Medical Science
-
ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి రిమోట్ సర్జరీ!
వైద్యశాస్త్రం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. అధునాత శస్త్ర చికిత్సా విధానాలతో కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏకంగా మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు సైతం వైద్యం అందేలా సరికొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పురోగతి వైద్యశాస్త్రంలో సరికొత్త విజయాన్నినమోదు చేసింది. వందలు, వేలు కాదు ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా సర్జరీ చేసి సరికొత్త చికిత్స విధానానికి నాందిపలికారు. ఈ సర్జరీని టెలిఆపరేటెడ్ మాగ్నెటిక్ ఎండోస్కోపీ సర్జరీ అంటారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్, చైనీస్ యూనివర్సిటీ ఆప్ హాంకాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ఎండోస్కోపీ సర్జరీని విజయవంతం చేశారు. దీన్ని రిమోట్ నియంత్రిత పరికరాన్ని ఉపయోగించి నిర్వహించారు. శస్త్ర చికిత్స టైంలో కడుపు గోడ బయాప్సీ తీసుకుని స్వైన్ మోడల్లో ఈ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో హాంకాంగ్‌లోని ఆపరేటింగ్ గదిలో భౌతికంగా ఉన్న ఒక వైద్యుడు, దాదాపు 9,300 కిలోమీటర్ల దూరంలోని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న రిమోట్ స్పెషలిస్ట్లిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో నియంత్రించడానికి ఇద్దరు నిపుణులు అధునాత సాంకేతికతను ఉపయోగించారు. ఇక్కడ నిపుణుడు జ్యూరిచ్‌లోని ఆపరేటర్ కన్సోల్ నుంచి గేమ్ కంట్రోలర్‌ని ఉపయోగించాడరు. అయితే నిపుణులు ఈ శస్త్ర చికిత్సను మత్తులో ఉన్న పందిపై విజయవంతంగా నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ విడుదల చేసింది. ఈ ఫరిశోధన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. తదుపరి దశలో మానవ కడుపుపై ఈ టెలీ ఎండోస్కోపీని నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ ఈ టెలి ఆపరేటెడ్ ఎండోస్కోపీ రిమోట్ సర్జికల్ ట్రైనింగ్ కేవలం శరీరాన్ని మానిటరింగ్ చేయడమే గాక మారుమూల ప్రాంతాల్లో తక్షణ రోగనిర్థారణ, శస్త్ర చికత్స సంరక్షణను అందించగలదు. ప్రత్యేకించి స్థానికంగా వైద్యనిపుణులు అందుబాటులో లేనప్పడు రిమోట్ నిపుణుడు శిక్షణ పొందిన నర్సులకు ఎలా చేయాలో సూచనలివ్వొచ్చు. ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగుల జీర్ణశయాంత కేన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించగలుగుతామని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షానన్ మెలిస్సా చాన్ అన్నారు. బాహ్య అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించబడే ఈ అయస్కాంత ఎండోస్కోప్ని వీడియో గేమ్ కంట్రోలర్ సాయంతో విజయవంతంగా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు పరిశోధకులు. (చదవండి: -
Health Tips: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి!
భారతీయ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడతారు, అందులో 30 శాతం మంది సాయంత్రం పూట తాగుతున్నారు. అయితే... సాయంత్రం పూట టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం మంచి నిద్ర, సరైన లివర్ డిటాక్స్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం పడుకోవడానికి కొద్దిగంటల ముందు కెఫీన్ ను నివారించడం ఉత్తమం. టీ చెడ్డది కాదు.. కానీ.., అది పాలతో తాగాలా, ఎక్కువ తాగాలా.. తక్కువ తాగాలా.. ఏ సమయంలో తాగాలి.. అనేది చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విదేశాలలో చాలా మంది బ్లాక్ టీనే తాగుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, థైరోఫ్లేవిన్, థైరోబిసిన్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి–ఇవన్నీ ఆరోగ్యకరమైనవే. మనదేశంలో మాత్రం పాలు, చక్కెరను జోడించి టీ తయారు చేసుకొని తాగుతారు. అయితే ఇది అంత మంచిది కాదు. అందువల్ల మన టీరు తెన్నులు మార్చుకోవడం మంచిది. ♦ రాత్రి షిఫ్టులో పనిచేసే వ్యక్తులు ♦ ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్య లేని వ్యక్తులు ♦ ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కలిగిన వారు ♦ నిద్ర సమస్య లేని వారు ♦ ప్రతిరోజూ సమయానికి భోజనం చేసేవారు ♦ సగం లేదా కప్పు కంటే తక్కువ టీ తాగే వారు.. వీరంతా ఎప్పుడు తాగినా ఫరవాలేదు. సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ♦ నిద్రలేమికి గురయ్యే వారు ♦ ఆందోళనతో బాధపడేవారు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపేవారు ♦ అధిక వాత సమస్యలు ఉన్న వ్యక్తులు (పొడి చర్మం,పొడి జుట్టు) ♦ బరువు పెరగాలనుకునే వారు ♦ ఆకలి సరిగా లేని వారు ♦ హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు ♦మలబద్ధకం / ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య. ♦జీవక్రియ, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారు. ♦ తక్కువ బరువు కలవారు ♦ ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోరుకునే వారు. ఇక ఏ టీ, ఎప్పుడు తాగాలో మీరే తేల్చుకోండి. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
అసాధ్యాన్ని సాధ్యం చేశాం
న్యూఢిల్లీ/కోచీ: నిర్మాణాత్మక విమర్శలను తానెప్పుడూ స్వాగతిస్తానని, ప్రజా జీవితంలో భిన్నాప్రాయాలకు తావుండాలని, అందరూ తమ తమ భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా... సమాజంలో అంశాలపై చర్చ నిరంతరం సాగుతూనే ఉండాలని శుక్రవారం జరిగిన ‘మలయాళ మనోరమ’ సదస్సులో ప్రధాని పేర్కొన్నారు. న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో తనలా ఆలోచించే వారు ఎక్కువ మంది లేకపోయినప్పటికీ కొందరి ఆలోచనలను, నిర్మాణాత్మక విమర్ళను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటానని చెప్పారు. నవ భారతం అన్న అంశంపై సదస్సు నిర్వహించడాన్ని హర్షిస్తూనే.. ‘‘మీరూ మోదీలా మాట్లాడుతున్నారా?’’ అని విమర్శకులు ప్రశ్నిస్తారని, దానికి సమాధానాలు సిద్ధంగా పెట్టుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సిఫారసులు, లైసెన్సులతో... మీ వెనుక ఎవరున్నారన్న అంశాలపై కాకుండా... మీ కలలు, ఆశలను సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పించేదే నవ భారత స్ఫూర్తి అని స్పష్టం చేశారు. ఈ దిశగా తమ ప్రభుత్వం ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఎన్నో మార్పులను చేసి చూపిందని చెప్పారు. పౌరులే కేంద్రంగా పరిపాలన... తమ హయాంలో పరిపాలన మొత్తం పౌరులే కేంద్రంగా సాగుతోందని, 1.5 కోట్ల మంది పేదలకు కేవలం నాలుగు గోడలు కాకుండా.. అన్ని రకాల సదుపాయాలు ఉండే ఇళ్లను నిర్మించి ఇవ్వగలిగామని మోదీ తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయుల యోగక్షేమాలను చూస్తున్నామని అన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన కేరళ నర్సులు, ఫాదర్ టామ్ రక్షణకు తాము తీసుకున్న చర్యలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. బీజేపీ రాజ్యసభ సభ్యురాలు మీనాక్షీ లేఖి, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నేత మహమ్మద్ సలీమ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మొయిత్రా తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రాచీన వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి న్యూఢిల్లీ: ప్రాచీన వైద్య విజ్ఞానాన్ని ఆధునిక వైద్య విధానాలతో అనుసంధానించే అంశంలో దేశం ఇప్పటివరకూ పెద్దగా పురోగతి సాధించలేదని.. ఈ పరిస్థితి మార్చేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వేల ఏళ్ల నాటి వైద్యవిజ్ఞానం అందుబాటులో ఉందని ఆధునిక పరిశోధనల సాయంతో వాటి ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ఐదేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పారు. పాత, కొత్త వైద్యవిధానాల మేళవింపుతోనే దేశ ఆరోగ్య రంగం మెరుగుపడగలదని స్పష్టం చేశారు. హర్యానాలో ఏర్పాటైన పది ఆయుష్ కేంద్రాలను శుక్రవారం వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఎన్నికల సమయంలో నాకూ ఇలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడైతే ఆయుష్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి కాబట్టి ఖట్టర్ లాంటి వారు అక్కడే చికిత్స తీసుకోవచ్చు’’ అని చమత్కరించారు. ఆయుష్ కార్యక్రమంలోకి తాజాగా సోవా రిగ్పా అనే బౌద్ధ వైద్యవిధానాన్ని చేరుస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఆయుర్వేద, సిద్ధ తదితర భారతీయ వైద్యవిధానాలకు విశేష సేవలందించిన 12 మంది వ్యక్తుల పోస్టల్ స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. గాంధీజీ వ్యక్తిగత వైద్యుడు దిన్షా మెహతా తదితరులు ఉన్నారు. ముంబైలోని ‘ది యోగా ఇన్స్టిట్యూట్’ డైరెక్టర్ హస్నా యోగేంద్రకు యోగా అవార్డు ప్రదానం చేస్తున్న మోదీ -
‘ప్లాస్టిక్’తో అందాలు
కోటేరు లాంటి ముక్కు... నవ్వితే దానిమ్మ గింజల్లా మెరిసిపోయే పలువరుస... సిగ్గుపడితే బుగ్గనసొట్ట... ఇలాంటి అందమైన ఆకృతి వద్దనుకునే అమ్మాయిలు ఏవరైనా ఉంటారా? కచ్చితంగా ఉండరు కాగా ఉండరు. పుట్టుకతోనే ఇంతటి సౌందర్య లక్షణాలు సంక్రమించకపోతే! అయితే అందంగా కనిపించే భాగ్యం మనకు లేదా? వీటన్నింటికి సమాధానమిస్తోంది ఆధునిక వైద్య విజ్ఞానం. ఔను ప్రస్తుతం ముఖారవిందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే మార్గం కావడంతో చాలా మంది ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన ఈ సర్జరీ విధానం ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మెట్రో యువతుల్లో రోజురోజుకూ ఈ ప్లాస్టిక్ సర్జరీపై క్రేజ్ పెరుగుతోంది. అమ్మాయిలే కాదండి... అబ్బాయిలు కూడా ఇలాంటి సర్జరీలపై మక్కువ చూపుతుండడం గమనార్హం. - సాక్షి, బెంగళూరు ముక్కుపై మక్కువ... ప్రస్తుతం బెంగళూరులాంటి మహానగరాల్లో ప్లాస్టిక్ సర్జరీల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. తమ ఆకృతిని మార్చుకునేం దుకు ప్లాస్టిక్ సర్జరీల వైపు చూస్తున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీరిలో ఎక్కువ శాతం మంది వివాహానికి ముందు ఇలాంటి సర్జరీలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా రినోప్లాస్టీ (ముక్కుకు సర్జరీ) చేయించుకోవడంపై చాలా మంది శ్రద్ధ కనబరుస్తున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాస్త లావుగా ఉన్న ముక్కును చెక్కేసి స న్నగా కోటేరులా తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం సర్జరీ చే యించుకునే వారి శరీరంలో ఏదో ఒక భాగం నుంచి కణజాలా న్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం వారికి సరిపోకపోతే రక్తసంబంధీకుల నుంచి కణజాలాన్ని సేకరించి సర్జరీ చేసిన చోట ఆ కొత్త కణజాలాన్ని పరచి ఆకృతినే మార్చేస్తున్నారు. ‘ఒక మనిషి అందాన్ని నిర్ణయించడంలో ముక్కు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముక్కు చక్కగా, నాజుకుగా ఉంటే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది అమ్మాయిలు రినోప్లాస్టీపై మక్కువ చూపుతున్నారు. వివాహాలు నిశ్చయమైన అమ్మాయిలను వారి తల్లిదండ్రులే పిలుచుకొచ్చి ఈ తరహా సర్జరీలు చేయిస్తున్నారు.’ అని బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మధు పేర్కొన్నారు. అబ్బాయిల్లోనూ క్రేజ్... ప్లాస్టిక్ సర్జరీల కోసం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎ గబడుతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా ముక్కు, గడ్డం, పెదవులకు సర్జరీలు చేయించుకోవడానికి ఇష్టపడుతుంటే అబ్బాయిలు మాత్రం అబ్డామినో ప్లాస్టీ(పొట్టను తగ్గించుకోవడం)పై ఆసక్తి చూపుతున్నారు. దీనినే టమ్మీ టకింగ్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ముఖంపై ఉన్న మడతలు పోగొట్టుకోవడానికి కూడా నగరంలోని యువకులు ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీనే ఆశ్రయిస్తున్నారు. సర్జరీలలోని రకాన్ని బట్టి ఒక్కొ సర్జరీకి రూ. 25వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని సర్జన్లు చెబుతున్నారు. జాగ్రత్తలు కూడా అవసరం ‘ఇంతకు ముందు శరీరం కాలిగాయాలైతేనే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారు. అయితే ఇపుడు ముఖాకృతి కోసం, ముడతలు పోగొట్టుకోవడానికి మధ్యతరగతి వారు కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏదో ఒక భాగానికి సర్జరీ చే యించుకున్నంత మాత్రాన మొత్తం రూపమే మారిపోతుందనుకుంటే పొరపాటు. ఒక్కొసారి సరైన నైపుణ్యం లేని డాక్టర్ల వద్ద సర్జరీ చేయించుకుంటే రక్తం గడ్డకట్టడం, బ్లీడింగ్ అవడం జరుగుతుంటాయి. అందుకే సర్జరీ చేయించుకోవాలనుకున్నపుడు నిపుణులైన సర్జన్లను సంప్రదించి వారి కౌన్సిలింగ్ తీసుకోవాలి. వారి సలహాలను పాటిస్తూ సర్జరీ చేయించుకుంటే అందమైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు.’ - డాక్టర్ చేతన్, ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్, బెంగళూరు సొట్టబుగ్గలు, పలువరుసలు కూడా... అమ్మాయిలకు దానిమ్మ గింజల్లా కనిపించే అందమైన పలువరుస, సొట్ట బుగ్గలు ఊహించుకుంటే ఎంత బాగుందో కదా.. అందుకే ప్రస్తుతం అమ్మాయిలు వీటిపై క్రేజీగా ఉన్నారు. అదనంగా ఉన్న కణజాలాన్ని తీసేసి చీక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బుగ్గలపై సొట్టలను సృష్టిస్తున్నారు సర్జన్లు. అంతేకాదు ఇంతకు ముందు పన్ను మీద పన్నుంటే ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడదే ప్యాషన్ అయింది. పన్నుమీద పన్నును ఇంప్లాంట్ చేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్లే యువతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకారు పెదవుల ఆకృతి సరిగా లేని అమ్మాయిలు లిప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్జరీలోనూ ఎన్నో రకాలు..... ప్లాస్టిక్ సర్జరీల్లో ప్రస్తుతం ఎక్కువగా బ్లెపారో ప్లాస్టీ( కనుబొమ్మలను తీర్చిదిద్దడం), ఓటో ప్లాస్టీ( చెవులు), చిన్ ఇంప్లాంట్(గడ్డం), చీక్ ఇంప్లాంట్ (చెంపలు), టమ్మీ టకింగ్లకు డిమాండ్ ఉంది. ఈ సర్జరీల్లో సైతం ఆటోగ్రాఫ్ట్స్, అల్లో గ్రాఫ్ట్స్, క్సెనోగ్రాఫ్ట్ అనే రకాలున్నాయి. ఆటోగ్రాఫ్ట్స్: సర్జరీ చేయించుకునే వ్యక్తి లేదా రక్తసంబంధీకుల కణజాలాలు సరిపోకపోతే ఓ కొత్తకణజాలాన్ని టెస్ట్‌ట్యూబ్‌లో సృష్టించి దానితో సర్జరీ పూర్తిచేస్తారు. అల్లోగ్రాఫ్ట్స్: ఒకే జాతికి చెందిన(ఆడవారికి సర్జరీ చేయాలంటే ఆడవారి నుంచి, మగవారికి సర్జరీ చేసేటపుడు మగవారి నుంచి కణజాలాన్ని తీసుకోవడం) వారి నుంచి తీసుకొని సర్జరీ చేయడం క్సెనోగ్రాఫ్ట్స్: మానవ శరీరం నుంచి కాకుండా వేరే జంతువుల కణజాలాన్ని సేకరించి సర్జరీ చేయడం -
ఆ విషయంలో తెగ ఇబ్బంది పడతాను!
లైఫ్‌బుక్: కాజోల్ హీరోలకు మాత్రమే మంచి పాత్రలను ఎంచుకునే అవకాశం ఉందనేదాంట్లో నిజం లేదు. హీరో అవసరం లేకుండానే ప్రేక్షకులను మెప్పించే పాత్రలను అప్పుడూ ఇప్పుడూ హీరోయిన్లు చేశారు. ఇక వయసు విషయంలో ఒక తమాషా ఎప్పుడూ జరుగుతుంటుంది. మగవాళ్లు 55 సంవత్సరాలు దాటినా- ‘‘ఇప్పటికీ గ్లామర్‌గా ఉన్నాడు’’ అంటారు. అదే ఆడవారి విషయానికి వస్తే- ‘‘ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవారో’’ అంటారు! అప్పుడు ఇప్పుడు నాలో మార్పు రాని విషయం...ఫోటోషూట్! ఎప్పుడు కెమెరా ముందు కూర్చున్నా తెగ ఇబ్బంది పడతాను. ‘‘భగవంతుడా ఏమిటిది?’’ అని గొణుక్కుంటాను. కెమెరా ముందు ఉంటానన్న మాటేగానీ ఎలాంటి హావభావాలు ప్రకటించాలో కూడా నాకు అర్థం కాదు. రోలింగ్ కెమెరా ముందు మాత్రం ఎలాంటి సమస్యా అనిపించదు. నలభైలోకి వచ్చేశాను. ‘నలభై తరువాత జీవితం మారుతుంది’ అనే దాని కంటే ‘నలభై అనేది మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక రిమైండర్ లాంటిది’ అనేదాన్ని నమ్ముతాను. నలభైలో ఆవేశం కంటే ఆలోచన ముందుంటుంది. ‘‘నేను సరియైన దారిలోనే ప్రయాణిస్తున్నానా?’’ అని నలభైలో ఎవరికి వారు ప్రశ్నించుకుంటారు. అదృష్టవశాత్తూ నేను సరియైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను. ఒకప్పుడు 70 సంవత్సరాలు బతకడం గొప్ప. అంతకంటే ఎక్కువ కాలం బతికితే ‘అదనపు కాలం’గా భావించేవారు. ఇప్పుడు ఏ వయసులోనైనా సరే హార్ట్ రిప్లెస్మెంట్తో సహా రకరకాల రిప్లెస్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘నా వయసు ఇంత’ అని మనమేమీ బెంగపడిపోనక్కర్లేదు. ఇప్పుడున్న మెడికల్ సైన్స్ దీర్ఘాయుషును ప్రసాదిస్తున్నప్పుడు 40 సంవత్సరాలకే భయపడడం అనేది అర్థం లేని పని.