Mumbai mayor
-
'పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకేం అన్యాయం చేశారు'
సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ పెడ్నేకర్‌కు గురువారం సాయంత్రం బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. ఆ లేఖలో అసభ్య పదజాలం వాడటంతో పాటు మేయర్‌ను, ఆమె కుటుంబాన్ని హతమారుస్తామని హెచ్చరికలు ఉన్నాయి. ‘మాతో వైరం పెట్టుకోవద్దు. నా సోదరుడి వైపు కన్నెత్తి చూడవద్దు’అని కూడా ఆ లేఖలో రాశారు. దీంతో మేయర్ కిశోరీ పెడ్నేకర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: (భారత్‌లో ఒమిక్రాన్ భయాలు.. ఒకే రోజు 9 కేసులు) గతేడాది జూన్‌లో కూడా ఆమెకు ఇలాగే ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ లేఖ రాసిన వారి చిరునామా గందరగోళంగా ఉండటంతో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రాసి ఉండవచ్చని తొలుత అనుమానించారు. కానీ, ఈ లేఖ నవీ ముంబైలోని పన్వేల్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేయర్ కిశోరీ పెడ్నేకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాలు రోజురోజుకు మరింత దిగజారి పోతున్నాయని, లేఖలో రాసిన అసభ్య పదజాలం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆమె కంటతడి పెట్టారు. చదవండి: (ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..) ఒక మహిళకు రాసిన లేఖలో రాయాల్సిన పదాలేనా ఇవి అంటూ నిలదీశారు. ‘నన్ను, నా కుటుంబ సభ్యులను రివాల్వర్‌తో కాల్చి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేస్తామని లేఖలో పేర్కొనడం ఎంత వరకు సమంజసం? పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి. నా కుటుంబ సభ్యులు మీకు ఏం అన్యాయం చేశారు’అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించే మన దేశంలో ఇలాంటి పదాలు వాడటం సిగ్గుచేటన్నారు. అడ్వొకేట్ విజేంద్ర మాత్రే అనే వ్యక్తి లేఖ రాసినట్లు లేఖపై ఉందని తెలిపారు. తన గళాన్ని అణచివేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను శివసైనికురాలినని, ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తులు రాసిన బెదిరింపు లేఖలకు భయపడనని ఉద్ఘాటించారు. -
‘కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని అనలేదు’: ముంబై మేయర్
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మళ్లీ దేశంలో కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ముంబై, నాగ్‌పూర్‌లో కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఓ మేయర్ థర్డ్ వేవ్ వచ్చేసిందని ప్రకటించారు. ఇదిగోండి మీ ఇళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. వారిద్దరి ప్రకటనలు ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోంది. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ‘నాగ్‌పూర్‌లో థర్డ్ వేవ్ వచ్చేసింది’ అని మంగళవారం తెలిపారు. తాజాగా ముంబై మేయర్ కిశోరీ పడ్నేకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘మూడో దశ రావడం కాదు. వచ్చేసింది! మన ఇంటి ముందరే ముప్పు పొంచి ఉంది. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం’ అని ఆమె తెలిపారు. ‘నాగ్‌పూర్‌లో వచ్చేసింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైవాసులు జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. ‘గత రెండు దశల అనుభవంతో ఇప్పుడు మూడో దశ రాకుండా అడ్డుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది’ అని విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. అయితే ఆ ప్రకటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా ఆమె బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ‘నేను అలా అనలేదు’ అని చెప్పారు. ముంబైలో థర్డ్ వేవ్ ఉందని తాను అనలేదని స్పష్టం చేశారు. మంత్రి నితిన్ రౌత్ థర్డ్ వేవ్ ఉన్నట్టు చెప్పడంతో థర్డ్ వేవ్ ఇంటి ముందరే ఉందని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. జాగ్రత్తలు అవసరం అని మాత్రమే తాను చెప్పినట్లు వివరించారు. కరోనాపై మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా స్పందించారు. కరోనా ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ‘12-18 ఏళ్ల వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని గుర్తించాలి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మూడో దశ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్‌ను అడ్డుకోగలం’ అని ఆదిత్య తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలు చేసుకోవాలని సూచించింది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
ఆస్పత్రిలో చేరిన మేయర్ కిశోరీ
సాక్షి, ముంబై: శివసేన కార్పొరేటర్, ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ఛాతీ నొప్పితో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం మేయర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. శనివారం రాత్రి నుంచే ఆమె స్వల్ప ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం నొప్పి మరింత తీవ్రం కావడంతో పరేల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మేయర్ కార్యాలయం వర్గాలు ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై ఇంతవరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పలువురు మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. -
మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్ వ్యాఖ్యలు దుమారం
సాక్షి, ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలతో ముంబై మేయర్ ఇరుకున పడ్డారు. ఓ టీవీ ప్రసారంపై సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ పరుష వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్ ఎవరూ ఇచ్చారు? ఓ నెటిజన్ ప్రశ్నించగా మీ అయ్య? అంటూ ఆమె ట్విటర్లో తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఓ వార్త ఛానల్ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి గ్లోబర్ టెండర్ విషయమై ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వివరాలను బుధవారం ఆ టీవీ ఛానల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన మిఠి రివర్ అనే నెటిజన్ స్పందిస్తూ ‘కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు?’ (మరాఠీలో ‘కాంట్రాక్ట్ కోనలా దియా’) అని ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. దీన్ని చూసిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ ఫడ్నేకర్ (శివసేన పార్టీ నాయకురాలు) స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చారు. మీ నాన్న (మరాఠీలో ‘తుజ బాప్ల’) అని రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. మేయర్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అయితే తప్పు తెలుసుకుని ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కాకపోతే అప్పటికే పలువురు స్క్రీన్షాట్లు తీయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యాఖ్యలపై వెంటనే ప్రతిపక్షాలు స్పందించాయి. ముంబై ప్రథమ పౌరురాలుగా ఉన్న ఆమె మాట్లాడే భాష ఏంటి? అని బీజేపీ కార్పొరేటర్ బాలాచంద్ర షిర్సత్ ప్రశ్నించారు. పౌరులతో మాట్లాడే తీరు ఇదేనా? అని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాయిస్ షేక్ తెలిపారు. మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వెంటనే అతడికి క్షమాపణలు చెప్పాలని నెటిజన్లతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కిశోర్ ఫడ్నేకర్ ముంబైలోని లోవర్ పరేల్ స్థానం మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2019లో ముంబై మేయర్‌గా ఎన్నికయ్యారు. చదవండి: ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం -
మేయరమ్మ నీకు వందనం!
ముంబాయి: 58 ఏళ్ల వయస్సులో ముంబాయి మేయర్ కిషోరీ పెడ్నేకర్ 18 సంవత్సరాల తరువాత తిరిగి నర్స్ డ్రెస్ వేసుకున్నారు. సోమవారం బీవైఎల్ నైర్ హాస్పటల్ని సందర్శించిన కిషోరీ తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారిలో స్ఫూర్తి నింపడానికి తానను మళ్లీ నర్స్‌గా పనిచేయాలనుకుంటున్నట్లు కిషోరీ తెలిపారు. ప్రతి రోజు మూడు గంటల పాటు కరోనా రోగులకు సేవలందిస్తూ ఆమె విధులు నిర్వర్తించనున్నారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కరోనాపై పోరాటంలో అందరూ చేతులు కలపాలని పిలుపినిచ్చారు. ఈ నేపథ్యంలోనే నేను మళ్లీ నర్స్‌గా పనిచేసి కరోనా రోగులకు సేవలందించడానికి ముందుకు వచ్చాను. ఇది కొంచెం ప్రమాదంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇలాంటి సమయంలో భయంతో విధుల నుంచి తప్పుకోవడంలో అర్థం లేదు. నాకు చాలా మంది నర్సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ పిల్లల్ని కోవిడ్-19 విధుల్లో వేయ్యొద్దు అని అడుగుతున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. ఈ వృత్తి అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. ఈ వృత్తిలో ఉన్న వారు హెచ్ఐవి, టీబీ లాంటి రోగులకు కూడా సేవలందిస్తారు. అది కూడా ప్రమాదకరమే. కానీ ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు రిస్క్ చేయక తప్పదు అని చెప్పాను’ అని కిషోరీపేర్కొన్నారు. మూడుసార్లు ముంబాయి మేయర్‌గా గెలిచిన కిషోరీ రాజకీయాల్లోకి రాకముందు 16 సంవత్సరాలు నర్స్‌గా పనిచేశారు. 24 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్రలోని రాయ్‌ఘర్‌లో నర్స్‌గా కేరీర్ మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి వెళ్లినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఇలా నర్స్‌గా మారడంతో అందరూ కిషోరీని అభినందిస్తున్నారు. (‘మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి’) -
జర్నలిస్టులను కలిసిన మేయర్.. దాంతో..
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ పడ్నేకర్ సోమవారం స్వీయ నిర్భంధలోకి వెళ్లారు. ముంబైలో కొంతమంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 14 రోజుల పాటు ఆమె ఇంటి నుంచే పనిచేయనున్నారు. మేయర్ నివాసాన్ని మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేశారు. మరోవైపు ఇద్దరు బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి కూడా కరోనా సోకింది. (చదవండి: ఏప్రిల్ 23న బ్లాక్‌డేనా?) ‘గత ఐదురోజులుగా నేను కలిసిన కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలింది. అందుకే నేను స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నా. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నాకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ 14 రోజులపాటు అందరికీ దూరంగా ఉంటాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని పడ్నేకర్ పేర్కొన్నారు. కాగా, ముంబై వ్యాప్తంగా 167 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక ముంబైలో 2985 కేసులు నమోదు కాగా.. 131 మరణాలు సంభవించాయి. మరోవైపు 4,203 కేసులు, 223 మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. (చదవండి: టిక్‌టాక్ వీడియోకు లైక్స్ రాలేదని బలవన్మరణం..) -
శివసేన మరో ‘విజయం’..
సాక్షి, ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ముందుగా ఊహించినట్టుగానే శివసేన తన పట్టును నిలుపుకుంది. మేయర్ పీఠంతోపాటు డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. ముంబై మేయర్ శివసేన సీనియర్ మహిళా కార్పొరేటర్ కిషోరి పెడ్నేకర్, డిప్యూటీ మేయర్‌గా అడ్వొకేట్ సుహాస్ వాడ్కర్‌లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో శివసేననే మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రకటించిన రిజర్వేషన్ ప్రక్రియలో ముంబై మేయర్ పదవి ఓపెన్ కేటగిరీలోకి వచ్చింది. దీంతో అనేక మంది ప్రయత్నించినప్పటికీ చివరికి శివసేన తరఫున మేయర్ పదవికి కిషోరి పెడ్నేకర్, డిప్యూటీ మేయర్ పదవికి సుహాస్ వాడ్కర్ సోమవారం నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో శివసేనకే మేయర్ పదవి ఖాయమైంది. అయితే శుక్రవారం అధికారికంగా కిషోరి పెడ్నేకర్, సుహాస్ వాడ్కర్‌లు ఏకగ్రీవంగా విజయం సాధించినట్టు ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత ఏకగ్రీవం... ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 50 ఏళ్ల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందించిన వివరాల మేరకు 1888లో స్థాపించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 50 ఏళ్ల కిందట ఏకగ్రీవంగా ఎన్నుకోగా మళ్లీ 2019లో మేయర్ డిప్యూటీ మేయర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. ముంబై మేయర్‌గా కిషోరి పెడ్నెకర్, డిప్యూటి మేయర్‌గా సుహాస్ వాడ్కర్‌లు ఎంపికైన తర్వాత స్వయంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్యా ఠాక్రేలు ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ వారిద్దరికీ అభినందనలు తెలిపారు. నర్స్ నుంచి మేయర్‌గా.. ముంబై మేయర్‌గా ఎంపికైన శివసేన సీనియర్ కార్పొరేర్ కిషోరి పెడ్నేకర్ రాజకీయ పయనం వినూత్నంగా సాగింది. ముఖ్యంగా ఓ ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహించే ఆమె రాజకీయాల్లోకి రావడమే కాకుండా దేశంలోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకున్నారు. కిషోరి పెడ్నేకర్ తండ్రి మిల్లు కార్మికునిగా పనిచేసేవారు. అయితే వివాహం అనంతరం నావాశేవాలోని ఓ ఆసుపత్రిలో ఆమె నర్స్‌గా చేరింది. ఇలా నర్స్‌గా విధులు నిర్వహిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది. అదే సమయంలో శివసేనలో చేరిన ఆమె లోయర్ పరేల్, వర్లీ పరిసరాల్లో పనులు చేయడం ప్రారంభించింది. 2002లో కార్పొరేటర్‌గా... శివసేనలో ప్రారంభంలో చిన్న చిన్న పదవులతో ప్రారంభమైన కిషోరి పెడ్నేకర్ పయనం కార్పొరేటర్ ఎన్నికల వరకు చేరింది. మొదటిసారిగా ఆమె 2002లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అనంతరం 2019లో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇలా ఆమె బీఎంసీలో అత్యున్నత పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్లీ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన శివసేన యువనేత గెలుపులో కిషోరి పెడ్నెకర్ తనదైన ముద్రను వేసుకున్నారు. దీంతోనే ఆమెకు ఈ పదవి లభించిందని కూడా ఊహాగానాలు వస్తుండటం కొసమెరుపు. -
ముంబై మేయర్‌గా విశ్వనాథ్ మహదేశ్వర్
-
ముంబై మేయర్‌గా విశ్వనాథ్ మహదేశ్వర్
ముంబై: ముంబై మేయర్ పదవిపై సందిగ్ధతకు తెరపడింది. బీజేపీ మద్దతుతో శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) మేయర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల సందర్భంగా విడిగా పోటీచేసిన ఇరుపార్టీలు మళ్లీ ఏకమయ్యాయన్న సంకేతాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ లోకారేను 171–31 ఓట్ల తేడాతో ఓడించిన మహదేశ్వర్ ముంబైకి 76వ మేయర్ కానున్నారు. శివసేనకే చెందిన హేమంగి వోర్లికర్ ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. -
‘ముంబయి కొత్త మేయర్ ఈయనే’
ముంబయి: ఆసియాలోని అత్యంత ధనికవంతమైన నగర పాలక సంస్థ బృహణ్ముంబయికి కొత్త మేయర్ వచ్చేశాడు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన శివసేన పార్టీ తన మేయర్ అభ్యర్థిగా విశ్వనాథ్ మహదేశ్వర్ను ప్రకటించింది. దీనికి బీజేపీ కూడా చేతులెత్తి మద్దతు తెలపడంతో ఇక ఆయన కొత్త మేయరగా అవతరించారు. దీంతో మరోసారి బీజేపీ, శివసేనల మధ్య స్నేహం చిగురించినట్లయింది. ముంబయి నగర పాలక సంస్థకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివసేన ముంబయిలో విజయం సాధించినప్పటికీ దాదాపు దానికి దగ్గరగా బీజేపీ కూడా సీట్లు గెలుచుకుంది. అయితే, మేయర్ స్ధానం కోసం పోటాపోటీ పరిస్థితి ఉంటుందని, ప్రభావాలకు గురిచేసి బీజేపీ తన వైపు మద్దతుదారులను పెంచుకునే అవకాశం ఉందని భావించినా అలాంటిదేం జరగలేదు. తన పార్టీ తరుపున మేయర్ అభ్యర్థిని నిలపడంలేదని, తాము శివసేనకు మద్దతిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం శివసేన మేయర్ అభ్యర్థి విశ్వనాథ్‌కు మద్దతిచ్చారు. దీంతో ఆయన కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. -
మేయర్ పదవే కాదు సీఎం పీఠం కూడా మాదే
ముంబై: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై మేయర్ తో పాటు తర్వాతి ముఖ్యమంత్రి కూడా శివసేనకు చెందినవారే అవుతారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో (బీఎంసీ) శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 84 సీట్లను గెల్చుకోగా, బీజేపీ 82 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 227 కార్పొరేటర్ స్థానాలు ఉండే బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ రాలేదు. శివసేన థానెలోనూ అతిపెద్ద పార్టీగా నిలవగా, మిగిలిన 8 కార్పొరేషన్లలో బీజేపీ హవా నడిచింది. బీఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలవడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు, తమ పార్టీ మరో వైపు నిలిచిందని, అయినా తామే నెంబర్ వన్ స్థానంలో నిలిచామని చెప్పారు. ముస్లింలు కూడా తమకే ఓట్లు వేశారని, ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంలో బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. చాలా చోట్ల తమ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాతి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన వ్యక్తి అవుతారని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వివాదాలతో స్నేహం
ముంబై: ఎప్పుడూ వివాదాల్లో ఉండే ముంబై మేయర్ స్నేహల్ అంబేకర్ ఇప్పుడు మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. నగరంలోని రోడ్ల పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ముంబై మున్సిపల్ కమిషనర్ అజోయ్ మెహతాకు ఆమె రాసిన రహస్య లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. తాను రాసిన లేఖపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని అంబేకర్.. ఆసలు ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాలిని కోరారు. ‘ఆ లేఖ రహస్యంగా రాసింది. మరి అది ఎలా బయటికొచ్చింది. దీనిపై దర్యాప్తు జరగాలి’ అని స్నేహాల్ డిమాండ్ చేశారు. కాగా దీనిపై సొంత పార్టీ నుంచే గాక అన్ని వైపుల నుంచి స్నేహాల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవ లేమి వల్లే ఆమె ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. స్నేహాల్ను పదవి నుంచి తప్పించేందుకు సేన నాయకులు ప్రయత్నించినప్పటికీ, ఆమె మేయర్‌గానే కొనసాగుతానని భీష్మించుకుని కూర్చున్నారు. మేయర్ పదవి నిర్వర్తించేంత బలమైన నేత లేకపోవడం, బీజేపీతో సత్సం బంధాలు లేకపోవడంతో సేన ఏం చేయలేకపోతోంది. దూరంగా ఉంటే మంచిది.. కాగా, వివాదాలకు దూరంగా ఉండాలంటూ అంబేకర్‌కు మాతోశ్రీ నుంచి మందలింపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఇదే పరిస్థితిని స్నేహాల్ కొనసాగిస్తే.. త్వరలోనే మేయర్ పదవి ఇంకొకరికి అప్పజెప్పాల్సి వస్తుంది’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ‘మేం మేయర్‌ను మార్చాలని అనుకుంటున్నాం. కానీ ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా కుదరదు. బీజేపీతో సంబంధాలు అంతంతమాత్రమే. ఈ వివాదాలను ఎత్తి చూపి వారు లబ్ధి పొందాలనుకుం టున్నారు. అందుకే ప్రస్తుతం ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపో తున్నాం. మరో ప్రత్యామ్నాయం లేదు. ఆమెను కొనసాగిం చడమే’ అని ఓ సేన సీనియర్ నేత అన్నారు. బీఎంసీ చరి త్రలో ఏ ఒక్క మేయర్ కూడా ఇన్ని వివాదాల్లో చిక్కుకోలేదు. అది కూడా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పే తలెత్తడం గమనార్హం. ఒక వేళ మేయర్‌గా అంబేకర్‌ను కొనసాగించాలని సేన అధినాయకత్వం భావిస్తే.. 2017 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే వరకు ఆమె కొనసాగుతారు. ఇదీ స్నేహాల్ ప్రస్థానం శివసేన నేత సూర్యకాంత్ సతీమణి అయిన స్నేహాల్, 1996లో పార్టీలో చేరారు. 2012లో లోయర్ పరేల్ నుంచి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముంబై మేయర్ పదవి ఎస్సీలకు రిజర్వయ్యింది. యామిణి జాదవ్, భారతి బౌడానే కార్పొరేటర్లతో పాటు స్నేహాల్.. మేయర్ పదవికి పోటీ పడగా, అంబేకర్‌ను పదవి వరించింది. ఇవీ వివాదాలు.. నెల రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి దుమారం రేపారు. తనకు కేటాయించిన ప్రభుత్వ కారుకు ఎర్ర బుగ్గను తొలగించేందుకు నిరాకరించారు. ముంబై నగరానికి తాను ముఖ్యమంత్రి లాంటి దాన్నని వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా శివాజీ పార్క్‌లోని తన అధికారిక నివాసంలో బాలీవుడ్ గీతాలకు నృత్యం చేసి మరో మారు వివాదంలో చిక్కుకున్నారు. డెంగీ వ్యాధి వ్యాప్తి గురించి మీడియా ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్
ముంబై: శివసేన నాయకురాలు, ముంబై నగర మేయర్ స్నేహాల్ ఆంబేకర్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో ఆమె పోల్చారు.' నరేంద్ర మోదీ అంటే నాకు గౌరవం. అయితే అది కొంతవరకే. హిట్లర్ లా ఆయన పరిపాలన సాగుతోంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని ఓ ఇంటర్వ్యూలో స్నేహాల్ అన్నారు. ముంబై మహానగరానికి మొదటి దళిత మహిళా మేయర్ గా గతేడాది బాధ్యతలు చేపట్టిన స్నేహాల్ కారుపై ఎర్రబుగ్గ(బీకన్) వివాదంతో పతాక శీర్షికలకు ఎక్కారు. అయితే మేయర్ ఎర్రబుగ్గ కారు వినియోగించడంలో తప్పేమి లేదని పునరుద్ఘాటించారు. కేంద్రం, మహారాష్ట్రలో మిత్రపక్షాలు ఉన్న బీజేపీ, శివసేన మధ్య పరస్పర విసుర్లు కొనసాగిస్తున్నానే ఉన్నాయి. -
ఎర్రబుగ్గపై ఎంత మోజో!
సాక్షి, ముంబై: మేయర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన స్నేహల్ అంబేకర్‌కు విధినిర్వహణ కంటే ఎర్రబుగ్గ వాహనం, తన కార్యాలయ అలంకరణపై మోజు ఎక్కువంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు ఆమె తన చాంబర్లోకి వచ్చారు. తన పదవీ బాధ్యతలేంటో తెలుసుకోవాల్సి ఉండగా, అదేం పట్టించుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారు. క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ చాలా సేపు గడిపారు. అంతేగాక ప్రభుత్వం అందజేసిన కారుపై ఎర్రబుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టారు. తదనంతరం ఉద్యోగులతో మాటామంతి అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరబాదరగా వెళ్లిపోయారు. తన కారుపై ఎర్రబుగ్గా కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో అంతా విస్తుపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వాళ్లు వాహనాలపై ఎర్రబుగ్గ అమర్చుకోకూడదు. దీన్ని కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మేయర్లందరికీ లిఖితపూర్వక ఆదేశాలు జారీచేసింది. ఇదివరకు మేయర్ పదవిలో కొనసాగిన సునీల్ ప్రభు ‘మేయర్ పదవి’ ఒక ప్రతిష్టాత్మకమైనదని, తాను నగర ప్రథమ పౌరుడినని పేర్కొంటూ ఎర్రబుగ్గ తొలగించలేదు. ఇదే వాహనాన్ని నూతన మేయర్ స్నేహల్ ఆంబేకర్కు అప్పగించాక, పాత పద్ధతే కొనసాగించాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అక్కడున్న కొందరు విలేకరులు గుర్తు చేశారు. నగర ప్రథమ పౌరురాలిని కాబట్టి అధికారిక వాహనంపై ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని అన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, స్నేహల్ వంటి వారిని చూసి ఇతరులు కూడా తమ వాహనాలపై బుగ్గ అమర్చుకుంటారని మున్సిపల్ అధికారులు విమర్శిస్తున్నారు. -
బీఎంసీ కొత్త మేయర్ స్నేహల్
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 73వ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ స్నేహల్ అంబేకర్ మంగళవారం ఎన్నికయ్యారు. ఇక బీజేపీకి చెందిన అల్కా కేర్కర్ ను ఉప మేయర్ పదవి వరించింది. భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) మాజీ ఉద్యోగి అయిన స్నేహల్ నగరంలోని జీ-సౌత్ (పరేల్) వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత మేయర్ సునీల్ ప్రభు పదవీకాలం ముగియడంతో మంగళవారం ఉదయం బీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిపారు. బీఎంసీలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 226 కాగా స్నేహల్‌కు అనుకూలంగా 121 మంది ఓటు వేశారు. ఈ పదవికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీపడిన డాక్టర్ ప్రియతమకు కేవలం 64 ఓట్లే పడ్డాయి. ఇక డిప్యూటీ మేయర్‌గా అల్కా కేర్కర్ ఎన్నికయ్యారు.