శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ, లాంగ్‌లాస్టింగ్ బ్యాటరీతో నడిచే మొబైల్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎమ్12ను కంపెనీ ఈ రోజు భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా లాంచ్ చేశారు . ప్రారంభంలో గెలాక్సీ ఎమ్ సిరీస్ మొబైల్‌ను వియత్నాంలో లాంచ్ చేయగా, ఈ మొబైల్ గెలాక్సీ ఎమ్ 11 తదనంతర మొబైల్‌గా నిలుస్తోంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం12 6జీబీ+128జీబీ ధర 13,499, 4 జీబీ+64 జీబీ ధర 10,999 గా నిర్ణయించారు.ఈ మొబైల్‌ను గత నెలలో వియత్నాంలో బ్లాక్, బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో రిలీజ్ చేశారు. గెలాక్సీ ఎమ్12ను అమెజాన్ సేల్ చేయనుంది.
గెలాక్సీ ఎమ్12 ఫీచర్స్..
గెలాక్సీ ఎమ్12 నాలుగు రియర్ కెమెరాలు, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
6.5-అంగుళాల హెచ్‌డి + (720x1,600 పిక్సెల్స్) టిఎఫ్‌టి వాటర్ డ్రాప్-స్టైల్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే నాచ్‌తో రానుంది. ఎమ్12 లో 6,000 ఎమ్‌ఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు.3జీబీ, 4 జీబీ ,6 జీబీ ర్యామ్ ను కలిగి ఉండగా, 32జీబీ, 64జీబీ, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ సెన్సార్, డ్యూయల్ సిమ్ (నానో) శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్12 ఆండ్రాయిడ్ వన్ యుఐ కోర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ 8 ఎంఎం ఎక్సినోస్ ప్రాసెసర్‌ను అమర్చారు. బ్లాక్, బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment