న్యూఢిల్లీ: మైక్రోమాక్స్ గత ఏడాది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బి మోడళ్లను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1కు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ తీసుకురానున్నట్లు సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ప్రకటించారు. మైక్రోమాక్స్ 5జీ ఫోన్ "అతి త్వరలో" భారతదేశంలోకి తీసుకోని వస్తున్నట్లు రాహుల్ శర్మ వినియోగదారులతో మాట్లాడిన వీడియో సెషన్‌లో వెల్లడించారు. యూజర్ అనుభవాన్ని మెరుగుపర్చడానికి మైక్రోమాక్స్ ఇన్ 1బి కోసం సాఫ్ట్‌వేర్ అప్డేట్ ను కూడా అందించనున్నట్లు వీడియోలో హైలైట్ చేశారు.
11 నిమిషాల వీడియో సెషన్ లో భవిష్యత్ ప్రణాళికలు గురించి మాట్లాడుతూ మైక్రోమాక్స్ 5జీని ప్రస్తావించారు. బెంగళూరు ఆర్&డి సెంటర్ లో 5జీ కోసం ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎప్పుడు తీసుకువస్తారో అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వీడియో సెషన్‌లో రాహుల్ శర్మ 6జీబీ ర్యామ్ అధిక డిస్ప్లే రిఫ్రెష్ రేట్, లిక్విడ్ కూలింగ్ గల స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఇంకా ఆ మోడల్ ని అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. ఆ ఫీచర్స్ ని మైక్రోమాక్స్ 5జీ ఫోన్‌తో తీసుకోని రానున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బెంగళూరులో అభివృద్ధి చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment