సాధారణంగా సినిమా విడుదలై, అది హిట్ కొట్టిన తర్వాత సదరు దర్శకులకు ఖరీదైన బహుమతులని నిర్మాతలు ఇస్తుంటారు. 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీకవర్మకు అలానే రీసెంట్‌గా బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్ మాత్రం తన సినిమా విడుదలకు చాలా నెలల ముందే దర్శకుడు శంకర్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన కమల్ హాసన్‌కు 'విక్రమ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని ఇచ్చింది. దీంతో అదే ఊపుతో 'ఇండియన్ 2' చేస్తున్నాడు. 2001లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగులోనూ 'భారతీయుడు' పేరుతో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు తీస్తున్న రెండో భాగంపైనా మంచి అంచనాలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)
అందుకు తగ్గట్లే సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాల్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఈ క్రమంలోనే దాదాపు రూ.8.77 లక్షల విలువైన పనేరాయ్ ల్యూమినార్ చేతివాచీని శంకర్ కి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. గతంలో సూర్యకి రోలెక్స్ ఇచ్చిన కమల్.. ఇప్పుడు శంకర్ కి పనేరాయ్ ఇచ్చారు. నెక్స్ట్ నాగ్ అశ్విన్ ఏం వాచ్ ఇస్తారో ఏంటో?
'ఇండియన్ 2 సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ని ఈరోజే చూశాను. శంకర్ కు నా అభినందనలు. ఈ చిత్రం మీ అత్యుత్తమ పని కాకూడదు. మీ క్రియేటివ్ లైఫ్ లో ఇది హైయస్ట్ స్టేజ్. అందుకే దీన్ని తలకు ఎక్కించుకుని గర్వపడొద్దని నా సలహా. ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా' అని కమల్ హాసన్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh
— Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023
இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B
(ఇదీ చదవండి: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!)
Comments
Please login to add a commentAdd a comment