వైద్యశాస్త్రం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. అధునాత శస్త్ర చికిత్సా విధానాలతో కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏకంగా మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు సైతం వైద్యం అందేలా సరికొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పురోగతి వైద్యశాస్త్రంలో సరికొత్త విజయాన్నినమోదు చేసింది. వందలు, వేలు కాదు ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా సర్జరీ చేసి సరికొత్త చికిత్స విధానానికి నాందిపలికారు.
ఈ సర్జరీని టెలిఆపరేటెడ్ మాగ్నెటిక్ ఎండోస్కోపీ సర్జరీ అంటారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్, చైనీస్ యూనివర్సిటీ ఆప్ హాంకాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ఎండోస్కోపీ సర్జరీని విజయవంతం చేశారు. దీన్ని రిమోట్ నియంత్రిత పరికరాన్ని ఉపయోగించి నిర్వహించారు. శస్త్ర చికిత్స టైంలో కడుపు గోడ బయాప్సీ తీసుకుని స్వైన్ మోడల్‌లో ఈ సర్జరీ చేశారు వైద్యులు.
ఈ సర్జరీలో హాంకాంగ్‌లోని ఆపరేటింగ్ గదిలో భౌతికంగా ఉన్న ఒక వైద్యుడు, దాదాపు 9,300 కిలోమీటర్ల దూరంలోని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న రిమోట్ స్పెషలిస్ట్‌లిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో నియంత్రించడానికి ఇద్దరు నిపుణులు అధునాత సాంకేతికతను ఉపయోగించారు. ఇక్కడ నిపుణుడు జ్యూరిచ్‌లోని ఆపరేటర్ కన్సోల్ నుంచి గేమ్ కంట్రోలర్‌ని ఉపయోగించాడరు. అయితే నిపుణులు ఈ శస్త్ర చికిత్సను మత్తులో ఉన్న పందిపై విజయవంతంగా నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ విడుదల చేసింది. ఈ ఫరిశోధన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. తదుపరి దశలో మానవ కడుపుపై ఈ టెలీ ఎండోస్కోపీని నిర్వహిస్తామని చెప్పారు.
ఇక్కడ ఈ టెలి ఆపరేటెడ్ ఎండోస్కోపీ రిమోట్ సర్జికల్ ట్రైనింగ్ కేవలం శరీరాన్ని మానిటరింగ్ చేయడమే గాక మారుమూల ప్రాంతాల్లో తక్షణ రోగనిర్థారణ, శస్త్ర చికత్స సంరక్షణను అందించగలదు. ప్రత్యేకించి స్థానికంగా వైద్యనిపుణులు అందుబాటులో లేనప్పడు రిమోట్ నిపుణుడు శిక్షణ పొందిన నర్సులకు ఎలా చేయాలో సూచనలివ్వొచ్చు. ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగుల జీర్ణశయాంత కేన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించగలుగుతామని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షానన్ మెలిస్సా చాన్ అన్నారు. బాహ్య అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించబడే ఈ అయస్కాంత ఎండోస్కోప్‌ని వీడియో గేమ్ కంట్రోలర్ సాయంతో విజయవంతంగా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు పరిశోధకులు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment