
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఆరోగ‍్యశాఖ మంత్రి హర‍్షవర్ధన్ తదితరులు వైద్యులతో మాట్లాడి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆరుణ్ జైట్లీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment