టీవీ కొంచెం... రిమోట్ ఘనం
తిక్క లెక్క
టీవీ సైజు ఎంత ఉంటుంది..? ఇళ్లలో సాధారణంగా వాడే ఎంత భారీ టీవీ అయినా మహా అయితే నలభై అంగుళాలు ఉంటుందేమో! రిమోట్ సంగతేముందిలే.. అరచేతిలో ఇమిడిపోయేదేగా.. అనుకుంటున్నారా..? ఫొటోలో కనిపిస్తున్న ఈ రిమోట్‌ను చూడండి.. దీని పొడవు ఏకంగా 14 అడుగుల 9.1 అంగుళాలు. ఉత్తుత్తి రిమోట్ నమూనా ఏమీ కాదు, నిజంగానే పనిచేస్తుంది.
ఎదురుగా మామూలు సైజులో ఉన్న టీవీని పెట్టుకుని, ఈ రిమోట్‌ను నొక్కుతూ చానళ్లను మార్చుకోవచ్చు, సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే, దీనిని ఎత్తాలంటే ఒక మనిషికి సాధ్యం కాదు. కనీసం ముగ్గురైనా ఉండాల్సిందే. ఒడిశాలోని సంబల్‌పూర్ నగరానికి చెందిన సోదరులు సూరజ్‌కుమార్ మెహర్, రాజేశ్‌కుమార్ మెహర్ దీనిని రూపొందించి గిన్నెస్ రికార్డు సాధించారు.