stable
-
స్థిరమైన డిమాండ్ ఉండే పరిశ్రమ
ముంబై: లగేజీ ఉత్పత్తుల పరిశ్రమలో (సంఘటిత రంగం) డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో స్థిరంగా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. పర్యాటకం, కార్పొరేట్ ప్రయాణాలకు డిమాండ్ కొనసాగుతుండడం ఇందుకు సానుకూలంగా పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంఘటిత లగేజీ పరిశ్రమ ఆదాయం 8–10 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. 2021–22 నుంచి 2023–24 మధ్య పరిశ్రమ పరిమాణం రెట్టింపు కావడం, అధిక బేస్ ఇందుకు కారణాలుగా పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ 18 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ‘‘తయారీ దారుల మధ్య పోటీ పెరిగింది. కొత్త సంస్థలు ప్రవేశించాయి. నిల్వలు మోస్తరుగా పెరగడం వంటి అంశాలతో కంపెనీలు విక్రయ ధరలను పోటాపోటీగా మార్చేశాయి. దీంతో నికరంగా విక్రయ ధరలు, ముఖ్యంగా ఎకానమీ (బడ్జెట్) విభాగంలో తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. 2023–24లో నిర్వహణ మార్జిన్లు 1.5 శాతం మేర తగ్గాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 0.50 శాతం వరకు క్షీణించి 13.5–14 శాతం వద్ద స్థిరపడొచ్చని అంచనా వేసింది. దేశ లగేజీ పరిశ్రమలో కేవలం కొన్ని పెద్ద సంస్థల ఆధిపత్యమే కొసాగుతున్నట్టు వివరించింది. ఇవి గత కొన్ని సంవత్సరాల్లో స్థానికంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు తెలిపింది. మరోవైపు అసంఘటిత లగేజీ పరిశ్రమ ప్రధానంగా చైనా నుంచి దిగుమతులపైనే ఆధారపడినట్టు వివరించింది. స్థానిక తయారీ.. హార్డ్ లగేజీ ఉత్పత్తుల తయారీని స్థానికంగానే చేపడుతుండడం గత ఐదేళ్లలో వీటి దిగుమతులు తగ్గుతూ వస్తున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘హార్డ్ లగేజీకి ప్రాధాన్యం పెరుగుతుండడం, , పోటీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత అన్నవి సంఘటిత రంగంలోని కంపెనీలకు అనుకూలం. ఫలితంగా దేశ లగేజీ పరిశ్రమలో సంఘటిత రంగ కంపెనీల వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 45 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో రిస్‌్కలు సైతం పెరుగుతున్నాయి. వరుసగా మూడేళ్ల పాటు డబుల్ డిజిట్ వృద్ధిని పరిశ్రమ చూసింది. అది ఇప్పుడు క్షీణిస్తోంది. కొత్త సంస్థల ప్రవేశంతో పోటీ పెరిగింది. ఇది ప్రచారంపై వ్యయాలను పెంచింది. దీంతో మార్జిన్లు మోస్తరు స్థాయికి చేరుకున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ వివరించారు. డిమాండ్ మోస్తరు స్థాయికి దిగి రావడంతో 2024లో లగేజీ నిల్వలు 114రోజులకు (విక్రయాలకు సరిపడా) చేరాయని, ఆర్థిక సంవత్సరం చివరికి 100–105 రోజులకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. కంపెనీల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, పూర్తి సామర్థ్య వినియోగం నేపథ్యంలో సంఘటిత రంగ సంస్థలు హార్డ్ లగేజీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘సామర్థ్యం 25 శాతం మేర పెరగొచ్చు. ఇందుకు రూ.500–550 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని అంతర్గత వనరుల నుంచే కంపెనీలు సమకూర్చుకోవచ్చు. రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా వడ్డీ కవరేజీ రేషియో, నెట్‌వర్త్ పరంగా కంపెనీలు సౌకర్యంగానే ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రుషబ్ బోర్కార్ తెలిపారు. -
భారత్ అవుట్‌లుక్.. పాజిటివ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు మెరుగుపరిచింది. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్అండ్పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్ రేటింగ్‌నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్‌లకు సంబంధించీ ఇదే అవుట్‌లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. -
ప్రతిభా పాటిల్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. -
నిత్యావసరాల ధరలు స్థిరం: కేంద్రం
