wrist watch
-
డైరెక్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఎన్ని లక్షలో తెలుసా?
సాధారణంగా సినిమా విడుదలై, అది హిట్ కొట్టిన తర్వాత సదరు దర్శకులకు ఖరీదైన బహుమతులని నిర్మాతలు ఇస్తుంటారు. 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీకవర్మకు అలానే రీసెంట్గా బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్ మాత్రం తన సినిమా విడుదలకు చాలా నెలల ముందే దర్శకుడు శంకర్‌ని సర్ప్రైజ్ చేశాడు. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన కమల్ హాసన్‌కు 'విక్రమ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని ఇచ్చింది. దీంతో అదే ఊపుతో 'ఇండియన్ 2' చేస్తున్నాడు. 2001లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగులోనూ 'భారతీయుడు' పేరుతో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు తీస్తున్న రెండో భాగంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) అందుకు తగ్గట్లే సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాల్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఈ క్రమంలోనే దాదాపు రూ.8.77 లక్షల విలువైన పనేరాయ్ ల్యూమినార్ చేతివాచీని శంకర్ కి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. గతంలో సూర్యకి రోలెక్స్ ఇచ్చిన కమల్.. ఇప్పుడు శంకర్ కి పనేరాయ్ ఇచ్చారు. నెక్స్ట్ నాగ్ అశ్విన్ ఏం వాచ్ ఇస్తారో ఏంటో? 'ఇండియన్ 2 సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ని ఈరోజే చూశాను. శంకర్ కు నా అభినందనలు. ఈ చిత్రం మీ అత్యుత్తమ పని కాకూడదు. మీ క్రియేటివ్ లైఫ్ లో ఇది హైయస్ట్ స్టేజ్. అందుకే దీన్ని తలకు ఎక్కించుకుని గర్వపడొద్దని నా సలహా. ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా' అని కమల్ హాసన్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B — Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023 (ఇదీ చదవండి: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) -
వేలంలో రూ.కోట్లు పలికిన ‘హిట్లర్’ వాచ్.. ఎంతంటే?
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. జన్మదిన కానుక.. అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్‌కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా? -
సీఎంకు ఆ వాచీ ఎలా వచ్చిందో తేల్చండి
ఏసీబీకి తొలి ఫిర్యాదు ఫిర్యాదు చేసిన న్యాయవాదులు బెంగళూరు: స్వపక్షంలోని నేతలతో పాటు విపక్షాలు, సాధారణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా అవినీతిని అరికట్టడానికి అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెల 14న ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ)కు శనివారం మొదటి ఫిర్యాదు అందింది. అయితే ఏసీబీని ఏర్పాటు చేసి పదహేను రోజులైనా ఆ సంస్థకు కార్యాలయం లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోకాయుక్తను మూసివేసే చర్యల్లో భాగంగా ఏసీబీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సీఎం స్థానంలోని ముఖ్యమంత్రికి దాదాపు రూ.75 లక్షల విలువైన వాచ్ గిఫ్ట్‌గా వచ్చిన విషయమై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. దీని వెనక పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దర్యాప్తు చేయాల్సింది.’ అని లిఖిత పూర్వకంగా కోరుతూ న్యాయవాదులైన అమృతేష్, నటరేశ్ శర్మలు ఖనిజభవన్కు వచ్చారు. ఈ విషయమై అమృతేష్ మీడియాతో మాట్లాడుతూ...‘ రాష్ట్ర హైకోర్టు కూడా ఏసీబీ అవసరం ఏమిటని తలంటింది. అసలు ఏసీబీ కార్యాలయం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. బెంగళూరులోని ఖనిజభవన్లో ఏసీబీ కార్యాలయం ఉందని సామాన్య ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును అందజేయవచ్చునని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొణ్ణన్న సమాధానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందువల్లే మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఏసీబీ కార్యాలయమే కాక ఏసీబీ కోసమంటూ ప్రభుత్వం నియమించిన అధికారి ఒక్కరూ లేరు. ఇలా అయితే అవినీ పై దర్యాప్తు ఎలా సాగుతుంది. లోకాయుక్త ఉన్నప్పుడు ఏసీబీ అవసరమేలేదు’ అని పేర్కొన్నారు. అనంతరంనృపతుంగ రోడ్డులోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో తమ ఫిర్యాదును అందజేశారు.