
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ నోటిఫికేషన్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో జారీ చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 2018 ఆగస్టు 16న సాయంత్రం 5.05 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏడు రోజుల సంతాప దినాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని తెలిపింది. మాజీ ప్రధాని మరణిస్తే వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ నిబంధనల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు.