Endoscopy
-
ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి రిమోట్ సర్జరీ!
వైద్యశాస్త్రం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. అధునాత శస్త్ర చికిత్సా విధానాలతో కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏకంగా మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు సైతం వైద్యం అందేలా సరికొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పురోగతి వైద్యశాస్త్రంలో సరికొత్త విజయాన్నినమోదు చేసింది. వందలు, వేలు కాదు ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా సర్జరీ చేసి సరికొత్త చికిత్స విధానానికి నాందిపలికారు. ఈ సర్జరీని టెలిఆపరేటెడ్ మాగ్నెటిక్ ఎండోస్కోపీ సర్జరీ అంటారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్, చైనీస్ యూనివర్సిటీ ఆప్ హాంకాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ఎండోస్కోపీ సర్జరీని విజయవంతం చేశారు. దీన్ని రిమోట్ నియంత్రిత పరికరాన్ని ఉపయోగించి నిర్వహించారు. శస్త్ర చికిత్స టైంలో కడుపు గోడ బయాప్సీ తీసుకుని స్వైన్ మోడల్లో ఈ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో హాంకాంగ్‌లోని ఆపరేటింగ్ గదిలో భౌతికంగా ఉన్న ఒక వైద్యుడు, దాదాపు 9,300 కిలోమీటర్ల దూరంలోని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న రిమోట్ స్పెషలిస్ట్లిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో నియంత్రించడానికి ఇద్దరు నిపుణులు అధునాత సాంకేతికతను ఉపయోగించారు. ఇక్కడ నిపుణుడు జ్యూరిచ్‌లోని ఆపరేటర్ కన్సోల్ నుంచి గేమ్ కంట్రోలర్‌ని ఉపయోగించాడరు. అయితే నిపుణులు ఈ శస్త్ర చికిత్సను మత్తులో ఉన్న పందిపై విజయవంతంగా నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ విడుదల చేసింది. ఈ ఫరిశోధన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. తదుపరి దశలో మానవ కడుపుపై ఈ టెలీ ఎండోస్కోపీని నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ ఈ టెలి ఆపరేటెడ్ ఎండోస్కోపీ రిమోట్ సర్జికల్ ట్రైనింగ్ కేవలం శరీరాన్ని మానిటరింగ్ చేయడమే గాక మారుమూల ప్రాంతాల్లో తక్షణ రోగనిర్థారణ, శస్త్ర చికత్స సంరక్షణను అందించగలదు. ప్రత్యేకించి స్థానికంగా వైద్యనిపుణులు అందుబాటులో లేనప్పడు రిమోట్ నిపుణుడు శిక్షణ పొందిన నర్సులకు ఎలా చేయాలో సూచనలివ్వొచ్చు. ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగుల జీర్ణశయాంత కేన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించగలుగుతామని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షానన్ మెలిస్సా చాన్ అన్నారు. బాహ్య అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించబడే ఈ అయస్కాంత ఎండోస్కోప్ని వీడియో గేమ్ కంట్రోలర్ సాయంతో విజయవంతంగా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు పరిశోధకులు. (చదవండి: -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
హైదరాబాద్, మే 14, 2024: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్ తింటూ, పళ్లు లేకపోవడంతో పొరపాటున ఓ ఎముక మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక.. లోపల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమైంది. ఎదభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు.. ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు.తొలుత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి, ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల నేతృత్వంలోని వైద్యబృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి, తగిన పరీక్షలు కూడా చేసి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజర్తోనే ఎముకను అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. దానివల్ల నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. వెళ్లిన విషయం కూడా తొలుత ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో తర్వాత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి చూసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు. అక్కడినుంచి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి పంపారు.సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవడం వల్ల ఆహారనాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. అలాంటప్పుడు తీసే సమయంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోయి, అది గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్‌లోనే తొలగించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఎముక వల్ల వచ్చిన నొప్పి ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు.ఏ వయసువారైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఇక కాస్త పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత అయితే ఏదైనా బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎముకలను ఎవరైనా యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో ఆయనకు పళ్లు లేకపోవడంతో తెలియక, పొరపాటున మింగేశారు. అది సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. చీము పడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు. -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. -
షాకింగ్ ఘటన: చెవిలో గూడు కట్టుకుని, పిల్లలతో సహా కాపురమున్న సాలీడు
షాంఘై: చైనాలో ఓ మహిళ చెవి నొప్పితో ఆస్పత్రికెళ్లింది. పరీక్షించిన వైద్యులు చెవిలోపలి భాగంలో ఓ సాలీడు గూడు కట్టుకుని సంతానంతో సహా కాపురం ఉన్నట్లు తేల్చారు. సిచువాన్ ప్రావిన్స్ హుయిడాంగ్ కౌంటీ ఆస్పత్రికి సుమారు పది రోజుల క్రితం ఓ మహిళ వచ్చింది. కుడి చెవి నొప్పితోపాటు లోపలి నుంచి బెల్ కొడుతున్నట్లుగా శబ్ధం వస్తోందంటూ వైద్యులకు తెలిపింది. ఎండోస్కోపీ పరీక్ష చేసిన వైద్యులు కర్ణభేరిలాంటి నిర్మాణాన్ని గుర్తించారు. కెమెరా అమర్చిన ప్రత్యేక పరికరాలను లోపలికి పంపించి చూడగా దాని వెనుక ఒక సాలీడు గూడు కనిపించింది. దీంతో,ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. వైద్య నిపుణులు ఆ గూడును బయటకు లాగగా దాంతోపాటు అందులోని సాలీడు, దాని పిల్లలు బయటకు వచ్చాయి. అయితే, ఈ సాలీడు విషపూరితమైంది కాకపోవడం సంతోషించాల్సి విషయమని వైద్యులు తెలిపారు. (లేటు వయసులో ఘాటు ప్రేమ.. 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!) -
వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
మొబైల్ మింగేశాడు.. ఎండోస్కోపీతో..
Delhi: తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఒకరు మొబైల్ ఫోన్ మింగేశాడు. జైలు అధికారులు తన వద్ద మొబైల్ ఉన్నట్లు గుర్తిస్తారన్న భయంతో ఖైదీ ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైదీని ఆస్పత్రికి తరలించి ఎండోస్కోపీ ద్వారా మొబైల్‌ను బయటకు తీశారు. జనవరి 5న ఈఘటన జరిగినట్లు జైళ్ల శాఖ ఐజీ సందీప్ గోయల్ చెప్పారు. చికిత్స పూర్తైన అనంతరం తిరిగి ఖైదీని జైలుకు తరలించామన్నారు. ఖైదీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘షిండ్లర్’.. తొలి భారతీయుడిగా..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి.. ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) వారి అత్యున్నత క్రిస్టల్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ట్రో స్కోపీ పితామహుడిగా పేరుపొందిన రుడాల్ఫ్ వి.షిండ్లర్ అవార్డును క్రిస్టల్ అవార్డ్స్‌లో అత్యున్నత కేటగిరీగా పరిగణిస్తారు. షిండ్లర్ పేరిట ఇచ్చిన ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా నాగేశ్వర్‌రెడ్డి అరుదైన ఘనత సాధించారు. సోమవారం ఉదయం ఏఎస్‌జీఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ వర్చువల్ కార్యక్రమంలో నాగేశ్వర్‌రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ రంగంలో పరిశోధన, శిక్షణ, సేవలలో భాగస్వామ్యానికి ఈ పురస్కా రాన్ని అందజేస్తున్నట్టు మెర్జెనర్ తెలిపారు. భారత దేశంలో ఎండోస్కోపీకి ఆదరణ కల్పించి, విస్తృతికి కారణమైన వారిలో నాగేశ్వర్‌రెడ్డి ఒకరని ప్రశంసించారు. ఎండోస్కోపీ వ్యాప్తికి పునరంకితమవుతా ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం లభించిన సందర్భంగా నాణ్యమైన ఎండోస్కోపీ విద్య, వ్యాప్తికి తాను పునరంకితం అవుతానని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తన సతీమణి, కుటుంబసభ్యులు, ఏఐజీ సహచరులకు నాగేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అంకితభావంతో కృషి చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారికీ గుర్తింపు లభిస్తుందని ఈ అవార్డుతో స్పష్టమైందన్నారు. -
ఏకంగా టూత్ బ్రష్ మింగేసింది...అయితే
షిల్లాంగ్ : సాధారణంగా చిన్నపిల్లలు నాణేలు, చిన్న చిన్నమూతలు, ఒక్కోసారి పిన్నీసులు లాంటి మింగేయడం చూశాం. అయితే ఒక పెద్దావిడ (50) ఏకంగా టూత్ బ్రష్‌ను మింగేసింది. ఇదే వింతగా వుంటే.. వైద్యులు ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా చాకచక్యంగా బ్రష్‌ను బయటకు తీయడం విశేషంగా నిలిచింది. షిల్లాంగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోయర్ మాప్రెమ్‌కు చెందిన మహిళ ఇటీవల పళ్లు తోముకుంటున్న సమయంలో ఒక్కసారిగా టూత్‌బ్రష్ మింగేసింది. అది నేరుగా ఆమె కడుపులోకి వెళ్లిపోయింది. అయినా ఆమెకు ఎలాంటి అరోగ్య సమస్యలు ఎదురు కాలేదు. కానీ అయితే వైద్యుడిని సంప్రదించాలని కూతురు బలవంతపెట్టడంతో..ఎట్టకేలకు మహిళ ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులకు టూత్‌బ్రష్ ఒక్క పట్టాన కనబడలేదు. చివరికి ఎండోస్కోపీ ద్వారా బ్రష్‌ను కొనుగొన్న డాక్టర్లు తిరిగి నోటి ద్వారానే మింగేసిన బ్రష్‌కు బయటికు తీశారు. దీనిపై వైద్యుడు ఇసాక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ...మొదట ఎక్స్‌రేలో ఆమె కడుపులో టూత్‌బ్రష్ కనపడలేదని, దీంతో తాము ఎండోస్కోపీ నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. టూత్‌బ్రష్ ఉందని తెలుసుకుని మొదట తామంతా ఆశ్చర్యపోయామనీ షిల్లాంగ్‌లో ఇటువంటి చికిత్స అందించడం మొదటిసారని పేర్కొన్నారు. చికిత్స అనంతరం గంటన్నరకే ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనీ, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. అయితే బ్రష్‌ను తీసి ఉండకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తేవని చెప్పారు. -
అమితాబ్‌కు మళ్లీ అస్వస్థత
సాక్షి, ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75) మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా ఆయన జీర్ణాశయ సమస్యలతోపాటు మెడ, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఎక్కువ కావటంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ‘‘లుంబార్ (నడుము కింది భాగం) ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఆపై డిశ్చార్జ్ చేశాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమాలపరంగా అమితాబ్ ప్రస్తుతం ‘102 నాటౌట్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మరో సీనియర్ నటుడు రిషి కపూర్ తో ఆయన స్క్రీన్ పంచుకున్నారు. ఇందులో రిషి అమితాబ్‌కు కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ గుజరాతీ నాటిక ఆధారంగా రూపొందుతోంది. మే నెలలో ‘102 నాటౌట్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రొస్టేట్ పెరిగితే ఆపరేషన్ తప్పదా?
యాండ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. నేను ప్రతిరోజూ 3, 4 సార్లు హస్తప్రయోగం చేసుకుంటున్నాను. దీని వల్ల ఏమైనా ప్రమాదమా? అంగస్తంభనలు తగ్గుతాయా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉందా? అంగపరిమాణం చిన్నదిగా మారుతుందా? దయచేసి నా సందేహాలకు సమాధానాలు చెప్పగలరు. - జె.ఎ.ఎస్., ఈ-మెయిల్ యుక్తవయసు వచ్చిన కొత్తలో అంటే 18 ఏళ్ల నుంచి దాదాపు మీ వయసు వారికి సెక్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దాంతో వారు చిన్న చిన్న స్పందనలకే తేలిగ్గా ఎక్సయిట్ అవుతుంటారు. హస్తప్రయోగం చేసుకోడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనివల్ల సెక్స్‌లో ఎలాంటి బలహీనతా రాదు. కాకపోతే అన్నిసార్లు హస్తప్రయోగం చేసుకున్నందు వల్ల శారీరకంగా కాస్త నీరసంగా అనిపించవచ్చు. అంతేతప్ప అంగస్తంభనలు తగ్గడమో లేదా మీ సెక్స్ సామర్థ్యానికి లోపం రావడమో వంటి సమస్యలు రావు. ఈ వయసులో హస్తప్రయోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా పోవడం అంటూ జరగదు. ఒకవేళ భవిష్యత్తులో పిల్లలు కలగకపోతే అది ఇతర సమస్యల వల్ల జరిగితే జరగవచ్చునేమోగానీ, మీరు ఈ వయసులో చేసిన హస్తప్రయోగం వల్ల భవిష్యత్తులో పిల్లలు కలగకుండా ఉండటం జరగదు. మీలాంటి చాలామంది యువకులు హస్తప్రయోగం తర్వాత స్తంభన (ఎరెక్షన్) తగ్గిన తమ పురుషాంగాన్ని చూసి, అది చిన్నదిగా మారినట్లుగా అపోహ పడుతుంటారు. అంతేగాని హస్తప్రయోగం వల్ల పురుషాంగం చిన్నదిగా మారడం జరగదు. నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా వుూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, వుూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోరుునట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.- పి.వి.ఎస్., నిజామాబాద్ మీరు ముందుగా రెట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్జీయుూ) అనే పరీక్ష చేరుుంచుకోవాలి. దీనివల్ల వుూత్రనాళంలో ఏదైనా అడ్డంకి (బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వుూత్రనాళాన్ని వెడల్పు చేరుుంచుకుంటే వుూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయుసు 30 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - డి.వై.ఆర్., చిత్తూరు చాలా వుందిలో తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ ఉంటుంది. మీకు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అరుుతే తవు వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు అవి చిన్నవిగా అరుుపోరుు ఉండి, నొప్పి లేదా లాగుతున్నట్లుగా ఉంటే మాత్రం దానికి కారణం వేరికోసిల్ అరుువుండవచ్చునని అనువూనించాలి. కాబట్టి మీరు ఒకసారి యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేరుుంచి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీకు సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. నా వయుస్సు 50 ఏళ్లు. తరచూ నడువుు నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపించాను. వుూత్రాశయుం గోడలు వుందంగా మారినట్లు పరీక్షల్లో తేలింది. ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందనీ, సిస్టైటిస్ విత్ బీపీహెచ్ అని డాక్టర్ చెబుతున్నారు. ఆపరేషన్ చేరుుంచాలని డాక్టర్ అంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్., గుంటూరు యూభై ఏళ్లు పైబడ్డ వారిలో నడువుు నొప్పికి చాలా కారణాలు ఉంటారుు. కండరాల్లో నొప్పి, ఎవుుకల్లో నొప్పి, కిడ్నీలో రాళ్లు... ఇలాంటివి సాధారణంగా కనిపించే కారణాలు. తరచూ వుూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి వుూత్ర విసర్జన సరిగా లేకపోయినా, వుూత్రం వుంటగా ఉండి, ధార సరిగ్గా రాకపోరుునా కూడా నడువుు నొప్పి రావచ్చు. మీరు ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలన్నీ చేరుుంచుకొని వుూత్ర సంబంధమైన సవుస్యలు ఉంటే, వాటికి చికిత్స చేయించుకోవడం వల్ల నడుం నొప్పి తగ్గవచ్చు. అరుుతే... యాభై ఏళ్ల వయసుకే ప్రొస్టేట్ సవుస్య రావడం అరుదు. అందువల్ల సర్జరీ గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ నడుం నొప్పికి అసలు కారణం కనుక్కోవడం ముందుగా జరగాల్సిన పని. మీరు చెబుతున్న సిస్టైటిస్ను యూంటీబయూటిక్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. మీరు యూరాలజిస్ట్‌ను కలవండి. నాకు పెళ్లయి ఆర్నెల్లకు పైగా అయ్యింది. పెళ్లయిన మొదట్లో కొన్ని రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో తాను అసహనం ప్రదర్శిస్తోంది. నాకూ నిరాశగా ఉంటోంది. అంతకు ముందు అంగస్తంభనలు చక్కగా జరిగేవి. హస్తప్రయోగం కూడా చేసేవాడిని. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డీ.ఎస్.ఆర్., ఖమ్మం సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉంటుంది. ఆ తర్వాత దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగి, అంగస్తంభన మామూలుగానే జరిగిపోతుంది. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి జరగవచ్చు. పెళ్లికాక ముందు మీకు అంగస్తంభనలు చక్కగా ఉండి, హస్తప్రయోగం కూడా చేసుకునేవాడినని చెబుతున్నారు కాబట్టి మీలో సెక్స్ పరమైన లోపం లేదనే చెప్పవచ్చు. కాబట్టి ముందుగా మీరు దగ్గర్లోని డాక్టర్‌ను కలిసి, కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. వాటితో మీ సమస్య చాలా తేలిగ్గా పరిష్కృతమవుతుంది. ఒకసారి మీకు దగ్గర్లోని యాండ్రాలజిస్ట్/యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 45 ఏళ్లు. నేను బెంగళూరులో ఉంటాను. నా భార్య హైదరాబాద్‌లో ఉంటుంది. చాలారోజులుగా నేను సెలవు తీసుకోలేదు. ఆరు నెలల తర్వాత నేను హైదరాబాద్ వెళ్లినప్పుడు నా భార్యతో సెక్స్‌లో పాల్గొనబోయాను. అంగస్తంభన అంతంత మాత్రమే. పైగా వీర్యం చాలా త్వరగా పడిపోతోంది. ఆర్నెల్లకోసారి సెక్స్‌లో పాల్గొనబోతే ఇలా జరగడంతో చాలా నిరాశపడుతున్నాను. నాలో మునుపటి సామర్థ్యం పెరిగేందుకు సూచనలు ఇవ్వండి. - జే.వి.ఆర్., బెంగళూరు చాలా రోజుల వ్యవధి తర్వాత ఎప్పుడో ఒకసారి సెక్స్‌లో పాల్గొంటే ఇలా శీఘ్రస్ఖలనం (ప్రీ-మెచ్యుర్ ఇజాక్యులేషన్) జరగడం చాలా మామూలు విషయమే. అయితే మీకు అంగస్తంభనలు నార్మల్‌గా ఉండాలి. మీ శారీరక దారుఢ్యం బాగానే ఉన్నదా అని తెలుసుకునేందుకు ముందుగా కొన్ని వైద్య పరీక్షలు అవసరం. కొలెస్ట్రాల్, బ్లడ్‌షుగర్, హార్మోన్ పరీక్షలు చేయించుకుని అవి నార్మల్‌గా ఉంటే టాడాల్ఫిన్ వంటి మందులు వాడటం వల్ల చాలావరకు పరిస్థితి మెరుగవుతుంది. అయితే దీనికంటే ముందర శారీరక, మానసిక దారుఢ్యం కోసం ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్, యోగా వంటివి చేయడం వల్ల చాలామట్టుకు ప్రయోజనం ఉంటుంది. శీఘ్రస్కలనం సమస్యకు ఇప్పుడు తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితాలను ఇచ్చే మందులు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు అంత నిరాశ పడాల్సిన అవసరం లేదు. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ అత్యున్నత పురస్కారం లభిం చింది. ఎండోస్కోపీ వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడంపాటు చౌక ధరకే అందించినందుకుగానూ ఆయనకు హాంకాంగ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సొసైటీ పురస్కారాన్ని అందించింది. హాంకాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హాంకాంగ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ లావో వాయ్ చుంగ్ ఈ పురస్కారాన్ని నాగేశ్వర్‌రెడ్డికి అందించారు. ఇప్పటివరకూ ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా 12 మంది వైద్యులు అందుకున్నారు. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం సోమవారం ప్రకటన విడుదల చేసింది. -
ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ...
డాక్టర్ సలహా నా వయసు 30. సమయానికి భోజనం చేయడం కుదరదు. ఈ మధ్య తరచూ గొంతు నొప్పి, పొడి దగ్గు వస్తోంది. రెండు నెలలుగా గొంతులో మార్పులు వచ్చాయి. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్య ఏమిటో తెలియడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారాన్ని తెలుపగలరు. - ఎస్. వికాస్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి పరిశీలిస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు అనిపిస్తోంది. మన ఆహారపుటలవాట్లు, సమయ నియంత్రణ, మారుతున్న జీవనవిధానాల వల్ల చాలామందిలో ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఆహారం జీర్ణం అయ్యే పక్రియలో ఉపయోగపడే ఆమ్లాలు అవసరానికి మించి ఉత్పత్తి కావడం, అవి పైకి ఉబికి గొంతు భాగంలోకి రావడం జరుగుతుంది. ఇది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఈ కింది లక్షణాలను ఒకసారి గమనించండి ఉదయం నిద్రలేవగానే నోటిలో ఏదో చేదుగా అనిపించడం ఛాతీలో మంట పొడిదగ్గు భోజనం తర్వాత, లేదా పడుకున్న తర్వాత దగ్గు గొంతులో నుంచి కఫం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం అలసట త్రేన్పులు రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక స్వరంలో మార్పులు, గొంతులో నొప్పి లేదా మంట మింగడంలో ఇబ్బందులు. పై లక్షణాల్లో ఏదైనా మీకు ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ నిపుణులను సంప్రదించండి. వారి సూచన మేరకు గొంతు పరీక్షలు, ఎండోస్కోపీతోపాటు మరికొన్ని పరీక్షలు అవసరం. వారి సూచనల మేరకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ సమస్యకు యాంటీ ఎసిడిటీ మందులతోపాటుగా ఆహార నియమాలను సరిగా పాటించడం చాలా అవసరం. ఉదయం 8 గంటలకు ఉపాహారం మధ్యాహ్నం ఒకటిన్నరకు భోజనం రాత్రి 8 గంటలకు భోజనం తీసుకోవాలి. రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి. భోజనాన్ని నెమ్మదిగా ఎక్కువసేపు నములుతూ తినాలి. పులుపు, కారం, మసాలా, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, చాక్లెట్లు, కాఫీ, పిప్పరమెంట్లు, ఉల్లిపాయలు వంటివి తక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనానికీ నిద్రకు మధ్య 2-3 గంటల విరామం ఉండాలి. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు -
షారుక్ కు ఎండోస్కోపి చికిత్స
'హ్యాపీ న్యూ ఇయర్' చిత్ర షూటింగ్ లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ త్వరలోనే ఎండోస్కోపి ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఐఏఏ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం సర్జరీ అవసరం లేదు. కాని ఎండోస్కోపి చికిత్స అవసరమైంది అని అన్నారు. జనవరి 23 తేదిన 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ లో చోటు జరిగిన ప్రమాదంలో షారుక్ గాయపడ్డారు. దాంతో రెండు, మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని.. రిస్క్ తో కూడిన ఫైట్స్ చేయకూడదని షారుక్ కు డాక్టర్లు సూచించారు. మరో నెల రోజుల విశ్రాంతి తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని షారుక్ తెలిపారు. -
ఆపరేషన్ తప్పనిసరా?
వూ నాన్నగారి వయస్సు 75 ఏళ్లు. మూత్ర సంబంధమైన సమస్య వస్తే యూరాలజిస్ట్‌ను కలిశాం. ప్రోస్టేట్ పెద్దదిగా ఉందని, ఆపరేషన్ చేస్తే మంచిదని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా? - సుకుమార్, వరంగల్ ఈ వయుస్సులో ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్య ఉన్నవారికి మొదట వుందులు వాడి చూస్తాం. అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చేస్తాం. మాత్రం పూర్తిగా ఆగిపోయినా, మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, మూత్రాశయంలో రాళ్లు ఉన్నా, మూత్రపిండాల పనితీరు తగ్గినా, మూత్రంలో తరచు రక్తం కనిపిస్తున్నా... వుందులపై ఆధారపడకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఈ ఆపరేషన్‌కు పేషెంట్ ఫిట్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం ముందుగా ఫిజీషియున్ను కలవండి. ఆ తర్వాత యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 35. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం సెక్స్ చేసిన ఒకటి రెండు నిమిషాల్లో వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో ఇద్దరికీ చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.డి., ఖమ్మం మీ సమస్యను ప్రీ-మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సాధారణంగా సెక్స్ మొదలుపెట్టాక స్ఖలనానికి నిర్దిష్టంగా ఇంతే సమయం కావాలనే నియమం ఏదీ లేదు. దంపతులిద్దరూ తృప్తిపడేంత సేపు సెక్స్ జరిగితే చాలు. అయితే కొందరిలో సెక్స్ మొదలుపెట్టిన ఒకటి, రెండునిమిషాల్లోనే వీర్యస్ఖలనం అయిపోతుంది. దాంతో దంపతులిద్దరికీ సెక్స్‌లో తృప్తి కలగకపోవచ్చు. ఇలా దంపతులిద్దరూ సంతృప్తి పొందకముందే వీర్యస్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా చెప్పవచ్చు. సెక్స్‌లో పురుషాంగంపైన ఏర్పడే కదలికల వల్ల ప్రేరేపణ జరిగి వీర్యస్ఖలనం అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొదట అరగంట లేదా గంటసేపు ప్రీ-ప్లే చేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మంచిది. మధ్యమధ్యలో ఆపడం వల్ల కూడా మెదడుకు అందే సిగ్నల్స్‌ను ఆపవచ్చు. ఇది కాకుండా ఫోగ్జటివ్ ఎపాక్సిటిన్ అనే మందులు మెదడు మీద పనిచేసి ఈ సిగ్నల్స్‌ను బలహీనపరుస్తాయి. అయితే ఈ మందులను కేవలం ఆండ్రాలజిస్ట్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?
