ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ | Sonia Gandhi Admitted To Delhi Hospital For Chest Infection | Sakshi
Sakshi News home page

సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స..

Published Sun, Sep 3 2023 12:42 PM | Last Updated on Sun, Sep 3 2023 1:07 PM

Sonia Gandhi Admitted To Delhi Hospital For Chest Infection - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ(76) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో పాటు జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో నిన్న రాత్రి చేరినట్లు అధికారులు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నామని తెలిపిన వైద్యులు.. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే చికిత్స జరుగుతున్నట్లు చెప్పారు. 

సోనియా గాంధీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులకే ఇలా ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఇండియా కూటమిని  ముందుకు తీసుకుపోయే విధంగా సోనియా గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఇండియా కూటమి ముంబయి సమావేశంలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. 

ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమిని బలపరచడానికి ఇప్పటికే నిర్వహించిన పాట్నా, బెంగళూరు, ముంబయి వరుస సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకుపోవడానికి కాంగ్రెస్ శ్రేణులకు ముందుండి నడుస్తున్నారు. 2019లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.  

ఇదీ చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement