న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment