admitted
-
లాలూకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గత రాత్రి(మంగళవారం) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగానే ఉంది. దీంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.లాలూ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల ఆయనకు చికిత్స అందించారు. తరువాత అతని ఆరోగ్యం పరిస్థితి కుదుటపడింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు రాత్రంతా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీపీ పెరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు రాకేష్ యాదవ్ తెలిపారు. 2022లో లాలూకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆయన చాలా కాలంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత లాలూ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌గా మారి, ఎన్నికల సమయంలో వేదికపై నుంచి ప్రసంగాలు కూడా చేశారు. -
ఎయిమ్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి,ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(73) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం(జులై11) ఉదయం రాజ్‌నాథ్ వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ప్రైవేట్ వార్డులో ఆయనకు వెన్నునొప్పి సంబంధిత పరీక్షలు చేశారు. -
తాబేలు మాసం తిని తొమ్మిదిమంది మృతి.. 78 మందికి అనారోగ్యం!
ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్‌వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు. ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్‌లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ(76) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్తో పాటు జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో నిన్న రాత్రి చేరినట్లు అధికారులు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నామని తెలిపిన వైద్యులు.. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే చికిత్స జరుగుతున్నట్లు చెప్పారు. సోనియా గాంధీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులకే ఇలా ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఇండియా కూటమిని ముందుకు తీసుకుపోయే విధంగా సోనియా గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఇండియా కూటమి ముంబయి సమావేశంలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Delhi's Sir Gangaram Hospital with symptoms of mild fever. She is under doctors' observation and is currently stable: Sources pic.twitter.com/9uuZz8n4ra — ANI (@ANI) September 3, 2023 ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమిని బలపరచడానికి ఇప్పటికే నిర్వహించిన పాట్నా, బెంగళూరు, ముంబయి వరుస సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకుపోవడానికి కాంగ్రెస్ శ్రేణులకు ముందుండి నడుస్తున్నారు. 2019లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇదీ చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత
-
హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..
Deepika Padukone Admit In Kamineni Hospital In Hyderabad: ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాష్ పదుకొణె కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ దీపికా పదుకొణె. తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది దీపికా పదుకొణె. ఇదిలా ఉంటే తాజాగా దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్‌బీట్ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రుస్తుతం ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు సమాచారం. కాగా దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతేకాకుండా షారుక్ ఖాన్‌తో 'పఠాన్' మూవీ చేస్తున్న దీపికా హాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్.. -
ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఢిల్లీ ప్రభుత్వాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నిన్న(సోమవారం) రాత్రి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అధిక జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్-19పరీక్ష చేసిన వైద్యుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని జైన్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత రాత్రి హై గ్రేడ్ జ్వరం, ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవటంతో ఆసుపత్రిలో చేరానని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా ఇటీవల స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. అయితే అనంతరం ఆయనకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పిల్చుకున్న సంగతి తెలిసిందే. Due to high grade fever and a sudden drop of my oxygen levels last night I have been admitted to RGSSH. Will keep everyone updated — Satyendar Jain (@SatyendarJain) June 16, 2020 -
ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు వైద్యులతో మాట్లాడి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆరుణ్ జైట్లీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. -
హీరో తండ్రికి అస్వస్థత
ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, మాజీ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్‌ను శనివారం ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియోతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. బాలీవుడ్ సీనియర్ స్టంట్ మాస్టర్ గా పేరుగడించిన వీరూ దేవగన్ కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. దాదాపు 80 సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అనేక అవార్డులను కూడా అందుకున్నారు. అంతేకాకుండా అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, మనీషా కొయిరాలా, సుస్మితీ సేన్ తదితరులు నటించిన 'హిందుస్తాన్ కి కసమ్' (1999) అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. -
అబ్దుల్ కలాం పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చేరిక