మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్ | Mumbai mayor compares Narendra Modi with Adolf Hitler | Sakshi
Sakshi News home page

మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్

Published Mon, Jul 20 2015 1:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్

మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్

ముంబై: శివసేన నాయకురాలు, ముంబై నగర మేయర్ స్నేహాల్ ఆంబేకర్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో ఆమె పోల్చారు.' నరేంద్ర మోదీ అంటే నాకు గౌరవం. అయితే అది కొంతవరకే. హిట్లర్ లా ఆయన పరిపాలన సాగుతోంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని ఓ ఇంటర్వ్యూలో  స్నేహాల్ అన్నారు.

ముంబై మహానగరానికి మొదటి దళిత మహిళా మేయర్ గా గతేడాది బాధ్యతలు చేపట్టిన స్నేహాల్ కారుపై ఎర్రబుగ్గ(బీకన్) వివాదంతో పతాక శీర్షికలకు ఎక్కారు. అయితే మేయర్ ఎర్రబుగ్గ కారు వినియోగించడంలో తప్పేమి లేదని పునరుద్ఘాటించారు. కేంద్రం, మహారాష్ట్రలో మిత్రపక్షాలు ఉన్న బీజేపీ, శివసేన మధ్య పరస్పర విసుర్లు కొనసాగిస్తున్నానే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement