Alexander
-
రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదలచేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు. మొత్తం 11 మంది విడుదల ఫోగెల్ విడుదల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు. రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్‌ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు. -
యంగెస్ట్ బిలియనీర్.. తర్వాతి ఎలాన్ మస్క్ ఇతడేనా?
మనం ఎందరో మిలియనీర్లు, బిలియనీర్ల గురించి తెలుసుకున్నాం.. కొందరు ఉన్నత వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందినవారైతే.. ఎటువంటి నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఎదిగినవారు మరికొందరు. 25 ఏళ్ల వయస్సులో స్థిరమైన సంకల్పం, మేధస్సుతో బిలియనీర్ అయ్యాడు అలెగ్జాండర్ వాంగ్. సాంప్రదాయ విద్య పరిమితులను అధిగమించి ఆవిష్కరణ శక్తితో సాంకేతిక ప్రపంచంలో ఎదిగి బిలియనీర్‌గా అవతరించిన ఇతన్ని తదుపరి ఎలోన్ మస్క్‌గా పిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచే గణితంలో విశేషమైన ప్రతిభ ఉన్న అలెగ్జాండర్ వాంగ్ గణిత, కోడింగ్ పోటీలలో పాల్గొనడానికి ఇష్టపడేవాడు. 25 ఏళ్ల వయసులో 2022వ సంవత్సరంలో వాంగ్ ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా అవతరించాడు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా వాంగ్ స్థాపించిన ‘స్కేల్ ఏఐ’ సంస్థ అమెరికా వైమానిక దళం, సైన్యానికి ఆర్టిఫీషియల్ వినియోగంలో సహకారం అందిస్తోంది. దీనికి సంబంధించి 110 మిలియన్ డాలర్ల విలువైన మూడు ఒప్పందాలను ఆ సంస్థ కలిగి ఉంది. చిన్న వయసు నుంచే.. అలెగ్జాండర్ వాంగ్ తల్లిదండ్రులు భౌతిక శాస్త్రవేత్తలు. యూఎస్ మిలిటరీ ఆయుధాల ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. వాంగ్ విద్యార్థిగా ఉన్నప్పుడే కెరియర్ను ప్రారంభించాడు. 17 ఏళ్ల వయసులో తోటి విద్యార్థులు ఉన్నత సిద్ధమవుతున్న సమయంలో వాంగ్.. అడేపర్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అదే సంవత్సరం 2014లో కోరా సంస్థకి మారాడు. అక్కడ అతను టెక్, స్పీడ్ లీడ్‌గా పనిచేశాడు. కాలేజీ డ్రాపౌట్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ (మిట్)లో బీఎస్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేసిన వాంగ్ మొదటి సంవత్సరం పూర్తయ్యాక చదువును, హడ్సన్ రివర్ ట్రేడింగ్‌లో చేస్తున్న అల్గారిథమ్ డెవలపర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి స్నేహితుడు వాంగ్ లూసీ జియోతో కలిసి ‘స్కేల్ ఏఐ’ కంపెనీని ప్రారంభించాడు. కోరాలో పనిచేస్తున్నప్పుడు వాంగ్, జియో కలుసుకున్నారు. యూఎస్ స్టార్టప్ యాక్సిలరేటర్ వై కాంబినేటర్ నుంచి పెట్టుబడితో ‘స్కేల్ ఏఐ’ని స్థాపించారు. వేసవి సెలవుల్లో భాగంగా ఈ స్కేల్ ఏఐని స్థాపించినట్లు తన తల్లిదండ్రులకు చెప్పినట్లుగా వాంగ్ ఫోర్బ్స్తో తెలిపాడు. అయితే అనుకోకుండా తాను మళ్లీ కాలేజీకి వెళ్లలేక పోయానని పేర్కొన్నాడు. వాంగ్ కంపెనీ 2021లో 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. ఈ ఆర్థిక తోడ్పాటుతో మరింత ఎదిగిన స్కేల్ ఏఐ కంపెనీ 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ సంస్థ విలువను 7.3 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. ప్రస్తుతం అలెగ్జాండర్ వాంగ్ నికర సంపద విలువ 1 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. Today, @scale_AI is launching our 2 major platforms to bolster government and enterprise: 🎖 Scale Donovan, the AI copilot for defense 🏙 Scale EGP, full-stack generative AI for global enterprise 👇 See Donovan in action below 🧵 on our platforms and why they are so critical pic.twitter.com/RcdtnL0Btj — Alexandr Wang (@alexandr_wang) May 10, 2023 ఇదీ చదవండి: Virji Vohra: బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి గురించి తెలుసా? -
ఆస్పత్రిలో చేరిన బెలారస్ అధ్యక్షుడు..పుతిన్‌తో సమావేశం తర్వాతే..
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని కలిసిన తర్వాతే ఆస్పత్రిలో చేరినట్లు వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ లుకాషెంకో మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ బెలారస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వాలెరీ సెప్కలో ఓ టెలీగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. అంతేగాదు లుకాషెండో పుతిన్‌తో సమావేశం అనంతరం అత్యవసరంగా మాస్కోలోని ఆస్పత్రిలో చేరారని, అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వాలేరీ. ఐతే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల అతనిని తీసుకువచ్చేలా వైద్య నిపుణలతో సహా అధికార బృందాన్ని పంపినట్లు తెలిపారు. అక్కడ లుకాషెంకోపై మాస్కో విషప్రయోగం జరిపినట్లు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నట్లు కూడా వివరించారు వాలేరీ. అందువల్ల తాము అతనని సతర్వరమే రక్షించేలా అన్ని రకాల వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటున్నట్లు వాలేరీ పేర్కోన్నట్లు అమెరికా వీక్లీ న్యూస్ తెలిపింది. నిజానికి మే 9ప మాస్కోలో రెడ్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే వేడుకలో లుకాషెంకో కనిపించిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడం మొదలైంది. ఐతే లుకాషెంకో వాటిని తోసిపుచ్చారు. అంతేగాదు బెలారస్లో వ్యూహాత్మక క్షిఫణుల విస్తరణను లాంఛనప్రాయంగా చేయడానికి లుకాషెంకో ప్రభుత్వంతో రష్యా ఒప్పందం కుదుర్చకున్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల నాయకులు సంతకం చేసినట్లు బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆ రెండు దేశాలు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే సమావేశంలో ఇరు దేశాల నాయకులు సైనిక, రాజకీయ పరిస్థితుల తోపాటు సాంకేతిక సహకార సమస్యలపై చర్చించనట్లు అని బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..) -
మృతి చెందిన పుతిన్ సన్నిహితుడి కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డు
Putin calls murder of ally's daughter 'dastardly crime: రష్యా రాజధాని మాస్కో సమీపంలో కారు బాంబు దాడిలో పుతిన్ సన్నిహితుడి కుమార్తె మృతి చెందిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ హత్యను భయంకరమైన హత్యా నేరంగా పిలిచారు. వృత్తిపరమైన విధి నిర్వహణలో తన మిత్రుడు అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగిన్ చూపించిన తెగువ, నిస్వార్థపూరితమైన సేవను ప్రశంసించారు. అంతేకాదు ఆమెకు మరణాంతరం ప్రతిష్టాత్మకమైన దేశ పురస్కార అవార్డును పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అలెగ్జాండర్ డుగిన్ టెలీగ్రామ్ యాప్‌లో...తన కూతురు తన కళ్లముందే అత్యంత పాశవికంగా హత్య చేయబడింది. అయినప్పటికీ తమ హృదాయాలు ప్రతీకార కాంక్షను కోరుకోవు. తమకు కావల్సింది ఉక్రెయిన్ పై గెలుపు. తన కుమార్తె తన భావి జీవితాన్ని విజయ పీఠానికి అంకితం చేసింది. కాబట్టి రష్యా బలగాలు ఇప్పుడైన గెలిచేందుకుకు సిద్ధంకావాలంటూ సందేశం పంపిచారు. తన కూతురు అందమైన ఆర్థోడాక్స్ మహిళ, రష్యా సెంట్రల్ టీవికి యుద్ధం గురించి సమాచారం అందించే టీవీ రిపోర్టర్, తత్వవేత్త అంటూ కూతురు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. అలెగ్జాండర్ రష్యాన్ మాట్లాడే భూభాగాలను ఏకీకృతం చేసేందుకు ఈ హింసాత్మక యుద్ధానికి తెరలేపాడంటూ పలు విమర్శులు ఉన్నాయి. పైగా అతడి కుమార్తె కూడా ఉక్రెయిన్ పై జరుపుతున్న ప్రత్యేక సైనిక చర్యకు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్ స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో రష్యా ఏదైన విధ్యంసక చర్యకు పాల్పడే ప్రమాదం ఉందంటూ బలగాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: పుతిన్‌కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం!) -
పుతిన్ సన్నిహితుడే లక్ష్యంగా కారు బాంబు దాడి.. పాపం ఆయన కుమార్తె
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, ఉక్రెయిన్‌పై యుద్ధం వ్యూహకర్త అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె కారు బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు. పుతిన్ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్ డుగిన్కు పేరుంది. అయితే.. ఈ దాడి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని చేయగా.. అతడి కుమార్తె డార్యా డుగిన్ మరణించినట్లు రష్యా మీడియాలు వెల్లడించాయి. శనివారం రాత్రి మాస్కో శివారు ప్రాంతంలో ఈ కారు బాంబు దాడి జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో డార్యా డుగిన్ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి. అలెగ్జాండర్ కుమార్తె డార్యా డుగిన్‌ను ఉక్రెయిన్ ఉగ్రవాదులే హత్య చేశారని ఆరోపించారు డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అధినేత డెనిస్ పుషిలిన్. ‘అలెగ్జాండర్ డుగిన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించి.. ఆయన కూతురిని హత్య చేశారు ఉక్రెయిన్ ప్రభుత్వ ఉగ్రవాదులు. ఆమె నిజమైన రష్యా యువతి.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. డార్యా తన కారులో ఇంటికి బయల్దేరగా.. మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు సంభవించింది. దాడిలో ధ్వంసమైన కారు వాస్తవానికి అలెగ్జాండర్‌ది. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అలెగ్జాండర్ వాదన కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్ బాగా ప్రభావితం చేశారు. ఆయన కుమార్తె కూడా రచయిత. కొద్ది రోజుల క్రితం అమెరికా ట్రెజరీస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ ఆంక్షల జాబితాలో డార్యా కూడా ఉన్నారు. ⭕️🇷🇺#Russia: Alexander #Dugin at the scene pic.twitter.com/oyHMxnVHkc — 🅻-🆃🅴🅰🅼 (@L_Team10) August 20, 2022 ఇదీ చదవండి: Russia - Britain: రష్యాకు ఆ నైతిక హక్కు లేదు.. జెలెన్స్కీ అన్ని విధాల అర్హుడు! -
వేలంలో రూ.కోట్లు పలికిన ‘హిట్లర్’ వాచ్.. ఎంతంటే?
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. జన్మదిన కానుక.. అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్‌కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా? -
CWG 2022: అంగరంగ వైభవంగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
ది గ్రేట్ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది
అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన ఈ పదార్థం ఇప్పుడు ఎమర్జింగ్ బిజినెస్‌గా మారింది. పాకిస్థాన్ మీదుగా ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచి ప్రపంచమంతటికీ విస్తరిస్తోంది. ఆరోగ్యన్ని అందివ్వడంతో పాటు ఆకర్షణీయమైన వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇంతకీ ఆ పదార్థం ఏంటంటే రాక్ సాల్ట్. ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే ఈ ఉప్పు ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగంగా ఉండేది... ఇప్పుడు సైతం భారత్ నుంచే విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అలెగ్జాండర్ దండయాత్ర వరుస దండయాత్రలతో ఎందరో రాజులనీ ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండ్ ది గ్రేట్. దేశం నుంచి అలెగ్జాండ్ భారత్ దేశానికి ఆయన దండెత్తి వచ్చాడు. అప్పటికే ఎందరో రాజులు అలెగ్జాండర్కి వెంటనే తలొగ్గినా భారతరాజు పురుషోత్తమ్ ఓటమిని అంగీకరించక యుద్ధానికి సై అన్నాడు. దీంతో అప్పడి అఖండ భారత్‌లో భాగమై ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కేవ్రా కొండల్లో అలెగ్జాండర్ సైనిక శిబిరం బస చేసింది. స్వయంగా యుద్ధంలో పాల్గొన్న అలెగ్జాండర్ సైతం అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అలెగ్జాండర్కి ఎంతో ప్రీతిపాత్రమైన ఆయన గుర్రం అదే పనిగా అక్కడున్న బండరాళ్లను నాకడం అక్కడున్న అందరినీ ఆకర్షించింది. రాజుగారి గుర్రానికి ఏమైందా అని అంతా ఆరా తీశారు. చివరకు ఆ బండరాళ్లు ఉప్పును పోలిన రుచి ఉన్నట్టు గమనించారు. యుద్ధం ముగించి తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఆ ఉప్పు రాళ్లను తీసుకెళ్లి మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. బ్రిటీషర్ల రాకతో క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ దండయాత్రల తర్వాత మళ్లీ రాక్‌సాల్ట్ వ్యాపారం మరుగున పడిపోయింది. అయితే 16వ శతాబ్ధంలో ఇండియాలోకి అడుగు పెట్టిన ఆంగ్లేయుల కన్ను ఈ రాక్‌సాల్ట్‌పై పడింది. దీంతో 1870లో బ్రిటీషర్ల ద్వారా రాక్‌సాల్ట్ మరోసారి ప్రపంచ ఉనికిలోకి వచ్చింది. అయితే దేశ విభజన తర్వాత ఉప్పు రాళ్లను కలిగిన కేవ్రా కొండలు పాకిస్థాన్ వశమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ సముద్ర ఉప్పుని ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెరగడానికి తోడు ఆయుర్వేద శాస్త్రంలో రాక్‌సాల్ట్ ప్రత్యేకతలు విపులంగా ఉండటం వల్ల వ్యాపారులు మరోసారి రాక్‌సాల్ట్‌పై ఫోకస్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హిమాలయన్ బ్రాండ్ పేరుతో రాక్సాల్ట్ని అమెజాన్ వేదికగా 2009లో ఇంగ్లాండ్‌లో అమ్మకానికి ఉంచారు. రుచితో పాటు ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉండటం.. మార్కెటింగ్ టెక్నిక్ తోడవడంతో ఇప్పుడీ ఉప్పుకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇంగ్లాండ్ నుంచి క్రమంగా యూరప్, అమెరికా, ఏషియా దేశాలకు విస్తరించింది. మన దగ్గర 900 గ్రాముల ఉప్పు ప్యాకెట్ ధర రూ. 300లుగా ఉంది. అదే సాధారణ ఉప్పు ఎంత మంచి క్వాలిటీది అయినా కేజీ రూ.30 లోపే ఉంటుంది. పాకిస్తాన్ టూ ఇండియా కేవ్రా పర్వతాలు పాకిస్తాన్లో ఉన్నా అక్కడ మైనింగ్ చేయడం తప్పితే దాన్ని ప్రాసెస్ చేసి అందమైన డిజైన్లుగా, రాక్సాల్ట్గా మార్చే పరిశ్రమలు లేవు. దీంతో కేవ్రా పర్వతాల్లో ఉప్పుని భూగర్భం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లుగా బయటకు తీసి సైజులుగా కట్ చేసి ఇండియాకి ఎగుమతి చేస్తుంటారు. టన్ను రాక్ సాల్ట్‌కి 40 డాలర్ల వంతున పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఈ ఉప్పు చేరుతుంది. ఇక్కడ ప్రాసెస్ చేసి టన్నుకి 300 డాలర్ల వంతున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పుల్వామా దాడి.. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఈ ఉప్పుని ఇండియాకి ఎగుమతి చేయోద్దంటూ ప్రచారాలు జరిగాయి. ఆరోగ్యం, ఆకర్షణ సాధారణ ఉప్పుతో పోల్చితే రాక్‌సాల్ట్‌తో లవణాలు అధికం. రాక్సాల్ట్లో 98 శాతం సోడియం క్లోరైడ్ ఉండగా మెగ్నీషియం, పోటాషియం, కాల్షియం వంటి మినరల్స్ ఉన్నాయి. దీంతో రాక్‌సాల్ట్ మిగిలిన ఉప్పు లాగా తెల్లగా కాకుండా గులాబీ రంగులో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో ఫుడ్ అండ్ బేవరేజెస్లతో పాటు సాల్ట్ లాంప్స్, బాత్ సాల్ట్, ల్యాంప్స్, గౌర్మెట్ సాల్ట్‌లతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువులుగా దీన్ని మార్చి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో ఈ రాక్సాల్ట్కి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం రాక్‌సాల్ట్ వ్యాపారం వంద కోట్ల రూపాయలకు చేరుకుంది. వేలటన్నులు 4 లక్షల టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి చేస్తున్నారు. కోట్ల ఏళ్ల క్రితం ఒకప్పుడు భూగోళం అంతా సముద్రం ఆవరించి ఉండేది. కోట్ల ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా సముద్ర మట్టం తగ్గిపోతూ భూమి పైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో కేవ్రా కొండల్లోని సముద్రపు నీరు ఉప్పుగా మారిపోయి భూగర్భం అడుగునే రాయి రూపంలో ఉండిపోయింది. సుమారు 600 మిలియన్ ఏళ్ల కిందట ఈ ఉప్పు రాతి కొండలు ఏర్పడినట్టు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వేల ఏళ్ల క్రితమే ఈ ఉప్పు గొప్పతనం గురించి ఆయుర్వేద గ్రంథాల్లో మన మహర్షులు పేర్కొన్నారు. సాక్షి, వెబ్ ప్రత్యేకం -
విశ్వవిజేత
-
అమెజాన్ : కిషోర్ బియానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్ గ్రూపు సీఈఓ కిషోర్ బియానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (బియానీని అరెస్ట్ చేయండి!) రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారతీయ కస్టమర్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాశారు. రిలయన్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. (అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) -
ఒకే ఒక్క పాత్రతో...
విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు తెలుగు చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి ఏకపాత్రాభినయం చేసి, నిర్మించిన సినిమా ‘అలెగ్జాండర్’. ధవళ సత్యం దర్శకుడు. జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా నాకు నాటకాలంటే ప్రాణం. అదే నన్ను సినిమా నటుణ్ణి చేసింది. వన్ మ్యాన్ షో చేద్దామని రచయిత పూసలకు చెబితే ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. వంద నిమిషాల నిడివితో ఉండే కథతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 ప్రదర్శనలు ఇచ్చాను. ఆ కథనే సినిమాగా తీద్దామని ధవళ సత్యం దర్శకత్వంలో నటించాను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించింది ప్రేక్షకులకు చేరువకావడం కష్టం. ఆ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సినిమాను ఎవరైనా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారేమోనని చూస్తున్నాం. రిటైర్డ్ మేజర్ ఒక హెల్ప్‌లైన్ ద్వారా కొందరి సమస్యలను తీర్చడం కథలో కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి ఒక్కడే పాత్రధారి కావడం విశేషం. అయితే వెనక నుంచి వచ్చే కొందరు నటుల మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి’’ అన్నారు ధవళ సత్యం. -
‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’
ఈ రోజుల్లో కామెడీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్టాండప్ కామెడీ షోలను జనాలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది స్టాండప్ కమెడియన్లు పుట్టుకొచ్చారు. అయితే నవ్వించడానికి ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదని అలెగ్జాండర్ బాబు నిరూపించాడు. ఓ పాట.. దానికి ముందు మాట.. వీటన్నింటి కన్నా ముందు సెలబ్రిటీలు. వీటిని ఆధారంగా చేసుకుని తన మాటలతో కామెడీని పండిస్తున్నాడు. యూట్యూబ్ స్టార్ కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. విమర్శలు, కామెడీ, మ్యూజిక్ అన్నింటి మేళవింపుతో చేసే అతని వీడియోలకు మిలియన్ల వ్యూస్ దక్కుతాయంటే అతని క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేమస్ పర్సనాలిటీస్పై అతను వేసే పంచ్‌లు, సెటైర్లే అతని కామెడీకి ప్రధానాధారం. తమిళ గాయకుడు ఏసుదాసు దగ్గర నుంచి తెలుగు సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వరకు అందరినీ తన కామెడీలో భాగం చేశాడు. అయితే అలెగ్జాండర్ కామెడీ వ్యంగ్యంగానే సాగినా ఎవరి మనోభావాలను నొప్పించకపోవడం గమనార్హం. ఇక తాజాగా అతను ఏసుదాసుకు నివాళిగా అర్పించిన వీడియోలో సింగర్స్‌తోపాటు టాలీవుడ్ ‘లెజెండ్’ బాలయ్యను కూడా వాడుకున్నాడు. మిడ్నైట్ మసాలా హీరోయిన్లు కూడా బాలకృష్ణ స్టెప్పులకు బెంబెలెత్తుతారని పేర్కొన్నాడు. ‘మాస్టర్ ఈ స్టెప్పు చెప్పనేలేదు అని వారు వారించినా అతనికి నచ్చింది చేస్తాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కష్టానికి తగిన న్యాయం చేస్తానంటూ అతనికి నచ్చినట్టుగా డాన్స్‌లు చేస్తాడు’ అని కామెంట్ చేశాడు. దీంతో అతన్ని చూసిన హీరోయిన్లు పారిపోతారు అని జోక్ పేల్చాడు. దీనికి అక్కడి జనం పగలబడి నవ్వినా బాలయ్య అభిమానులు మాత్రం కాస్త హర్ట్ అయ్యారు. అయితే, ఇలా ధైర్యంగా సెలబ్రిటీలపై పంచ్‌లు విసురుతూ కామెడీ చేసి అందులో విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇందుకుగానూ తమిళంలో ప్రముఖ సంస్థ బిహైండ్ వుడ్స్ గోల్డ్ మిక్.. అలెగ్జాండర్‌కు ‘ఇండియాలోనే బెస్ట్ మ్యూజికల్ స్టాండప్ కమెడియన్’ అవార్డు ప్రకటించింది. -
అలెగ్జాండర్ ఒక్కడే
నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు సంపాదించారు జయప్రకాశ్ రెడ్డి. ఆయన ముఖ్య భూమిక పోషించిన చిత్రం ‘అలెగ్జాండర్’. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ పతాకంపై విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ రెడ్డి మాత్రమే నటించటం విశేషం. కొన్ని వందల చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న జయప్రకాశ్ రెడ్డి ఒకే పాత్ర ఉన్న చిత్రంలో హీరోగా నటించిన చిత్రం ఇది. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. -
‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట...
ఈ ‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట. ఎలుగుబంటి దాడిలో గాయపడి.. దాని గుహలో నెలరోజులపాటు ఉండి.. మృత్యుంజయుడిలా బయటపడ్డాడంటూ అలెగ్జాండర్ అనే వ్యక్తి గురించి పాశ్చాత్య మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ‘నన్ను తర్వాత తినడానికి వీలుగా ఇక్కడ దాచి పెట్టి ఉంచింది’ అంటూ అతడు చెప్పాడని తెలిపాయి. అయితే.. అవన్నీ అబద్ధాలని కజకిస్థాన్‌కు చెందిన వైద్యుడు రుస్తుం ఇసేవ్ చెబుతున్నారు. ‘మమ్మీ’లా కనిపించిన అలెగ్జాండర్ అసలు ఫొటో ఇదిగో ఇదేనట. ఇతడు తీవ్రమైన సొరియాసిస్ వ్యాధితోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్నాడట. అందువల్లే అలా అయిపోయాడట. అలెగ్జాండర్ కజకిస్థాన్‌కు చెందినవాడని.. ప్రస్తుతం ఔట్ పేషెంట్ కింద తమ వద్ద చికిత్స తీసుకుంటున్నాడని రుస్తుం తెలిపారు. తమ కుమారుడిని ఎలుగుబంటి దాడి బాధితుడిగా చూపించడం.. మమ్మీ అనడం వంటి వాటి వల్ల అలెగ్జాండర్ తల్లి ఎంతో బాధపడుతున్నారని.. అతడి గురించి మరే వివరాలు వెల్లడించవద్దని తమను కోరారని వివరించారు. చదవండి: ‘మమ్మీ’ మనిషి కథలో కొత్త మలుపు! అలెగ్జాండర్ అసలు ఫొటో.. -
సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టు మృతి
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ (38) టూరిస్ట్ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో పోలీసులు వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అలెగ్జాండర్ చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి చెందిన కెమెరాలోని ఫొటోల ఆధారంగా ఈ నెల 4, 5వ తేదీల్లో సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్లో నివాసం ఉంటున్న అలెగ్జాండర్, ఈ నెల 10 హోటల్ నుంచి ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరుగుతూ కనిపించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్ మృతి చెందాడని, గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. బోరెజ్ వచ్చిన తరువాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రోజు ఏం జరిగింది?
అలెగ్జాండర్ ది గ్రేట్.. జగజ్జేత.. ప్రపంచాన్ని జయించిన మహావీరుడు.. మరి అంతటి వీరాధివీరుడు ఎలా చనిపోయాడు.. ఏదో ఇన్ఫెక్షన్ సోకి అని కొందరు.. తాగుడు అలవాటు వల్ల అని ఇంకొందరు.. అబ్బే.. ఇదేం కాదు.. విషమిచ్చి చంపారని మరికొందరు.. ఎవరేం చెప్పినా.. మొత్తానికి అదో మిస్టరీ అయి కూర్చుంది.. 2,300 ఏళ్లనాటి ఈ మిస్టరీని తాను ఛేదించానని చెబుతున్నారు న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీకి చెందిన పరిశోధకురాలు కేథరీన్ హాల్. అంతేకాదు.. ఇప్పటివరకూ అందరూ చెబుతున్నట్లుగా క్రీ.పూ. 323 జూన్ 10న లేదా 11న అలెగ్జాండర్ చనిపోలేదట. అతడు చనిపోయినట్లు ప్రకటించిన తేదీకి ఆరు రోజుల అనంతరం మరణించాడట. కానీ.. అప్పటి వైద్యుల తప్పుడు నిర్ధారణ వల్ల బతికుండగానే.. అలెగ్జాండర్ చనిపోయినట్లు ప్రకటించారట. సంచలనం రేకెత్తిస్తున్న ఈ అధ్యయనం తాలూకు వివరాలు ‘ది ఏన్షియెంట్ హిస్టరీ బులెటిన్’లో ప్రచురితమయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపింపజేసే ఆ అధ్యయనం తాలూకు వివరాలేంటో చూసేద్దామా.. డాక్టర్ కేథరీన్ హాల్.. ఒటాగో వర్సిటీలోని డ్యూన్డిన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన సీనియర్ లెక్చరర్. ఆమె చెప్పినదాని ప్రకారం.. అలెగ్జాండర్‌కు గులియన్ బారే సిండ్రోమ్ వచ్చింది.. అప్పటికాలంలో కామన్‌గా ఉండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల ఇది ఆయనకు సోకింది. గులియన్ బారే సిండ్రోమ్ అన్నది నరాలకు సంబంధించిన ఓ అరుదైన రుగ్మత. ప్రతి లక్ష మందిలో ఒకరికి వచ్చే అవకాశముంది. దీని వల్ల నాడీ వ్యవస్థపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది.. దాంతో అలెగ్జాండర్ ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. బుర్ర పనిచేస్తుంది కానీ.. మనిషి మాత్రం చచ్చిన శవంలాగ అయిపోయాడు. దీంతో వైద్యులు అలెగ్జాండర్ చనిపోయినట్లు ప్రకటించారు. వాస్తవానికి అతడు బతికే ఉన్నాడు. చనిపోయాడని ప్రకటించిన తేదీ నుంచి ఆరు రోజుల తర్వాత అతను మరణించాడు. ‘అలెగ్జాండర్ మరణంపై వచ్చిన పాత వాదనలన్నీ ఒట్టి ట్రాష్. ఎందుకంటే.. అవి మొత్తం ఎపిసోడ్‌ను వివరించలేదు. అప్పటికాలంలో వైద్యులు మనిషి బతికున్నాడా లేదా అన్నది నిర్ధారించేందుకు శ్వాస ఆడుతోందా లేదా అన్నదే చూసేవారు. పల్స్‌ను పరీక్షించేవారు కాదు.. గులియన్ బారే సిండ్రోమ్ వల్ల ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. దీంతో ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో అవసరం పడేది. దీని వల్ల శ్వాస తీసుకున్నా.. తెలిసీ తెలియనట్లు ఉండేది. అదే అప్పటి తప్పుడు నిర్ధరణకు‘ కారణం’ అని కేథరీన్ తెలిపారు. అంతేకాదు.. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతడి శరీరం కుళ్లకపోవడాన్ని ఆమె గుర్తు చేశారు. ‘దీనికి సంబంధించి చరిత్రలో సరైన వివరణ ఇప్పటికీ లేదు. ఆరు రోజుల వరకూ అతడి శరీరం తాజాగానే ఉంది. దీనికి కారణం అప్పటికీ అలెగ్జాండర్ బతికి ఉండటమే. కాకపోతే.. గ్రీకులు అతడిని దేవుడిగా భావించేవారు. దీంతో ఆ మహిమ వల్లే అలెగ్జాండర్ శరీరం తాజాగా ఉందని నమ్మారు’ అని ఆమె వివరించారు. తన పరిశోధన కొత్త చర్చకు తెరలేపుతుందని.. అవసరమైతే.. చరిత్ర పుస్తకాలను తిరగరాయాల్సి ఉంటుందని కేథరీన్ అంటున్నారు. ఏమోమరి.నిజానిజాలు ఆ అలగ్జాండర్కే ఎరుక. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆఖరివాడు
‘పట్టుకుపోయేదేం లేదు’ అని చెప్పడానికి తన చేతుల్ని పైకే పెట్టించుకుని, దేహాన్ని ఖననం చేయించుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ‘కనులు లేవని నీవు కలత పడవలదు’ అంటూ స్పర్శలిపిని చెక్కి ఇచ్చి, చెక్కిన ఆ చేతులతోనే ఈ ప్రపంచానికి చిరస్మరణీయం అయ్యాడు ‘ఆఖరివాడు’ ది గ్రేట్. చిన్న గ్రామం అది. ఎంత చిన్నదంటే.. ఒక పెద్ద కుటుంబమంత. రెండొందల పదేళ్ల క్రితం ఆ గ్రామ జనాభా ఆరొందల పది. జనాభాను బట్టి చూస్తే ఇప్పటికీ అది చిన్న గ్రామమే. ఐదేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం జనాభా మూడు వేలకు మించి లేదు. ఆరొందల పదిమంది ఉన్న ఆ గ్రామంలో ఆరుగురు మనుషులున్న ఒక కుటుంబం ఉండేది. తల్లి, తండ్రి, నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆఖరి సంతానం మగపిల్లవాడు. గ్రామంలో సారవంతమైన నేలలు, సున్నితమైన పర్వత ప్రాంతాలు, పండ్లతోటలు, వ్యవసాయ క్షేత్రాలు, ద్రాక్ష తోటలు ఉండేవి. వైద్యుడు, మంత్రసాని, దర్జి, తాళాల మనిషి, తాళ్ల మనిషి, కళ్లేల మనిషి ఉండేవారు. ఈ కళ్లేల మనిషి గుర్రాలకు, శునకాలకు తోలు కళ్లేలు తయారు చేస్తుండేవాడు. పైన చెప్పుకున్న ఆరుగురు మనుషుల కుటుంబం ఆయనదే. ఆఖరివాడు ఎప్పుడూ ఆయన్ని అంటుకునే ఉండేవాడు. తల్లిని కదా చంటి పిల్లలు అంటుకుని ఉండేది, ఈ ఆఖరివాడు తన తండ్రిని అంటుకుని ఉండేవాడు. ‘వెళ్లరా అమ్మ దగ్గరికి’ అని చెప్పినా వినకుండా మూడేళ్ల వయసున్న ఆ ఆఖరివాడు తండ్రి దగ్గరే ఉండేవాడు. ఇంటి ప్రాంగణంలోనే ఒక వైపు ఉండేది ఆయన కళ్లేల పరిశ్రమ. తోళ్లను తేలిగ్గా ఒక ఆకృతిలోకి కోసేవాడు. కోసిన తోళ్లను కలిపి మేకులు కొట్టేవాడు. ఇంకా ఏవో హంగులు జత చేశాక అందమైన కళ్లేలు తయారయ్యేవి. ఈ పనులన్నింటినీ ఆఖరివాడు అబ్బురంగా చూస్తూ కూర్చునేవాడు. తండ్రికి కళ్లేలొక్కటే పని కాదు. ముకుతాళ్లు, గుర్రపు జీనులు తయారుచేసేవాడు. ఆ ఒడుపునంతా దగ్గర్నుంచి చూస్తుండేవాడు ఈ ఆఖరివాడు. ఒకరోజు తండ్రి ఇంట్లో లేనప్పుడు తండ్రి పనిచేసే చోటుకు వెళ్లి కూర్చున్నాడు. వాడికీ తండ్రిలా చెయ్యాలని ఉంది. ఒక తోలు ముక్క తీసుకున్నాడు. పదునైన పరికరం అందుకుని దానితో తోలు ముక్కపై గట్టిగా కొట్టాడు. పరికరం చెయ్యి జారి, ఎగిరొచ్చి ఆఖరివాడి కంటికి తగిలింది! కంటిచూపు పోయింది. తర్వాత కొన్నాళ్లకే గాయం పెద్దదై రెండో కన్ను మీదా దుష్ప్రభావం చూపించి, రెండో కన్నూ పోయింది. ఆఖరివాడు అంధుడయ్యాడు!కుటుంబ పెద్దకు కుటుంబ పోషణ ఒక్కటే బాధ్యత కాదు. రోజుకింత సంపాదించి తెస్తే అయిపోదు. కుటుంబ సంరక్షణ తీసుకోవాలి. కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. పిల్లలకు ఒక దారి చూపించాలి. ఆఖరివాడికి చూపు లేదు దారి చూపించడానికి. చూపు లేకున్నా దారి వేశాడు. వేసిన దారినే చూపుగా మార్చాడు. మొదట ఎ,బి,సి,డిల దారి. తర్వాత బడి దారి. పదేళ్లు వచ్చేనాటికి ఆఖరివాడికి తండ్రి తన పక్కనే ఉంచుకుని అన్నీ నేర్పించాడు. చెక్కతో అక్షరాలను చెక్కి వాటిని వేళ్లతో తడిమి గుర్తించేలా తర్ఫీదు ఇచ్చాడు. గుర్తించిన అక్షరాలను చెయ్యి పట్టి రాయించాడు. ఆ గ్రామంలోని చర్చి ఫాదర్ ఆఖరివాడికి ప్రకృతి గురించి చెప్పాడు. ఏ పక్షి ఎలా కూస్తుందో, ఏ జంతువు ఎలా అరుస్తుందో, ఏ పువ్వు పరిమళం ఎలా ఉంటుందో, రుతువులు ఎలా మారుతాయో, ఎందుకు తెల్లవారుతుందో, ఎందుకు చీకటి పడుతుందో అర్థమయ్యేలా చెప్పాడు. ఆఖరివాడికి పదో ఏడు వచ్చిన ఆరు వారాలకు అతడిని గ్రామానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. అతడు అక్కడే ఉండి, అక్కడే చదువుకుని, అక్కడే పెరిగి పెద్దయి, అక్కడే పని చేసి, ఆ తర్వాత అక్కడే పాఠాలు చెప్పాడు. ఆ పాఠశాలే ‘రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ యూత్’. ఆ నగరం పారిస్. ఆ అఖరివాడు లూయీ బ్రెయిలీ. అతడి గ్రామం కూప్రే.కూప్రేలో రెండొందల పదేళ్ల క్రితం బ్రెయిలీ కుటుంబం నివసించిన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఇప్పుడది ఇల్లు కాదు. మ్యూజియం. బ్రెయిలీ చనిపోయాక ఆయన చేతుల్ని కూప్రేలో ఖననం చేసి, మిగతా దేహాన్ని పారిస్‌లో పూడ్చిపెట్టారు. చేతులే జీవితాంతం ఆయనను కళ్లయి నడిపించాయి. ఆయన్నొక్కర్నే కాదు. ఆ చేతులతో ఆయన కనిపెట్టిన భాష ఎందరో అంధుల్ని చూపు కర్రలా నడిపిస్తోంది. అందుకే ఆయన చేతులకు అంత ప్రత్యేక ‘స్థానం’. ఇవాళ బ్రెయిలీ జనన దినం. ఎల్లుండి మళ్లీ మరణ దినం. ఒకే నెలలో రెండు రోజుల తేడాతో ఈ నలభై మూడేళ్ల ఆఖరివాడు జన్మించి, మరణించాడు. మరణించి స్పర్శలిపిగా పునర్జన్మించాడు. -
జ్వెరేవ్ చేతిలో ఫెడరర్ చిత్తు
లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పోరు ముగిసింది. ఆరు సార్లు ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఫెడెక్స్‌పై సంచలన విజయంతో జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీస్‌లో జ్వెరేవ్ 7–5, 7–6 (5)తో ఫెడరర్‌ను ఓడించాడు. ఫలితంగా 1996 (బోరిస్ బెకర్) తర్వాత ఏటీపీ ఫైనల్స్ చేరిన తొలి జర్మనీ ఆటగాడిగా జ్వెరేవ్ నిలిచాడు. 1 గంటా 35 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫెడరర్కంటే 16 ఏళ్లు చిన్నవాడైన 21 ఏళ్ల జ్వెరేవ్ ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడ్డాడు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు పది గేమ్‌ల వరకు సమంగా సాగింది. 5–5 వద్ద 11వ గేమ్‌ను నిలబెట్టుకొని 6–5 ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరేవ్ తర్వాతి గేమ్‌లో రోజర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 40 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్ మరింత పోటాపోటీగా సాగింది. స్విస్ స్టార్ ముందుగా 2–1తో ముందంజ వేసినా చక్కటి బేస్‌లైన్ ఆటతో జ్వెరేవ్ దానిని సమం చేశాడు. 4–5తో వెనుకబడిన రోజర్ మళ్లీ పోరాడాడు. అయితే జోరు తగ్గించని జ్వెరేవ్ 6–5తో దూసుకుపోయాడు. ఆ తర్వాత బ్యాక్‌హ్యాండ్ వాలీ విన్నర్‌తో అతను ఫెడరర్ ఆట కట్టించాడు. -
అలెగ్జాండర్ని ప్రెసిడెంట్ చేసింది నేనే: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : భరింపశక్యంకాని గొప్పలు చెప్పుకోవడంలో తమను మించిన వారు లేరని మరోసారి రుజువుచేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చరిత్రంటే నారా వారిదేనని.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్, ఆస్కార్లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేశానని చెప్పుకునే చంద్రబాబు తాజాగా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి చంద్రబాబు పేల్చింది అలాంటి ఇలాంటి బాంబుకాదు. చంద్రబాబు చెప్పింది ఏంటో అర్థం కాక టీడీపీ నేతలు, కార్యకర్తలు జుట్టుపీక్కుంటుంటే, నెటిజన్లు మాత్రం చంద్రబాబు మాటలను రీపీట్ చేసుకొని మరీ వింటూ తెగ నవ్వుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే... గత మంగళవారం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు సుప్రీం కోర్టులో పోరాడుతానని, రాయలసీమతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేస్తామని, హజ్‌యాత్రకు అమరావతి నుంచి నేరుగా విమాన సదుపాయం కల్పిస్తామని, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ఆదుకుంటామని హామీలిచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గానికి త్వరలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తానన్నారు. ఇక అదే ఫ్లో లో 'తెలుగుదేశం పార్టీ ఎన్నో చరిత్రలు సృష్టించాము. ఒకటి రెండు కాదు ఒక దశలో అలెగ్జాండర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశాము. నేనొక్కటే చెప్పాను ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పి ప్రధాన మంత్రిగారిని ఒప్పించి దేశ అధ్యక్ష పదవికి సహకరించిన పార్టీ ఈ తెలుగు దేశం పార్టీ' అంటూ చంద్రబాబు స్పీచ్ దంచికొట్టారు. దీంతో అక్కడున్నవారంతా ఎవరబ్బా ఈ అలెగ్జాండర్ అంటూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబుకు ప్రసంగానికి సంబంధించి వీడియో సామాజికమాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆ అలెగ్జాండర్ ఎవరో కాదు క్రీ.పూ. 3వ శతాబ్ధంలో ప్రపంచ దండయాత్రకు బయలుదేరిన గ్రీకు రాజు అలెగ్జాండర్ అయ్యిండొచ్చు, అతనికి మన చంద్రబాబుకు మంచి స్నేహితుడనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ యువతలో స్పూర్తినింపిన అబ్దుల్ కలాం అయ్యి ఉంటారని, చివరికి పేరుకూడా సరిగ్గా పలకడం రాదు కానీ మిసైల్ మ్యాన్ కలాంకు చంద్రబాబు రాష్ట్రపతి పదవి ఇప్పించారా అంటూ మండిపడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇలానే.. హైదరాబాద్‌లో గత మేలో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి... (డిలిట్ చేసిన బాబు ట్వీట్ స్ర్కీన్‌షాట్) -
అలెగ్జాండర్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు..వీడియో వైరల్
-
శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..?
అలెగ్జాండ్రియా : చారిత్రక ఈజిప్టు పోర్టు నగరం అలెగ్జాండ్రియా కింద 16 అడుగుల లోతులో భద్రపర్చిన 2000 సంవత్సరాల నాటి నల్లరాతి శవకోష్టికను శాస్త్రవేత్తలు తెరిచారు. దాదాపు 10 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న కోష్టిక నుంచి మూడు మమ్మీల పుర్రెలు బయటపడ్డాయి. పుర్రెలతో పాటు కోష్టికలోని ఎరుపు రంగు పదార్థం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదార్థం వల్ల మృతదేహాలు అతి వేగంగా కుళ్లిపోయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. శవ కోష్టికను తెరిస్తే శాపానికి గురవుతామనే నమ్మకం నరనరాల్లో జీర్ణించుకుని పోయిన వేళ ఈజిప్టు పురాతత్వ సుప్రీమ్ కౌన్సిల్ ముస్తఫా వాజిరీ దాన్ని తెరవాలని ఆదేశించి సంచలనం రేపారు. ఆయన ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం కోష్టికను తెరవగా మూడు పుర్రెలు, ఎరుపు రంగు పదార్థం బయల్పడ్డాయి. దీనిపై మాట్లాడిన వాజిరీ కోష్టికను తెరిచామని, ఎలాంటి శాపానికి గురి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకమైన నల్లరాతి కోష్టికలో మృతదేహాలను భద్రపర్చడంతో అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవని తొలుత భావించారు. పైగా కోష్టికపై కింగ్ అలెగ్జాండర్ పేరు ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే, బయల్పడిన మూడు మమ్మీలు రోమన్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులవి కావని పరిశోధకులు తేల్చారు. రాజ కుటుంబీకుల సమాధులు ఇంకా భారీగా ఉంటాయని వారు పేర్కొన్నారు. అలెగ్జాండర్ సమాధి దీనికి ఎన్నో రెట్లు పెద్దగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఛాలెంజ్
ఈ కథను మనం కథకుడి నోటి నుంచి వింటాం. అతడు సైన్యంలో పనిచేస్తుంటాడు. వాళ్లు ‘ఎన్...’ అనే చిన్న పట్టణంలో ఉన్నారప్పుడు. ఆర్మీ అంటే డ్రిల్లు, డిన్నరు, పేక; ఇదే జీవితం. యూనిఫారాలు తప్ప మరొకటి కనబడవు. సైనికులు తమ బృందంతో కలవనిచ్చే వేరే వ్యక్తి ఒక్కడే. ఆయన వయసు ముప్పై ఐదు ఉండొచ్చు. ఈ కుర్రాళ్ల మధ్య అతడు పెద్దమనిషి కిందే లెక్క. అతడు ఎక్కువ మాట్లాడడు. మాట్లాడినా కోసినట్టుగా ఉంటుంది మాట. చూడ్డానికి రష్యన్‌లా కనబడినా పేరు విదేశీలా ధ్వనిస్తుంది. కుర్రాళ్లందరికీ సిల్వియో అంటే ఒక ఇది ఉంటుంది. అతడు అంతకుముందు అశ్వికదళంలో పనిచేశాడు. మరి ఎందుకు అందులోంచి రిటైర్ అయ్యాడో, ఎందుకు ఈ పాడుబడిన ఊళ్లో ఉంటున్నాడో ఎవరికీ తెలీదు. సిల్వియో సైనికుల గుంపుతో కలిసి షాంపేన్ తాగుతాడు. వాళ్లు అడిగితే తన దగ్గరున్న పుస్తకాలు ఇస్తాడు. అవి ఎక్కువగా సైన్యం గురించినవే అయివుంటాయి. సిల్వియోకు ఎక్కువ వినోదకరమైంది మాత్రం షూటింగ్. బుల్లెట్లు తగిలి అతడి ఇంటి గోడలు తేనెపట్టు రంధ్రాలైనాయి. సిల్వియో గురి ఎంత గొప్పదంటే, నీ టోపీ మీదున్న పండును కొడతానని గనక అతడంటే, దాన్ని నెత్తిన పెట్టుకోవడానికి ఏ ఒక్క సైనికుడు కూడా జంకడు. సైనికుల సంభాషణ తరచూ ద్వంద్వయుద్ధాల మీదకు మళ్లేది. ఆ రోజుల్లో ఇద్దరు మనుషుల మధ్య తేడా వచ్చిందంటే ద్వంద్వయుద్ధానికి సవాల్ విసరడం మామూలే. కానీ వాటిలో సిల్వియో జోక్యం చేసుకునేవాడు కాదు. బదులిచ్చినా పొడిగానే. అయినా సిల్వియో పిరికివాడై ఉంటాడన్న ఆలోచన కూడా ఎవరి తలలోకి దూరేది కాదు. కానీ ఒక సంఘటన కథకుడిని విస్తుపోయేలా చేసింది. ఒకరోజు ఓ పదిమంది సిల్వియోతో విందు చేసుకున్నారు. అనంతరం సైనికులు అడిగిన మీదట బలవంతంగా పేక ఆడటానికి ఒప్పుకున్నాడు సిల్వియో. అయితే, స్కోర్ దగ్గర చిన్న తేడా జరిగింది. ఎక్కువ మాట్లాడని సిల్వియో దాన్ని చాక్‌పీస్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనిలోనే మాటలు పెరిగాయి. కొత్తగా ఆ రెజిమెంటుకు వచ్చిన కుర్ర లెఫ్ట్‌నెంట్ కోపంగా సిల్వియో మీదకు టేబుల్ మీదున్న ఇత్తడి దీపపు సెమ్మె విసిరేశాడు. జరిగినదానికి మిగతా సైనికులు భీతిల్లారు. వీడింక చచ్చాడే అనుకున్నారు. అయినా కాసేపు ఆట మౌనంగా కొనసాగింది. సిల్వియోకు ఆసక్తి పోయిందని గ్రహించి ఒక్కొక్కరూ బయటికి నడిచారు. తెల్లారి గుర్రపు స్వారీల దగ్గర ఆ లెఫ్ట్‌నెంట్ ఇంకా బతికేవున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సిల్వియో ద్వంద్వయుద్ధానికి సవాల్ విసరలేదా? ఇది కుర్రాళ్ల దృష్టిలో సిల్వియోను పలుచన చేసింది. మనిషి గుణాలన్నింటిలోకీ శ్రేష్ఠమైందని యువకులు తలిచే ధైర్యం లేకపోవడాన్ని వాళ్లు క్షమించలేరు. అందరికన్నా సిల్వియోతో ఎక్కువ దగ్గరితనం ఉన్న కథకుడు కూడా సిల్వియో కళ్లలోకి చూడటానికి ఇష్టపడలేదు. ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని చదవగానే సిల్వియో కళ్లు మెరిశాయి. తను ఇక నిష్క్రమించాల్సిన తరుణం వచ్చిందనీ, వెళ్లేలోగా చివరిసారి రాత్రికి తనతో భోజనం చేయమనీ కుర్రాళ్లను ఆహ్వానించాడు. ప్రత్యేకించి కథకుడికి మరీ మరీ చెప్పాడు. విందు బాగా జరిగింది. అందరూ సిల్వియోకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు. కథకుడు కూడా బయలుదేరుతుండగా చేయి పట్టి ఆపాడు సిల్వియో. ఇద్దరూ మౌనంగా కాసేపు పైపులు కాల్చారు. ‘ఇంక మనం మళ్లీ ఎప్పటికీ కలవలేకపోవచ్చు. వెళ్లేముందు నేను నీకో వివరణ ఇవ్వాల్సివుంది’ అన్నాడు సిల్వియో. ‘నా మీద ఉన్న చెడు తలంపును దూరం చేయకపోతే అది నన్ను జీవితకాలం వెంటాడుతుంది’ అని చెప్పి, ఆ రోజు ఆ తాగుబోతు ‘ఆర్...’ను వదిలేయడానికి తన ఔదార్యం మాత్రమే కారణం కాదనీ, వాడిని పిస్టల్‌తో కాల్చడంలో తనకో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, ఆయుధాల ఆటలో తన జీవితం కూడా ప్రమాదంలో పడే వీలుందనీ చెప్పాడు సిల్వియో. ఈ వివరణ కథకుడిని మరింత స్తంభించేలా చేసింది. మృత్యువు అంచుకు వెళ్లే హక్కు తనకు లేదంటాడు సిల్వియో. దానిక్కారణం ఆరేళ్లుగా అతడు తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఒక ప్రతీకారం. తనను దెబ్బ కొట్టిన శత్రువు ఇంకా బతికేవున్నాడు. ఆ గతానికి గుర్తుగా పెట్టెలోంచి తీసి బుల్లెట్ దిగిన ఒక టోపీని చూపించాడు. సిల్వియో అశ్వికదళంలో పనిచేసే రోజుల్లో అసాధారణ వీరుడిగా పేరొచ్చింది. ద్వంద్వయుద్ధాల్లో అతడికి సాటి లేరు. అలాంటి రోజుల్లో వాళ్ల రెజిమెంటుకు కొత్త ఆఫీసర్ వస్తాడు. అతడు ధనవంతుడు, అందగాడు, దేన్నీ లెక్కచేయని ధైర్యవంతుడు, మాటకు మాటను తెలివిగా విసురుతాడు. తనను సవాల్ చేసేవాడే లేడనుకున్న తరుణంలో వచ్చిన ఈ కొత్త ఆఫీసర్ సిల్వియోలో ఈర్ష్య పుట్టిస్తాడు. చివరికి ఒకరోజు ఒక విందునాట్యంలో అతడిని పరుషమైన మాటంటాడు సిల్వియో. బదులుగా అతడు సిల్వియో ముఖం మీద కొడతాడు. ఇద్దరూ కత్తులు దూసుకుంటారు. పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ రాత్రే వాళ్లు ద్వంద్వయుద్ధానికి సవాల్ విసురుకుంటారు. తెల్లవారుతుంది. నిర్దేశిత స్థలంలో సిల్వియో అసహనంగా ఎదురుచూస్తుంటాడు. వెంబడి ముగ్గురు సహాయకులుంటారు. కొత్త ఆఫీసర్ తాపీగా నడుచుకుంటూ వస్తాడు. తన క్యాపులో చెర్రీపళ్లు ఉంటాయి. వెంట ఒక్కడే సహాయకుడు. సహాయకులు ఇద్దరి మధ్యా పన్నెండు అంగల దూరం కొలుస్తారు. ముందు ఎవరు కాల్చాలి? సిల్వియో చేయి వణుకుతుంది. తనకు తాను ఆ నిశ్చలత ఇచ్చుకోవడానికి వీలుగా ఆఫీసర్‌కు మొదటి షాట్ ఆఫర్ ఇవ్వబోతాడు సిల్వియో. కానీ సహాయకులు వారించి పాచిక వేస్తారు. ఆఫీసర్ చెప్పిన అంకె పడుతుంది. అతడు గురిపెట్టి మొదటి షాట్ కాలుస్తాడు. సరిగ్గా సిల్వియో నుదురు పైన అంగుళం దూరం నుంచి క్యాపుగుండా వెళ్తుంది బుల్లెట్. ఇప్పుడు సిల్వియో వంతు. గురి చూసి కొట్టడంలో మొనగాడైన సిల్వియో చేతుల్లో ఆఫీసర్ ప్రాణం ఉంది. సిల్వియో పిస్టల్ గురి పెడతాడు. అతడిలో ఏమైనా భయం జాడ ఉన్నదా? ఊహు. తాపీగా టోపీలోంచి విరగబండిన చెర్రీపళ్లను తీసుకు తింటూ, వాటి గింజలు నోట్లోంచి దూరంగా సిల్వియో కాళ్ల దగ్గర వచ్చి పడేలా ఊస్తూ నిలబడతాడు. ఇది సిల్వియోను కలవరపరుస్తుంది. ఎవడైనా భయపడితే వాడి బతుకును లాక్కోవచ్చు. ఇట్లాంటివాడిని చంపితే ఎంత, చంపకపోతే ఎంత? పిస్టల్ దించి, నువ్వింకా చావడానికి సిద్ధంగా లేనట్టున్నావు, నీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, నేను అడ్డురానంటాడు సిల్వియో. అడ్డు వస్తున్నావని ఎవరన్నారు? కాల్చుకో, షాట్ నీది, నేను ఎప్పుడైనా సిద్ధం అంటాడు అతను. సహాయకులతో తన షాట్‌ను ఈ రోజు తీసుకోనని సిల్వియో చెప్పడంతో ఆ ద్వంద్వయుద్ధం ఆగిపోతుంది. తర్వాత సిల్వియో ఈ ఊరికి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డాడు. తన ప్రతీకారం గురించి అతడు ఆలోచించని రోజంటూ లేదు. అనుకోకుండా సిల్వియో ఏజెంట్ మాస్కో నుంచి రాసిన ఆ ఉత్తరంలో ‘ఒకానొక వ్యక్తి’ ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని రాశాడు. ఈ కథంతా సిల్వియో కథకుడికి చెప్పి, ఆ ఒకానొక వ్యక్తి ఎవరో నీకు అర్థమైందనుకుంటాను, అని అడుగుతాడు. ఆ రోజు మృత్యువు ముఖంలోకి చెర్రీపళ్లు తింటూ చూసినట్టుగానే ఈ వివాహ వేడుక సందర్భంగా కూడా చూస్తాడా? సిల్వియో తన సామగ్రి సిద్ధం చేసుకుని, బోనులోంచి బయటపడిన పులిలా ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అతడి కోసం గుర్రాల బండి సిద్ధంగా ఉంది. చాలా ఏళ్లు గడిచాయి. కుటుంబ పరిస్థితులు మన కథకుడిని ‘ఎమ్...’ అనే ఊళ్లో స్థిరపడేలా చేశాయి. ఊళ్లో ప్రత్యేకించి ఏమీ జరగదు. ఒక్క విశేషం ఉంటే దాని గురించి రెండు నెలలు చెప్పుకుంటారు గ్రామస్థులు. కథకుడి ఇంటికి నాలుగు వర్స్ దూరం(1 వర్స్ = 1.1 కిలోమీటర్)లో దొరసాని బి... ఎస్టేట్ ఉంది. అది ఎ... అనే గ్రామం కిందికి వస్తుంది. ఎస్టేట్‌లో పర్యవేక్షకుడు తప్ప ఎవరూ ఉండరు. ఆమెకు పెళ్లయిన తొలి ఏడాది ఓసారి ఇక్కడికి వచ్చి వెళ్లిందట. మళ్లీ ఆమె భర్తతో సహా ఎస్టేట్‌కు వస్తున్నారని తెలిసి కథకుడు ఉత్సాహపడతాడు. ఊళ్లల్లో జరగ్గలిగే విశేషాలు అంతకంటే ఏముంటాయి? జమీందారు, అతడి భార్య వచ్చారని తెలిశాక వచ్చిన మొదటి ఆదివారం కథకుడు తన వందనాలు తెలియజేయడానికి వెళ్లాడు. భవంతి అత్యంత విలాసవంతంగా ఉంది. పుస్తకాలు, కంచు ప్రతిమలు, తివాచీలు, పెద్ద అద్దం... ఒక పనివాడు ఈయన వచ్చినట్టు చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ఇంత సంపద ఎప్పుడూ చూసివుండని కథకుడిలో కొంత వణుకు పుట్టిన మాట నిజం. కానీ అందమైన ముప్పై రెండేళ్ల వరకు వయసుండే జమీందారు వచ్చీరావడంతోనే స్నేహంగా పలకరించాడు. ఈ లోపల దొరసాని కూడా వచ్చింది. ఆమె ఇంకా అందగత్తె. కథకుడి బిడియం పోయేలా ఇద్దరూ మామూలుగా మాట్లాడసాగారు. ఆ గదిలో ఉన్న ఒక పెయింటింగ్, అది స్విట్జర్లాండ్‌లోని ఒక దృశ్యం, కథకుడిని ఆకర్షించింది. దానిమీద సరిగ్గా ఒక దానిమీద ఒకటి తగిలిన రెండు బుల్లెట్ గుర్తులున్నాయి. మంచి షాట్’ అన్నాడు కథకుడు. ‘అవును, అసాధారణమైన షాట్’ అని బదులిచ్చాడు జమీందారు. అట్లా మాటల్లో ముప్పై అంగల దూరం నుంచి గురి తప్పకుండా కాల్చగలనని చెప్పాడు కథకుడు. నువ్వు కూడా అలా కాల్చగలవా డియర్, అని అడిగింది దొరసాని. ఏదో ఒక రోజు నేనూ కాల్చగలనన్నాడు జమీందారు. నాకు తెలిసిన ఒకతను ఉండేవాడు, గోడ మీద ఈగ కనబడితే పిస్టల్ తెమ్మని కేకేసేవాడు, ఢాం, అదీ అతడి గురి అని చెప్పాడు కథకుడు. ఎవరాయన? అడిగాడు జమీందారు. ‘సిల్వియో అని...’ ‘సిల్వియో!’ అరిచినంత పనిచేశాడు జమీందారు. దీంతో ఆ పాత కథంతా తవ్వుకోవాల్సి వస్తుంది. జమీందారుకు పెళ్లయి నెలే అయిందప్పుడు. ఆరోజు కొత్త దంపతులు గుర్రపు స్వారీకి వెళ్లారు. దొరసాని గుర్రం ఆ రోజు మాట వినకపోతే ఆమె దిగి నడుచుకుంటూ వస్తానంది. జమీందారు ముందు ఇల్లు చేరాడు. వచ్చేసరికి సిల్వియో ఉన్నాడు. అతణ్ని చూడగానే జమీందారు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాకీ తీర్చమని అడిగాడు సిల్వియో. జమీందారు సిద్ధమయ్యాడు. భార్య వచ్చేలోగా కాల్చమని కోరాడు. మళ్లీ సిల్వియో సందేహపడ్డాడు. ఇలా కాల్చడం మర్డర్ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని మళ్లీ చీటీలు వేశారు. ఈసారీ జమీందారుకే తొలి ఛాన్స్ వచ్చింది. మహాచెడ్డ అదృష్టవంతుడు. జమీందారు కాల్చిన షాట్ మిస్ అయి ఆ పెయింటింగుకు తగిలింది. ఇప్పుడు కాల్చడం సిల్వియో వంతు. పిస్టల్ గురి పెట్టాడు. అప్పుడే దొరసాని ఆ గదిలోకి వచ్చింది. కాల్చవద్దని సిల్వియో కాళ్లదగ్గర పడింది. ‘మాషా, ఇది నీకు సిగ్గుగా లేదూ!’ అని జమీందారు వారించాడు. అదిగో, అప్పుడు సిల్వియో వదిలేసి వెళ్లాడు. వెళ్తూ, గురి కూడా చూడకుండా జమీందారు కాల్చిన పెయింటింగును అదే స్థానంలో కాల్చాడు. తనకు అంతకుముందు తెలిసినదానికి జమీందారు చెప్పినదానితో కలిపి కథకుడు కథ పూర్తి చేస్తాడు. తర్వాత చాలా ఏళ్లకు అలెగ్జాండర్ ఇప్సిలాంటి నేతృత్వంలోని తిరుగుబాటులో సిల్వియో పాల్గొని స్కౌలానా యుద్ధంలో మరణించినట్టు కథకుడికి తెలుస్తుంది. అలెగ్జాండర్ పుష్కిన్ 1831లో రాసిన ‘ద షాట్’ కథాసారం ఇది. రష్యన్ ఆధునిక సాహిత్యానికి పుష్కిన్ మార్గదర్శి అంటారు. -
టెలిఫోన్ లేని ప్రపంచం ఊహిద్దామా?
మానవచరిత్రలో మార్చి 10, 1876 ఒక మైలురాయి. ఆరోజు అలెగ్జాండర్ గ్రాహంబెల్ తాను రూపొందించిన టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తొలి మాటలు కమ్ హియర్ వాట్సాన్, ఐ వాంట్ యూ!. యూరోపియిన్ కమిషన్ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శాతం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలిఫోన్ల రంగంపై ఆధారపడి ఉంది. ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ 2006 సంవత్సరానికి ప్రమోటింగ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీని లక్ష్యంగా ఎంచుకున్నది. గ్లోబల్ టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ సుమారు 220 దేశాల్లో నిరాటంకంగా పనిచేస్తోంది. ఇప్పుడు భూమి మీదే కాకుండా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సముద్రం లోపల కూడా విస్తరించింది. టెలిగ్రాఫ్, టెలెక్స్ టెలిఫోన్, టెలివిజన్ మొదలైన ప్రత్యేక వ్యవస్థలు ప్రత్యేక కేబుల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఒకప్పుడు తీగెల ఆధారంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేది. నేడు వైర్లెస్, సెల్‌ఫోన్ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. నేడు సెల్‌ఫోన్ లేని వ్యక్తి లేడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నవారితో క్షణాల్లో సెల్ఫోన్లో మాట్లాడటం, ఛాటింగులు చేయడం, వీడియో కాల్ చేయడం, వీడియోలు పంపడం సులభతరంగా మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అన్ని రకాల సెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. కొండలు, గుట్టలపైన కూడా సెల్ఫోన్లు పనిచేస్తున్నాయి. సెల్ఫోన్ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవసరం మేరకే ఫోన్లను వాడితే మంచిది. అనవసర కబుర్లను ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడుకోవడమే మేలు. (నేడు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం సందర్భంగా) -కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
ఎరక్కపోయి.. ఇరుక్కుని!
అలెగ్జాండర్ జెఫర్సన్ డెల్గాడో.. ఓ అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికాలోని పెరూకు చెందిన 28 ఏళ్ల అలెగ్జాండర్ పేరుమోసిన దొంగ కూడా. కాస్త తెలివిగలవాడే. ఇంతకీ ఇతడు ఏం చేశాడంటే. పోలీసుల కళ్లు కప్పి జైలు నుంచి పారిపోయాడు. పైగా అతడు ఉన్న జైలు అలాంటిలాంటి జైలు కాదు.. పెరూలో చాలా కట్టుదిట్టమైన జైలు. మరెలా తప్పించుకున్నాడో తెలుసా.. అలెగ్జాండర్ సోదరుడు గియాన్‌కార్లో ఇద్దరూ కవలలు. ఓ రోజు అలెగ్జాండర్‌తో ములాఖత్ అయ్యేందుకు గియాన్‌కార్లో జైలుకు వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అలెగ్జాండర్ సెల్‌లోకి ఇద్దరూ వెళ్లారు. అక్కడ ఉన్న మరో ఖైదీ గియాన్కార్లోకు ఏదో ద్రవాలు ఇవ్వడంతో కళ్లు తిరిగిపడిపోయాడు. వెంటనే అలెగ్జాండర్ తన సోదరుడి దుస్తులు మార్చుకుని మెల్లగా జారుకున్నాడు. మెలకువ వచ్చిన గియాన్‌కార్లో జైలు అధికారులకు అసలు విషయం చెప్పాడు. అయితే పారిపోయేందుకు అబద్ధం చెబుతున్నాడని, ఏదో కుట్ర పన్నుతున్నాడని వినిపించుకోలేదు. అయితే చాలాసార్లు ఇదే విషయాన్ని చెప్పడంతో అధికారులు వేలిముద్రలు.. కంటిపాపలను పోల్చి చూడటంతో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీలలో రికార్డయిన దృశ్యాల ద్వారా కూడా ధ్రువీకరించుకున్నారు. లిమాలోని కాల్లలో అనే పట్టణంలో ఇంట్లో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అలెగ్జాండర్‌ను పట్టుకున్నారు. పాపం సొంత సోదరుడే కదా.. ఓసారి చూసొద్దామనుకున్న గియాన్కార్లోకు దిమ్మదిరిగి ఉంటుంది! -
బీసీల్లో చైతన్యం కల్పిస్తాం..
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు హన్మకొండ అర్బన్: అలెగ్జాండర్, ఫిడెల్ క్యాస్ట్రో తరహాలో బీసీల్లో చైతన్యాన్ని నింపేలా బాటలు వేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. వారికి వ్యక్తిత్వ వికాసం కల్పించి జ్ఞానమార్గం చూపిస్తామని అన్నారు. కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలసి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ధేశించిన ప్రకారం రాష్ట్రంలో బీసీల ఆర్థిక స్థితిగతులు, కుల వృత్తులపై 3 నెలల పాటు అధ్యయనం చేసి వెరుు్య పేజీలకు తగ్గకుండా నివేదిక ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలను నిరాశ, నిస్పృహల నుంచి విముక్తులను చేయడమే కమిషన్ లక్ష్యమన్నారు. ప్రతీ గ్రామం, కుటుంబం, వ్యక్తికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపై నివేదిక ఇస్తామన్నారు. ఆధునిక పరిజ్ఞానం అందు బాటులోకి రావడంతో కుల వృత్తులకు కాలం చెల్లిందన్నారు. లాభసాటిగా ఉండే ఏ వృత్తిని అరుునా ఇతర కులాలు స్వీకరిస్తాయని.. దీనికోసం వారికి తగిన శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తామని రాములు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోందని, ఉపకారవేతనాలు, విదేశీ చదువులకు రుణాలు, బ్యాంకుల ద్వారా రుణాలు, ఆసరా పెన్షన్లు వంటివి ఇందులో ఉన్నాయని బీఎస్.రాములు అన్నారు. అరుుతే, ఆయా పథకాలు అర్హులకు ఏ మేరకు చేరుతున్నాయన్న విషయంలో అధ్యయనం చేస్తామని తెలిపారు. తమకు వందల సంఖ్యలో వినతులు అందాయని, వాటిని పరిశీలించి అవసరం ఉన్నవాటిని నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. -
అలెగ్జాండర్
-
బాక్సర్ అలెగ్జాండర్ హత్య
సాన్ జూవాన్: పూర్టో రికా చెందిన యువ బాక్సర్ అలెగ్జాండర్ డి జీసెస్(33) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అతనిపై దాడి చేసిన కొంతమంది దుండగులు కాల్చి చంపారు. అలెగ్జాండర్‌ను బెల్మొంట్ లోని ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు అతనిపై పలుమార్లు కాల్పులు జరిపి హత్య చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో పూర్టో రికా తరపున అలెగ్జాండర్ ప్రాతినిధ్యం వహించాడు. ఆపై అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అలెగ్జాండర్ పలు పతకాలను గెలుచుకున్నాడు. అయితే 2005లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి 19 బౌట్లలో విజయం సాధించాడు. కాగా, 2009లో అర్జెంటీనా ఆటగాడు సీజర్ రీనే చేతిలో ఓటమి పాలై తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. అనంతరం గృహహింస కేసులో అలెగ్జాండర్ నాలుగు సంవత్సరాల జైలు జీవితం అనుభవించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో భాగంగా జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలోనే ప్రత్యేక అనుమతితో అలెగ్జాండర్ బయటకొచ్చాడు. 2010లో జరిగిన ఆ పోటీలో అలెగ్జండర్ తన దేశానికి చెందిన ఏంజెల్ రోమన్ సునాయాసంగా ఓడించి సత్తాను చాటుకున్నాడు. ఆపై 2013 లో జైలు నుంచి విముక్తి లభించడంతో అప్పట్నుంచి తిరిగి బాక్సింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే జావేర్ గార్సియాపై ఏకపక్ష విజయం సాధించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. అయితే గత నెల్లోనే తన కెరీర్ లో రెండో ఓటమిని అలెగ్జాండర్ చవిచూశాడు. అలెగ్జండర్ ఓవరాల్ విజయాల రికార్డు 21-2 గా ఉంది. ఇందులో 13 నాకౌట్ మ్యాచ్‌లు ఉండటం విశేషం. -
జడ్రుచులు
హ్యూమర్ చిన్నప్పుడు మా బుజ్జిగాడికి ఒక జడ ఉండేది. దాని వెనకో కథ కూడా ఉంది. దానితో నాకో నీతి తెలిసింది. ఆ టైమ్‌కు కలిసివస్తోంది కదా అని తొందరపడి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. కొన్నిసార్లు మన మాటలే మనకు అడ్డం తిరిగి, మనకే ముప్పుగా మారుతుంటాయి. పుట్టెంటికలు తీయకపోవడం వల్ల మా బుజ్జిగాడి జుట్టు విపరీతంగా పెరిగింది. ఇంట్లో ఆడబిడ్డ లేకపోవడం వల్ల మా బుజ్జిగాడికే జడలు వేసి తన ముచ్చట తీర్చుకుంటోంది మా ఆవిడ. మామూలుగానే నా అభ్యంతరాలను ఎవరూ లెక్క చేయరు. పైగా ముద్దు ముద్దుగా జరిగే ఈ జడ కార్యక్రమానికి నా సంపూర్ణ కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. ఫలితంగా ‘మగపిల్లాడు కదా వాటికి జడ వద్దు’ అనే నా తీర్మానం మొదట్లోనే వీగిపోయింది. మా బుజ్జిగాడికి నాలుగేళ్లు నిండ టంతో ఇంగ్లిష్ అక్షరాలు నేర్పిస్తున్నా. ఓ పుస్తకం కొని ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బాల్ అంటూ చెబుతున్నా. వై ఫర్ ‘యాక్’ అనగానే దాన్ని తెలుగులో ఏమంటారని అడిగాడు. క్షణం కూడా ఆలోచించకుండా ‘జడలబర్రె’ అని చెప్పా. మా బుజ్జిగాడు కూడా క్షణం ఆలోచించకుండా అడిగేశాడు, ‘మరి దానికి జడలు లేవేమిటి? వాళ్లమ్మ జడ వేయకపోయినా దాన్ని జడలబర్రె అని ఎందుకు అంటున్నారు?’ అని. దానికి ఒకరు జడ వేయాల్సిన అవసరం లేదనీ, జుట్టు పెరుగుతూన్న కొద్దీ చివరన ఉండే జుట్టు జడ పాయల్లా పెరుగుతుందని చెప్పా. ‘‘అయితే నాకు జడ వెయ్యకండి. అలా వదిలేయండి’ అన్నాడు వాడు. వాడికి జడలు వేయడం తప్పదనీ, వాడిని సమాధానపర్చమనీ హుకుం జారీ అయ్యింది. దాంతో జడల గొప్పదనాన్ని వాడికి విడమరచి చెప్పాల్సిన అగత్యం నాకు ఏర్పడింది. ‘‘ఒరేయ్... పెద్ద పెద్ద నదులన్నీ జడలు వేసుకుంటాయి తెల్సా’’ అంటూ మొదలెట్టా. ‘‘నదులు జడలు వేసుకుంటాయా?’’ అన్నాడు వాడు. ‘‘అవున్రా. నువ్వు కాస్త పెద్ద క్లాసులకు వచ్చాక తెలుస్తుంది. వాటినే బ్రెయిడెడ్ స్ట్రీమ్స్ అంటారు. అంటే జడలు వేసుకున్న ప్రవాహాలు అని అర్థం. మొదట్లో నదులన్నీ అల్లరిచిల్లరిగా ప్రవహిస్తుంటాయి. ఆ తర్వాత కాస్త పెద్దరికం వస్తుంది. దాంతో నది పడక మీద ఇసుక పేరుకుపోయి జడలు అల్లుకునట్టుగా అయిపోతుం టుంది. దాన్నే ఇంగ్లిష్‌లో బ్రెయిడెడ్ స్ట్రీమ్ అంటారు. జడలు వేసుకున్నందుకే నదికి ఆ పేరు’’ అని చెప్పా. అక్కడితో ఆగలేదు. ఇంకా రెచ్చి పోయా. ‘‘మూడొందల ఏళ్ల క్రితం అలెగ్జాండర్ పోప్ అనే ఇంగ్లిషు మహాకవి జడ కుచ్చులు కత్తిరించడం మీద పెద్ద పద్యం రాశాట్ట. నాలుగు రోజుల్లోనే ఆ పద్యాల పుస్తకాలు మూడు వేలు అమ్ముడు పోయాట్ట. అదీ జడ మహత్యం’’ అంటూ వివరించా. వాడికి నమ్మకం కుదరలేదు. దాంతో ఎగ్జాంపుల్ మార్చక తప్పలేదు. మొన్నీమధ్యనే టీవీలో కుంగ్‌ఫూ ఫైటింగ్ సినిమా చూశా. అందులో పెద్ద పెద్ద మాంక్స్ పొడవు పొడవు జడలు వేసుకున్నారు. ఫైటింగ్ చేసేటప్పుడు చేతులు, కాళ్లతో పాటు జడలతోనూ కొడుతుంటారు’’ అంటూ చెప్పా. అయినా వాడికి నమ్మకం కుదిరినట్లు అనిపించలేదు. దాంతో నాకిక తెలుగు సినిమా రంగానికి రాక తప్పలేదు. ‘‘హీరోయిన్లో అచ్చమైన తెలుగు దనం చూపించడానికి జడ బాగా ఉప యోగపడుతుంది. ఆమెలో తెలుగుదనం ఉట్టిపడాలంటే... జడను చేతుల్లోకి తీసు కుని అదేపనిగా తిప్పుతూ ఉండాలి. రెండు జళ్ల సీత అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో హీరోయిన్ రెండు జడలు వేయడం మాత్రమే కాదు, ఆమె జడలనే టైటిల్‌గా పెట్టడంతో ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. అంతెందుకు మనం మర్రి మానులనూ, మన ఊరి మారెమ్మనూ ఎందుకు పూజిస్తామో తెలుసా? పెద్ద పెద్ద ఊడలూ, జడలూ ఉండటం వల్లనే’’ అన్నానేను. ఇక వాడికి నమ్మక తప్పలేదు. జడ గొప్పదనాన్ని వివరిస్తూ అవాకులూ చెవాకులూ పేలుతూ ఇంతగా వాడిని నమ్మించినందుకు ఆ టైమ్‌కు నేను బాగానే ఆనందపడ్డాను. కానీ నేను చెప్పిన మాటలే నా కాళ్లకు అడ్డం పడతాయని నాకు తెలియలేదు. తీరా తెలిసే సరికి జడ రిబ్బన్లాగే ముడి బిగుసుకు పోయింది. మొక్కు తీర్చాలిన టైమ్‌లో మావాడు అడ్డం తిరిగాడు. ‘‘జడలు చాలా గొప్పవి కాబట్టి వాటిని కత్తిరించడానికి వీల్లేదు’’ అంటూ ఒకే మాట మీద ఉన్నాడు. కత్తి పెట్టడం కుదరని కరాఖండీగా చెప్పడంతో గుండు కొట్టించడానికి వాడిని ఒప్పించేలోపు నాకు ఐదారు కత్తిగాట్లు పడ్డాయి. - యాసీన్ -
అలెగ్జాండర్ ది గ్రేట్!
మాధవ్ శింగరాజు అలెగ్జాండర్ ది గ్రేట్! ‘ది గ్రేట్’ ఎందుకు? గ్రీకు వీరుడనా? గ్రీకు రాజ్యాలన్నిటినీ ఏకం చేశాడనా? పర్షియాను ఆక్రమించుకున్నాడనా? ఇండియా వరకు.. దండయాత్రలతో తనకు తెలిసిన భూభాగాలన్నిటినీ హస్తగతం చేసుకున్నాడనా? అవును. కచ్చితంగా అందుకే. గ్రేట్! కానీ ఇదంతా ఎవరికి గొప్ప?! అలె క్స్ మాతృమూర్తికి గొప్ప. అలెక్స్ తండ్రికి గొప్ప. అలెక్స్‌కి పిల్లనిచ్చిన మామగారికి గొప్ప. అలెక్స్ ఫ్రెండ్స్‌కి గొప్ప. అలెక్స్ గురువు అరిస్టాటిల్‌కి గొప్ప. మరి అలెక్స్ భార్య రొక్సానాకి? గొప్పే. అయితే.. వీళ్లందరికీ అలెగ్జాండర్ ఎందుకు గొప్ప అయ్యాడో అందుకు మాత్రం కాదు! ఆమెపై ప్రేమను రుద్దే ప్రయత్నం ఏరోజూ చెయ్యలేదట అలెగ్జాండర్.. వాళ్ల పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ! అది గ్రేట్‌గా అనిపించింది రొక్సానాకు. మగాడంటే అలా ఉండాలి అంటుందట ఆవిడ. అలా అని ప్లూటార్క్ రాశాడు. క్రీ.శ. రెండో శతాబ్దపు గ్రీకు చరిత్రకారుడు ఆయన. శత్రురాజులను పాదాక్రాంతం చేసుకోవడం, స్త్రీ ముందు మోకరిల్లడం రెండూ ఒకటే అలెగ్జాండర్‌కు. శత్రువును గెలవడం అతడికి గౌరవం. స్త్రీ ఎదుట కిరీటం తీసి నిలబడడం కూడా అతడికి గౌరవమే! (ఓయ్ అలెక్స్.. ఇది కూడా ఒక యుద్ధవ్యూహం కాదు కదా.. స్త్రీ హృదయాన్ని దోచుకోడానికి?!) అంత గొప్ప చక్రవర్తి అలెక్స్ నిజంగానే ఏ స్త్రీ ముందైనా మోకరిల్లి ఉంటాడా? ఉండొచ్చు. లేదా స్త్రీ మనసు తెలుసుకుని మసులుకొని ఉండొచ్చు. స్త్రీ మనసు తెలుసుకుని మసులుకోవడం మాత్రం.. ఆమెకు మోకరిల్లడం కన్నా ఏం తక్కువని?! క్రీ.పూ. 328లో అలెక్స్ ఆస్థానంలో కూడా మోకరిల్లడం అనే సంప్రదాయం ఉండేది. మరీ పైనున్నవాళ్లకు కిందివాళ్లు నీల్ డౌన్ అయ్యేవాళ్లు. పర్షియాను ఓడించి వస్తూ వస్తూ ఆ ఆచారాన్ని తెచ్చుకున్నాడు అలెగ్జాండర్. మోకరిల్లడంలో అభ్యర్థన ఉంటుంది. అర్పణ ఉంటుంది. అఫెక్షన్ ఉంటుంది. భయము, భక్తి, గౌరవం ఉంటాయి. ఇవన్నీ కలిసిందే ‘ప్రపోజల్’! ‘ప్రపోజల్’ అంటే.. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా?’ అని అర్థించడం. ప్రియుడు మోకరిల్లి ప్రియురాలిని కనికరించమని (పెళ్లి చేసుకొమ్మని) అడిగే ఈ సంప్రదాయం ప్రతి దేశంలోనూ ఉంది. పువ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, నవ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, పగడం తొడుగుతూ ప్రపోజ్ చెయ్యడం, ముత్యమంత ముద్దిచ్చి ప్రపోజ్ చెయ్యడం.. ఇక ఇవన్నీ మగాళ్ల తిప్పలు, తలనొప్పులు. ఎలా ప్రపోజ్ చేసినా, ఎక్కడ ప్రపోజ్ చేసినా, ఎప్పుడు ప్రపోజ్ చేసినా.. అసలంటూ ప్రపోజ్ చెయ్యడం గ్రేట్. రిప్లయ్ నెగిటివ్‌గా ఉన్నా హర్ట్ అవకుండా ఉండగలిగితే.. అలెగ్జాండర్ ది గ్రేట్. హ్యాపీ ప్రపోజ్ డే ఇవాళ ‘ప్రపోజ్ డే’. వాలెంటైన్ వీక్ మొదలైన (7-14) రెండో రోజు.. అంటే ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే వస్తుంది. -
మొదట ఈ నరుడు వానరుడు!
అక్షర తూణీరం: విశ్వవిజేత అలెగ్జాండర్ ఏం కావాలని అడిగితే ‘తమరు పక్కకు తప్పుకుంటే సూర్యనమస్కారాలు చేసుకుంటాను’ అన్న నాటి రుషి లాగా నేడు తెలుగు ప్రజలు నగరాలు, నజరానాలు వద్దు, మమ్మల్నిలా వదిలేయమంటున్నారు. ఒకరు సింగపూర్ అంటారు. ఇంకొకరు ఇస్తాంబుల్ అంటారు. ఒకాయన వాటికన్ అన్నాడు. ఇంకొకాయన మక్కా, ఇది పక్కా అన్నాడు. ఒకరు రాష్ట్రానికి సంస్కృతం లో స్వర్ణ విశేషం తగిలిస్తే మరొకరు తెలుగులో బంగారు శబ్దం జోడించారు. ఆకాశహర్మ్యాలంటున్నాడొ కాయన. ఆ విధంగా అండర్‌గ్రౌండ్‌లో ముందుకు పోతాం. పాతాళలోకం తలుపులు తీస్తాం, తాళం నా దగ్గర ఉందటున్నాడొకాయన. ఇక పనిలేని వర్గం పవరున్న వారితో ఆడుకుంటూ ఉంది. ‘‘ఏది స్విస్ డబ్బు? ఎక్కడ రుణమాఫీ? మోదీ నిజంగా గాంధే యవాదే అయితే స్వచ్ఛ భారత్ కాదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచెయ్యాలి. సవాల్ విసు రుతున్నాం’’ అంటూ జనాన్ని ఆకట్టే ప్రయత్నంలో ఉన్నారు. పవర్లో లేనివారు ఎప్పుడూ ఎక్స్‌గ్రేషి యాలు ఉదారంగానే ప్రకటిస్తారు. సీటు దిగిపో యాక ఆదర్శాలకు పదును పెడతారు. ప్రజల చేత నిర్ద్వంద్వంగా తిరస్కరింపబడిన నేతలు కనీసం ఒక ఏడాది పాటు వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేయరా దని రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది- అని ఓటర్లంటున్నారు. ఏమిటీ రాజ్యం ఇట్లా అఘోరించిందంటే, ముందటి పాలకుల అవినీతి అసమర్థ పాలన కార ణమంటారు. ముందటి పాలకులను నిలదీస్తే బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలనలో పీల్చి పిప్పి చేయబడ్డ రాజ్యాన్ని ఇంతకంటే ఉద్ధరించలేకపోయా మంటారు. సందర్భం దొరికి బ్రిటిష్ పాలకుల్ని అడిగితే, అసలు లోపం మహమ్మదీయ పాలనలోనే ఉందని గతం మీదకి తప్పుతోస్తారు. నడం నొప్పిగా ఉందని పేరు మోసిన డాక్టర్ దగ్గరకు వెళితే ‘‘ఉం టుందండీ! సహజం. మనిషి మొదట చతుష్పాది కదా! క్రమంగా రెండుకాళ్ల మీద నడవడం ఆరంభిం చాడు. అంచేత నడుంనొప్పి... నేచురల్లీ’’ అన్నాడు. ఆ మాటలు విన్నాక ఎవడికైనా అగ్గెత్తుకు రాదూ! జపాన్ టెక్నాలజీలో మన వాస్తుని మిళాయించి కేపిటల్ నిర్మాణమై వస్తుంది. అదొక అద్భుతం. ఇదిగో ఆ మూల ప్రపంచంలో ఎత్తై మహా శిఖరం వస్తోంది. అదసలు కేవలం వాస్తుకోసమే ఆవిర్భవి స్తోంది. మీరే చూస్తారు! ఇవన్నీ వింటుంటే నాకు ‘అలెగ్జాండర్-మహర్షి’ కథ గుర్తుకొస్తోంది. అలెగ్జాం డర్ మనదేశాన్ని జయించాక, ఇక్కడ తపస్సంపన్ను లైన రుషులుంటారని విని ఒక వేకువజామున బయ లుదేరి అడవిలోకి వెళ్లాడు. మర్యాదగా ఆశ్రమం బయటే గుర్రాన్ని వదలి, శిరస్త్రాణంతీసి లోనికి వెళ్లా డు. అప్పుడే స్నానాదికాలు పూర్తి చేసుకుని అంగో స్త్రంతో బయటకు వస్తున్న రుషి కనిపించాడు. నమ స్కరించి, ‘‘నన్ను అలెగ్జాండరంటారు. విశ్వ విజే తని. తమర్ని దర్శించవచ్చాను. చెప్పండి, మీకేం కావాలో! వజ్ర వైఢూర్యాలా, బంగారు గనులా, వెం డికొండలా, గోవులా... చెప్పండి! అన్నాడు. మహర్షి మాటా పలుకూ లేక మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. ‘‘సందేహించకండి! అన్నింటినీ ఇమ్మన్నా ఇస్తాడీ గ్రీకువీరుడు. మీకేం కావాలి?’’ అన్నాడు. నోరు విప్పాడు రుషి, ఎట్టకేలకు- ‘‘తమరు కాస్త పక్కకు తప్పుకుంటే నాకు ఎండపొడ తగుల్తుంది. నేను సూర్యనమస్కారాలు చేసుకుంటాను. తమరా మేలు చేస్తే చాలు’’ అన్నాడు రుషి. ప్రస్తుతం తెలుగు ప్రజ రుషిలా అల్ప సంతోషులుగా ఆలోచిస్తున్నారు. నగ రాలూ వద్దు, నజరానాలూ వద్దంటున్నారు. ఆడలేక మద్దెలని ఓడు చెయ్యద్దంటున్నారు. అవినీతిని అరి కట్టడానికి పెట్టుబడులు అక్కర్లేదు కదా అని అడుగు తున్నారు. రోజు వారీ పాలనలో పొదుపుకీ సమయ పాలనకీ క్రమశిక్షణకీ జవాబుదారీతనానికీ బడ్జెట్లో కేటాయింపులు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ప్రజారుషులు. ఆధునిక వాహనాలను దింపితే సరి పోదు అందులో కూచునే పోలీసు అధికారుల నైజం మారాలంటున్నారు. దీన్ని న్యూయార్క్ సిటీని చేస్తే మన సిటీయే గొప్పదవుతుందన్నాడొక సిటిజనుడు. అదెట్లా అన్నాను, అర్థంకాక. ‘‘మూడు లక్షల ఇరవై వేల వీధికుక్కలు మన సిటీకి ఎగస్ట్రా..’’ అన్నాడు గర్వంగా. అవును, మొదట ఈ నరుడు వానరుడు. (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత) - శ్రీరమణ -
‘సంగం’ సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?
