపర్‌స్టార్ వచ్చే శుక్రవారం మార్చి 19న జరగబోయే మ్యాట్ని షోకు అందరూ ఆహ్వానితులే ’ అంటూ మైక్రోమాక్స్ సోషల్ మీడియాలో షేర్‌చేసింది. ప్రస్తుతం మైక్రోమాక్స్ ఇన్ 1 ఫీచర్స్ పై ఎలాంటి సమాచారం లేదు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం మైక్రోమాక్స్ ఇన్ 1 , 6.67-అంగుళాల ఏఫ్‌హెచ్‌డీ + హోల్-పంచ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌తో రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 18వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్‌తో , బ్యాటరీ 5,000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటితో రానుంది. అంతేకాకుండా త్రిపుల్ రియర్ 48 ఎమ్‌పి ప్రైమరీ కెమరా, 2 ఎమ్‌పి సెకండరీ కెమరా , 2 ఎమ్‌పి షూటర్‌కెమరా 8ఎమ్‌పి ఫ్రంట్‌కెమరాతో రాబోతుంది.
(చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!)
Taiyyar ho jao, India Ka Naya Blockbuster, #IN1 is coming soon! Made in India, directed by Indians, starring the Indian Superstar! Releasing next Friday, 19th March, matinee show! 🎬🍿#INMobiles #INdiaKeLiye pic.twitter.com/6en3nfCiJG
— IN by Micromax (@Micromax__India) March 13, 2021
Comments
Please login to add a commentAdd a comment