ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ పడ్నేకర్ సోమవారం స్వీయ నిర్భంధలోకి వెళ్లారు. ముంబైలో కొంతమంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 14 రోజుల పాటు ఆమె ఇంటి నుంచే పనిచేయనున్నారు. మేయర్ నివాసాన్ని మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేశారు. మరోవైపు ఇద్దరు బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి కూడా కరోనా సోకింది.
(చదవండి: ఏప్రిల్ 23న బ్లాక్‌డేనా?)
‘గత ఐదురోజులుగా నేను కలిసిన కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలింది. అందుకే నేను స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నా. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నాకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ 14 రోజులపాటు అందరికీ దూరంగా ఉంటాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని పడ్నేకర్ పేర్కొన్నారు. కాగా, ముంబై వ్యాప్తంగా 167 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక ముంబైలో 2985 కేసులు నమోదు కాగా.. 131 మరణాలు సంభవించాయి. మరోవైపు 4,203 కేసులు, 223 మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
(చదవండి: టిక్‌టాక్ వీడియోకు లైక్స్ రాలేదని బలవన్మరణం..)
Comments
Please login to add a commentAdd a comment