తైవాన్ కంపెనీ ఫీజన్‌తో జేవీ
నోయిడా ఫెసిలిటీలో ఉత్పత్తి
దేశీయంగా ప్రారంభమైన ట్రయల్స్
మైక్రోమ్యాక్స్ కో–పౌండర్ రాహుల్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న మైక్రోమ్యాక్స్, తైవాన్‌కు చెందిన స్టోరేజ్ చిప్ కంపెనీ ఫీజన్ తాజాగా మిఫీ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేశాయి. ఈ జేవీ కృత్రిమ మేధస్సుతో (ఏఐ) కూడిన స్టోరేజ్ చిప్‌సెట్ మాడ్యూళ్లను రూపొందించి, తయారు చేస్తుంది. నోయిడా ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభించామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ కో–పౌండర్ రాహుల్ శర్మ గురువారం తెలిపారు. ‘ఎన్‌ఏఎన్‌డీ కంట్రోలర్, ఎన్‌ఏఎన్‌డీ స్టోరేజ్ టెక్నాలజీలలో ఫీజన్ అగ్రగామిగా ఉంది. జేవీలో మైక్రోమ్యాక్స్‌కు 55 శాతం, ఫీజన్‌కు 45 శాతం వాటా ఉంది’ అని శర్మ చెప్పారు. భద్రత, వ్యూహాత్మక దృక్కోణం నుండి ఏ దేశానికైనా సర్వర్స్ చాలా ముఖ్యమైన అంశం అని అన్నారు. స్టోరేజ్ చిప్‌సెట్‌ల రూపకల్పనపై సంస్థ దృష్టి సారిస్తుందని చెప్పారు.
ధర పదో వంతుకు తగ్గింపు..
ఈ వెంచర్‌తో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) ధరను పదో వంతు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇది భారత్‌లోనే కాకుండా ఇతర మార్కెట్లలోనూ సంచలనం కలిగిస్తుందని చెప్పారు. భారత్‌లోని కొన్ని ప్రముఖ సంస్థలతో ట్రయల్స్ ఈ నెలలో పూర్తవుతాయని, 2025 మొదటి త్రైమాసికంలో వాణిజ్య పరంగా సరఫరా ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘స్టోరేజ్ పరిష్కారాలను అందించే కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశీ స్టోరేజ్ సొల్యూషన్స్ కంపెనీ లేని దేశాలకు.. ముఖ్యంగా భారత్‌కు ఇది చాలా ముఖ్యం. మా జాయింట్ వెంచర్ మన స్వంత డిజైన్, తయారీని కలిగి ఉండటం వల్ల విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’ అని శర్మ చెప్పారు.
మూడేళ్లలో 1,000 మంది..
కంపెనీ ఫ్రెషర్లను నియమించి వారికి స్టోరేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇస్తుందని రాహుల్ తెలిపారు. ‘మా కాన్సెప్ట్ మొదట భారత్ కోసం.. ఆ తరువాత ప్రపంచం కోసం రూపొందించబడింది. రెండు ఏళ్లలో మొదటి డిజైన్‌ను సిద్ధం చేయాలనేది మా ఆకాంక్ష. మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 1,000 ఇంజనీర్లను కలిగి ఉండాలని భావిస్తున్నాం. వీరందరికీ ఫీజన్ శిక్షణ ఇస్తుంది. కంపెనీ ఇప్పటికే ఉన్న తయారీ సంస్థల నుండి వేఫర్‌లను కొనుగోలు చేస్తుంది. స్టోరేజ్ మాడ్యూల్స్ తయారీకి వాటిని ఉపయోగిస్తుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment