ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్‌వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు.
ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్‌లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Comments
Please login to add a commentAdd a comment