
Tulsa Remote program: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అమెరికాలోని ఓ నగరం కొన్నాళ్ల క్రితం బంపరాఫర్ ప్రకటించింది. యూఎస్‌లోని ఎక్కడ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులైనా తమ నగరానికి వచ్చి నివాసం ఉంటే 10,000 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు) డబ్బులిస్తామని వెల్లడించింది. ఇప్పుడా ఐడియా వర్కవుట్ అయినట్లు కనిస్తోంది.
అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న తుల్సా (Tulsa) అనే నగరం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘తుల్సా రిమోట్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అందించిన ఈ ఆఫర్ యూఎస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి రిమోట్‌గా పూర్తి సమయం పని చేయగల నిపుణులను తమ నగరానికి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ఆలోచన ఏమిటంటే ఉద్యోగులు ఇక్కడికి స్థిరపడతారు. ఇక్కడే ఖర్చు చేస్తారు.
తుల్సా నగరం
తుల్సా రిమోట్ ప్రోగ్రామ్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రోగ్రామ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి తుల్సాకు 2,000 మందికి పైగా మకాం మార్చారు . 2022 చివరి నాటికి, తుల్సా రిమోట్ దాదాపు 307 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష కార్మిక ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చింది. నగరానికి వచ్చిన ప్రతి ఇద్దరు తుల్సా రిమోట్ సభ్యులతోపాటు పాటు మరో ముగ్గురు వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 76 శాతం మంది ఇక్కడే స్థిరపడిపోయారు.