
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment