
సాక్షి, ముంబై: శివసేన కార్పొరేటర్, ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ఛాతీ నొప్పితో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం మేయర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. శనివారం రాత్రి నుంచే ఆమె స్వల్ప ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం నొప్పి మరింత తీవ్రం కావడంతో పరేల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
అయితే మేయర్ కార్యాలయం వర్గాలు ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై ఇంతవరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పలువురు మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment