మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్ | Micromax in 1B To Go on Sale Today at 12PM | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్

Published Thu, Nov 26 2020 2:51 PM | Last Updated on Thu, Nov 26 2020 3:19 PM

Micromax in 1B To Go on Sale Today at 12PM - Sakshi

మైక్రోమాక్స్ చివరకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బీ సిరీస్‌తో కంపెనీ భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొదటిసారిగా నవంబర్ 24న విక్రయించగా, మైక్రోమాక్స్ ఇన్ 1బీఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటి సేల్‌కి తీసుకొచ్చింది. మైక్రోమాక్స్ యొక్క ఇన్ నోట్ 1ని మొదటి సేల్‌కి తీసుకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్ అమ్ముడైంది.

మైక్రోమాక్స్ ఇన్ 1బి స్పెసిఫికేషన్స్
మైక్రోమాక్స్ ఇన్ 1బి 6.52-అంగుళాల హెచ్‌డీ + మినీ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1బీ పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 10వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎంహెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ వెనకభాగంలో అందించారు. (చదవండి: జియో పేజెస్‌లో కొత్త ఫీచర్)

మైక్రోమాక్స్ ఇన్ 1బి ధర 2 జీబీ ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 6,999, కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్‌లోని కొనుగోలుదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్.. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా 5 శాతం అదనపు తగ్గింపు పొందగలరు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మైక్రోమాక్స్ ఇన్ 1బిపై 9 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని పొందవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement