aims hospital
-
ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి ఓరం
న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం ఢిల్లీలోని ఎయి మ్స్‌లో చేరారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కొత్త ప్రైవేట్ వార్డులో చేరారని, పల్మనరీ మెడిసిన్ అండ్ స్లీప్ డిజార్డర్స్ విభాగాధిపతి డాక్టర్ అనంత్ మోహన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి ఆరోగ్య నిలకడగా ఉందని వెల్లడించాయి. మంత్రి ఓరం భార్య ఝింగియా ఓరం(58) శనివారం ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో డెంగీతో చికిత్స పొందుతూ చనిపోవడం తెలిసిందే. అదే ఆస్పత్రిలో డెంగీతో మంత్రి ఓరం కూడా చికిత్స పొందారు. ఇలా ఉండగా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో జాయినయ్యారు. ‘ఆయన మంచిగానే ఉన్నారు. చికిత్స అందుతోంది. ఎలాంటి ప్రమాదం లేదు’అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు సమీక్షిస్తున్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు అద్వానీది కీలక పాత్ర. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర కీలక మలుపు. ఆ యాత్ర ద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 1999–2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా చేశారు. బీజేపీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. పదేళ్లుగా అద్వానీ పూర్తి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ ఏడాదే ఆయన భారతరత్న అందుకున్నారు. వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పురస్కారాన్ని అందజేయడం తెలిసిందే. -
విమానంలో చిన్నారికి గుండెపోటు.. ప్రాణం పోసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు. విమానం నాగ్‌పూర్‌కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్‌పూర్‌కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్‌దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. #Always available #AIIMSParivar While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! -
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. -
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి
-
ఎయిమ్స్ సేవలకు ‘ఈ–పరామర్శ’
మంగళగిరి: రాష్ట్ర ప్రజలందరి సౌకర్యార్థం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఆస్పత్రి మొబైల్ యాప్ ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఈ–పరామర్శ’ యాప్‌ను ఉపయోగించి.. ప్రజలు తమకు అవసరమైన వైద్య సేవలను ఇక సులభంగా పొందవచ్చు. నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకునే వారితో పాటు టెలీమెడిసన్ ద్వారా వైద్య సేవలు అవసరమైనవారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆస్పత్రి అధికారులు చెప్పారు. దీనివల్ల రోగులకు సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని చెప్పారు. మొబైల్ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘ఎయిమ్స్ మంగళగిరి ఈ–పరామర్శ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి.. రోగి తన వివరాలు నమోదు చేసుకోవచ్చు. అందులోని టెలీకన్సెల్టెన్సీ ద్వారా జనరల్ మెడిసన్, దంత, నేత్ర, ఎముకల వైద్యంతో పాటు 12 రకాల వైద్య సేవలను పొందవచ్చు. అవసరమైన విభాగంలో వివరాలు నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు వైద్యులు అందుబాటులోకి వచ్చి చికిత్సకు సంబంధించిన సలహాలిస్తారు. నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లి ఓపీలో రూ.10 చెల్లించి చికిత్స తీసుకున్న వారు.. తమ రిపోర్టులను యాప్‌లో తెలుసుకునే అవకాశముంది. యాప్ ద్వారానే రోగులు తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు వివరించవచ్చు. -
సుశాంత్ మృతి కేసులో ఎయిమ్స్ వైద్యుల నివేదిక
-
సుశాంత్ మృతిపై ఎయిమ్స్ కీలక రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్ అనుమానాస్పద మృతిని సుదీర్ఘం పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. సుశాంత్ డీఎన్ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని వివరించారు. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. (నలుగురిదీ ఒక్కటే మాట..) జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మృతిపై తొలుత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడిని ఎవరో గొంతునులిమి హత్య చేసిఉంటారని, ఇది ముమ్మాటికి హత్యేనని అతని తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌కు ముమ్మాటికి ఆత్మహత్యేనని తేల్చింది. మరోవైపు అతని మరణాంతరం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతోంది. మరోవైపు సీబీఐ సైతం ఎంక్వైరీ చేస్తోంది. (సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!) మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. -
వారానికి రెండు రోజులు ఎయిమ్స్ వైద్యుల సేవలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మరణాలను నియంత్రించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యుల సేవలు వినియోగించాలని నిర్ణయించింది. వీరు ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా వ్యవహరించేలా స్థానిక యంత్రాంగానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న స్పెషల్ కోవిడ్ ఆస్పత్రులను ప్రతి మంగళవారం, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. ► ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్ణయించిన ఆస్పత్రుల్లో వీడియో కన్సల్టేషన్ నిర్వహణ ► ప్రధానంగా క్రిటికల్ కేర్‌లో ఉన్న రోగుల పరిస్థితులపై అధ్యయనం ► వీరికి ఎలాంటి మందులు ఇస్తున్నారు, వారిని మృత్యువాత పడకుండా ఎలా కాపాడాలన్నదానిపై సలహాలు, సూచనలు ► కోవిడ్ రోగుల కేస్ షీట్ల పరిశీలన ► క్రిటికల్ కేర్‌కు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలనేదానిపై స్థానిక వైద్యులకు సూచనలు -
ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న ఆయన ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒళ్లునొప్పులు, నిస్సత్తువ తగ్గలేదని అమిత్ షా తెలిపిన నేపథ్యంలో ఆయన్ను ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు. అమిత్ షా ఆరోగ్యం బాగానే ఉందని, ఆసుపత్రి నుంచి తన పనులు నిర్వహిస్తున్నారని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడ్డ సమయంలో అమిత్ షా ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. వైద్యుల సూచనల ప్రకారం అమిత్ షా మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండనున్నారు. -
కరోనా పాజిటివ్.. జర్నలిస్ట్ ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న తరుణ్ సిసోడియాకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది వెంటనే గమనించి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. తరుణ్ సమీప వ్యక్తుల సమాచారం ప్రకారం.. వైరస్ బారినపడటంతో ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది. (చైనా ఆస్పత్రి కన్నా పదింతలు పెద్దది) -
మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, నిలకడగా ఉందని ఎయిమ్స్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా వచ్చిందని సోమవారం వెల్లడించింది. ఆదివారం ఆయనకు కొత్త మెడికేషన్ సరిపడక జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు. ‘ఆయన్ను కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించాం. ఇవాళో రేపో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది’ అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
ఎయిమ్స్‌కు చిదంబరం
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి∙చిదంబరానికి కడుపునొప్పి రావడంతో ఎయిమ్స్‌కు సోమవారం తరలించారు. చికిత్స ముగిశాక తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఈడీ పర్యవేక్షణలో ఐఎన్ఎక్స్ కేసుకు సంబంధించి తీహార్ జైల్లో ఉన్నారు. మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం సమయంలో ఎయిమ్స్‌కు పంపించి, అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు గంటలప్పుడు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఆయనకున్న సమస్యను డాక్టర్లు వెల్లడించడంలేదు. -
ఆరోగ్యానికి భరోసా.. ఎయిమ్స్‌తో కులాసా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీబీనగర్ ఎయిమ్స్‌లో వచ్చే డిసెంబర్ నుంచి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్కడ నిమ్స్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతుండగా, త్వరలో ఎయిమ్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభ గల ప్రముఖవైద్యులు, ప్రొఫెసర్లు అక్కడ అందుబాటులో ఉంటారు. వారి సేవలు బీబీనగర్ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అం దనున్నాయి. ఇప్పటికే నిమ్స్ ద్వారా రోజుకు 500 మంది వరకు ఓపీ రోగులు వస్తున్నా రని అంచనా. ఎయిమ్స్ సేవలు అందుబాటులోకి వస్తే రోజుకు 2వేల మంది వరకు వచ్చే అవకాశముందంటున్నారు. ఈ ఏడాది నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమ య్యాయి. పలు రాష్ట్రాలకు చెందిన 50మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మార్చి నుంచి ఇన్ పేషెంట్ సేవలు... వచ్చే మార్చి నుంచి ఇన్‌పేషెంట్(ఐపీ) సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా జనరల్ మెడిసిన్, గైనిక్ విభాగాల్లో ఇన్ పేషెంట్లకు ముందుగా వైద్య సేవలు ప్రారంభించి తదుపరి విడతల వారీగా ఇతర వైద్య సేవలన్నింటినీ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎయిమ్స్ వర్గాలు ముందుగా 750 పడకలతో అనుబంధ ఆస్పత్రి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకొని వెయ్యి పడకలకు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కేంద్ర ఎయిమ్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశాయి. అందుకు కేంద్ర వర్గాలు సుముఖత వ్యక్తంచేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలకాధికారి ఒకరు తెలిపారు. ఇన్‌పేషెంట్లు 2 వేల వరకు రోజూ ఉంటే, పడకల సంఖ్య తప్పనిసరిగా వెయ్యి ఉండాలని అంటున్నారు. నిమ్స్‌లో ప్రస్తుతమున్న ఫీజుల మాదిరిగానే ఎయిమ్స్‌లో ఉంటాయని అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి.. బీబీనగర్ ఎయిమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 200 ఎకరాలు కేటాయించింది. అధికారులు పలుమార్లు దీనిపై ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్ కోసం కృషిచేశారు.ఎట్టకేలకు ఇది సాకారం కావడంతో ఇక్కడి ప్రజలు సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ నిమ్స్ భవనాలు ఉండటంతో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తున్నారు. మూడేళ్లలోగా పూర్తిస్థాయిలో 200 ఎకరాల్లో హాస్టళ్లు, ప్రొఫెసర్లు, డాక్టర్ల వసతి గృహాలు పూర్తికానున్నాయి.అద్భుతమైన మైదానాలు, స్విమ్మింగ్ ఫూల్స్, బృందావనాలు కూడా రూపుదిద్దుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అందుకోసం ఎయిమ్స్ ఇప్పటికే నిధులు కేటాయించింది. మున్ముందు పీజీ సీట్లు కూడా వచ్చాక ఎయిమ్స్ ద్వారా ఇక్కడి ప్రాంత వాసులకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు మించి వైద్యం ఉంటుందని, అదే రాష్ట్రంలో వైద్యానికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని అంటున్నారు. అంతేగాక అనేక పరిశోధనలు కూడా ఇక్కడ జరగనున్నాయి. -
జైట్లీ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9 నుంచి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించారు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లు కూడా ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆయన ఆగస్టు 9న ఉదయం ఎయిమ్స్‌లో చేరారు. ఆ రోజు రాత్రి నుంచి ఆయనను వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని అదే రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. -
జైట్లీ కుటుంబసభ్యులకు వెంకయ్య పరామర్శ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీని శనివారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఇవాళ ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లిన ఆయన ...జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. చికిత్సకు అరుణ్ జైట్లీ శరీరం స్పందిస్తోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జైట్లీ కుటుంబసభ్యులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి సెక్రటేరియెట్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. గతేడాది మే నెలలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. చదవండి: అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత The doctors informed the Vice President that Shri Jaitley is responding to the treatment and his condition is stable. The Vice President also met Shri Jaitley’s family members who were present. #ArunJaitley — VicePresidentOfIndia (@VPSecretariat) August 10, 2019 Hon’ble Vice President, Shri Venkaiah Naidu Visited AIIMS & enquired about the health of Shri Arun Jaitley with the team of doctors attending on the former Union Finance Minister. #ArunJaitley — VicePresidentOfIndia (@VPSecretariat) August 10, 2019 -
అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఉదయం ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. హృదయం, మూత్రపిండాలు తదితర పలు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు చికిత్స అందించారు. జైట్లీ అస్వస్థత వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. ‘ప్రస్తుతం జైట్లీ గుండె స్థిరంగా కొట్టుకుంటోంది. కీలక అవయవాలకు రక్త ప్రసరణ బావుంది. ఆయనను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం’ అని ఎయిమ్స్ ఆ ప్రకటనలో పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తదితరులు ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన జైట్లీ.. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో, విమర్శలను తిప్పికొట్టడంలో జైట్లీ ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు. గతేడాది మే నెలలో ఆయనకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. -
ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు వైద్యులతో మాట్లాడి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆరుణ్ జైట్లీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. -
ఎయిమ్స్ తరహాలో విమ్స్ అభివృద్ధి
సాక్షి, ఆరిలోవ(విశాఖతూర్పు): కొత్త ప్రభుత్వం ఆలోచన మేరకు ఎయిమ్స్ తరహాలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య సంస్కరణల నిపుణుల కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సుజాతారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె ఆధ్వర్యంలో విమ్స్‌ను కమిటీ సందర్శించింది. సభ్యులు డాక్టర్ భూమారెడ్డి చంద్రశేఖర్, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్ బి.సాంబశివరెడ్డి, డాక్టర్ కాశిరెడ్డి సతీస్కుమార్రెడ్డి, డాక్టర్ దుత్త రామచంద్రరావు, చెంగపల్లి వెంకట్ సందర్శించారు. విమ్స్‌ను పరిశీలించిన అనంతరం ఇక్కడ డైరెక్టర్ డాక్టర్ కె.సత్యవరప్రసాద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి సుధాకర్, జీవీఎంసీ డీఎంహెచ్‌వో తదితరులతో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఎయిమ్స్ తరహాలో విమ్స్‌ను తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కేజీహెచ్, విమ్స్ వైద్య నిపుణులు, జీవీఎంసీ హెల్త్ విభాగం, హెల్త్ సిటీ ప్రతినిధులు, జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణుల నుంచి ప్రజలకు మెరుగైన వైద్య వైద్య సేవలు అందించడానికి కావాల్సిన సలహాలు, సూచనలు సేకరించారు. వైద్యుల సూచనలు.. ► కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం దృషిపెట్టాలి. ► ఆంధ్రా మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించి, కొరతగా ఉన్న ప్రొఫెసర్ల నియామాకం చేపట్టాలి. ► విమ్స్‌లో త్వరలో అన్ని సూపర్ స్పెషాలిటీలతో పేదలకు వైద్య సేవలు అందించడానికి సన్నాహాలు చేపట్టాలి. ► అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేక రోగులు కేజీహెచ్‌కు తరలివస్తున్నారు. అనకాపల్లిలో వెంటిలేటర్ల సదుపాయం ప్రభుత్వ ఆస్పత్రిలో లేదు. ఆ సౌకర్యం అక్కడ మెరుగుపడాలి. ► శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో నివసిస్తున్న ప్రజల్లో కిడ్నీ బాధితులు 40 శాతం మంది ఉన్నారు. వారికి మెరుగైన సదుపాయాలు ఇంతవరకు కల్పించ లేదు. అక్కడే డయాలసిస్ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయాలి. ► 30 ఏళ్లుగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్న వైద్య నిపుణులకు పదోన్నతులు కల్పించ లేదు. ఇటీవల నియామకమైన జూనియర్ వైద్యులతో సమాన కేడర్‌తో పని చేయాల్సి వస్తుంది. పదోన్నతులు కల్పించి ఉత్సాహంగా పనిచేసే వాతావరణం వైద్యుల్లో కల్పించాలి. ► పేద రోగులకు అతి తక్కువ ఫీజులతో స్వచ్ఛంద సంఘాలు నిర్వహిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి. అలాంటి వాటిని గుర్తించి ఆరోగ్యశ్రీలో నిబంధనలు సడలించితే బాగుంటుంది. ► విశాఖలో డెంటల్ కేర్‌కు సంబధించి ప్రభుత్వ వైద్య విభాగాన్ని అందుబాటులోకి తేవాలి. ► నగరంలో అందిస్తున్న ఐఎంఏకు ప్రత్యేకంగా శాశ్వత భవనం లేదు. దానికోసం విమ్స్‌లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించగలిగితే మేలు జరుగుతుంది. వినతులు.. విమ్స్‌లో శాశ్వత వైద్యులను నియమించాలని, వారి పదోన్నతులు తదితర వాటిపై ఇక్కడ వైద్యులు వైద్య సంస్కరణల నిపుణుల కమిటీకి వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సుజాతారావు ఈ విషయం కమిటీ పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. విమ్స్‌లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లు ఆమెకు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న 75 మంది వర్కర్లు ఆమెతో మాట్లాడి కాంట్రాక్టర్ నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, అవి కూడా చాలీచాలని వేతనాలే చెల్లిస్తున్నారని గోడు వెల్లబుచ్చారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ విమ్స్ డైరెక్టర్‌ను విషయం అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్య వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల వైద్యులు ఆరోగ్య సంస్కరణలపై సీఎం దృష్టి.. వైద్యుల సమావేశంలో డాక్టర్ సుజాతారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఆరోగ్య సంస్కరణలపై దృష్టి చారించారని తెలిపారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేడానికి వైద్య సంస్కరణల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ మార్పుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు. వారంతా ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని నివేదిక తయారు చేస్తామన్నారు. దానిని ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖలో సమావేశం నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. -
బీబీనగర్‌లోనే ఎంబీబీఎస్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఎయిమ్స్ ఆస్పత్రి ఉనికిలోకి రావడానికి ముందు అక్కడ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తరగతి గదులు, నిర్మాణాలు పూర్తికావన్న భావనతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే ఎయిమ్స్ ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించాలని మొదట అనుకున్నారు. కానీ బీబీనగర్‌లోనే ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు భోపాల్ ఎయిమ్స్ బృందం సోమవారం బీబీనగర్‌ను సందర్శించింది. భోపాల్ ఎయిమ్స్‌కు బాధ్యతలు బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు భోపాల్ ఎయిమ్స్‌కు కేంద్రం బాధ్యత అప్పగించింది. దాని ఆధ్వర్యంలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సర్మాన్ సింగ్‌ను బీబీనగర్ ఎయిమ్స్‌కు మెంటార్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోని బృందం బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి జులై 15 నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని, అనంతరం ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని ఆ బృందం వెల్లడించినట్లు డీఎంఈ తెలిపారు. ముందుగా 50 ఎంబీబీఎస్ సీట్లతో ఎయిమ్స్ వైద్య విద్య ప్రారంభిస్తారు. అనంతరం 100 సీట్లకు పెంచుతారు. బీబీనగర్ క్యాంపస్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి అవసరమైన బ్లూప్రింట్‌ను తయారు చేశారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎయిమ్స్ ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి సంబంధించి అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే భోపాల్ ఎయిమ్స్ నోటిఫికేషన్ జారీచేసింది. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియోలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్లకు ఒక్కొక్క ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే అనాటమీలో మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్, బయో కెమిస్ట్రీలో నాలుగు, ఫిజియోలజీలో నాలుగు, కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్లలో నాలుగు పోస్టుల చొప్పున నోటిఫికేషన్ జారీచేశారు. ఇవే పోస్టులకు సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లుగా మరో 16 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని రమేశ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో భోపాల్ ఎయిమ్స్ డీన్ డాక్టర్ అర్నీత్ అరోరా, సూపరింటెండెంట్ ఇంజనీర్ జితేంద్రకుమార్ సక్సేనా, పీఎంఎస్ఎస్వై డైరెక్టర్ సంజయ్రాయ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, బీబీనగర్ నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సహృదయత చాటుకున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సహృదయతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ జర్నలిస్టును స్వయంగా తన కారులో తీసుకెళ్లి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఓబీసీ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం రాహుల్ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో స్థానిక జర్నలిస్ట్ రాజీందర్ వ్యాస్ హుమయూన్ రోడ్డు పక్కన పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కారును ఆపిన రాహుల్.. రాజీందర్‌ను తన కారులో ఎక్కించుకుని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు తిరిగి బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
50 సీట్లతో బీబీనగర్ ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ తొలుత 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభం కానుంది. వాస్తవానికి 100 సీట్లు రావాల్సి ఉన్నా.. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఎయిమ్స్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేందుకు మూడేళ్ల సమయం పడుతుండటంతో తక్కువ సీట్లతోనే ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూడు బ్యాచ్‌ల వరకు కూడా 50 ఎంబీబీఎస్ సీట్లే అందుబాటులో ఉండనున్నాయి. ఎయిమ్స్ పూర్తిగా ఉనికిలోకి వచ్చాక 100 ఎంబీబీఎస్ సీట్లకు పెంచుతారు. 2019–20 వైద్య విద్య సంవత్సరానికి ఇప్పటికే ఎయిమ్స్ ఎంబీబీఎస్‌కు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు తరగతి గదులు, లైబ్రరీ, హాస్టల్ వసతి ప్రస్తుతమున్న నిమ్స్ భవనాల్లోనే నిర్వహిస్తారు. నిమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్‌కు అప్పగించాక దాని అనుబంధంగానే ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. సూపర్ స్పెషాలిటీపైనే ప్రధాన దృష్టి.. రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను 45 నెలల్లోగా నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 750 పడకలతో ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్లు వచ్చే అవకాశముంది. తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాల్లో ఎయిమ్స్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్కడ ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో పాటు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే 15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ సీట్లు వస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల కంటే కూడా సూపర్ స్పెషాలిటీ కోర్సుల పైనే ఎయిమ్స్ దృష్టి పెడుతుందంటున్నారు. పైగా మెడికల్ రంగంలో పరిశోధనలు ప్రోత్సహిస్తారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, వివిధ దేశాల్లో జరిగే సెమినార్లకు విద్యార్థులు, ప్రొఫెసర్లు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. స్థానికులకు అవకాశాలు లేనట్టే.. బీబీనగర్ ఎయిమ్స్‌లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన ఇతర వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఆ మేరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తా యి. అన్ని రకాల భర్తీలు కూడా జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. స్థానికులకు ప్రత్యేక కేటాయింపులు ఉండవు. చిన్నపాటి, నాలుగో తరగతి ఉద్యోగుల వరకు మాత్రం స్థానికులు ఉండే అవకాశముంది. కాగా, నిమ్స్ భవనాలను, అక్కడి భూముల ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంద ని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో ప్రస్తుత నిమ్స్ భవనంలో ఎయిమ్స్ ఓపీ సేవలు ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి విన్నవించింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. -
త్వరలో అందుబాటులోకి ఎయిమ్స్ సేవలు
సాక్షి, హైదరాబాద్: సాధ్యమైనంత వరకు నిర్ణీత గడువు కంటే ముందే ఎయిమ్స్ వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు అందుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. ఎయిమ్స్ సేవలను వేగంగా అందించేందుకే దాదాపు నిర్మాణం పూర్తయిన బీబీ నగర్ నిమ్స్ ఆçస్పత్రిని ఎయిమ్స్‌కి అప్పగించామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించిందని, సీఎం కేసీఆర్, ఎంపీలు, నాడు మంత్రిగా తాను అనేక సందర్భాల్లో చేసిన ప్రయత్నాల ఫలితం గా ఎయిమ్స్ వచ్చిందని గుర్తుచేశారు. ఎయి మ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్రానికి, ప్రధానిని కలసి తీవ్రంగా ప్రయత్నించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎయిమ్స్ని ప్రకటించిన కేంద్రం తెలంగాణను విస్మరించిందని పేర్కొన్నారు. దీంతో అప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డాలను కలిశానని గుర్తు చేశారు. నడ్డా ఇక్కడకు వచ్చిన సమయంలోనూ ఎయిమ్స్ కోసం లేఖలు ఇచ్చామని తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి తెలంగాణ ఎయిమ్స్ కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఎయిమ్స్ ఇవ్వాలని అనేక సందర్భాలలో పట్టుబట్టారని గుర్తుచే శారు. కేంద్ర మంత్రివర్గం సోమవారం బీబీనగర్ నిమ్స్ ఉన్న చోటే ఎయిమ్స్‌కి పచ్చజెండా ఊపడంపై సంతోషం వ్యక్తం చేశారు. తొలిదశ పనులు ఈ ఏడాదిలోపే ప్రారంభమవుతాయని, ఈ లోగా ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీని కోసం నోటిఫికేషన్ వేశారని, ఓపీనీ త్వరగా ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. -
మహానేతకు సేవ చేయడం మా అదృష్టం...
దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న మహానేతకు వారు సేవలందించారు. వాజ్‌పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్‌లో వాజ్‌పేయికి 9 వారాల పాటు చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు. ’ చిన్నప్పటి నుంచి ఏ నాయకుడి ఉపన్యాసాలు టీవీల్లో చూస్తూ పెరిగామో ఆ నేతే ఆసుపత్రి మంచంపై తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించడాన్ని వివరించడానికి కష్టంగా ఉంది. వాజ్‌పేయి లాహోర్ బస్సుయాత్రకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లకు కట్టినట్టుగా ఇప్పటికీ నాకు కనిపిస్తున్నాయి’ అని ఓ నర్సు చెప్పారు. మామూలు ఆరోగ్య పరీక్షల కోసం జూన్ 11న ఏయిమ్స్‌కు వచ్చిన సందర్భంగా ముత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్తో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్,తక్కువ మోతాదులో మూత్రం విడుదల, ఛాతీ సమస్యలను డాక్టర్లు గుర్తించారు. ఆయనకు అవసరమైన వైద్యం అందించేందుకు ఆ వెంటనే ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఐదుగురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యపరిస్థితిని గురించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. గత శనివారం నుంచి వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, బుధవారం మరింత విశమించిందని వారు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నానానికి రెండు ఊపరితిత్తుల్లో న్యూమోనియా తీవ్రస్థాయికి చేరుకుందని, ఆ వెంటనే ’ఎక్స్ట్రా మెంబ్రేన్ ఆక్సిజెనెషన్’ (ఈసీఎంఓ) సేవలు అందించారు. ఈ ప్రక్రియ గుండెకు, శ్వాసక్రియకు సహాయకారిగా ఉండడంతో పాటు, కృత్రిమ గుండెగా, ఊపిరితిత్తులుగాను ఇది పనిచేస్తుంది. దిగజారుతున్న వాజ్‌పేయి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు వైద్యసిబ్బంది ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, విశమిస్తున్న ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చివరకు ప్రధాని మోదీ ఏయిమ్స్‌ను సందర్శించాక, వాజ్‌పేయి మరణవార్తను ఏయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్పర్సన్ డా. ఆర్తి విజ్ ప్రకటించారు. వాజ్‌పేయి మరణం రూపంలో ఎంతో నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న సంతాపంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నామంటూ పేర్కొన్నారు. -
వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ నోటిఫికేషన్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో జారీ చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 2018 ఆగస్టు 16న సాయంత్రం 5.05 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించారని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడు రోజుల సంతాప దినాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని తెలిపింది. మాజీ ప్రధాని మరణిస్తే వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ నిబంధనల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. -
అందరి నోటా ఎయిమ్స్..
అప్పుడు ఎయిమ్స్ సాధనకోసం పోరాటం.. ఇప్పుడు క్రెడిట్ కోసం కుస్తీలు..! రంగాపూర్ వద్దనే ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో దాని నుంచి లబ్ధి పొందేందుకు రాజకీయ పక్షాలు మళ్లీ గళం విప్పాయి. ఆ ఘనత మాదేనంటే మాదేనని.. వాదనలకు దిగాయి. సాక్షి,యాదాద్రి : ఎయిమ్స్.. రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. జిల్లాలోని బీబీనగర్ మండలం రంగాపూర్ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్రాజెక్ట్ కొన్నేళ్లుగా రాజకీ య పక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. వివిధ పార్టీలు ఎయిమ్స్ సాధనకు పోరాటాలు, పాదయాత్రలు సైతం చేశాయి. కొన్ని సందర్భాల్లో ఎయిమ్స్ రంగాపూర్ వద్ద కాదని, ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందనే ప్రచారం జరిగింది. వీట న్నింటికీ తెరదించుతూ ఎయిమ్స్‌ను రంగాపూర్ వద్దనే ఏర్పాటు చేస్తున్నట్లు మూడు రోజుల క్రితం కేంద్రం ప్రకటించడంతో మళ్లీ ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మాదేనంటే మాదే.. జిల్లాకు ఎయిమ్స్ వచ్చిదంటే ఆ క్రెడిట్ మాదే అంటే మాదే అంటూ పోటీపడుతున్నాయి. ఎయిమ్స్సాధనలో తమ పాత్రను ప్రజలకు వివరిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభæజన చట్టంలో తెలంగాణ కు ఎయిమ్స్‌ను ఇవ్వాలని నిర్ణయించింది తామేనని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. తమ వల్లే మం జూరైందని బీజేపీ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ ఓ అడుగు ముందుకేసి ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వడంతో పాటు పార్లమెంట్లో పోరాడిన ఘన త తమదేనని చెప్పుకుంటోంది. తమ పార్టీ కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని యు వ తెలంగాణ నేతలు గుర్తు చేస్తుండగా.. టీడీపీ, వామపక్షా>లు సైతం తమ పోరాట శైలిని వివరి స్తున్నాయి. అయితే ఎవరిప్రమేయం ఎంత ఉన్నా ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలుపడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే మంజూరైన ఎయిమ్స్‌ను ఎన్ని రోజుల్లోగా అందుబాటులోకి తెస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది. ఎయిమ్స్ ప్రస్థానం ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రసాదించిన గొప్ప ప్రాజెక్ట్ నిమ్స్. మహానేత మరణానంతరం నిధుల లేమి తో నిమ్స్ నిలిచిపోయింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నిమ్స్‌కు నిధులను కేటా యించలేదు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని ఆ మేరకు పనులు చేపట్టగా వైఎస్ మరణం తర్వాత.. సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ దాన్ని పూర్తిగా తుంగలో తొక్కింది.ఒక దశలో ప్రైవేట్ పరం చేయాలని ప్ర యత్నించింది. అయితే ప్రతిపక్షాలు ప్రతిఘటించడంతో వాయిదా పడింది. తెలంగాణవాదులు, అన్ని రాజకీయ పక్షాలు నిమ్స్‌ను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ చేతుల మీదుగా శంకుస్థాపన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బీబీనగర్ దగ్గరలోని రంగాపూర్వద్ద జాతీయ రహదారి పక్కన అత్యంత ఆధునిక వసతులతో కూడిన నిమ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2005 డిసెంబర్ 1న పనులకు శంకుస్థాపన చేశారు. 2009 ఫిబ్రవరి 22న వైఎస్సార్ దాన్ని ప్రారంభించారు. 161 ఎకరాల్లో రూ.220 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును.. దేశ రాజధాని ఢి ల్లీలోని ఎయిమ్స్ తరహాలో యూనివర్సిటీ, పీజీ వైద్యవిద్య, క్యాంపస్, ఫార్మసీ (పి.జి) వివిద రోగాలపై పరిశోధనా సంస్థగా రూపకల్పన చేసేం దుకు పనులు చేపట్టారు. 2009 ఫిబ్రవరి 22న వైఎస్సార్ నిమ్స్‌ను ప్రారంభించిన సమయంలో 15 రోజుల్లో అవుట్ పేషెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చేసిన ప్రకటన అమలు కాలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిమ్స్ భవనసముదాయాన్ని పరి శీలించారు. నిమ్స్ ప్రాంగణం అన్ని రకాలుగా అ నుకూలంగా ఉన్నందున ఎయిమ్స్ ఏర్పాటు చే సేందుకు చర్యలు చేపట్టునున్నట్లు 2015లో ప్రకటించారు. అయితే కేంద్రం నుంచి మంజూరు ఆలస్యం కావడంతో నిమ్స్‌లో ఓపీ విభాగాన్ని ప్రారంభించి రోగులకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు నిమ్స్‌ను పూర్తిస్థాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఎవరి వాదనలు వారివే.. బీబీనగర్ నిమ్స్ ప్రాంగణంలో ఎయిమ్స్ వస్తున్నందునే సీఎం కేసీఆర్ నిమ్స్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ వివరించారు. కేసీఆర్ ప్రయత్నాలు, కేంద్ర ఆ రోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను పలుమార్లు కలిసి ఎయిమ్స్ సాధించామని ఆయన చెబుతున్నారు. బీజేపీ మాత్రం విభజన చట్టంతోపాటు, ప్రధానమంత్రి సురక్ష సంయోజ్ యోజనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 220 ఎకరాల స్థలంలో 49 ఎకరాలు ఇంకా సేకరించనే లేదని వెంటనే ఇవ్వకపోతే ఎయిమ్స్ పనులు ఆలస్యం అవుతాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపకపోవడం వల్లే జాప్యం జరిగిందని బీజేపీ చెబుతోంది. ఇక కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే ఎయిమ్స్ సాకారం అయిందని ఆ పార్టీ నేతలు అంటున్నా రు. జాతీయ రహదారి 163 వెంట, హైదరాబా ద్‌కు శివారులో నిమ్స్‌కోసం 161ఎకరాల స్థలం కేటాయించి.. అందులో భవనాలు నిర్మిచడం వల్లే ఈరోజు ఎయిమ్స్ సాధ్యమైందని కాంగ్రెస్ నియోజకవర్గఇంచార్జ్ కుంభం అనిల్‌కమార్‌రెడ్డి చెబుతున్నారు. ఎయిమ్స్ మంజూరీలో జరుగుతున్న ఆలస్యంపై పలుమార్లు ఆందోళనలు చేయడంలో కాంగ్రెస్‌తో పాటు యువతెలంగాణ, టీడీపీ, వామపక్షాల నాయకులు ఉన్నారు. లబ్ధి పొందడానికే..! ఇదిలా ఉంటే ఎయిమ్స్ విషయంలో పార్టీలన్నీ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నాయనడంలో సందేహం లేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎయిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రచారాస్త్రంగా మారబోతుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిమ్స్ విషయంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న అభిప్రాయం ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. 220 ఎకరాల స్థలం ఎయిమ్స్ పేరున రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యుత్ సబ్‌స్టేషన్, అంతర్గతర రహదారులు, మంచినీటి వసతిని కల్పించా లి. మౌళిక వసతులు సమకూర్చిన వెంటనే కేంద్రం నిధులను విడుదల చేసి అస్పత్రిని ప్రారంభించాలి. అయితే ఎయిమ్స్ కోసం మంజూరు చేసిన నిధులను వెంట వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది.ఏది ఏమైన రాజకీయ పార్టీలకు జిల్లాలో ఇక నుంచి ఎయిమ్స్ ఒక ప్రచారాస్త్రంగా మారబోతుంది. -
ఎయిమ్స్‌లో అటల్జీ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, 93ఏళ్ల అటల్ బిహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయిని వైద్యుల సలహాతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లోని అత్యవసర చికిత్సావిభాగం(ఐసీయూ)లో చేర్పించారు. సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నా.. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మూత్రనాళ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో తీసుకురాగానే డయాలసిస్ చేసిన వైద్యులు తర్వాత ఇన్ఫెక్షన్కు చికిత్సనందిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం వాజ్‌పేయి ఆరోగ్య బాధ్యతలను చూస్తోంది. ‘ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తోంది’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. పరామర్శించిన ప్రముఖులు 1984 నుంచి వాజ్‌పేయి ఒకే కిడ్నీతో పనిచేస్తుండగా ఇప్పుడు ఆ కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతోనే డయాలిసిస్ చేస్తున్నారు. గులేరియా మూడుదశాబ్దాల పాటు వాజ్‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడూ ఆయన నేతృత్వంలోనే వైద్యులు చికిత్సచేస్తున్నారు. ఆసుపత్రిలో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్షవర్ధన్, పలువురు బీజేపీ ప్రముఖులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పరామర్శించారు. ‘మా అందరికీ స్ఫూర్తిప్రదాత అయిన వాజ్‌పేయీజీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. దాదాపు 50 నిమిషాల సేపు ఆసుపత్రిలో ఉన్న ప్రధాని మోదీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెల్సుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మోదీ మాట్లాడారు. అడ్వాణీ రాత్రి 9 గంటలకు తన దీర్ఘకాల సహచరుడిని చూసేందుకు ఎయిమ్స్ వచ్చారు. ఈ సందర్భంగా అడ్వాణీ కాస్త ఉద్విగ్నతకు లోనైనట్లు సమాచారం. నేడో రేపో డిశ్చార్జ్? ‘వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఉన్నతస్థాయి వైద్యబృందం ఆయనకు చికిత్సనందిస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు. మంగళవారం ఉదయం వాజ్‌పేయిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. పరామర్శించేందుకు ప్రముఖులు వస్తుండటంతో ఎయిమ్స్‌తోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో భద్రత పెంచారు. వాజ్‌పేయి ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998–2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి.. 2009 తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అప్పటినుంచీ ఆయన ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. ఎయిమ్స్‌లో మోదీకి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న వాజ్‌పేయి బంధువు -
నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఆదివారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించనున్నారు. శనివారం పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను ఒకరోజు పరిశీలనలో ఉంచారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకునే వారిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచడం సాధారణమేనని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, కిడ్నీ దాత సిద్ధంగా ఉన్నారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించనున్నారు. -
అరుణ్ జైట్లీకి అనారోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(65) మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సమస్య గురించి పూర్తిగా వివరించకుండా.. ‘కిడ్నీ సంబంధిత సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను. భవిష్యత్ చికిత్సను డాక్టర్లు నిర్ధారిస్తారు’ అని మాత్రమే జైట్లీ ట్వీట్ చేశారు. అయితే, జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుందని ఎయిమ్స్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కిడ్నీ దాతకు సంబంధించిన విధి, విధానాలు కూడా పూర్తయ్యాయని తెలిపాయి. డాక్టర్ల సలహాతో త్వరలో జైట్లీ ఎయిమ్స్‌లో కొత్తగా నిర్మించిన అత్యాధునిక కార్డియో–న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. జైట్లీ కుటుంబానికి సన్నిహితుడైన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోదరుడు, అపోలో ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా జైట్లీకి ఆ ఆపరేషన్ చేస్తారని తెలిసింది. 2014లో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడమే ప్రస్తుత సమస్యకు కారణమై ఉండొచ్చని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాక్స్ ఆసుపత్రిలో ఆ సర్జరీ జరిగినప్పటికీ.. ఆపరేషన్ అనంతరం పలు సమస్యలు రావడంతో అప్పట్లోనే ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. జైట్లీ చాన్నాళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ కూడా జరిగింది. జైట్లీ ఈ సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జైట్లీ.. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 2న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికీ హాజరుకాలేదు. లండన్‌లో ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనాల్సిన ఆయన, ఆ పర్యటనను కూడా రద్దుచేసుకున్నారు. -
బ్రెడ్ ప్యాకెట్లో నుంచి ఎలుక దూకింది!
న్యూఢిల్లీ: అస్వస్థతతో బాధ పడుతున్న మీరు అధిక పోషక విలువలుగల గోధుమ బ్రెడ్‌ను తిందామని సీల్డ్ ప్యాకెట్‌ను విప్పితే హఠాత్తుగా అందులో నుంచి బతికున్న ఎలుక బయటకు దూకితే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఎవరికైనా ఒళ్లు జలధరిస్తుంది కదా! ఈ సంఘటన రోజుకు వందలాది మంది రోగులకు చికిత్సచేసే ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలో ఏయిమ్స్ ఆస్పత్రిలోనే జరిగింది. పర్యవసానంగా ఆ బ్రెడ్‌ను తయారుచేసి సరఫరా చేసిన ఎం/ఎస్ బాన్ న్యూట్రియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏయిమ్స్ షోకాజ్ నోటీసును జారీ చేసి, మూడేళ్లపాటు ఆ కంపెనీ ఉత్పత్తుల సరఫరాను నిషేధిస్తున్నామని ప్రకటించింది. బ్రెడ్స్, బిస్కట్లు, కేక్స్, కుకీస్ లాంటి వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారుచేసి దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న ప్రముఖ బాన్ న్యూట్రియెంట్స్ కంపెనీ విషయంలోనే ఇలా జరిగితే ఇక సాధారణ కంపెనీలను ఎలా నమ్మగలం. సీల్డ్ బ్రెడ్ ప్యాకెట్‌ను విప్పగానే సజీవ ఎలుక సాక్షాత్కరించిన సంఘటన ఏయిమ్స్‌లో గత జూలై 29వ తేదీన జరగ్గా, దానిపై స్పందించేందుకు ఏయిమ్స్ లాంటి వైద్య విజ్ఞాన సంస్థ కూడా తాత్సారం చేసింది. సెప్టెంబర్ 9వ తేదీతో సెప్టెంబర్ 24వ తేదీన సదరు కంపెనీ ఉత్పత్తుల కొనుగోలును నిలిపివేస్తున్నట్టు నోటీసు జారీ చేసింది. ఎందుకింత ఆలస్యంగా స్పందించారని మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి సంఘటన జరిగినట్టు తన దృష్టికే రాలేదంటూ ఆస్పత్రి సూపరింటెండ్ వ్యాఖ్యానించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల బ్రెడ్ నాణ్యతను గుర్తించగలిగామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఏయిమ్స్ సీనియర్ డాక్టరొకరు వెల్లడించారు. తమ ఆస్పత్రిలో సాధారణ రోగులకే కాకుండా శస్త్ర చికిత్సలు చేసిన వారికి కూడా అధిక పోషక పదార్థాల కోసం బ్రౌన్ బ్రెడ్ అందిస్తామని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన బ్రెడ్‌ను తిన్నట్లయితే ఎలర్జీ, ఫీవర్, డయేరియా లాంటి జబ్బులే కాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్, మెనింజైటీస్ లాంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయని ఆయన వివరించారు. అలాంటి సంఘటన తన దృష్టికి రాలేదంటూ ఏయిమ్స్ సూపరింటెండెంట్ తప్పించుకోజూసినా 24, సెప్టెంబర్, 2015 నాడు కంపెనీకి జారీచేసిన షోకాజ్ నోటీసులో ఎలుక బయట పడిన సంఘటన ప్రస్థావన స్పష్టంగా ఉంది. ఇదే విషయమై బాన్ న్యూట్రియంట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఢిల్లీ డివిజన్ మేనేజర్‌ను మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. సీసం పాలు ఎక్కువ ఉందంటూ ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల కంపెనీ ‘నేస్లీ’పై కొన్ని రాష్ట్రాల్లో నిషేధం విధించిన విషయం తెల్సిందే. భారత్‌లో తయారవుతున్న పలు బ్రాండ్ల ఆహోర్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, సీసం పాళ్లు ఎక్కువగా ఉంటోందంటూ పలు ఉత్పత్తులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ (ఎఫ్‌డీఏ) నిషేధించిన విషయం తెల్సిందే. -
అభివృద్ధికి దూరంగా.. అనారోగ్యానికి బంధువుగా!
రీజినల్ క్యాన్సర్ సెంటర్ హుళక్కే గుంటూరుకు తరలించే ప్రయత్నం ఆ ప్రాంత మంత్రి ముమ్మర ఏర్పాట్లు కర్నూలుకు మరోసారి మొండిచేయి ఇప్పటికే గుంటూరుకు మళ్లిన ఎయిమ్స్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలో జిల్లాకు మొండిచేయి చూపిన చంద్రబాబు.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా ముందువరుసలో నిలుపుతామని ఇచ్చిన హామీ క్రమంగా నీరుగారుతోంది. ఎయిమ్స్‌ను గుంటూరుకు తరలించిన ఆ పార్టీ పెద్దలు.. తాజాగా రీజినల్ క్యాన్సర్ సెంటర్‌ను కూడా అదే ప్రాంతానికి తరలించుకుపోతుండటం గమనార్హం. కర్నూలు(జిల్లా పరిషత్) : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు 60 ఏళ్ల చరిత్ర ఉంది. రాయలసీమ నుంచే కాకుండా మహబూబ్‌నగర్, బళ్లారి, రాయచూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ప్రజలకు కూడా ఈ ఆసుపత్రే పెద్దదిక్కు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రి కావడంతోనే 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వైజాగ్, గుంటూరుతో పాటు కర్నూలులో క్యాన్సర్ విభాగాన్ని, కోబాల్ట్ మిషన్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ మిషన్ ద్వారా రేడియేషన్ థెరపి ఇస్తూ లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు సాంత్వన చేకూరుస్తోంది. రోజూ 40 నుంచి 60 మంది ఓపీ విభాగానికి చికిత్స కోసం వస్తుండగా.. నిత్యం 25 మందికి రేడియేషన్, 25 మందికి కీమోథెరపి ఇస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యులు ఇక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు పేద రోగులకు ఉచితంగా కూడా ఇక్కడ రూపాయి ఖర్చులేని వైద్యం అందుతోంది. రూ.40కోట్లతో రీజనల్ క్యాన్సర్ సెంటర్ హుళక్కే ప్రాధాన్యత దృష్ట్యా ఆసుపత్రిలో రూ.40కోట్లతో రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెంటర్ ఏర్పాటైతే లీనర్ యాక్సిలేటర్, బ్రాకీథెరపి యంత్రాలతో ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న రేడియాలజితో పాటు సర్జికల్ ఆంకాలజి, మెడికల్ విభాగాలు ఏర్పాటవుతాయి. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియమితులవుతారు. అత్యాధునిక యంత్రాల ద్వారా క్యాన్సర్ రోగులకు మరింత సులభమైన, సురక్షితమైన, సైడ్ఎఫెక్ట్ తక్కువగా ఉండే చికిత్స అందుకునే వీలుంటుంది. ఇలాంటి క్యాన్సర్ సెంటర్‌ను జిల్లా నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న కుట్ర విమర్శల పాలవుతోంది. గుంటూరుకు తరలించే యత్నం కర్నూలుకు ఎయిమ్స్‌ను ఎలాగూ రానీయలేదు. కనీసం రీజనల్ క్యాన్సర్ సెంటర్‌నైనా ఏర్పాటు చేస్తున్నారనే ఆశను కోస్తా మంత్రులు ఆవిరి చేస్తున్నారు. ఈ సెంటర్‌ను గుంటూరులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఆ మేరకు గుంటూరులో ఏర్పాట్లు జరిగిపోతున్నట్లు జిల్లా ఆసుపత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తే రోగులకు ఉపయోగం రాయలసీమ ప్రాంతంలో క్యాన్సర్ విభాగం లేదు. కర్నూలులోని క్యాన్సర్ విభాగానికి మంచి పేరుంది. ఇక్కడ స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది ఉన్నారు. దీనిని అప్‌గ్రేడ్ చేసి రీజనల్ క్యాన్సర్ సెంటర్‌గా ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. -డాక్టర్ వీరస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కర్నూలులోనే క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలి రాష్ట్రం విడిపోయినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు చివరన మిగిలిపోయింది. ఇక్కడి రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ఆరోగ్యశ్రీ కార్డులను ఆమోదించకపోతే పరిస్థితి ఏమిటో పాలకులు తెలుసుకోవాలి. రాయలసీమ ప్రాంతంలో క్యాన్సర్ రోగులు అధికంగా ఉన్నందున రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను కచ్చితంగా కర్నూలులో ఏర్పాటు చేయాలి. గుంటూరుకు తరలించాలని చూస్తే ఊరుకోబోం. - డాక్టర్ విజయశంకర్, మెడికల్ జేఏసీ నాయకులు గుంటూరుకు తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం కేంద్ర విద్యాసంస్థలను కర్నూలులో ఏర్పాటు చేయనీయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారు. అన్ని విద్యాసంస్థలను గుంటూరు, విజయవాడ మధ్యలోనే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్యలోనే అభివృద్దిని కేంద్రీకరిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది. రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను గుంటూరుకు తరలించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. - జె.లక్ష్మీనరసింహ, కర్నూలు జేఏసీ కోకన్వీనర్