వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది.
జన్మదిన కానుక..
అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్‌కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?
Comments
Please login to add a commentAdd a comment