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో చక్కెర, వంట నూనెలు సహా నిత్యావసర ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా భరోసా ఇచ్చారు. గోదుమలు, బియ్యం, పంచదార, వంట నూనెల వంటి ముఖ్యమైన ఆహార పదార్థాల దేశీయ సరఫరాలు, ధరలపై ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో ధరల స్థిరత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మే 22 నుండి గోధుమల ఎగుమతిపై నిషేధం, పార్బాయిల్డ్ బియ్యంపై మార్చి 2024 వరకు 20 శాతం ఎగుమతి సుంకం పొడిగింపు, పప్పుధాన్యాలపై స్టాక్ పరిమితులు, ‘నియంత్రిత’ కేటగిరీ కింద చక్కెర ఎగుమతుల పొడిగింపు వంటి అనేక ఆంక్షలు ధరల పెరుగుదలను నిరోధించడానికి దోహదపడతాయని తెలిపారు. దేశంలో వినియోగానికి తగిన చక్కెర నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. వంట నూనెల విషయంలో వేరుశెనగ నూనె మినహా మిగిలిన ఉత్పత్తులు రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. గడచిన మూడు నాలుగు నెలల్లో బియ్యం ద్రవ్యోల్బణం 11 నుంచి 12 శాతం స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. మార్కెట్లోకి కొత్త పంట ఉత్పత్తులు వస్తున్న నేపథ్యంలో, ధరలు మున్ముందు మరింత తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోధుమల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిలో దాదాపు 3.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. -
ప్రపంచంలోని టాప్ 10 ఆర్థికంగా స్థిరమైన దేశాలు (ఫోటోలు)
-
అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది
-
ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ కీలక ప్రకటన
సాక్షి, ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థపై మందగమనం ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శుక్రవారం వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ అలాగే ఉందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 4.5 శాతంతో జీడీపీ ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబరు ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ తన వృద్ధి అంచనాను 240 బేసిస్ పాయింట్లు తగ్గించి 5 శాతంగా పేర్కొంది. గ్లోబల్ రిస్క్‌లు, స్థూల ఆర్థిక పరిస్థితులపై రిస్క్ పర్సెప్షన్స్, ఫైనాన్షియల్ మార్కెట్ రిస్క్‌లు లాంటి ప్రధాన రిస్క్ గ్రూపుల ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై సాధారణ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఏదేమైనా, దేశీయ వృద్ధి, ఆర్థిక, కార్పొరేట్ రంగం, బ్యాంకుల ఆస్తి నాణ్యత వంటి వివిధ రంగాల్లోని నష్టాల అవగాహన 2019 ఏప్రిల్ -అక్టోబర్ మధ్య పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. -
సోనాలి బింద్రే ఆరోగ్యంపై ‘గోల్డీ’ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : న్యూయార్క్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్‌పై పోరాటం దీర్ఘకాలమైనా తాము సానుకూల దృక్పథంతో ప్రయాణం ప్రారంభించామన్నారు. తాను మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, దీనిపై ధైర్యంగా పోరాడతానని జులైలో సోనాలి వెల్లడించిన విషయం తెలిసిందే. ‘సోనాలి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ తలెత్తడం లేదు.. సానుకూల దృక్పథంతో తాము ఈ ప్రయాణాన్ని ప్రారంభించా’మని గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్ రూపంలో తనకు ఎదురైన ప్రాణాంతక వ్యాధిని అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటున్న సోనాలీని బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే. Thank you all for the love and support for Sonali... she is stable and is following her treatment without any complications. This is a long journey but we have begun positively.🙏 — goldie behl (@GOLDIEBEHL) 2 August 2018 -
ఆసుపత్రిలో స్టార్ కమెడియన్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత కపిల్ శర్మ అనారోగ్యానికి గురయ్యారు. స్వల్ప అనారోగ్యంతో బుధవారం ఆయన అంధేరిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. లో బ్లడ్ ప్రెషర్ కారణగా అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శర్మ కోలుకుంటున్నారనీ, ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని బాలీవుడ్ మీడియా కథనం. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఎపుడు డిశ్చార్చ్ చేసేది ఇంకా ఆసుపత్రి వర్గాలు ప్రకటించలేదు. అయితే నేడు జరగనున్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పంక్షన్‌కు హాజరు లేకపోవచ్చని బాలీవుడ్.లైఫ్ తెలిపింది. ఈ గౌరవ పురస్కారానికి ఈ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ రెండవ సారి ఎంపిక య్యారు. ఒకవైపు కపిల్ షో, మరోవైపు బాలీవుడ్ సినిమా షూటింగ్ పనుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు పేర్కొంది. కాగా కామెడీ నైట్స్ విత్ కపిల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కపిల్ శర్మ తాజాగా ది కపిల్ శర్మ షో కు వ్యాఖ్యాతగా ఉన్నారు. మరోవైపు ఫిరంగి మూవీ షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కపిల్ ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. -
భారత్ బ్యాంకింగ్ ‘నెగిటివ్’
♦ డౌన్‌గ్రేడ్ చేసిన ఫిచ్ ♦ అధిక మొండిబకాయిల ఫలితం ♦ ‘స్టేబుల్’ నుంచి ‘నెగిటివ్’కు తగ్గింపు ముంబై: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- ఫిచ్ భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకూ ‘స్టేబుల్’గా ఉన్న అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చింది. అధిక మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యను ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. కార్పొరేట్ ఆదాయాలు బలహీనంగా ఉండడాన్ని మరో కారణంగా చూపింది. ఆయా అంశాలు సమీపకాలంలో సైతం బ్యాంకింగ్‌కు ప్రతికూలంగా ఉంటాయని ఒక నివేదికలో పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే ఈ బ్యాంక్ అనుబంధ న్యూజిలాండ్ విభాగం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లుసహా తొమ్మిది బ్యాంకులకు సంబంధించి లాంగ్‌టర్మ్ రేటింగ్ ‘బీబీబీ-’ కొనసాగిస్తున్నట్లు ఫిచ్ స్పష్టం చేసింది. జంక్‌కు ఇది కేవలం ఒక అంచె ఎక్కువ. కాగా ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐల మూలధన పరిస్థితులు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నట్లు పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న రుణాల అంశం ఇందుకు కారణంగా పేర్కొంది. 2015-16 నాటికి బ్యాంకింగ్ మొండిబకాయిలు 13 శాతానికి పైగా (ఎనిమిది లక్షల కోట్లు) పెరిగిన సంగతి తెలిసిందే. మరింత తగ్గే అవకాశం... రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో బ్యాంకింగ్ రుణ నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉందని కూడా తన తాజా నివేదికలో ఫిచ్ పేర్కొంది. మౌలిక రంగం, ఇనుము, ఉక్కు రంగాలకు సంబంధించి అకౌంట్లు ఇంకా ఒత్తిడిలో కొనసాగుతుండడం దీనికి కారణంగా పేర్కొంది. బ్యాంకుల మూలధన పరిస్థితులు చరిత్రాత్మక బలహీన స్థాయిల్లో ఉన్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ బాసెల్ 3 ప్రమాణాలు అనుగుణంగా- 2019 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 90 బిలియన్ డాలర్ల (దాదాపు 6 లక్షల కోట్లు) మూలధనం అవసరమవుతుందన్నది తమ అంచనా అని పేర్కొంది. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కష్టమవుతుందని, ప్రభుత్వమే ఈ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించింది. -
'దిలీప్ బానే ఉన్నారు.. కానీ ప్రమాదం కూడా ఉంది'
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ప్రమాదం దాటిపోయిందని మాత్రం చెప్పలేమని అన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నామని, ఆస్పత్రిలో చేరిన సమయం కన్న ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో దిలీప్ కుమార్ ను శనివారం ఉదయం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 'దిలీస్ సాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కొంచెం పర్వాలేదు. కానీ కొంత ఆందోళన మాత్రం ఉంది. అపాయం తప్పినట్లు మాత్రం చెప్పలేము. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంది. మరో 48 గంటలు గడిచిన తర్వాత స్పష్టమైన్ ఆరోగ్య సమాచారం వెల్లడిస్తాం' అని జలీల్ పార్కర్ అనే వైద్యుడు తెలిపారు. ఊపిరితిత్తుల్లో కొంత చెడిపోయాయని కూడా వెల్లడించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమల దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా. -
హీరో తండ్రికి అస్వస్థత
ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, మాజీ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్‌ను శనివారం ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియోతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. బాలీవుడ్ సీనియర్ స్టంట్ మాస్టర్ గా పేరుగడించిన వీరూ దేవగన్ కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. దాదాపు 80 సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అనేక అవార్డులను కూడా అందుకున్నారు. అంతేకాకుండా అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, మనీషా కొయిరాలా, సుస్మితీ సేన్ తదితరులు నటించిన 'హిందుస్తాన్ కి కసమ్' (1999) అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. -
జగన్ బిపి,సుగర్ సాధారణ స్ధాయిలో ఉన్నాయి