నాకు 45 ఏళ్లు. ఈమధ్యకాలంలో బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. దాంతో హెల్త్ చెక్ అప్స్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ‘కిడ్నీ పనితీరు కొంచెమే మారింది, పెద్దగా ప్రమాదమేమీ లేద’న్నారు. అసలీ నీటి బుడగల జబ్బేమిటి? నాకు భయమేస్తుంది. మా నాన్నగారు కూడా ఏదో కిడ్నీ సమస్యతోనే చనిపోయారు. ఈ జబ్బు విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అసలు కిడ్నీ చెడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నా ఈ జబ్బుకు ఏదైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా? - సుదర్శన్, వరంగల్ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండవచ్చునని అనిపిస్తోంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే జబ్బు . ఈ జబ్బు ఉన్నవారిలో 30 ఏళ్ల వయసప్పటి నుంచి 50 ఏళ్ల మధ్యన మూత్రపిండాల్లో నీటిబుడగలు తయారవ్వడం మొదలవుతుంది. ఈ నీటిబుడగల సంఖ్య, పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ సైజ్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కిడ్నీ కండ తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రమేపీ నీటిబుడగల సంఖ్య పెరగడం వల్ల కిడ్నీ పనితీరు కూడా నెమ్మదిగా మందగిస్తూ పోతుంది. ఈ జబ్బుకు నిర్దిష్టంగా ఏ మందులూ లేకపోయినా, బీపీని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తక్కువ మాంసకృత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరును కాపాడుకోవచ్చు. ఈ జబ్బు ఉన్నవారు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కాన్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుంటూ, మూత్రపిండాల వ్యాధి నిపుణులను సంప్రదిస్తూ ఉండటం అవసరం. ఈ జబ్బు ఉన్నవారు దీన్ని నిర్లక్ష్యం చేసినా కిడ్నీ పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలం పాటు సాధారణజీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఆందోళన చెందకండి. నాకు 56 ఏళ్లు. పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాను. ఇటీవల పురుషాంగం మీద చర్మం పగిలినట్లుగా ఉండి, మంటగా ఉంటోంది. చర్మం కూడా ఫ్రీగా వెనక్కి రావడం లేదు. షుగర్ అప్పుడప్పుడూ 200 పైన కూడా ఉంటోంది. దీనివల్ల సెక్స్‌లో కూడా ఇబ్బంది కలుగుతోంది. దయచేసి ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి. - డి.ఆర్.ఎస్., నందిగామ షుగర్ ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మానికి ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు ఒకటి రెండుసార్లు యాంటీఫంగల్, యాంటీబయాటిక్ మందులు వాడినప్పటికీ ఇలాగే జరుగుతుంటే సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుంది. పురుషాంగం చర్మం వెనక్కి రానివారిలో లోపల మూత్రనాళం (యురెథ్రా) కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా సున్తీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తాం. మీరు మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు పెళ్లయి ఏడాది అయ్యింది. పెళ్లయిన మొదటి రెండు రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి.ఎన్.పి., సత్తుపల్లి సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉన్నా, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగాక అంగస్తంభన మామూలుగానే జరిగిపోవాలి. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి జరగవచ్చు. అందువల్ల మీరు సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా మూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, మూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. పెళ్లికి ముందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలావుంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు అలా చేయడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయేమోనని యూంటిబయూటిక్స్ ఎక్కువగా మింగుతున్నాను. నాకు వుంచి సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్., విజయవాడ మీరు ముందుగా ఇరట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్జీయూ) అనే పరీక్ష చేయించుకోవాలి. దీనిల్ల మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి(బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా మూత్రనాళాన్ని వెడల్పు చేయించుకుంటే మూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్