ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, మాజీ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్ను శనివారం ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియోతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. బాలీవుడ్ సీనియర్ స్టంట్ మాస్టర్ గా పేరుగడించిన వీరూ దేవగన్ కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు.
దాదాపు 80 సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అనేక అవార్డులను కూడా అందుకున్నారు. అంతేకాకుండా అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, మనీషా కొయిరాలా, సుస్మితీ సేన్ తదితరులు నటించిన 'హిందుస్తాన్ కి కసమ్' (1999) అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.