న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లోధిరోడ్‌లో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బిల్డింగ్‌లోని, సీజీఓ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కాగా, వెంటనే 6 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. ఈ ప్రమాదం ఉదయం 11 తర్వాత జరిగిందని భావిస్తున్నారు. అయితే, మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్ అధికారి తెలిపారు.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. ప్రమాదం తెలిసిన వెంటనే.. పెద్ద ఎత్తున పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, సీజీఓ కాంప్లెక్స్‌లోని సెకండ్ బేస్‌లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment