పక్కవాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వడానికే చాలామంది ఆలోచిస్తారు. అలాంటి ఈ రోజుల్లో బ్యాంక్ కార్డు డీటైల్స్ పెట్టి, నచ్చింది కొనుక్కోండి అంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇందులో నిజమెంత ఉంది? అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
బోల్డ్ కేర్ కో-ఫౌండర్ 'రాహుల్ కృష్ణన్' సోమవారం (సెప్టెంబర్ 2)న తన బ్యాంక్ కార్డు వివరాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. నచ్చింది కొనుక్కోండి అంటూ.. రూ.1000 లిమిట్ పెట్టారు. ఇది చూసినవారు మొదట్లో నమ్మలేదు, కానీ రాహుల్ కృష్ణన్ ఓటీపీలను కూడా షేర్ చేశారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆ కార్డు వాడటం మొదలు పెట్టారు. లెక్కకు మించిన జనం ఆ కార్డును వాడటం వల్ల బ్యాంక్ దానిని బ్లాక్ చేసినట్లు సమాచారం.
రాహుల్ కృష్ణన్ మరో ట్వీట్ చేస్తూ.. నా నెంబర్ బ్లాక్ చేశారు అని వెల్లడించారు. అయితే ఐదు గంటల్లో సుమారు 200 మంది ఈ కార్డును ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువమంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వంటి వాటిలో కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.
I think my number is blocked so no more otps unfortunately :(( https://t.co/qR2LeGdWom
— Rahul Krishnan (@oneandonlyrk) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment