పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్ | Asin to tie the knot with Rahul Sharma on Novemver 26 | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్

Published Sun, Oct 25 2015 4:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్

'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వచ్చేనెల 26న తన చెలికాడు రాహుల్‌ శర్మను మనువాడనున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరుగనుంది.

నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనుంది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొనున్నారు. ఇదే ఫామ్‌హౌజ్‌లో గతంలో షాహిద్, మీరాల రిసెప్షన్ జరిగింది. నవంబర్ 28న ముంబైలో ఈ దంపతులు మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు.

 మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్‌ శర్మ-అసిన్ కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మనస్సులు కలువడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement