
భారతీయ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడతారు, అందులో 30 శాతం మంది సాయంత్రం పూట తాగుతున్నారు. అయితే... సాయంత్రం పూట టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్య శాస్త్రం ప్రకారం మంచి నిద్ర, సరైన లివర్ డిటాక్స్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం పడుకోవడానికి కొద్దిగంటల ముందు కెఫీన్ ను నివారించడం ఉత్తమం. టీ చెడ్డది కాదు.. కానీ.., అది పాలతో తాగాలా, ఎక్కువ తాగాలా.. తక్కువ తాగాలా.. ఏ సమయంలో తాగాలి.. అనేది చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
విదేశాలలో చాలా మంది బ్లాక్ టీనే తాగుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, థైరోఫ్లేవిన్, థైరోబిసిన్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి–ఇవన్నీ ఆరోగ్యకరమైనవే. మనదేశంలో మాత్రం పాలు, చక్కెరను జోడించి టీ తయారు చేసుకొని తాగుతారు. అయితే ఇది అంత మంచిది కాదు. అందువల్ల మన టీరు తెన్నులు మార్చుకోవడం మంచిది.
♦ రాత్రి షిఫ్టులో పనిచేసే వ్యక్తులు
♦ ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్య లేని వ్యక్తులు
♦ ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కలిగిన వారు
♦ నిద్ర సమస్య లేని వారు
♦ ప్రతిరోజూ సమయానికి భోజనం చేసేవారు
♦ సగం లేదా కప్పు కంటే తక్కువ టీ తాగే వారు.. వీరంతా ఎప్పుడు తాగినా ఫరవాలేదు.
సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి!
♦ నిద్రలేమికి గురయ్యే వారు
♦ ఆందోళనతో బాధపడేవారు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపేవారు
♦ అధిక వాత సమస్యలు ఉన్న వ్యక్తులు (పొడి చర్మం,పొడి జుట్టు)
♦ బరువు పెరగాలనుకునే వారు
♦ ఆకలి సరిగా లేని వారు
♦ హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు
♦మలబద్ధకం / ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య.
♦జీవక్రియ, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారు.
♦ తక్కువ బరువు కలవారు
♦ ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోరుకునే వారు.
ఇక ఏ టీ, ఎప్పుడు తాగాలో మీరే తేల్చుకోండి.
నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment