short circute
-
ఎల్ఈడీ లైట్లే కొంప ముంచాయా?
ఉప్పల్: ఉప్పల్ సీఎంఆర్ వస్త్ర దుకాణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఎల్ఈడీ లైట్లే కారణమని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కారణంగా షార్ట్ సర్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై సీఎంఆర్ మేనేజర్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతులపై అన్నీ అనుమానాలే..? సీఎంఆర్ దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అయినా వస్త్ర దుకాణం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పని చేసే చోట భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఆక్యుపెన్సీ(ఓసి) లేకుండా అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకే వ్యాపార సంస్థకు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ట్రాఫిక్ విషయంలో సంబంధిత అధికారులు అనుమతి ఉందా? ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బుధవారం ఉదయం అనుమతులపై ఆరా తీశారు. నిర్వాహకులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తమే కానీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని టౌన్‌ప్లానింగ్ అధికారి స్వయంగా పేర్కొనడం గమనార్హం. -
హైదరాబాద్: పార్కింగ్ లో ఉన్న బస్సు లో చెలరేగిన మంటలు
-
సీబీఐ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లోధిరోడ్‌లో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బిల్డింగ్‌లోని, సీజీఓ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కాగా, వెంటనే 6 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. ఈ ప్రమాదం ఉదయం 11 తర్వాత జరిగిందని భావిస్తున్నారు. అయితే, మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్ అధికారి తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. ప్రమాదం తెలిసిన వెంటనే.. పెద్ద ఎత్తున పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, సీజీఓ కాంప్లెక్స్‌లోని సెకండ్ బేస్‌లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన
సాక్షి, ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఓ చిన్నారి వయసు అయిదేళ్లు మాత్రమే. లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్‌లోని మౌలానా ఆజాద్ కాలనీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు వీరంతా ఒకే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. మృతులు పర్వీన్ (40), ఫాతిమా (12), సహిమా (10), రతియా (8), అబ్దుల్ అజీమ్ (8), అబ్దుల్ అహద్ (5) గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం
పత్తికొండ: పత్తికొండలోని ఆదోని రహదారిలో సవారమ్మ దేవాలయం సమీపంలోని పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వేస్తుండగా ఓ పంప్‌లోని మోటారు వద్ద షార్ట్సరూ్క్యట్తో మంటలు చెలరేగాయి. బంక్ యాజమాన్యం వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గురువారం డీజిల్ ట్యాంకర్ అన్ లోడ్ చేశారు, ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే ప్రమాద నష్టం తీవ్రంగా ఉండేది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో కాలనీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. -
వికారాబాద్ లో అగ్నిప్రమాదం
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎంఆర్పీ సర్కిల్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బాబ్జీ ఎలక్ట్రికల్స్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. 15 లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం సంభవించింది. తొలుత పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ లైట్లు కాలిపోవడమేకాక, పెట్రోల్ పంపులు ఆగిపోయాయి. గమనించిన సిబ్బంది మెయిన్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ మంటలు పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ షాప్‌కు పాకాయి. రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపుచేయాల్సి వచ్చింది.