remote
-
కన్నవారి ఆరోగ్యంపై బెంగ.. ఎన్ఆర్ఐల కోసం ఏఐ పరిష్కారం
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అయితే వారి బెంగ అంతా భారత్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్ఆర్ఐల కోసమే డోజీ అనే కంపెనీ డోజీ శ్రవణ్ పేరుతో క్లినికల్-గ్రేడ్ ఏఐ ఆధారిత రిమోట్ పేరెంట్ మానిటరింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.డోజీ శ్రవణ్‌తో విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయొచ్చు. డోజీ ఏఐ ఆధారిత, కాంటాక్ట్‌లెస్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ టెక్నాలజీ వృద్ధులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు చేరవేస్తుంది.ఏఐ ఆధారిత బలిస్టోకార్డియోగ్రఫీతో రూపొందించిన ఈ సిస్టమ్ బయోమార్కర్లను విశ్లేషించడానికి, ఏవైనా వ్యత్యాసాలుంటే సకాలంలో హెచ్చరికలను అందించడానికి అధునాతన ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించి సకాలంలో వైద్య సేవలు పొందేలా చేస్తుంది. ఈ సాంకేతికత యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. డేటా గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. -
ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి రిమోట్ సర్జరీ!
వైద్యశాస్త్రం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. అధునాత శస్త్ర చికిత్సా విధానాలతో కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏకంగా మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు సైతం వైద్యం అందేలా సరికొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పురోగతి వైద్యశాస్త్రంలో సరికొత్త విజయాన్నినమోదు చేసింది. వందలు, వేలు కాదు ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా సర్జరీ చేసి సరికొత్త చికిత్స విధానానికి నాందిపలికారు. ఈ సర్జరీని టెలిఆపరేటెడ్ మాగ్నెటిక్ ఎండోస్కోపీ సర్జరీ అంటారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్, చైనీస్ యూనివర్సిటీ ఆప్ హాంకాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ఎండోస్కోపీ సర్జరీని విజయవంతం చేశారు. దీన్ని రిమోట్ నియంత్రిత పరికరాన్ని ఉపయోగించి నిర్వహించారు. శస్త్ర చికిత్స టైంలో కడుపు గోడ బయాప్సీ తీసుకుని స్వైన్ మోడల్లో ఈ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో హాంకాంగ్‌లోని ఆపరేటింగ్ గదిలో భౌతికంగా ఉన్న ఒక వైద్యుడు, దాదాపు 9,300 కిలోమీటర్ల దూరంలోని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న రిమోట్ స్పెషలిస్ట్లిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో నియంత్రించడానికి ఇద్దరు నిపుణులు అధునాత సాంకేతికతను ఉపయోగించారు. ఇక్కడ నిపుణుడు జ్యూరిచ్‌లోని ఆపరేటర్ కన్సోల్ నుంచి గేమ్ కంట్రోలర్‌ని ఉపయోగించాడరు. అయితే నిపుణులు ఈ శస్త్ర చికిత్సను మత్తులో ఉన్న పందిపై విజయవంతంగా నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ విడుదల చేసింది. ఈ ఫరిశోధన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. తదుపరి దశలో మానవ కడుపుపై ఈ టెలీ ఎండోస్కోపీని నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ ఈ టెలి ఆపరేటెడ్ ఎండోస్కోపీ రిమోట్ సర్జికల్ ట్రైనింగ్ కేవలం శరీరాన్ని మానిటరింగ్ చేయడమే గాక మారుమూల ప్రాంతాల్లో తక్షణ రోగనిర్థారణ, శస్త్ర చికత్స సంరక్షణను అందించగలదు. ప్రత్యేకించి స్థానికంగా వైద్యనిపుణులు అందుబాటులో లేనప్పడు రిమోట్ నిపుణుడు శిక్షణ పొందిన నర్సులకు ఎలా చేయాలో సూచనలివ్వొచ్చు. ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగుల జీర్ణశయాంత కేన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించగలుగుతామని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షానన్ మెలిస్సా చాన్ అన్నారు. బాహ్య అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించబడే ఈ అయస్కాంత ఎండోస్కోప్ని వీడియో గేమ్ కంట్రోలర్ సాయంతో విజయవంతంగా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు పరిశోధకులు. (చదవండి: -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
‘మూన్‌లైటింగ్’తో కోట్లు సంపాదిస్తున్న ఐటీ ఉద్యోగి.. మీరూ చేస్తారా?
కొంత కాలం క్రితం ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ తీవ్ర చర్చంనీయంశమైంది. ఒకే సమయంలో లేదా విధులు ముగిసిన తరువాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ తరుణంలో తాను ఒకే సారి రెండు ఉద్యోగాలు చేసి ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదించినట్లు ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగి ఆడమ్ ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.98లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం అతను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఫలితం శూన్యం.పేరుకే రెండు ఉద్యోగాలు చేస్తున్నాడనే మాటగాని కొండలా పేరుకుపోయినా అప్పుల్ని తీర్చేందుకు ఇది సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏడాదికి కోటి సంపాదన అంతే 2022లో రిమోట్ జాబ్ కోసం అన్వేషించాడు. చివరికి తాను కోరుకున్నట్లుగా భారీ వేతనంతో రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అలా 2023 జనవరి నుంచి రెండు ఉద్యోగాలు చేయగా వచ్చిన మొత్తం ఏడాదికి రూ.70లక్షలుగా కాగా..అదే ఏడాది చివరి నాటికి ఆడమ్ సంపాదించిన మొత్తం రూ.కోటికి పెరిగింది. సంపాదన పెరగడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాడు. డబ్బులు బాగా సంపాదించాలనే ఈ సందర్భంగా రెండు ఉద్యోగాలు చేరేందుకు తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటో చెప్పాడు. అందులో ఒకటి సంపాదన రెట్టింపు చేసుకోవడం, రెండోది రెండేళ్లలో తాను ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం. ఇందుకోసం తన లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉద్యోగాల కోసం అన్వేషించగా.. రెండు వారాల్లో రెండు ఉద్యోగాలు పొందాడు. స్వల్ప కాలంలో తన ఎడ్యుకేషన్‌లోన్ మెల్లమెల్లగా తిరిగి చెల్లించడంతో పాటు నాలుగు నెలల అత్యవసర సేవింగ్స్‌ను కూడబెట్టుకున్నాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పిన టెక్కీ వారానికి 30 నుంచి 60 గంటల మధ్య పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ టిప్స్ మీకోసమే అదే సమయంలో మూన్‌లైటింగ్ చేయాలని ఉద్యోగులకు పలు టిప్స్ చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా .. ఒకే సమయంలో రెండు ఆఫీసుల్లో మీటింగ్స్ లేకుండా చూసుకోవడం, రెండవది.. ఆఫీస్ వర్క్ మొత్తం ఒకేసారి మీదేసుకుని చేసుకోకుండా భాగాలు, భాగాలుగా విభజించి పని సులభం అవుతుందని అన్నాడు. దీంతో పాటు ఆఫీస్‌లో ఇచ్చే పబ్లిక్ హాలిడేస్, వీకాఫ్స్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు బంపరాఫర్.. ఐడియా వర్కవుట్!
Tulsa Remote program: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అమెరికాలోని ఓ నగరం కొన్నాళ్ల క్రితం బంపరాఫర్ ప్రకటించింది. యూఎస్‌లోని ఎక్కడ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులైనా తమ నగరానికి వచ్చి నివాసం ఉంటే 10,000 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు) డబ్బులిస్తామని వెల్లడించింది. ఇప్పుడా ఐడియా వర్కవుట్ అయినట్లు కనిస్తోంది. అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న తుల్సా (Tulsa) అనే నగరం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘తుల్సా రిమోట్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అందించిన ఈ ఆఫర్ యూఎస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి రిమోట్‌గా పూర్తి సమయం పని చేయగల నిపుణులను తమ నగరానికి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ఆలోచన ఏమిటంటే ఉద్యోగులు ఇక్కడికి స్థిరపడతారు. ఇక్కడే ఖర్చు చేస్తారు. తుల్సా నగరం తుల్సా రిమోట్ ప్రోగ్రామ్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రోగ్రామ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి తుల్సాకు 2,000 మందికి పైగా మకాం మార్చారు . 2022 చివరి నాటికి, తుల్సా రిమోట్ దాదాపు 307 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష కార్మిక ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చింది. నగరానికి వచ్చిన ప్రతి ఇద్దరు తుల్సా రిమోట్ సభ్యులతోపాటు పాటు మరో ముగ్గురు వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 76 శాతం మంది ఇక్కడే స్థిరపడిపోయారు. -
Layoffs In 2024: వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 2024లో పోయే జాబ్స్ వీళ్లవే..!
టెక్ పరిశ్రమలో 2024లోనూ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే, ఆల్ఫాబెట్, అమెజాన్, సిటీ గ్రూప్, ఈబే, మాకీస్, మైక్రోసాఫ్ట్, షెల్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్, వేఫెయిర్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. తాజగా యునైటెడ్ పార్సెల్ సర్వీస్ 12,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి ఐదు రోజులు కార్మికులను ఆఫీసులకు రప్పించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సంకేతాలను పంపుతున్న క్రమంలో లేఆఫ్ ప్రకటనలు వస్తున్నాయి. ఒకవైపు యూఎస్ ఉద్యోగ అవకాశాలు కాస్త పెరిగాయి. మరోవైపు హై ప్రొఫైల్ ఉద్యోగాల కోతల జాబితా పెరుగుతున్న వైట్ కాలర్ ప్రపంచానికి అనిశ్చితిని జోడిస్తోంది. రిమోట్ వర్క్‌పై పెరుగుతున్న అణచివేత కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్ ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుంకు వ్యూహాలను పొందడానికి దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు, కెరీర్ కోచ్‌లను బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. వారు ఏం చెప్పారు.. కోతల ప్రమాదం ఎక్కువ ఉన్నది ఎలాంటి ఉద్యోగులకు అన్నది ఇక్కడ చూద్దాం.. మిడిల్ మేనేజర్లు, రిమోట్ వర్కర్లు జాగ్రత్త కంపెనీలు తొలగింపులకు తరచుగా మిడిల్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ‘గ్లాస్‌డోర్’ ప్రధాన ఆర్థికవేత్త డేనియల్ జావో చెప్పారు. ఇలాంటి సమయంలో మిడిల్ మేజేజర్లు బాధితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత తొలగింపుల రౌండ్ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్న తరుణంలో లేఆఫ్‌లలో రిమోట్‌గా పనిచేస్తున్నవారినే లక్ష్యంగా చేసుకుంటారని కొన్ని నివేదికలు సూచించాయి. రిమోట్‌గా పనిచేస్తున్నవారిని తొలగించడం కంపెనీలకు సులువవుతుందని న్యూయార్క్‌లోని ఏబీఎస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏరియల్ షుర్ అభిప్రాయపడ్డారు. కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్లో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ పెన్ మాట్లాడుతూ ఎవరిని తొలగించాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యుత్తమ సంస్థలు రెండు అంశాలను చూస్తాయని చెప్పారు. ఒకటి ఆ ఉద్యోగి వల్ల సంస్థకు ప్రస్తుతమైనా లాభదాయకంగా ఉండాలి లేదా భవిష్యత్తులో అయినా లాభం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా అలాంటి ఉద్యోగులు ఇంటికిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. -
కంపెనీల్లో నయా ట్రెండ్, కాఫీ కప్పులతో ఉద్యోగులు.. బాసుల్లో గుబులు!
ప్రపంచ దేశాల్లోని ఎక్కువ శాతం సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌ను రద్దు చేస్తున్నాయి. ఆఫీసుకు రావాలని పిలుపునిస్తున్నాయి. దీంతో సుదీర్ఘ కాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వారిని ఇప్పుడు ఆఫీసులో పనిచేయాలని ఆదేశించడం ఉద్యోగులకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే కాఫీ బ్యాడ్జింగ్ అనే కొత్త ట్రెండ్‌తో సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ అంటే? కోవిడ్-19 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్‌లతో ఆఫీస్‌లకు కొత్త కళ వచ్చింది. దీంతో కరోనా మహమ్మారితో రిమోట్‌గా వర్క్ చేస్తున్న సిబ్బందిని కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఎవరైతే ఆఫీస్‌లో పనిచేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారో ఆ ఉద్యోగులు.. ఆఫీస్‌లో ఐడీని స్వైప్ చేస్తారు. ఆ తర్వాత సహాచరులకు కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్తారు. అక్కడే హెచ్ఆర్, మేనేజర్ల దృష్టిలో పడేలా అటు ఇటూ తిరుగుతుంటారు. ఆ తర్వాత డెస్క్‌కు వచ్చి ఇంటికి వెళ్లిపోతారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అంటారు. ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే ఈ ఏడాదిలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ప్రతి 5 మందిలో 1 ఒకరు పూర్తిస్థాయిలో ఆఫీస్‌లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది హైబ్రిడ్ వర్క్‌ను కోరుకుంటుంటే 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్ ల్యాబ్స్’ అనే సంస్థ తెలిపింది. రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్ ఓల్ ల్యాబ్స్ చేసిన అధ్యయనంలో తప్పని సరిగా ఆఫీస్‌లో పనిచేయాలన్నా నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగం (58శాతం) మంది కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడుతున్నారు. ధోరణి అక్కడితో ఆగలేదు. మరో 8 శాతం మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడడంతో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడం యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. సంస్థల్లో ప్రతి విభాగంలో ఒకరో, ఇద్దరో ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడినా కంపెనీలకు పెద్ద నష్టం ఉండేది కాదు. హై స్కిల్ ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా ఆఫీస్ పనిచేయకుండా కాఫీ కప్పులతో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేయడం యామాన్యాలకు మింగుడు పడడం లేదు. క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్‌లోపు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకపోవడం, ఇటు ఉద్యోగులు చేజారిపోకుండా కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. కాఫీ బ్యాడ్జింగ్‌ను పుల్ స్టాఫ్ పెట్టాలంటే 'కాఫీ బ్యాడ్జింగ్' ట్రెండ్ తగ్గాలంటే కంపెనీలు అంతర్గత సమస్యలను పరిష్కరించాలి. కమ్యూనికేషన్‌ను పెంపొందించాలి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ఆఫీస్ వాతావరణం సైతం ఉద్యోగుల్ని ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. -
వర్క్ ఫ్రం హోమ్ శకం ముగిసినట్టే..నా? కంపెనీలు ఏమంటున్నాయి?
కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం అన్ని కంపెనీలకూ, ముఖ్యంగా టెక్ సంస్థలకు అనివార్యంగా మారింది. ఆ తర్వాత కోవిడ్ పరిమితులు సడలించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే క్రమంలో వారిని ఆఫీస్‌లకు రప్పించే హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు, రిమోట్ వర్కింగ్ యుగానికి ముగింపు పలుకుతూ ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయడాన్ని (WFO) తప్పనిసరి చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు నవంబర్ 20వ తేదీ నుంచి తిరిగి ఆఫీస్ బాట పట్టనున్నారు. వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచే వారు పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఇక టీసీఎస్ (TCS) అయితే గత నెలలో తమ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పాటు ఆఫీస్ నుంచి వర్క్‌ను తప్పనిసరి చేసింది. ఇక విప్రో తమ ఉద్యోగులను వారంలో తమకు నచ్చిన మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేసేందుకు మే నెల నుంచి అవకాశం కల్పించింది. హెచ్‌సీఎల్‌టెక్ కూడా తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలని కోరింది. ఇదీ చదవండి: ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు.. కీలక రిపోర్ట్ వెల్లడి సొనాటా సాఫ్ట్‌వేర్‌లో దశలవారీగా రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలుపై కసరత్తు చేస్తున్నారు. మిడ్-మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, లీడర్షిప్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి మిగిలిన వారు కూడా హైబ్రిడ్ మోడ్‌లో వారానికి కనీసం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తారని సొనాటా సాఫ్ట్వేర్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ బాలాజీ కుమార్ చెప్పారు. పూర్తి వర్క్ ఫ్రం హోమ్ విధానం నుంచి ఉద్యోగులను కంపెనీలు ఇప్పుడిప్పుడే హైబ్రిడ్ మోడల్‌కు తీసుకొచ్చి వారానికి కొన్ని రోజులైనా ఆఫీస్‌ల నుంచి పని చేయించుకుంటున్నాయి. అయితే ఈ హైబ్రిడ్ విధానమైనా కొనసాగుతుందా లేదా టీసీఎస్ లాగా అన్ని కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్‌ను తప్పనిసరి చేసి వర్క్ ఫ్రం హోమ్ శకానికి ముగింపు పలుకుతాయా? అన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. రిమోట్ వర్క్ క్షీణిస్తోంది వంద శాతం రిమోట్ జాబ్స్ అనే భావన క్రమంగా మసకబారుతోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ అంజలి రఘువంశీ చెబుతున్నారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి భారతీయ ఉద్యోగులు క్రమంగా అలవాటు పడుతున్నారని, వారి అవసరాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. వారానికి నాలుగు రోజులైతే ఓకే రాండ్‌స్టాడ్ ఇన్సైట్స్ 4-డే వర్క్‌వీక్ క్యాండిడేట్ పల్స్ సర్వే 2023 ప్రకారం, 35 శాతం మంది ఉద్యోగులకు తమ కంపెనీ 4-రోజుల వర్క్‌వీక్‌కి మారితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి అభ్యంతరం లేదు. 43 శాతం మంది ఒక రోజు అదనపు సెలవు వస్తే మిగిలిన రోజుల్లో పని గంటలు కాస్త ఎక్కువైనా పర్వాలేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అభిప్రాయాలను అదే సమయంలో తమ వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ అనువైన విధానాన్ని కంపెనీలు ఆలోచించాలని అంజలీ రఘువంశీ సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి వర్క్ ఫ్రం ఆఫీస్ మోడల్‌కు ఉద్యోగులు వచ్చినప్పటికీ ఒక్కసారి జాబ్ మార్కెట్ అనుకూలంగా మారిందంటే ఉద్యోగులు తమకు మరింత సౌలభ్యాన్ని అందించే ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల కంపెనీలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు. దశలవారీగా ఆఫీస్‌లకు.. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత నేర్చుకునేందుకు, అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు నమ్ముతున్నారు. “హైబ్రిడ్ విధానం ఐటీ రంగంలోని ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ రావడానికి ఇష్టపడవచ్చు. ప్రయాణ ఇబ్బందుల నేపథ్యంలో మరికొంత మంది ఆఫీస్‌లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు” అని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ మంచి ఆలోచన కాదని ఐటీ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దశలవారీగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉన్న రిమోట్ వర్క్ విధానం తగ్గుతూ వస్తోంది. రిమోట్ వర్క్ క్రమంగా తగ్గుముఖం పట్టడం కూడా ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించడానికి కంపెనీల్లో కొనసాగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని బిజ్ స్టాఫింగ్ కామ్రేడ్ మేనేజింగ్ పార్టనర్ పునీత్ అరోరా పేర్కొన్నారు. -
ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి!
ఎవరైనా మీకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తూ, వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో సొమ్ము ఇస్తామంటే కాదంటారా? నిజంగా ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే. అటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సుదూరతీరంలో ఉన్న ఐలాండ్లలో నివసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. అక్కడి నివసించేందుకు ఆసక్తి చూపేవారికి భారీ మొత్తంలో సొమ్ము అందిస్తోంది. జూలై 1 నుంచి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వీడి రిమోట్ ఐలాండ్‌లో ఉండాలనుకునేవారికి రూ. 70 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రద్దీ ప్రాంతాలను వీడి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండాలనుకునేవారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఫథకానికి ఐర్లాండ్ ప్రభుత్వం ‘అవర్ లివింగ్ ఐలాండ్ పాలసీ’ అని పేరు పెట్టింది. మెట్రో యూకే రిపోర్టును అనుసరించి ఇప్పటి వరకూ మొత్తం 23 ఐలాండ్లను ఇందుకోసం సెలెక్ట్ చేశారు. ఆయా ఐలాండ్లలో ఉండేందుకు జనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐలాండ్లు రద్దీ ప్రాంతాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి కోసం ప్రభుత్వం ఇళ్లు, భూములు ఇవ్వడంతోపాటు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకునేందుకు లక్షల రూపాయలు అందజేస్తోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే.. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని వారు వివిధ కారణాలతో పట్టణాలకు వలస వెళుతున్నారు. ఫలితంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ఇళ్లు, రోడ్లు వృథాగా మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐలాండ్లకు వెళ్లేందుకు సుముఖత చూపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 1993కు ముందు నిర్మించిన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రభుత్వం అందించే సొమ్మును ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ప్రతీ ఐలాండ్‌లో నివసించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. వాటిని అక్కడ ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఐలాండ్లలో నివసించేందుకు విదేశీయులకు ఏమాత్రం అనుమతి లేదు. కాగా ఈ విధానం ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయడం లేదు. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి అద్భుత ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్, ఇటలీ, చిలీ, మారిషస్, గ్రీస్, క్రొయేషియా మొదలైన దేశాలున్నాయి. ఈ దేశాలు శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడేవారికి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. -
ఓటు వలస వెళుతుందా? రిమోట్ ఓటింగ్‌పై పెరుగుతున్న రాజకీయ వేడి
ఓటు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్ ఓటింగ్ మెషీన్లు(ఆర్వీఎం). ఈ ఓటింగ్ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ (యూ), శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది. ఎందుకీ ఆర్వీఎంలు ? వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్ ఓటింగ్ ప్రక్రియకు తెరతీశారు. ఆర్వీఎంలు ఎలా పని చేస్తాయి ? ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) ఇది సవరించిన వెర్షన్. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్న వారిని రిమోట్ ఓటర్లు అని పిలుస్తారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్ పోలింగ్ బూత్‌కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్ రీడర్ (సీసీఆర్) ద్వారా స్కాన్ చేసి గుర్తిస్తారు. అప్పుడు ఆర్వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రం డిస్ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్రం కోడ్, నియోజకవర్గం, అభ్యర్థుల నెంబర్ వివరాలన్నీ రిమోట్ కంట్రోల్ యూనిట్లో రికార్డు అవుతాయి. ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్ స్లిప్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆర్వీఎంలు ఇంటర్నెట్ అవసరం లేకుండా పని చేస్తాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవీ ► సీఈసీ ప్రతిపాదనలేవీ సమగ్రంగా లేవు. ఆర్వీఎంల వ్యవస్థ పైపైన రూపొందించినట్టుగా ఉంది. ► ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఉండదు. ► ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదు. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే వివిధ పోలింగ్ బూత్‌లలో వారు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వనరులు ఆ పార్టీలకు ఉండవు. ► ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చు ► ఓటరు స్థానికంగా నివాసం లేకపోతే రాజకీయ పార్టీలపై ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఓటు వేయడంలో వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ► దేశంలో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరెక్కడి నుంచో ఓటు వేసే వ్యక్తి అసలు సిసలు ఓటరేనని ఎలా నమ్మాలి. ఓటింగ్‌లో జరిగే అక్రమాలు ఇకపై వివిధ నియోజకవర్గాలకు విస్తరిస్తాయి. ఈసీ ఎదుట ఉన్న సవాళ్లు ► అసలు వలస ఓటర్లు అంటే ఎవరు ? వారిని ఎలా గుర్తించాలి. వలస ఓటర్లను గుర్తించడంలో ఏర్పడే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవడం ► ఈవీఎంలకు సవరించిన వెర్షన్‌గా రూపొందించిన ఆర్వీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనడం ► ఎన్నికల్లో ఎన్ని రిమోట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడం ► ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే వలస ఓట్లు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ఎలాంటి కసరత్తు చేయాలి. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతోంది. రిమోట్ ఓటింగ్ అనేది ఎన్నికల ప్రకియలో ఒక విప్లవాత్మకమైన మార్పు. పట్టణ ప్రాంతాల్లో, యువతలోనూ ఓటుపై ఆసక్తి పెంచడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. కానీ దీని అమలులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. మేం వేసే ప్రతీ అడుగు ముందడుగానే ఉంటుంది. రాజీవ్ కుమార్, సీఈసీ ధనిక పార్టీ అయిన బీజేపీకి ఇలాంటి ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆందోళనలో అర్థం ఉంది. రిమోట్ బూత్‌లున్న ప్రతిచోటా పోలింగ్ ఏజెంట్లను తెచ్చిపెట్టుకునే సామర్థ్యం వారికి ఉండదు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా రిమోట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడం సరి కాదు. జగ్దీప్ చొకార్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ సహ వ్యవస్థాపకుడు ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12% ఓట్లు పోలయినట్టు గుర్తించాం. అంటే ప్రతీ 25–30 సెకండ్లకి ఒక ఓటు పోలయినట్టు లెక్క. అదెలా సాధ్యం. ఒక ఓటు నమోదు కావడానికి కనీసం 60 సెకండ్ల సమయం పడుతుంది. ఈవీఎంలలో కళ్లకు కట్టినట్టు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆర్వీఎం అవసరం ఏమొచ్చింది..? జైరామ్ రమేష్, కాంగ్రెస్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిమోట్ ఓటింగ్ మెషిన్ ను సిద్ధం చేసిన ఈసీ
-
కలల బండి కదిలివస్తోంది!
– నేడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం – నంద్యాలకు వచ్చిన డెమో రైలు – రేపటి నుంచి రైళ్ల రాకపోకలు నంద్యాల: కర్నూలు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు శుభవార్త. నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను మంగళవారం ప్రారంభమవుతోంది. బుధవారం నుంచి నంద్యాల–కడప మధ్య రైళ్లు పరిగెత్తనున్నాయి. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ పనులు కేంద్ర మాజీ హోంశాఖా మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య చొరవతో కార్యరూపం దాల్చాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాక పనులు గత నెల పూర్తయ్యాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా దాదాపు రూ.650 కోట్లు మంజూరు చేసింది. ప్రతి రైల్వే బడ్జెట్లో రూ.40 నుంచి రూ.60 కోట్లు మంజూరు చేస్తుండటంతో పనులు ముందుకు కదల్లేదు. నరేంద్రమోడీ ప్రభుత్వం పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు విడతలుగా రూ.150 కోట్లు మంజూరు చేసింది. 2016 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌ను నిర్దేశించింది. దీంతో పనులు త్వరితంగా పూర్తయి నిర్ణీత టార్గెట్ కంటే నెల ముందే పూర్తయ్యాయి. దీంతో నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో రైల్వే రాకపోకలకు క్లియరెన్స్ వచ్చింది. నంద్యాల–కడప మధ్య బుధవారం నుంచి రెగ్యులర్ రైళ్లు తిరగనున్నాయి. విజయవాడ నుంచి రిమోట్‌తో ప్రారంభం నంద్యాల–ఎర్రుగంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం 2.00– 2.03 గంటల మధ్యలో విజయవాడ నుంచి రిమోట్ ద్వారా నంద్యాలలోని రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. చెన్నైలో తయారైన డెమో రైలు సోమవారం తెల్లవారుజామున నంద్యాలకు చేరింది. కేంద్ర మంత్రి ప్రారంభించిన అనంతరం రైలు 3.30 గంటలకు కడపకు బయల్దేరుతుంది. ఈ రైలులో 8 క్యాబిన్లు ఉన్నాయి. ఒక్కో క్యాబిన్లో దాదాపు 80మంది కూర్చుకొనే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై ఈ ప్రారంభోత్సవ వేడుకలను తిలకించడానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, ఇన్చార్జి మంత్రి అచ్చెంన్నాయుడు, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఎస్పీవైరెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లయ్య, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్, కడప, కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఏర్పాట్లను రైల్వే గుంటూరు, గుంతకల్లు డీఆర్ఎంలు విజయశర్మ, గోపినాథ్మాల్య పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల–కడప రైలు మార్గం వివరాలు దూరం: 160కి.మీ రైళ్ల వేగం : 42కి.మీ(గంటకు) స్టేషన్లు : నంద్యాల, మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఎస్.ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుడిపాడు, కమలాపురం, గంగాయపల్లె, క్రిష్ణాపురం, కడప నంద్యాల నుంచి వెళ్లే రైళ్ల సమయం.. బనగానపల్లెకు 33 నిమిషాలు, కోవెలకుంట్ల 49 నిమిషాలు, సంజామలకు 60 నిమిషాలు, నొన్సం 1.27 గంటలు, జమ్మలమడుగు 1.51గంటలు, ప్రొద్దుటూరు 2.17గంటలు, ఎర్రగుంట్ల 2.20గంటలు, కడప 3.45 గంటలు. చార్జీలు... నంద్యాల – బనగానపల్లె, కోవెలకుంట్లకు రూ.10, సంజామలకు రూ.15, నొస్సం రూ.20, జమ్మలమడుగు రూ.20, ప్రొద్దుటూరు రూ.25, కడప రూ.40. -
23న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ ప్రారంభం
నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఈనెల 23వ తేదీ కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విజయవాడ నుంచి రిమోట్‌తో ప్రారంభించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి సురేష్ ప్రభు విజయవాడ రైల్వే భవన్‌కు చేరుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.45 గంటల మధ్యన నంద్యాల–ఎర్రగుంట్ల నూతన రైల్వే లైన్‌ను రిమోట్‌తో ప్రారంభిస్తారు. తర్వాత ఈ రైలు మార్గంపై తిరిగే నంద్యాల–కడప డెమో రైలును ప్రారంభిస్తారు. రైల్వే మంత్రి పర్యటన ఖరారు కావడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని ఇంట్రాగెల్ కోచ్‌ఫ్యాక్టరీలో తయారైన నూతన డెమో రైలు నంద్యాలకు చేరుకుంది. ఇందులో 8 బోగీలు ఉన్నాయి. ఒక్కో బోగీలో 80 మంది చొప్పున దాదాపు 600 మంది కూర్చుకొనే అవకాశం ఉంది. ఈ రైలును మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభిస్తారు. తర్వాత 24 నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ నంద్యాల–కడప మధ్య నాలుగు ప్యాసింజర్ రైలు తిరుగుతాయి. మంత్రి సురేష్‌ప్రభు రిమోట్‌తో నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి స్థానిక రైల్వే స్టేషన్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
భౌ... వావ్!
టెక్ టాక్ ‘‘మనసున మనసై... బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమూ అదే సౌఖ్యమూ’’ పాతకాలం సినిమా పాట ఇది. ఫొటోలో కనిపిస్తున్న డామ్గీ రోబోకు... ఈ వర్ణన అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటారా? ఈ రోబో కుక్కపిల్ల కూడా మీ ఇంట్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది కాబట్టి! అంతలేసి కళ్లు మిటకరిస్తూ... ఇంట్లో ఉన్నవారందరి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడమే కాకుండా.. అందుకు తగ్గట్టుగా పలకరిస్తుంది కూడా. మీ ముఖంలో ఫీలింగ్స్‌ను పసిగట్టి ఒకవేళ మీ మూడ్ బాగా లేదనుకుంటే మంచి సంగీతం వినిపిస్తుంది.. లేదా మీకిష్టమైన పనేదో చేసి మిమ్మల్ని మామూలు మూడ్‌లోకి తెచ్చేస్తుంది. అంతేకాదు.. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేరనుకోండి.. ఇల్లంతా కలియదిరుగుతూ కొత్తవాళ్లెవరూ చొరబడకుండా కాపలా కాస్తూ ఉంటుంది కూడా. దీని ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. మీరు సోఫాలో జారగిలబడి టీవీ చూస్తున్నప్పుడు.. ఛానల్ మార్చేందుకు కూడా బద్దకించే వేళ డామ్గీ మీ టీవీ రిమోట్ అయిపోతుంది. ఒక్క మాటతో నచ్చిన ఛానల్‌ను తెరపైకి తెచ్చేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతూంటే.. తానంతటతనే ప్లగ్ ఎక్కడుందో వెతుక్కుని రీఛార్జ్ చేసుకుంటుంది కూడా. అన్నిటికన్నా సదుపాయం... మనం ఈ కుక్కపిల్ల మూతీ ముక్కు తుడిచే పని లేదు. బయట ఎక్కడికీ తిప్పనవసరం లేదు. రూబో అనే చైనీస్ కంపెనీ తయారు చేసిన ఈ తొమ్మిది అంగుళాల రోబో కుక్కపిల్ల త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. -
టీవీ కొంచెం... రిమోట్ ఘనం
తిక్క లెక్క టీవీ సైజు ఎంత ఉంటుంది..? ఇళ్లలో సాధారణంగా వాడే ఎంత భారీ టీవీ అయినా మహా అయితే నలభై అంగుళాలు ఉంటుందేమో! రిమోట్ సంగతేముందిలే.. అరచేతిలో ఇమిడిపోయేదేగా.. అనుకుంటున్నారా..? ఫొటోలో కనిపిస్తున్న ఈ రిమోట్‌ను చూడండి.. దీని పొడవు ఏకంగా 14 అడుగుల 9.1 అంగుళాలు. ఉత్తుత్తి రిమోట్ నమూనా ఏమీ కాదు, నిజంగానే పనిచేస్తుంది. ఎదురుగా మామూలు సైజులో ఉన్న టీవీని పెట్టుకుని, ఈ రిమోట్‌ను నొక్కుతూ చానళ్లను మార్చుకోవచ్చు, సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే, దీనిని ఎత్తాలంటే ఒక మనిషికి సాధ్యం కాదు. కనీసం ముగ్గురైనా ఉండాల్సిందే. ఒడిశాలోని సంబల్పూర్ నగరానికి చెందిన సోదరులు సూరజ్‌కుమార్ మెహర్, రాజేశ్‌కుమార్ మెహర్ దీనిని రూపొందించి గిన్నెస్ రికార్డు సాధించారు. -
పోర్టు సిటీల మధ్య చుక్ చుక్
- నేడు పారాదీప్ రైలు ప్రారంభం విశాఖపట్నం : పోర్టు కార్యకలాపాల కేంద్రాలైన విశాఖ-పారాదీప్‌ల మధ్య ఓ వీక్లీ రైలు ఎట్టకేలకు నడవనుంది. ఈ రెండు పట్టణాల మధ్య రైలు నడుపుతున్నట్లు గత బడ్జెట్లో రైల్వే శాఖ ప్రకటించింది. బుధవారం ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి రిమోట్ ద్వారా రైలును ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి దాదాపు 554 కిలోమీటర్ల దూరంలోని పారాదీప్‌కు వెళ్లాలంటే గతంలో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. శ్రీకాకుళం దరి పలాస నుంచి డీఎంయూ రైలు ద్వారా కొందరు పారాదీప్‌కు వెళుతుంటే ఎక్కువ శాతం మంది భువనేశ్వర్, కటక్ మీదుగా ప్రయాణించి పారాదీప్‌కు చేరుకునే వారు. విశాఖ పోర్టు, పారాదీప్ పోర్టులు రెండూ మేజర్ పోర్టులే కావడంతో ఈ రెండు నగరాల మధ్య అనేక ఏళ్లుగా షిప్పింగ్ కంపెనీలు, మత్స్యకారుల మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు జరిగేవి. ఇప్పుడీ రైలు రాకతో మరింత వేగంగా ఇరు ప్రాంతాల సంబంధాలు పెరుగుతాయని వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు. పారాదీప్ వేళలు విశాఖపట్నం-పారాదీప్-విశాఖపట్నం(22810/09) వారాంతపు ఎక్స్‌ప్రెస్ ప్రతీ వారం విశాఖ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖ(22810) నుంచి బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు పారాదీప్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పారదీప్(22809) నుంచి ప్రతీ బుధవారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8.30 గంటలకు విశాఖకు చేరుతుంది. -
తూ.కొ...మేలుకో
ఆగని పెట్రోల్‌బంకుల మోసాలు దర్జాగా పంపింగ్‌లో మోసం లీటర్‌కు 10 ఎంఎల్ స్వాహా కేసులకు భయపడని డీలర్లు పట్టింపులేని తూ.కొ.శాఖ అధికారులు సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పెట్రోలు, డీజిల్ బంకుల మోసాలకు అడ్డుకట్టపడటం లేదు. మోసాలు జరుగుతున్నాయని మొత్తుకుంటున్నా యంత్రాంగం స్పందించడం లేదు. ప్రభుత్వ లోపభూయిష్ట చట్టాలతో పెట్రోలుబంకుల డీలర్ల దోపిడీ దర్జాగా సాగుతోంది. హైదరాబాద్‌లో పెట్రోలుబంకుల మహా మోసాలు కళ్లముందు కదలాడుతున్నా..కనీసం పట్టని తూనికల,కొలతల శాఖ తిమింగలాలను వదిలి.. చేపలను పట్టేలా ఇటీవల స్పెషల్‌డ్రైవ్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని బంకులను తనిఖీలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోంది. మహానగరం పరిధిలో సుమారు 300కు పైగా పెట్రోలు, డీజిల్ బంకులు ఉండగా, ఇటీవల స్పెషల్‌డ్రైవ్‌లో కనీసం పదిశాతం బంకులను కూడా తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగైదు ప్రాంతాల్లో కొన్ని బంకులను మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించగా..అంబర్‌పేటలోని ఐవోసీ పెట్రోల్బంకుపై మాత్రమే ఒక కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో పెట్రోలు బంకుల డీలర్లకు కనీసం భయం లేకుండాపోయింది. వినియోగంలో మనమే టాప్ : రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్ వినియోగంలో నగరం వాటా సగానికి పైనే. ప్రతిరోజు మహానగరంలో సగటున 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. బంకుల్లో సగటున ప్రతి లీటరుకు 10 నుంచి 15 ఎంఎల్ వరకు తక్కువగా పంపింగ్ జరగడం సర్వసాధరణమే. ఈ నగ్నసత్యాన్ని సంబంధిత అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇలా 10ఎంల్ చొప్పున తక్కువ పంపింగ్ జరిగినా.. ప్రతిరోజు 3వేల లీటర్ల పెట్రోలు, 3300 లీటర్ల డీజిల్ దోపీడీ జరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం లెక్కకడితే నిత్యం కోట్లాదిరూపాయలు వినియోగదారులు నష్టపోతున్నారు. భయపడని డీలర్లు : పెట్రోలు బంకుల డీలర్లు ఎలాంటి భయం లేకుండా దర్జాగా దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. కొన్నినెలల క్రితం ఎస్వోటీ పోలీసులు, తూనికలకొలతలశాఖ ఫ్లైయింగ్స్క్వాడ్లు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో పెట్రోల్ బంకుల నయా వంచనలు బహిర్గతం కావడం పాఠకులకు తెలిసిందే. కొందరు బంకుల యజమానులు ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లు పెట్టి రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తూ మీటర్ రీడింగ్‌ను జంపింగ్ చేస్తున్నట్లు బయటపడగా, మరికొందరు ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా పంపింగ్‌ను కంట్రోల్ చేస్తూ దోపిడీ చేయడం సంచలనం సృష్టించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేవలం ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుపట్టి హడావుడి సృష్టించి నోటీసులు జారీ చేసిన తూ.కొ.శాఖ అధికారులు కేసులు నమోదు చేసి కాంపౌండింగ్‌తో సరిపెట్టారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో ఏదొక తరహాలో మోసాల తంతు సాగుతూనే ఉంది. క్రిమినల్ కేసులే పరిష్కారం: పెట్రోల్‌బంకుల్లో మోసాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే తప్ప అడ్డుకట్ట పడదని వినియోగదారులు పేర్కొంటున్నారు. నిత్యం బంకుల దోపిడీ కోట్లలో జరుగుతుంటే జరిమానాలు వేలల్లో విధిస్తే లాభం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తూనికల,కొలతలశాఖ చట్టాలను సవరించి కేసులను కోర్టుకు నివేదించి బాధ్యులను జైళ్లకు పంపితే తప్ప మోసాలు పునరావృతం కావని వారు అభిప్రాయపడుతున్నారు. -
జలసిరి పదిలం
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో భూగర్భ జలసిరి పదిలంగానే ఉంది. గతేడాదితో పోలిస్తే జనవరి చివరి నాటికి నీటిమట్టాలు స్వల్పంగా పెరగడం ఊరటనిస్తోంది. బండ్లగూడ,చార్మినార్, మారేడ్‌పల్లి, నాంపల్లి, శేరిలింగంపల్లి, సైదాబాద్, బహదూర్‌పురా, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో నీటిమట్టాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. మారేడ్‌పల్లి, మల్కాజ్గిరి, అమీర్‌పేట్ మండలాల్లో స్వల్పంగా నీటిమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి ప్రారంభంలో విచ్చలవిడి బోరుబావుల తవ్వకాన్ని నియంత్రించడంతోపాటు పాతాళగంగను పొదుపుగా వాడుకుంటేనే మండువేసవిలో పానీపట్టు యుద్ధాలు తప్పుతాయని భూగర్భజల శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా మొత్తంగా గ్రేటర్ పరిధిలో గతేడాది జనవరి చివరి నాటికి 8.11 మీటర్ల లోతున భూగర్భ జల జాడ లభించగా.. ఈసారి 7.33 మీటర్ల లోతున పాతాళ గంగ ఆచూకీ లభించినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంటే గతేడాది కంటే 0.78 మీటర్ల మేర భూగర్భ జలసిరి పెరిగిందని తాజా నివేదిక వెల్లడించింది. -
హ్యాకర్ల ట్రెండు... మారిపోయింది..!
మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారు.. అకస్మాత్తుగా రిమోట్ మొరాయిస్తుంది. చానెళ్లు వాటంతటవే మారిపోతాయి. మీరు ఒక చానెల్ పెడితే... టీవీ తెరపై ఇంకేదో చానెల్ ప్రత్యక్షమవుతుంది. మీ టీవీ ఏకంగా మీ పైనే నిఘా పెట్టేస్తుంది! మీరు రోడ్డుపై కారులో రయ్యిన దూసుకుపోతున్నారు. అకస్మాత్తుగా మీ కారు బ్రేకులు ఫెయిలవుతాయి లేదా స్టీరింగ్ బిగుసుకుపోతుంది. చూస్తుండగానే యాక్సిడెంట్ జరిగిపోతుంది! అంతే కాదు... మీ గుండెకు అమర్చిన పేస్‌మేకర్ పరికరం హఠాత్తుగా పనిచేయడం మానేసి గుండెపోటు తెప్పించొచ్చు కూడా! అవును... ఎందుకంటే హ్యాకర్లు ఇప్పుడు ట్రెండు మార్చారు మరి! ఇంతవరకూ కంప్యూటర్లు, వెబ్సైట్లు, ఈ-మెయిళ్లు, క్రెడిట్‌కార్డుల వంటివాటి నుంచి సమాచార తస్కరణకు, ఆర్థికపరమైన దోపిడీకే పరిమితమైన హ్యాకర్లు.. ఇప్పుడు కాదేదీ హ్యాకింగ్కనర్హం అంటూ అన్నిరకాల ఆధునిక టెక్నాలజీలపైనా దృష్టిసారిస్తున్నారు. హ్యాకర్లు తెలివి మీరిపోతుండటంతో హ్యాకింగ్ ప్రక్రియ రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోందని ఇటీవల ‘ఐవోయాక్టివ్’ అనే అంతర్జాతీయ భద్రతా సంస్థ నిపుణులు హెచ్చరించారు. ఆటోమేటిక్ వాహనాలు, టీవీలు, వె బ్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు, వై-ఫైతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నింటినీ హ్యాకర్లు ఇప్పుడు తమ నియంత్రణలోకి తీసుకోగలుగుతున్నారని వారు వెల్లడించారు. గుండెకు అమర్చే పేస్‌మేకర్‌ను సైతం హ్యాక్ చేసి హత్యలు కూడా చేసేయగల స్థాయికి చేరారంటేనే.. టెక్నాలజీ ఎంత పెరిగినా భద్రత మాత్రం డొల్లగానే మారుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్టీరింగ్ చేతిలో ఉన్నా.. కారు మాట వినదు..! హైవేపై కారు గంటకు 90 కి.మీ. వేగంతో రయ్యిన దూసుకుపోతుంటుంది. ఒక్కసారిగా స్టీరింగ్ బిగుసుకుపోతుంది. కారు అడ్డం తిరుగుతుంది లేదా బ్రేకులు ఫెయిలవుతాయి లేదా ఉన్నపళంగా నడిరోడ్డు పైనే అడ్డంగా తిరిగి ఆగిపోతుంది. మొత్తానికి అన్నిరకాలుగా డ్రైవరు నియంత్రణ కోల్పోతాడు. కారు అత్యంత వేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇందులో ఏది జరిగినా పెను ప్రమాదం తప్పదు. కేవలం ఒక బటన్‌ను నొక్కి హ్యాకర్లు ఇదంతా చేయగలరన్నది అసలు సంగతి. భవిష్యత్తులో కంప్యూటర్ల సాయంతో నడిచే ఆటోమేటిక్ వాహనాల వాడకం బాగా పెరగనున్నందున హ్యాకర్లు వాటిని అదుపులోకి తీసుకుని నియంత్రించే ప్రమాదముందని ‘ఐవోయాక్టివ్’ కంపెనీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కంప్యూటరైజ్డ్ ఆటోమేటిక్ కారును ఎలా హ్యాకింగ్ చేయవచ్చో కూడా వారు ఇటీవల లాస్‌వెగాస్‌లో చేసి చూపించారు. ఒక్క క్లిక్‌తోనే వారు ఓ ఆటోమేటిక్ కారును డ్రైవరు నుంచి పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆటోమేటిక్ కార్లలోని ఏదైనా ఒక్క కంప్యూటర్ను హ్యాక్ చేసినా... ఇక ఆ కారు, అందులో ఉండేవారి భద్రత గాలిలో కలిసినట్టే. రేడియో, యూఎస్బీ పోర్టు, జీపీఎస్ వ్యవస్థ, వై-ఫై వంటి సౌకర్యాలన్నీ హ్యాకర్లకు రాచమార్గాలేనట. అసలు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల కన్నా కార్ల హ్యాకింగే చాలా సులభం అయిపోతుందట. రిమోట్ కంట్రోల్‌తో కార్లను లాక్ చేసేటప్పుడు ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ స్క్రాంబ్లర్ పరికరంతో సిగ్నళ్లను జామ్ చేసి హ్యాకర్లు లాక్ పడకుండా చేయగలరట. ఇంకేం... కారులో ఉన్న వస్తువులే కాదు... కారును కూడా ఈజీగా మాయం చేసేయొచ్చన్నమాట. ఇల్లు... గుల్లే! ఇంటి విషయానికి వస్తే... స్మార్ట్ ఫోన్ సాయంతో వై-ఫై, బ్లూటూత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ పరికరాలతో ఏర్పాటుచేసే ‘లాకిట్రాన్’ వంటి డోర్ లాక్‌లను తెరవడమూ హ్యాకర్లకు పెద్ద కష్టం కాదట. ఒక్క సుత్తిదెబ్బ పడకుండా.. చడీచప్పుడు లేకుండా... తలుపు తెరవగలిగితే ఇంకేముంది... ఇల్లు గుల్ల అవడం ఖాయం! అలాగే ఇళ్లల్లో మన కంప్యూటర్లకు ఉండే వెబ్ కెమెరాలతో, టీవీలు, బల్బులు, ఇతర వస్తువుల్లో అమర్చే ప్రత్యేక పరికరాలతో కూడా నిరంతరం మనం ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడుకుంటున్నాం? ఎవరితో ఉన్నాం? వంటివీ వారు తెలుసుకోవచ్చట. విద్యుత్ బల్బులు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, ఏసీల వంటి వాటినీ హ్యాకర్లు నియంత్రించగలరట. కత్తులతో కాదు... పేస్‌మేకర్‌తో చంపేస్తారు..! కొందరు హ్యాకర్లు ఎంతగా తెలివిమీరి పోయారంటే.. హృద్రోగుల గుండె పనితీరు మెరుగుపర్చేందుకు అమర్చే పేస్‌మేకర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తమ నియంత్రణలోకి తీసుకోగలరట. ఇవన్నీ దాదాపుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్లూటూత్ వంటి టెక్నాలజీలతోనే నియంత్రణలో ఉంటాయి. కాబట్టి.. స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేస్తే.. లేదా బ్లూటూత్‌ను నియంత్రిస్తే వీటి పనితీరును మార్చేయవచ్చన్నమాట. అయితే ఇలా శరీరంలో అమర్చే వైద్యపరికరాలను హ్యాకింగ్ చేయవచ్చని, దీనిని ప్రదర్శించి చూపుతానంటూ హ్యాకింగ్‌లో నిపుణుడైన బార్నబీ జాక్ అనే యువకుడు ఇటీవల ముందుకొచ్చారు. ఇందుకు ‘బ్లాక్ హ్యాట్’ అనే కంపెనీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది కూడా. కానీ ప్రదర్శనకు కొద్ది సమయానికి ముందే జాక్ చనిపోయాడు. అయితే అతడి మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కొత్త పరిష్కారాలపై దృష్టిపెట్టాలి... ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా... వెబ్సైట్ల మీద, కంప్యూటర్ల మీద జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతున్నాం. ఇక వాహనాలు, ఇళ్లు, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్, వైద్య పరికరాలపై కూడా హ్యాకర్ల దాడులు ముమ్మరం అయితే ఏం చేయాలో? అంటూ అంతర్జాతీయ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఏదేమైనా.. హ్యాకర్లను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే కొత్త పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని చెబుతున్నారు. నిపుణుల ఎత్తులకు హ్యాకర్లు ఎప్పటికప్పుడు పైఎత్తులు వేస్తూనే ఉన్నారని... వారి ఆట కట్టించాలంటే నిపుణులు కూడా ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే ఉండాలనీ, వినియోగదారులు తాజా సెక్యూరిటీ అప్డేట్స్ను డౌన్లోడ్ చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. - హన్మిరెడ్డి యెద్దుల ఇలా కూడా చేస్తారు... ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ప్రాచుర్యం పొందిన యాంగ్రీబర్డ్స్ వంటి ఆటల ద్వారా రహస్య కోడ్‌ను పంపి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను నియంత్రణలోకి తీసుకుంటారు. ఐఫోన్ చార్జ్ చేసేందుకు ఉపయోగించే పవర్ అడాప్టర్ ద్వారా కూడా దానిని హ్యాక్ చేస్తారు. స్మార్ట్‌ఫోన్ ఆప్‌తో పనిచేసే టాయిలెట్లను సైతం నియంత్రణలోకి తీసుకోగలరట. దీనివల్ల టాయిలెట్లో నీళ్లు కిందికి చిమ్మే విధానాన్ని కూడా మార్చేస్తారు. ఇంటర్నెట్కు అనుసంధానమై ఉండే లైటు బల్బులను కూడా ట్యాంపర్ చేసి వెలగకుండా చేస్తారు. డిజిటల్ ఫ్రిజ్‌ను ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా చేసి ఆ ఇంట్లోవారికి తెలియకుండానే ఆహారాన్ని పాడు చేస్తారు. ఏసీ యంత్రాలను ఆగిపోయేలా చేసి ఇంట్లోవారికి చెమటలు పట్టించేయగలరు. రేడియో ట్రాన్సీవర్లను ఉపయోగించి తప్పుడు సెన్సర్ సమాచారాన్ని పంపడం ద్వారా వైర్లెస్ టెక్నాలజీతో పనిచేసే విద్యుత్ కేంద్రాలను సైతం హ్యాకర్లు పూర్తిగా ఆగిపోయేలా చేయగలరట! ఇలా... హ్యాకర్లు తలచుకుంటే ఏమైనా చేయగలరు. జాగ్రత్త! -
కూలుతున్న ‘పంచాయతీ’
ఇందూరు, న్యూస్‌లైన్ :మారుమూల గ్రామ పంచాయతీలు సైతం చాలా వరకు నూతన భవనాలు నిర్మించుకున్నాయి. కానీ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం రేపోమాపో కూలుతుందేమోనన్నట్లు తయారైంది. పెచ్చులూడిన పైకప్పుతో, చెట్ల వేర్లు పాకిన, తేమతో నిండిన గోడలతో ఉద్యోగులను భయపెడుతోంది. అందులో కూర్చుండి పనిచేయడానికి శాఖ ఉద్యోగులు జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని భయం భయంగా పనిచేస్తున్నారు. ఇందులోని డీపీఓ, డీఎల్పీఓ చాంబర్లతో పాటు ఇతర గదులు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల పలు భవనాలు కూలిన సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీచేయాలని నోటీసులు జారీ చేశారు. కానీ పంచాయతీ అధికారి కార్యాలయానికి మాత్రం నోటీసులు పంపలేదు. గోడలపై చెట్లు మొలిచి, పెద్దపగుళ్లు వచ్చాయి. స్లాబు పూర్తిగా చెడిపోయి పెచ్చులూడుతోంది. వర్షకాలం సీలింగ్ నుంచి ధారగా ఊరుస్తూనే ఉంది. గోడలన్నీ తేమగా మారిపోయాయి. ఇప్పటికే కంప్యూటర్ విభాగంలో రెండు కొత్త కంప్యూటర్లు వర్షానికి తడిసి చెడిపోయాయి. ఉన్నవాటిని కాపాడుకునేందుకు సిబ్బంది కవర్లు కప్పి ఉంచుతున్నారు. పాతకాలం నాటి విలువైన దస్త్రాలు సైతం తడిసి ముద్దయ్యాయి. మొన్నటికి మొన్న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సామగ్రి సైతం వర్షంనీళ్లకు తడిసింది. ఇప్పటికీ అద్దె భవనంలోనే.. అసలు జిల్లా పంచాయతీ అధికారికి సొంత భవనమే లేదు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న కార్యాలయ భవనం మునిసిపాల్టీకి చెందింది. దీనికి శాఖ అద్దె చెల్లిస్తోంది. ఇందులో 1991 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఓ కార్యాలయానికి స్థలం ఉంది. దీంట్లో నూతన భవన నిర్మాణం కోసం 2000లో ప్రణాళికలు వేశారు. తీరా నిధులు లేక నిర్మాణం అటకెక్కింది. నిధుల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా మంజూరు మాటేలేదు. నూతన భవనం కోసం.. -సురేశ్‌బాబు, డీపీఓ ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయంలో శిథిలావస్థకు చేరుకుంది. జడ్పీలో ఖాళీస్థలం ఉన్నా నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. వీటికోసం మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. అప్పటి వరకు మరో అద్దెభవనం కోసం గాలిస్తున్నాం.