Co-Founder
-
స్టోరేజ్ చిప్సెట్స్ తయారీలోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న మైక్రోమ్యాక్స్, తైవాన్‌కు చెందిన స్టోరేజ్ చిప్ కంపెనీ ఫీజన్ తాజాగా మిఫీ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేశాయి. ఈ జేవీ కృత్రిమ మేధస్సుతో (ఏఐ) కూడిన స్టోరేజ్ చిప్సెట్ మాడ్యూళ్లను రూపొందించి, తయారు చేస్తుంది. నోయిడా ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభించామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ కో–పౌండర్ రాహుల్ శర్మ గురువారం తెలిపారు. ‘ఎన్ఏఎన్డీ కంట్రోలర్, ఎన్ఏఎన్డీ స్టోరేజ్ టెక్నాలజీలలో ఫీజన్ అగ్రగామిగా ఉంది. జేవీలో మైక్రోమ్యాక్స్‌కు 55 శాతం, ఫీజన్కు 45 శాతం వాటా ఉంది’ అని శర్మ చెప్పారు. భద్రత, వ్యూహాత్మక దృక్కోణం నుండి ఏ దేశానికైనా సర్వర్స్ చాలా ముఖ్యమైన అంశం అని అన్నారు. స్టోరేజ్ చిప్సెట్ల రూపకల్పనపై సంస్థ దృష్టి సారిస్తుందని చెప్పారు. ధర పదో వంతుకు తగ్గింపు.. ఈ వెంచర్‌తో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) ధరను పదో వంతు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇది భారత్‌లోనే కాకుండా ఇతర మార్కెట్లలోనూ సంచలనం కలిగిస్తుందని చెప్పారు. భారత్‌లోని కొన్ని ప్రముఖ సంస్థలతో ట్రయల్స్ ఈ నెలలో పూర్తవుతాయని, 2025 మొదటి త్రైమాసికంలో వాణిజ్య పరంగా సరఫరా ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘స్టోరేజ్ పరిష్కారాలను అందించే కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశీ స్టోరేజ్ సొల్యూషన్స్ కంపెనీ లేని దేశాలకు.. ముఖ్యంగా భారత్‌కు ఇది చాలా ముఖ్యం. మా జాయింట్ వెంచర్ మన స్వంత డిజైన్, తయారీని కలిగి ఉండటం వల్ల విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’ అని శర్మ చెప్పారు. మూడేళ్లలో 1,000 మంది.. కంపెనీ ఫ్రెషర్లను నియమించి వారికి స్టోరేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇస్తుందని రాహుల్ తెలిపారు. ‘మా కాన్సెప్ట్ మొదట భారత్ కోసం.. ఆ తరువాత ప్రపంచం కోసం రూపొందించబడింది. రెండు ఏళ్లలో మొదటి డిజైన్‌ను సిద్ధం చేయాలనేది మా ఆకాంక్ష. మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 1,000 ఇంజనీర్లను కలిగి ఉండాలని భావిస్తున్నాం. వీరందరికీ ఫీజన్ శిక్షణ ఇస్తుంది. కంపెనీ ఇప్పటికే ఉన్న తయారీ సంస్థల నుండి వేఫర్లను కొనుగోలు చేస్తుంది. స్టోరేజ్ మాడ్యూల్స్ తయారీకి వాటిని ఉపయోగిస్తుంది’ అని వివరించారు. -
ఇవి నా కార్డు డీటైల్స్.. నచ్చింది కొనుక్కోండి
పక్కవాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వడానికే చాలామంది ఆలోచిస్తారు. అలాంటి ఈ రోజుల్లో బ్యాంక్ కార్డు డీటైల్స్ పెట్టి, నచ్చింది కొనుక్కోండి అంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇందులో నిజమెంత ఉంది? అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బోల్డ్ కేర్ కో-ఫౌండర్ 'రాహుల్ కృష్ణన్' సోమవారం (సెప్టెంబర్ 2)న తన బ్యాంక్ కార్డు వివరాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. నచ్చింది కొనుక్కోండి అంటూ.. రూ.1000 లిమిట్ పెట్టారు. ఇది చూసినవారు మొదట్లో నమ్మలేదు, కానీ రాహుల్ కృష్ణన్ ఓటీపీలను కూడా షేర్ చేశారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆ కార్డు వాడటం మొదలు పెట్టారు. లెక్కకు మించిన జనం ఆ కార్డును వాడటం వల్ల బ్యాంక్ దానిని బ్లాక్ చేసినట్లు సమాచారం.రాహుల్ కృష్ణన్ మరో ట్వీట్ చేస్తూ.. నా నెంబర్ బ్లాక్ చేశారు అని వెల్లడించారు. అయితే ఐదు గంటల్లో సుమారు 200 మంది ఈ కార్డును ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువమంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వంటి వాటిలో కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.I think my number is blocked so no more otps unfortunately :(( https://t.co/qR2LeGdWom— Rahul Krishnan (@oneandonlyrk) September 2, 2024 -
కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!
Peyush Bansal Success Story లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, పియూష్ బన్సల్ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు.ఢిల్లీలోని నీతి బాగ్‌లో 18 కోట్ల రూపాయలతో ఇంటిని కొనుగోలు చేశారు. నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద డీల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రకారం 2023, మే 19 దీనికి సంబంధించిన సేల్ డీడ్ ఒప్పందం కుదిరింది. ఈ లావాదేవీకి బన్సల్ రూ. 1.08 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు కూడా తెలుస్తోంది.ఇది 939.4 చదరపు మీటర్లు లేదా 10,111.7 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాను బన్సాల్ సురీందర్ సింగ్ అత్వాల్ నుండి కొనుగోలు చేశారు. రియాల్టీ షో షార్క్ ట్యాంక్ షా ఇండియా న్యాయమూర్తుల ప్యానెల్లో కూడా ఉన్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన కీలక ఒప్పందాల్లో ఇది లేటెస్ట్ అని తెలుస్తోంది. అలాగే మార్చిలో, ఢిల్లీలోని టోనీ గోల్ఫ్ లింక్స్‌లో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధా రోహత్గీ పేరు మీద 2,160 చదరపు గజాల బంగ్లాను రూ.160 కోట్లకు కొనుగోలు చేశారు. ఆగస్టులో, ఇంటర్డెంటల్ బ్రష్‌లను తయారు చేసే గ్లోబల్ డెంట్ ఎయిడ్స్ డైరెక్టర్ రేణు ఖుల్లర్ ఢిల్లీలోని ఖరీదైన లొకాల్టీ నిజాముద్దీన్ ఈస్ట్‌లో 873 చదరపు గజాల విస్తీర్ణంలో 61.70 కోట్ల రూపాయలకు బంగ్లాను కొనుగోలు చేశారు. ఎవరీ పియూష్ బన్సల్ వ్యాపంలో బిల్ గేట్స్ అంతటి వాడిని కావాలనే పియూష్ కల. అలా తమ డ్రీమ్ ప్రాజెక్ట్ మార్కెట్ స్టడీ చేసిన వినూత్నంగా వ్యాపారాన్ని మొదలు పెట్టి, పట్టుదల, కృషితో తన కంపెనీని అంచెలంచెలుగా తీర్చిదిద్దుతూ, అభివృద్ది పథంలో నడిపించిన ఘనత పియూష్ బన్సల్ సొంతం. మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్ మేనేజర్ నుంచి లెన్స్‌కార్ట్ కో-ఫౌండర్‌గా విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచిన వైనం వెనుక చాలా పెద్ద స్ట్రగులే ఉంది. ఈ రంగంలో దేశంలోని ప్రముఖ ఆన్లైన్ రిటైలర్లలో ఒకటిగా నిలిపిన పియూష్ విజయగాథ, ఎలా ఎదిగాడు అనే విషయాలను చూద్దాం. 1985 ఏప్రిల్ 26న ఢిల్లీలో జన్మించారు బన్సల్. కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మైక్రోసాఫ్ట్‌లో MS ఆఫీస్‌లో పనిచేశారు. 2007లో మైక్రోసాఫ్ట్‌ను విడిచి, తన ఇండియాకు తిరిగి వచ్చారు. 2007- 2009 మధ్య కొన్ని పాపులర్ సంస్థలతో పనిచేశారు. లెన్స్‌కార్ట్ ఆవిష్కరణ ఒక వైపు పీజీ చేస్తూనే సొంత వ్యాపారాన్ని మొదలు పెట్దాలన్న పట్టుదలతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులతో చర్చించి రూ.25 లక్షల ప్రారంభ పెట్టుబడితో జనవరి 2008లో సెర్చ్మైకాంపస్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గృహ నిర్మాణం, ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైమ్ ఉపాధి , అనేక ఇతర వాటితో సహా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వెబ్సైట్ ద్వారా సమాధానాలిస్తూ పాపులరయ్యారు. ఈ సమయంలో ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలు కళ్లద్దాల రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని గమనించారు. 2010లో అమిత్ చౌదరి, సుమీత్ కపాహితో కలిసి లెన్స్కార్ట్ని స్థాపించారు. మొదట్లో కాంటాక్ట్ లెన్స్‌లను ప్రిస్క్రిప్షన్పై మాత్రమే విక్రయించారు. ఆ తరువాత 2011 మార్చినుంచి ఆన్లైన్ స్టోర్ ద్వారా సన్ గ్లాసెస్ , ఫ్యాషన్ కళ్లజోళ్లతో అత్యంత వైవిధ్యమైన ఆన్లైన్ మార్కెట్‌ను సృష్టించారు. పియూష్ బన్సల్ నెట్‌వర్త్ పియూష్ నెట్‌వర్త్ 600 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్‌లో దాదాపు 4000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా1,000 స్టోర్లతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 37,500 కోట్ల రూపాయల విలువనుతో లెన్స్‌కార్ట్ 2019లో యునికార్న్ క్లబ్లో చేరింది. 2020లోమార్చిలో విక్రయాలు రెట్టింపు కావడంతో రాబడి రూ. 486 కోట్ల నుండి రూ. 1,000 కోట్లకు చేరుకుంది.అంతేకాదు ప్రధాన ప్రత్యర్థి అయిన టైటన్ ఐవేర్‌ను అధిగమించింది. 2019లో ఫార్చ్యూన్ ఇండియా బెస్ట్ 40 అండర్ 40 వ్యవస్థాపకుల జాబితాలో కూడా చోటు సంపాదించారు. ఢిల్లీలోని ఆధునిక ఫీచర్లు, ఫర్నిచర్‌తో కోట్ల విలువైన ఒక విలాసవంతమైన ఇంట్లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. రూ. 1.70 కోట్ల విలువైన జర్మన్ సెడాన్ BMW 7 సిరీస్ కారు ఇతని సొంతం. ఇది విలాసవంతమైన రైడ్ మాత్రమే కాదు, కేవలం 5.4 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.2011లో నిమిష మిట్టల్‌ని పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. -
కష్టాల్లో స్టార్టప్: గుడ్‌బై చెప్పిన కో-ఫౌండర్
బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోకు భారీ షాక్ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్‌బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతున్న స్టార్టప్ భారీ పునర్నిర్మాణ ప్లాన్ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి సంస్థ నుంచి నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. (కిర్రాక్ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్ రాయిస్’! వైరల్ వీడియో) 2015 మే నుంచిస్టార్టప్ కంపెనీకి కో-ఫౌండర్‌గా సూరి ఆరేళ్లకు పైగా పనిచేశారు. అలాగే డంజో మర్చంట్ సర్వీసెస్ (DMS)తో సహా కొత్త వ్యాపారాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా గత కొన్ని నెలలుగా నిధుల సమీకరణం కోస కష్టపడుతోంది. ఈ కష్టాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నగదు కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థకు నిధులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వీటన్నింటికి తోడు నష్టాలను చవిచూస్తోంది. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. జీతాల చెల్లింపులను పలుమార్లు వాయిదా వేసిన సంస్థ గత నెలలో, Dunzo ఆగస్టు నెల జీతాలకుగాను పేరోల్ ఫైనాన్సింగ్ కంపెనీ OneTapతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ రెండో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన గూగుల్ , బకాయిలు చెల్లించమని కోరుతూ కంపెనీకి లీగల్ నోటీసు పంపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో , గూగుల్ కలిపి దాదాపు రూ.4 కోట్లు బకాయినోటీసులిచ్చాయి. అయితే ఎపుడు సూరి పదవీకాలం ముగిసేది, అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనేది వెల్లడించలేదు. సూరి, బిశ్వాస్‌తోపాటు అంకుర్ అగర్వాల్ , ముకుంద్ ఝా కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో బిస్వాస్‌కు మాత్రమే కంపెనీలో 3.57 శాతం ఈక్విటీ వాటా ఉంది. సూరికి ఈక్విటీ లేదు జీతం కూడా లేని కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు Dunzo ఇప్పటివరకు Reliance, Google, Lightrock, Lightbox, Blume Ventures ఇతర కంపెనీల నుంచి 2015 నుండి దాదాపు 500 మిలియన్ డాలర్లను సేకరించింది. రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ప్రైవేట్ మార్కెట్ డేటా ప్రొవైడర్ Tracxn ప్రకారం, ప్రస్తుతం Dunzoలో 19 శాతం యాజమాన్యంతో Google రెండో అతిపెద్ద వాటాదారు. డంజో దాదాపు రూ.250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
పవర్ పాయింట్ సహ- సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ ఇకలేరు
Dennis Austin పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ సహ-సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ (76) ఇక లేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 1న కన్ను మూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని తన ఇంటిలో తుదిశ్వాస విడిచారని మైఖేల్ ఆస్టిన్ తెలిపారు. దీంతో ఆయన మృతిపై పలువురు టెక్ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. ఆధునిక సమాజంలో సమాచారం కమ్యూనికేషన్ కోసం ‘పవర్ పాయింట్’ కీలకమైన సాఫ్ట్వేర్ డెవలపర్‌గా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు డెన్నిస్ ఆస్టిన్. ఫోర్‌థాట్ అనే చిన్న సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా 1987లో దీన్ని విడుదల చేశారు. పవర్‌పాయింట్ ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్లకు డిజిటల్ వారసుడిగా , స్లయిడ్లను రూపొందించే శ్రమతో కూడిన ప్రక్రియను సులువుగా మార్చేశారాయన. ఫోర్థాట్ను రూపొంచిన ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ గాస్కిన్స్తో కలిసి డెన్నిస్ ఆస్టిన్ ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్ బిజినెస్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినషున్ గ్రేవాల్, 2016లో కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను ప్రదర్శించారు. పవర్‌పాయింట్ ఇప్పుడు రోజుకు 30 మిలియన్లకు పైగా ప్రెజెంటేషన్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంతోని కంపెనీ తెలిపింది. 1947, మే 28న పిట్స్‌బర్గ్‌లో జన్మించిన డెన్నిస్ ఆస్టిన్ MIT అండ్ UC శాంటా బార్బరా లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. తరువాత సాఫ్ట్వేర్ కంపెనీ ఫోర్‌థాట్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేరి పవర్‌పాయింట్‌ను కో-డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్ కొన్ని నెలల తర్వాత ఈ కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్టిన్ 1985 - 1996 వరకు అతను పదవీ విరమణ చేసేనాటికి PowerPoint ప్రాధమిక డెవలపర్‌గా పనిచేశారు. కాగా ప్రెజెంటేషన్ల కు సంబంధించి కీలక సాఫ్ట్‌వేర్‌గా పాపులర్ అయిన పవర్ పాయింట్‌కి 36-సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, PowerPoint ప్రజెంటేషన్‌కు వ్యతిరేకులు కూడా ఉన్నారు. జెఫ్ బెజోస్ , స్టీవ్ జాబ్స్ దీన్ని వ్యతిరేకించారు. ఏమి మాట్లాడుతున్నారో తెలిసినవాళ్లకి పవర్ పాయింట్ అవసరం లేంటూ జాబ్స్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. -
విజయవాడలో కార్స్24 హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోటెక్ కంపెనీ కార్స్24 వచ్చే నెలలో విజయవాడలో హబ్‌ను ప్రారంభిస్తోంది. 200 కార్లు పార్క్ చేయగలిగే సామర్థ్యంతో ఈ కేంద్రం రానుందని కార్స్24 కోఫౌండర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘దేశవ్యాప్తంగా పాత కార్ల క్రయవిక్రయాల్లో 8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మార్కెట్ 8వ స్థానంలో ఉంది. కార్స్24 వ్యాపారంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రాలు 15 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నాయి. కొత్త కార్లకు రుణం సులభంగా లభిస్తుంది. పాత కార్ల విషయంలో రుణ లభ్యత అంత సులువు కాదు. యూజ్డ్ కార్ల రంగంలో విలువ ఉందని గ్రహించాం. సులభ వాయిదాల్లో వినియోగదార్లకు రుణం అందించాలన్న ధ్యేయంతో 2019లో నాన్–బ్యాంకింగ్ ఫై నాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ దక్కించుకున్నాం. కంపెనీ కస్టమర్లలో దేశవ్యాప్తంగా 55 శాతం మంది రుణం ద్వారా కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ సంఖ్య 65 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ వృద్ధి 50 శాతం.. ఏడాది వారంటీతో సరి్టఫైడ్ కార్లను మాత్రమే విక్రయిస్తున్నామని గజేంద్ర తెలిపారు. ‘కారుకు 140 క్వాలిటీ చెక్ పాయింట్ల ద్వారా మరమ్మతులు చేపడతాం. కారు నచ్చకపోతే ఏడు రోజుల్లో వెనక్కి ఇవ్వొచ్చు. అర్హత కలిగిన వినియోగదార్లకు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యమూ ఉంది. కస్టమర్లలో 15% మహిళలు ఉన్నారు. పరిశ్రమ 15 శాతం వృద్ధి చెందితే, కార్స్24 ఏకంగా 50% నమోదు చేస్తోంది. వ్యవస్థీకృత రంగంలో రెండవ స్థానంలో ఉన్నాం. 2025 నాటికి తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం యూజ్డ్ కార్స్ విపణిలో 5% వాటా సొంతం చేసుకున్నాం. వచ్చే ఏడాది రూ.30–50 లక్షల ధరల శ్రేణి విభాగంలోకి ఎంట్రీ ఇస్తాం. ఇప్పటి వరకు భారత్‌లో 8 లక్షల కార్లు విక్రయించాం. 2022–23లో ఈ సంఖ్య 2.5 లక్షల యూనిట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధి ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. -
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్‌లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్‌గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్‌ను, 12.8 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్‌ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నిఖిల్ కామత్ (34) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంపదలో సగం సమాజానికి దానమిస్తున్నట్టు ప్రతిజ్ఞను తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో చేరి ప్రసిద్ధ పెట్టుబడిదారులు సరసన చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు తమ సంపదను దానం చేస్తామని ప్రకటించిన నాలుగో భారతీయుడు, భారతదేశపు అతి పిన్న వయస్కుడు నిఖిల్ కామత్ కావడం గమనార్హం. ఒక యువ పరోపకారిగా గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం చేస్తూ ప్రమాణం చేయడం) లో చేరడాన్ని గౌరవంగా భావిస్తూన్నానని, ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపించేందుకు తానీ నిర్ణయించుకున్నాను అని కామత్ వెల్లడించాడు. మరింత సమానత్వంతో కూడిన సమాజం అనే ఫౌండేషన్ లక్ష్యం తన ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) దేశీయంగా విప్రో అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి ఈ కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆర్థిక వనరులలో ఎక్కువ భాగం లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా ఇస్తారు. అలాగే నితిన్ కామత్ నేతృత్వంలోని రెయిన్‌మాటర్ ఫౌండేషన్, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి వీటికనుగుణంగా జీవనోపాధికి మద్దతుగా పనిచేసే సంస్థలకు మద్దతు ఇస్తుంది. 90 శాతం మందికి చెందాల్సింది కేవలం 10 శాతం మందికే 2021లో ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలో 90 శాతం మందికి చెందాల్సినవి కేవలం 10 శాతం మంది చేతిలో ఉండకూడదు. జీవితంలో ముందుగానే ఇవ్వడం ప్రారంభించమని ప్రజలను ప్రోత్సహించాలనే ఫిలాంత్రపి ఫిలాసఫి అని చెప్పుకొచ్చారు. రోజుల్లో యువకులుగా డబ్బులు సంపాదించడం మొదలుపెడితే, అది రెండింతలు, పదింతలు అవుతుంది. మన లైఫ్ స్టయిల్‌గా పెద్దగామారదు. మరి సంపాదించిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. అలా కాకుండా మన చుట్టూ ఉన్న, అవసరమైన వారికి సహాయపడే విధంగా ఆ డబ్బును వినియోగిస్తే ఆ కిక్కే వేరని కామత్ అన్నారు. ఇదీ చదవండి: రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ఫోర్బ్స్ ప్రకారం, కామత్ 3.45 బిలియన్ల డాలర్ల (రూ. 28 వేల కోట్లు) సంపదలో 50 శాతాన్ని కట్టుబడివాతావరణ మార్పు, శక్తి, విద్య ,ఆరోగ్యం వంటి విషయాలకు విరాళమివ్వడానికి నిర్ణయించుకున్నా నంటూ తన ప్రతిజ్ఞ లేఖలో చెప్పారు. దీనికి అదనంగా, యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (YIPP), వ్యవస్థాపకులతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతం స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తారు. జెరోధా సహ వ్యవస్థాపకులు సోదరులు నిఖిల్, నితిన్ కామత్ అనేక దాతృత్వ విరాళాలకు ప్రసిద్ధి చెందారు. కామత్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి 2022లో రూ.100 కోట్ల వ్యక్తిగత సంపదను విరాళంగా ఇచ్చారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ప్రకారం వీరి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సాయం 300 శాతం ఎక్కువ. దేశీయంగా తొమ్మిదో అతిపెద్ద ఫిలాంత్రపిస్టులుగా ఉన్నారు. 2010లో వారెన్ బఫెట్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గివింగ్ ప్లెడ్జ్‌పై 29 దేశాలకు చెందిన దాదాపు 241 మంది పరోపకారులు సంతకాలు చేశారు.(నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) -
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్‌ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్‌తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్‌బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
న్యూయార్క్: అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడుగోర్డాన్ మూరే (94)కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇంటెల్ కార్పొరేషన్ తన సహ వ్యవస్థాపకుడికి నివాళులర్పించింది. ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ ట్వీట్ చేసింది. మూరే దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ వ్యాపార వర్గాలు నివాళులర్పించాయి. యాపిల్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు ఆగమనానికి ఆద్యుడు మూరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. Today, we lost a visionary. Gordon Moore, thank you for everything. pic.twitter.com/bAiBAtmd9K — Intel (@intel) March 25, 2023 మూరే ఎప్పుడూ 'యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్' అని తనను తాను పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన టీచర్ కావాలనుకునేవారట. కానీ ఎలక్ట్రానిక్స్‌ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. మైక్రోచిప్ పరిశ్రమలో 500 డాలర్ల పెట్టుబడితో బిలియనీర్‌గా అవతరించారు. 1960లలో కంప్యూటర్ చిప్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కాలిఫోర్నియా సెమీకండక్టర్ చిప్ మేకర్ ఇంటెల్.. సిలికాన్ వ్యాలీకి ఆ పేరు రావడానికి దోహదపడింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, గతంలో అమెరికన్ విస్తారమైన ఉక్కు పారిశ్రామిక ఆధిపత్యానికి బ్రేక్ వేసింది ఇంటెల్. ఇంటెల్ ఆవిష్కారం మూరే అతని దీర్ఘకాల సహచరుడు రాబర్ట్ నోయ్స్ జూలై 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. వందల మిలియన్ల మందికి ల్యాప్‌టాప్ కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత, టోస్టర్ ఓవెన్లు, బాత్రూమ్ స్కేల్స్ , టాయ్ ఫైర్ ట్రక్కుల నుండి టెలిఫోన్లు, ఆటోమొబైల్స్ ,ఎయిర్‌క్రాఫ్ట్ దాకా తమ మైక్రోప్రాసెసర్లతో అరుదైన ఘనతను మూరే దక్కించుకున్నారు. 1975లో ఇంటెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికంటేముందు మూరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు 1979లో బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా నియమితుడయ్యారు. 1987లో సీఈవోగా పదవి నుంచి వైదొలగి ఛైర్మన్‌గా ఉన్నారు. మరో విశేషమేమిటంటే, 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన 80శాతం కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్లే. ఫలితంగా చరిత్రలో అత్యంత సంపన్నమైన సెమీ కండక్టర్ వ్యాపారంగా నిలిచింది. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) గొప్ప దాత మూరే మూరే, అతని భార్య బెట్టీ మూరేతో కలిసి విస్తృత దానాలు చేశారు. 2001లో వీరిద్దరూ కలిస బెట్టీ మూరే ఫౌండేషన్‌ను స్థాపించారు. 175 మిలియన్ ఇంటెల్ షేర్లను విరాళంగా ఇచ్చారు. 2001లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 600 మిలియన్ డాలర్లతో ఒక విశ్వ విద్యాలయానికి అందించిన ఏకైక గొప్ప బహుమతినిచ్చిన గౌరవాన్ని దక్కించుకున్నారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) మూర్స్ లా కంప్యూటర్ విప్లవం ప్రారంభమవడానికి రెండు దశాబ్దాల ముందే కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతాయని మూరే ముందే ఊహించాడు. ఆ తర్వాత దీన్ని ప్రతి రెండేళ్లకు అని సవరించారు. దీన్నే మూర్స్ లా అని పిలుస్తారు. -
230 మిలియన్లకు చేరిన యూజర్లు, నెట్‌ఫ్లిక్స్ సీఈవో పదవికి రీడ్ హేస్టింగ్స్ గుడ్‌బై
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గత ఏడాది ముగిసే సమయానికి నిపుణుల అంచనాలకు మించి ప్రపంచ వ్యాప్తంగా 230 మిలియన్ సబ్‌స్కైబర్లు చేరినట్లు ప్రకటించింది. పాస్వర్డ్ షేరింగ్, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా సేవల్ని నిలిపి వేయడం, ఆర్ధిక అనిశ్చితితో ఆ సంస్థ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. అయితే ‘వెడ్నస్డే’, ‘హ్యారీ అండ్ మేఘన్’ షోల కారణంగా చేజారిపోయిన సబ్‌స్కైబర్లు తిరిగి చేరినట్లు తెలిపింది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ డీవీడీ సర్వీసుల్ని రెంట్ ఇచ్చే స్థాయి నుంచి ఎంటర్టైన్మెంట్ దిగ్గజంగా అవతరించేందుకు సుదీర్ఘకాలం పాటు విశేష్ సేవలందించిన రీడ్ హేస్టింగ్స్ నెట్‌ఫ్లిక్స్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని రీడ్ హేస్టింగ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇక, ఆయన బాధ్యతల్ని సీఎఫ్ఓ గ్రెగ్ పీటర్స్, టెడ్ శారండోస్‌కు అప్పగించారు. తాను ఇకపై ఇతర టెక్ దిగ్గజ వ్యవస్థాపకుల తరహాలోనే కార్యనిర్వాహక ఛైర్మన్‌గా కొనసాగుతానని హేస్టింగ్స్ చెప్పారు. మూడు నెలల్లో 7.3 మిలియన్ల సబ్‌స్కైబర్లు అంతేకాదు మూడు నెలల్లో 7.3 మిలియన్ల మంది చందాదారులు చేరగా..ఆ మొత్తం సంఖ్య 230 మిలియన్ల మందికి చేరింది. ఇక హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన వెడ్నస్డే,ఆడమ్స్ ఫ్యామిలీలు అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది. -
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్: ఫోన్‌ఫే కో-ఫౌండర్లు పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 2022లో నిర్వహించిన అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ దేశీయ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్థాపకులు రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. 8వ ఫ్రాంచైజీ- ముంబై మీటార్స్‌ను ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు. అలాగే భారత వాలీబాల్ టీమ్ మాజీ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారని ఫోన్‌పే ఫౌండర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్ క్రీడాకారుడిగా వాలీబాల్ ఆట ఆనందం గురించి తనకు తెలుసునని రూపే పీవీఎల్ తమకు ఖచ్చితమైన అవకాశాన్ని ప్రొఫెషనల్ మార్గంలో ప్రపంచశ్రేణి స్ధాయిలో నిర్మించే అవకాశం అందిస్తుందని భావిస్తున్నామంటూ కోఫౌండర్ సమీర్ నిగమ్ సంతోషం వెలిబుచ్చారు. భారతీయ క్రీడా వ్యవస్థ అత్యంత ఉత్సాహ పూరిత మైందనీ, ముఖ్యంగా క్రికెటేతర రంగంలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్న రంగంలో తగిన తోడ్పాటునందించేందుకు రూపే పీవీఎల్ తమకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మరో కో ఫౌండర్ రాహూల్ చారి తెలిపారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ అత్యంత గౌరవనీయమైన కార్పోరేట్ లీడర్లు సమీర్, రాహుల్‌లు ఫ్రాంచైజీ యజమానులుగా చేరడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ముంబై ఫ్రాంచైజీ యజమానులును స్వాగతించిన థామస్ ముత్తూట్, యజమాని, కొచి బ్లూ స్పైకర్స్ మాట్లాడుతూ వారి వ్యాపార అనుభవం, ఈ క్రీడ పట్ల అభిరుచి రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు తోడ్పడుతుందనిపేర్కొన్నారు. రెండో సీజన్ 2023 సంవత్సరారంభంలో ప్రారంభమవుతుందని అంచనా. వాలీబాల్ అంతర్జాతీయ సంస్ధ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ వాలీబాల్, ఎఫ్‌ఐవీబీ)కు వాణిజ్య విభాగం, వాలీబాల్ వరల్డ్ ఇప్పుడు పీవీఎల్‌తో చేతులు కలపడంతో పాటుగా పలు సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్ట్రీమింగ్ భాగస్వామిగా వ్యవహరించనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. ఈ లీగ్‌కు మొత్తం 133 మిలియన్ల టెలివిజన్ వ్యూయర్షిప్ ఉంది. ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలలో కామెంట్రీ ఎంచుకునే అవకాశమూ అందించింది. -
తప్పు చేస్తే సహించేదేలే ! భారత్‌పే సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహవ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్ గ్రోవర్‌కు భారత్‌పే తాజాగా షాకిచ్చింది. అన్ని పొజిషన్ల నుంచీ గ్రోవర్ పేరును తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు సైతం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో గ్రోవర్‌కున్న వాటాలపైనే ఆంక్షలు విధించనుంది. రానున్న బోర్డు సమావేశంలో చేపట్టనున్న అంశాల వివరాలు అందుకున్న గ్రోవర్ రాజీనామా చేసినట్లు భారత్‌పే వెల్లడించింది. కంపెనీలో గ్రోవర్ కార్యకలాపాలపై స్వతంత్ర ఆడిట్ నివేదికను బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టనున్న అంశాన్ని సైతం గ్రోవర్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. ముందురోజు సాయంత్రం నిర్వహించిన సమావేశం అర్ధరాత్రి వరకూ కొనసాగినట్లు వెల్లడించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే హక్కులను కంపెనీ రిజర్వ్ చేసుకున్నట్లు తెలియజేసింది. క్యూఆర్ కోడ్స్ ద్వారా వివిధ షాప్ యజమానులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు భారత్‌పే వీలు కల్పించే సంగతి తెలిసిందే. ఆహ్వానం ఇలా బుధవారం(2న) రాత్రి 7.30కు చేపట్టనున్న బోర్డు మీటింగుకు హాజరుకావల్సిందిగా గ్రోవర్‌కు మంగళవారం ఈమెయిల్ అందడంతో 12.05కు రాజీనామా చేసినట్లు భారత్‌పే పేర్కొంది. గ్రోవర్ కుటుంబం, అతని కుటుంబ సభ్యులు కంపెనీ నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు.. నకిలీ వెండార్స్ సృష్టి ద్వారా కంపెనీ ఖాతాల నుంచి సొమ్మును దారిమళ్లించినట్లు ఆరోపించింది. తద్వారా ధనాన్ని ఆర్జించడమేకాకుండా, విలాసవంత జీవనవిధానాలకు సొమ్మును వినియోగించినట్లు ఆరోపణల్లో తెలియజేసింది. కంపెనీ ఎండీ, బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయడంతో గ్రోవర్ ఉద్యోగ బాధ్యతలను రద్దు చేసేందుకు భారత్‌పే నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
కాబూల్‌లో బరాదర్ చర్చలు
కాబూల్: అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ శనివారం కాబూల్‌కు చేరుకున్నారు. తాలిబన్ దళాధిపతులు, విధాన నిర్ణేతలు, మత పెద్దలు, అష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో బరాదర్ చర్చించనున్నారని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘వచ్చే కొద్ది వారాల్లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతోపాటు, కొత్త పరిపాలనా విధానంతో సిద్ధంగా ఉన్నాం. పశ్చిమ దేశాలు నిర్వచించినట్లుగా ప్రజాస్వామ్య రూపురేఖల్లో నూతన ప్రభుత్వం ఉండబోదుగానీ ప్రభుత్వం ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తుంది’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు ఆయన చెప్పారు. -
అఫ్గానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా బరాదర్?
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా పని చేసిన అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో విదేశాలకు పరారయ్యారు. దేశంలో ఇక తాలిబన్ పాలన ఖాయమే అని తేలినప్పటికీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలయ్యింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కల్లోల అఫ్గాన్ పాలనా పగ్గాలను బరాదర్‌కు కట్టబెట్టేందుకు తాలిబన్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల రాజకీయ విభాగం చీఫ్‌గా పలుదేశాలతో సంబంధాలు నెరపడం ఆయనకు అనుకూలించే అంశమని భావిస్తున్నారు. ముల్లా ఒమర్‌కు కుడిభుజం ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ 1968లో అఫ్గానిస్తాన్‌లోని ఉరుజ్గన్ ప్రావిన్స్‌లో దే రహ్వోద్ జిల్లాలో వీత్మాక్ అనే గ్రామంలో జన్మించారు. పుట్టుక రీత్యా సదోజాయ్ తెగకు చెందిన దుర్రానీ పుష్తూన్ వర్గానికి చెందినవాడు. యువకులుగా ఉన్నప్పుడే ముల్లా మహమ్మద్ ఒమర్, బరాదర్ మంచి స్నేహితులయ్యారు. 1980వ దశకంలో కాందహార్ ప్రాంతంలో సోవియట్–అఫ్గాన్ యుద్దంలో బారదార్ పాల్గొన్నాడు. అప్పట్లో సోవియట్ యూనియన్ మద్దతుతో కొనసాగుతున్న అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిదీన్ అనే సంస్థలో చేరి పోరాటం సాగించాడు. నిజానికి మొదట్లో అతడి పేరు చివరన బరాదర్ లేదు. ప్రాణ స్నేహితుడు, తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా మహమ్మద్ ఒమర్ అతడి పేరు చివర బరాదర్(సోదరుడు) అని చేర్చాడు. సోవియట్–అఫ్గాన్ యుద్దం తర్వాత కాందహార్ ప్రావిన్స్‌లోని మైవాంద్లో ఒమర్‌తో కలిసి ఓ మదర్సాను బరాదర్ నిర్వహించాడు. దక్షిణ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ముఠాను స్థాపించేందుకు ఒమర్‌కు తోడుగా నిలిచాడు. కుడిభుజంగా వ్యవహరించాడు. అఫ్గాన్‌లో 1996 నుంచి 2001 వరకూ కొనసాగిన తాలిబన్ పాలనలో బరాదర్ ఎన్నో కీలక పదవులు దక్కించుకున్నాడు. హెరాత్, నిమ్రుజ్ ప్రావిన్స్‌ల గవర్నర్‌గా పనిచేశాడు. ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా, సెంట్రల్ ఆర్మీ కార్ప్స్ కమాండర్గానూ సేవలందించినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ డిప్యూటీ మినిస్టర్‌గా కూడా పనిచేసినట్లు అమెరికాకు చెందిన ఇంటర్‌పోల్ వెల్లడించింది. ► ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబన్ల ఆధ్యాత్మిక కేంద్రం, వారి పాలన కొనసాగినప్పుడు రాజధాని అయిన రెండో అతిపెద్ద నగరం కాందహార్‌కు మంగళవారం చేరుకున్నాడు. ► బరాదర్ గత కొన్న నెలలుగా ఖతార్‌లోనే గడిపాడు. అమెరికాతోపాటు అఫ్గాన్ ప్రతినిధులతో శాంతి చర్చల్లో పాలు పంచుకున్నాడు. ► అఫ్గాన్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణపై జరిగిన చర్చల్లో బరాదర్‌దే కీలక పాత్ర. ► తాలిబన్ మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా వ్యవహరించడంతోపాటు 2004, 2009లో అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపాడు. ► కాందహార్ ఎయిర్‌పోర్టులో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు ఘన స్వాగతం లభించింది. తాలిబన్లు అతడికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. బరాదర్ అరెస్టు.. టర్నింగ్ పాయింట్ 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్ కాయిదా దాడుల తర్వాత అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది. అమెరికా మద్దతు ఉన్న నార్తన్ అలయెన్స్‌కు వ్యతిరేకంగా బరాదర్ పోరాటం ప్రారంభించాడు. 2010 ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లోని కరాచీలో అరెస్టయ్యాడు. బరాదర్ అరెస్టు తాలిబన్లపై తాము సాగిస్తున్న యుద్ధంలో టర్నింగ్ పాయింట్ అని అమెరికా సైనికాధికారులు వ్యాఖ్యానించారంటే అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్‌ను జైలు నుంచి విడుదల చేసినట్లు 2018 అక్టోబర్ 25న తాలిబన్లు ప్రకటించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే పాక్ ప్రభుత్వం అతడిని విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తర్వాత ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నాడు. దోహాలోని తాలిబన్ దౌత్య కార్యాలయం అధినేతగా నియమితుడయ్యాడు. అమెరికాతో జరిగిన చర్చల్లో తాలిబన్ల తరపున పాల్గొన్నాడు. 2020 ఫిబ్రవరిలో అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించిన దోహా ఒప్పందంపై సంతకం చేశాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2021 ఆగస్టు 17న ఖతార్ నుంచి స్వదేశం అఫ్గానిస్తాన్‌కు తిరిగొచ్చాడు. 2001లో తాలిబన్ ప్రభుత్వం పతనమైన తర్వాత అతడు అఫ్గాన్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. -
Divya Gokulnath: ఆన్లైన్ టీచర్
టీచర్ కావాలన్నది ఆమె ఆశయం. అదొక్కటే కాదు, జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా వెళ్లలేదు. తన సొంత దేశస్థులకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నారు. బైజూస్ కో ఫౌండర్ అయ్యారు. ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తిమంతమైన ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు బెంగళూరుకు చెందిన దివ్య గోకుల్‌నాథ్. భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్ – టెక్ కంపెనీ బైజూస్. ఈ యాప్‌కి ఎన భై మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఏడాదిన్నరగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ‘బైజూస్’ టీమ్ కొత్త కొత్త ప్రోడక్ట్స్‌ని తీసుకు వచ్చింది. ఉద్యోగులంతా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ ఈ ఏడాది కాలంలో పనులు చేస్తూ ఎన్నో విజయాలు సాధించేలా చేశారు ఈ సంస్థ కో ఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్. విద్యార్థిగా చేరి... బైజూస్‌లో ఒక స్టూడెంట్‌గా చేరి కో ఫౌండర్ స్థాయికి ఎదిగారు. తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయటం వల్ల ఈ అద్భుత విజయం సాధించగలిగారు. చదువుకునే రోజుల్లోనే దివ్య ఆల్‌రౌండర్‌గా ఎదగాలనుకున్నారు. ‘‘నేను బయో టెక్నాలజీ చదువుకునే రోజుల్లో మాకు సరైన అధ్యాపకులు లేకపోవటంతో, చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ పాఠాలు నేర్చుకునేవాళ్లం. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాను’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్. టీచర్‌గా మొదటి రోజు.. బైజూలో విద్యార్థిగా చేరి, ఆ తరవాత అక్కడ టీచర్ని అయ్యాను. నేను టీచర్ కావాలనుకున్న నా కల అలా నెరవేరింది. మొదటి రోజు క్లాసు తీసుకున్నప్పుడు క్లాసులో వందమంది విద్యార్థులు ఉన్నారు. వారంతా నా కంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. నేను టీచర్లా కనిపించటం కోసం ఆ రోజున క్లాసుకి చీర కట్టుకుని వెళ్లాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ రోజు పాఠం చెబుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది’ అంటారు దివ్య టీచర్‌గా తన మొదటి అనుభవం గురించి. విదేశాలలో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడు బయోటెక్నాలజీ చెప్పడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకపోవటంతో పడిన ఇబ్బందులను దివ్య గోకుల్‌నాథ్ మరచిపోలేదు. తనలా ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనుకున్నారు. ‘ఆఫ్‌లైన్ టెస్ట్ ప్రిపరేషన్ క్లాసులు మానేసి, ఆన్లైన్ క్లాసులను దేశంలోని మారుమూలలకు సైతం తీసుకువెళ్లాలని మా బైజులో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. 2015లో యాప్ లాంచ్ చేశాం. ఇందులో ర్యాంకులు, క్లాసులో టాపర్లు వంటివి ఉండవు. ఇందులో విజయం సాధించగలమని, మా ప్రోడక్టు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్. చిత్తశుద్ధి ఉండాలి.. స్టార్టప్‌లకు కావలసింది చిత్తశుద్ధి. ఏ స్టార్టప్ అయినా, కస్టమర్‌కి చాలా వేగంగా స్పందించడం ముఖ్యం. తొలిదశలో ఎంతమంది ఆదరిస్తున్నారనేది కాదు. పనిలో శ్రద్ధ చూపిస్తే విజయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవటం, ఆచరణలో పెట్టడం వెంట వెంటనే జరిగి పోవాలి. ఆలస్యం చేస్తే నిరుపయోగం.. అని నమ్ముతారు దివ్య గోకుల్‌నాథ్. ‘‘నేను, బైజు... మా ఇద్దరి దార్శనికత, ప్రాధాన్యతలు ఒకేలా ఉంటాయి. మా విజయం వెనుక ప్లేబుక్ ఏమీ లేదు. ఈ పాండమిక్ సమయంలో, కేవలం ఆరు మాసాల వ్యవధిలో సుమారు 35 మిలియన్ల మంది మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. మేం ఒక్కో అడుగు ఎదుగుతున్నాం’’ అంటూ తమ విజయం గురించి చెబుతారు దివ్య గోకుల్‌నాథ్. ఎన్నో ఆశయాలు, ఆలోచనతో కృషి చేస్తున్న దివ్య గోకుల్‌నాథ్... భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ సేవలు విస్తరించాలనుకుంటున్నారు. -
కార్టూనిస్ట్, ఫుడ్ బ్లాగర్ ఆత్మహత్య
మంగళూరు: ప్రముఖ కార్టూనిస్ట్, ప్రముఖ పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్ (29) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్‌తో పాపులర్ అయిన నిఖిల్ ఆత్మహత్య ఫుడ్ లవర్స్‌ను, వ్యాపార వర్గాలను విస్మయపర్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. తల్లితో గొడవ పడిన నిఖిల్ బయటకు వెళ్లారు. ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగుళూరు మలెమార్నగరంలోని ఆయన నివాసంలో మృతదేహాన్నిఆదివారం కనుగొన్నారు. నిఖిల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా, ముగ్గురు స్నేహితులతో కలిసి ‘ది త్రీ హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్‌ను 29మే 2009లో ప్రారంభించారు నిఖిల్. దీంతోపాటు తండ్రి మరణానంతరం కుటుంబ వ్యాపారాలను కూడా నిఖిల్ చూసుకుంటున్నారు. యూట్యూబ్‌లో కార్టూన్ కళపై ఆయన వీడియోలు పాపులర్ అయ్యాయి. అలాగే వివిధ ప్రదేశాల్లో దొరికే విలక్షణ ఆహార పదార్థాలు, వంటకాలపై ఆయన నిర్వహించే రివ్యూలు బహుళ ప్రజాదరణ పొందాయి. నిఖిల్‌కు భార్య, తల్లి , సోదరి ఉన్నారు. త్వరలో ‘ది త్రీ హంగ్రీ మెన్’ పదేళ్ల వార్షికోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. -
ట్విటర్ కో ఫౌండర్ రాజీనామా
ట్విటర్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విటర్‌కు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్లపాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్ అనూహ్యంగా బోర్డునుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్వటర్ కు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు. అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్ పేర్కొన్నారు. I'm very lucky to have served on the @Twitter board for 12 years (ever since there was a board). It's been overwhelmingly interesting, educational—and, at times, challenging. — Ev Williams (@ev) February 22, 2019 -
ఫేస్‌బుక్‌కు షాక్ : ఇన్స్టాగ్రామ్ కో ఫౌండర్స్ గుడ్‌బై
శాన్ఫ్రాన్సిస్కో: ఫేక్ న్యూస్, డేటాచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నసోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ ఫొటో షేరింగ్ ప్లాట్‌పాం ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రెగర్ తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్ని వారాల్లో కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. సిస్ట్రోమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిలో, క్రెగర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నదీ స్పష్టత ఇవ్వకుండానే రాజీనామా లేఖను కంపెనీకి సమర్పించారు. వీరి రాజీనామా విషయాన్ని సంబంధిత వర్గాలు తమకు తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మరోవైపు ఈ రాజీనామాను ధృవీకరించిన సిస్ట్రోమ్ కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో సోమవారం రాత్రి ఒక పోస్ట్ పెట్టారు. కొత్త చాప్టర్‌కి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. కొత్త ఉత్సుకతను సృజనాత్మకతను మరోసారి వెలికి తీయాలి. ఈ అన్వేషణకు కొంత సమయాన్ని కేటాయించాలని తెలిపారు. తమకు స్ఫూర్తినిచ్చేది, ప్రపంచానికి ఏది కావాలో అర్థం చేసుకోవాలి..ఆ వైపుగా ప్లాన్ చేస్తున్నామని, అందుకే వైదొలిగినట్లు తెలిపారు. అలాగే ఇన్స్టాగ్రామ్ తమ ప్రస్థానాన్ని మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కాగా ఎనిమిదేళ్ల కింద 2010లో లాంచ్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట 2012లో ఫేస్బుక్ 715 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ఢోకా ఉండదని ఫేస్బుక్ వాగ్దానం చేసింది. అయితే కాలక్రమలో ఇన్స్టాగ్రామ్ పూర్తిగా తన స్వేచ్ఛను కోల్పోతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్బుక్ మధ్య నెలకొన్న విభేదాల వల్లే వీరు రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇది ఇలావుంటే ఈ వార్తలపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. ఆల్ ది బెస్ట్: కెవిన్, మైక్ అద్భుతమైన ప్రొడక్ట్ లీడర్లు.. వారి సృజనాత్మక ఉమ్మడి కృషికి ఇన్స్టాగ్రామ్ ఒక తార్కాణం. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. వారికి ఆల్ ది బెస్ట్ ..తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాలని వుందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. Over 8 years ago, Kevin and I started Instagram, hoping to build something that would bring out people’s creativity and spirit for exploration. Now it’s time for the next chapter. A huge thank you to everyone in the community who we’ve met along the way. https://t.co/9Omyj6VHbe — Mike Krieger (@mikeyk) September 25, 2018 The @instagram journey is one I won't forget. It started by building simple products that solved universal problems. Now eight years we look back and are proud and grateful to have been part of that journey. Thank you to the entire community as we move on for now. — Kevin S. (@kevin) September 25, 2018 -
వాట్సాప్‌కు భారీ ఝలక్!
కాలిఫోర్నియా: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కో ఫౌండర్ అనూహ్యంగా గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపనీని తాను వీడుతున్నట్టుగా మంగళవారం ఫేస్‌బుక్‌ద్వారా ప్రకటించారు. అలాగే త్వరలోనే సొంతంగా లాభాపేక్షలేని ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించబోతున్నానని వెల్లడించారు. ఫేస్బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వాట్సాప్ సమావేశంలో తన సహచరులకు ఆయన ప్రకటన చేశారు. కంపెనీని విడిచి పెడుతున్నానని, సొంత లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించబోతున్నానని బ్రియన్ ప్రకటించారు. అలాగే నాకిష్టమైన అంశాలపై రిస్క్ తీసుకోగలిగే వయసులో ఉన్నాను. దీనికి చాలా సంతోషంగా ఉంది. టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌లో సొంత నాన్‌ప్రాఫిట్ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా నా మనసులో ఈ ఆలోచన ఉంది. ఇప్పటికి ఆచరణలోకి రాబోతోంది. రాబోయే నెలల్లో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేస్తానని తన పేస్బుక్ పేజ్‌లో పోస్ట్‌లో వెల్లడించారు బ్రియాన్. కాగా జాన్ కోమ్‌తో కలిసి బ్రియన్ యాక్షన్ సహ-వ్యవస్థాపకుడిగా 2009లో వాట్సాప్ ను నెలకొల్పారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. బ్రియాన్ వాట్సాప్‌లో దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు యాహూకి పనిచేశారు. -
ఫోర్బ్స్ లిస్ట్ లో 'బాలకృష్ణ'
సింగపూర్ : ప్రముఖ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న పతంజలి ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యోగా గురు రామ్ దేవ్ బాబా సహాయకుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఫోర్బ్స్ లిస్ట్ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. సుమారు రూ.16,000 కోట్లు సంపదతో వందమంది ధనవంతుల భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న వినియోగ వస్తువుల సంస్థల్లో పతంజలి ఒకటని, దీని నికర విలువ ఆధారంగా, సంస్థలో 92 శాతం వాటాను కలిగివున్న బాలకృష్ణను ఎంపిక చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. రామ్ దేవ్ కు పతంజలి సంస్థలో వాటాలున్నప్పటికీ , బాలకృష్ణ కార్యకలాపాలు నడిపే వ్యక్తి అనీ, కంపెనీ వాస్తవ బ్రాండ్ అంబాసిడర్ అని ఫోర్బ్స్ పేర్కొంది. గత సంవత్సరం 5,000 కోట్ల ఆదాయాన్ని సాధించిన పతంజలి ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా లయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 22.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. -
కమల్‌హాసన్‌కు మరో పురస్కారం!
దేశం గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్ ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయన జాబితాలో పురస్కారం చేరింది. ఫ్రాన్స్‌కి చెందిన ప్రసిద్ధ ఫిల్మ్ ఆర్కైవిస్ట్ ‘హెన్రీ లాంగ్లోయిస్’ పేరు మీద ‘యునెస్కో’కు చెందిన ఫ్రెంచ్ నేషనల్ కమిషన్ వారు అందించే ఈ అవార్డు కమల్‌ను వరించింది. భారత సినీసీమకు అందించిన సేవలకు గాను ఆయ నకు ఈ అవార్డును ప్రదానం చేశారు. హెన్రీ లాంగ్లోయిస్ పుర స్కారం విశిష్టత చెప్పాలంటే... ఫ్రాన్స్‌లో చలన చిత్రాలను భద్రపరిచే ప్రకియ చేపట్టిన ఘనత హెన్రీ లాంగ్లోయిస్ది. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్’, ‘సినిమాథెక్యూ ఫ్రాంకైస్’లకు ఆయన కో-ఫౌండర్. సినిమాల పట్ల కనబర్చిన అంకితభావం, చేసిన సేవలకుగాను 1974లో హెన్రీ గౌరవ అకాడమీ అవార్డు సాధించారు. అలాంటి విశిష్ట వ్యక్తి పేరు మీద ప్రవేశపెట్టిన అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు కమల్‌హాసన్. ‘‘ప్యారిస్‌లో అవార్డు తీసుకున్నా. దీన్ని కళ్లారా చూడడానికి నా గురువు అనంతు సార్ బతికి ఉంటే బాగుండేది. ఆయన ద్వారానే హెన్రీ లాంగ్లోయిస్ గొప్పతనం తెలుసుకున్నా’’ అని కమల్ ట్వీట్ చేశారు. భారత్‌లో ఈ అవార్డ్ అందుకున్న తొలి వ్యక్తి కమలే. -
మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం!
- ఈ ఏడాది చివరకు రూ.600 కోట్లకు.. - త్వరలో క్విప్ జారీ ద్వారా 15-20 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ - కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ కో-ఫౌండర్, ఎండీ కృష్ణ చింతం వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఆధారిత సేవలనందిస్తున్న కెల్టాన్ టెక్ రానున్న మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.600 కోట్లకు చేరుకుంటామని కంపెనీ కో-ఫౌండర్, ఎండీ కృష్ణ చింతం ధీమావ్యక్తం చేశారు. సంస్థ 2014-15 ఆర్థిక ఫలితాలను సోమవారమిక్కడ విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది (జులై 2014-జూన్ 2015) 79 శాతం ఆదాయ వృద్ధి రేటును కనబరిచామన్నారు. అంటే గతేడాది 133.7 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాదికి 239.64 కోట్లకు చేరుకుందన్నారు. ఏటా నికర ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నామన్నారు. గతేడాది నికర ఆదాయం 6.36 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాదికది 22.07 కోట్లకు చేరిందన్నారు. కంపెనీ ఆదాయ గణాంకాల్లో 65 శాతం అమెరికా నుంచి, మిగతాది ఇండియా వాటా ఉంటుందన్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి క్విప్ జారీ ద్వారా 15-20 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనున్నట్లు చెప్పారు. ఈ నిధులతో మరో టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా, ఇండియాకు చెందిన రెండేసి కంపెనీలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని.. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన ప్రొసాఫ్ట్ టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేశామని.. ఈ కొనుగోలు తర్వాత సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తుతం సంస్థలో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారని.. మూడేళ్లలో మూడింతలకు చేరుస్తామని పేర్కొన్నారు.