భారతదేశ చరిత్ర, పారశీక, గ్రీకు దండయాత్రలు భారతదేశంపై విదేశీ దండయాత్రలకు అంకురార్పణ చేసినవారు పారశీకులు. ఇరాన్ దేశాన్ని పూర్వం పర్షియా అని పిలిచేవారు. ఆ దేశానికి చెందిన పారశీకులు క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారత వాయవ్య ప్రాంతంపై దండయాత్రలు చేసి సుమారు 200 ఏళ్లు పాలించారు. వీరిలో మొదటిరాజు సైరస్. ఆయన మొదట ‘గాంధార’ను జయించాడు. వీరితోనే ఇండో-పర్షియన్ సంస్కృతి అభివృద్ధి చెందింది. కుడి నుంచి ఎడమకు రాసే ‘ఖరోష్టి లిపి’ పారశీకుల వల్ల భారత్‌లో ప్రవేశించింది. అశోకుడి శిలాశాసనాలు ఈ లిపిలోనే ఉన్నాయి. గ్రీకుల దండయాత్రలు- అలెగ్జాండర్ (క్రీ.పూ. 327-324) భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి యూరోపియన్లు గ్రీకులు. వీరు ఇండియా గొప్పతనాన్ని పారశీకుల ద్వారా తెలుసుకున్నారు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మాసిడోనియా (గ్రీక్ రాజ్యం) చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ‘అరబేలా యుద్ధం’లో పర్షియా రాజైన మూడో డేరియస్ను ఓడించి పర్షియాను ఆక్రమించాడు. ఆ విధంగా పారశీక సామ్రాజ్యంలో భాగంగా ఉన్న భారత వాయవ్య ప్రాంతం గ్రీకుల ఆధీపత్యంలోకి వెళ్లింది. ప్రపంచ విజేత కావాలన్న కోరికతో ఉన్న అలెగ్జాండర్ క్రీ.పూ. 327లో భారత్‌పై దండయాత్ర చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తక్షశిల రాజు ‘అంభి’, తన పొరుగురాజైన ‘పోరస్’ (పురుషోత్తముడు)పై శత్రుత్వంతో అలెగ్జాండర్‌ను తమ భూభాగంలోకి ఆహ్వానించాడు. మొదట తక్షశిలను ఆక్రమించిన అలెగ్జాండర్ జీలం, చినాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్తముడిపై దాడిచేసి అతన్ని బందీగా పట్టుకున్నాడు. ఇక్కడ స్వదేశీ రాజుల మధ్య ఉన్న అనైక్యత అలెగ్జాండర్‌కు కలిసోచ్చింది. వీరోచితంగా పోరాడి ఓడిన పురుషోత్తముడి దేశభక్తిని మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చి స్వతంత్ర రాజుగా ప్రకటించాడు. తన కోరిక తీరకుండానే అలెగ్జాండర్ క్రీ.పూ. 324లో తీవ్ర అనారోగ్యంతో ‘బాబిలోనియా’ వద్ద మరణించాడు. ఈ వార్తవిన్న గ్రీస్‌లోని అలెగ్జాండర్ ప్రతినిధి ‘సెల్యూకస్ నికేటర్’ స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. భారతదేశంలో తన రాయబారిగా ‘మెగస్తనీస్’ను నియమించాడు. మెగస్తనీస్.. ఆనాటి భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. గ్రీకుల దండయాత్రల వల్ల ఇండో-గ్రీకు సంస్కృతి, సంప్రదాయాలు మన దేశంలో నెలకొన్నాయి. గ్రీకుల నాణేల ముద్రణా పద్ధతి, ఖగోళ విజ్ఞానం, శిల్ప శైలి భారత్‌లో ప్రవేశించాయి. అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశ చరిత్రలో కచ్చితమైన కాల నిర్ణయం చేయడానికి ఉపకరిస్తుంది. మగధ రాజ్య విజృంభణ క్రీ.పూ. 6వ శతాబ్దంలో సామాజిక, మత విషయాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ‘షోడశ మహాజనపదాల’నే 16 స్వతంత్య్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జి, మల్ల, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక (బోధన్), అవంతి, కాంభోజ, గాంధార. వీటిలో మగధ.. ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్యంగా అవతరించింది. మగధ రాజధాని రాజగృహ (గిరివ్రజపురం). ఆ కాలంలో మగధ మహాజనపదాన్ని బృహధృదవంశం పాలించేది. ఆ వంశపు చివరి రాజైన రిపుంజయుణ్ణి ఓడించిన హర్యాంక వంశీయులు మగధ సామ్రాజ్యానికి పునాదులను వేశారు. హర్యాంక వంశస్థాపకుడు బింబిసారుడు. ఇతడు గౌతమ బుద్ధుడికి సమకాలీకుడు. ఆయన తర్వాత అజాత శత్రువు సామ్రాజ్య విస్తరణకు కృషి చేశాడు. అతడు పాటలీపుత్ర నగర నిర్మాత. క్రీ.పూ. 483లో రాజగృహలో మొదటి బౌద్ధసంగీతిని (సమావేశం) నిర్వహించాడు. హర్యాంక వంశ చివరి రాజు ‘నాగదాసకుడి’ని ఓడించి ‘శిశునాగుడు’ శైశునాగవంశాన్ని స్థాపించాడు. అతని వారసుడైన ‘కాలాశోకుడు’ తన రాజధానిని ‘వైశాలి’ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. కాలాశోకుడు క్రీ.పూ. 383లో రెండో బౌద్ధ సంగీతిని ‘వైశాలి’లో నిర్వ లహించాడు. తర్వాత మగధలో మహాపద్మనందుడు క్రీ.పూ. 360లో నంద వంశాన్ని స్థాపించి పాలనలోకి వచ్చాడు. నంద వంశస్థులు మగధ సామ్రాజ్యాన్ని బలిష్టం చేశారు. వీరి వంశ చివరి రాజు ‘ధననుదుడు. ఆయనకు అలెగ్జాండర్ సమకాలీనుడని చరిత్రకారుల అభిప్రాయం. కౌటిల్యుడు (చాణక్యుడు) సహాయంతో చంద్రగుప్తుడు క్రీ.పూ. 321లో నందవంశాన్ని నిర్మూలించి మౌర్యవంశ పాలనకు పూనుకున్నాడు. మౌర్య సామ్రాజ్యం మంచి పరిపాలనదక్షుడైన చంద్రగుప్తుడు తనపై దాడిచేసిన సెల్యూకస్ నికేటర్ (గ్రీకురాజు)ను ఓడించాడు. గ్రీకుల రాయబారిగా మెగస్తనీస్ను అంగీకరించాడు. గుజరాత్లో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. చంద్రగుప్తుడు తన అవసాన దశలో జైన భిక్షువుగా మారి సల్లేఖన వ్రతం (ఉపవాస దీక్ష)ను ఆచరించి మైసూర్ సమీపంలోని శ్రావణ బెళగొళలో నిర్యాణం (మరణం) చెందాడు. చంద్రగుప్తుడి ప్రధానమంత్రి కౌటిల్యుడు (చాణక్యుడు లేదా విష్ణుశక్తి) సుప్రసిద్ధుడు. అతడు ‘అర్థశాస్త్రం’ గ్రంథాన్ని రాశాడు. అది ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మూలాధారం. చంద్రగుప్తుని అనంతరం బిందుసారుడు సింహసనం అధిష్టించాడు. అతని కుమారుడే అశోక చక్రవర్తి. అశోకుడు క్రీ.పూ. 273లో మౌర్య చక్రవర్తి అయి సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కళింగ రాజ్యం (ఒడిశా ప్రాంతం)ను ఆక్రమించుకోవడానికి భువనేశ్వర్‌కు సమీపంలోని ‘ధౌలి’ వద్ద క్రీ.పూ. 261లో ‘కళింగ యుద్ధం’ చేశాడు. ఆ యుద్ధంలో గెలిచిన అశోకుడు యుద్ధ మరణాలను, నష్టాలను, క్షతగాత్రులను చూసి పశ్చాత్తాపం చెందాడు. ఉపగుప్తుడనే బౌద్ధ గురువు వద్ద బౌద్ధమతాన్ని స్వీకరించి సత్యం, శాంతి, అహింస, న్యాయం, ధర్మం గురించి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశాడు. అశోకుడికి ‘దేవానాంప్రియా’, ‘ప్రియదర్శిని’ అనే బిరుదులున్నాయి. శ్రీనగర్ (జమ్మూకాశ్మీర్ రాజధాని) పట్టణాన్ని నిర్మించాడు. సాంద్రీ, బార్హత్, సార్నాథ్, అమరావతి స్థూపాలను ప్రతిష్టించాడు. భారత ప్రభుత్వ రాజ చిహ్నంగా ఉన్న ‘మూడు సింహాల’ (అసలు నాలుగు సింహాలు, నాలుగోది వెనుక వైపు ఉంటుంది) కిరీటాన్ని భోపాల్ దగ్గరలోని సార్నాథ్ స్థూపం నుంచి గ్రహించారు. ఆ స్థూపం నుంచే బౌద్ధ ధర్మ చక్రాన్ని పోలిన అశోక చక్రాన్ని మన జాతీయ జెండా మధ్యలో పొందుపర్చారు. అశోకుడు క్రీ.పూ. 250లో 3వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. పరమత సహనమే బౌద్ధమత ధర్మంగా భావించేవాడు. బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు సంఘమిత్రను, కుమారుడు మహేంద్రుడిని విదేశాలకు పంపాడు. భారతదేశ చరిత్రలో శిలాశాసనాలు వేయించిన మొదటి చక్రవర్తి అశోకుడు. ఈ శాసనాలు ‘బ్రహ్మీలిపి’లో ఉన్నాయి. అశోకుడు 13వ శిలాశాసనం కళింగ యుద్ధ దుష్ఫలితాలను తెలుపుతుంది. అశోకుడు తన ‘దమ్మ’ (ధర్మ) విధాన సూత్రాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో శిలాశాసనాల్లో చెక్కించాడు. బౌద్ధ ధర్మం, అశోకుడి దమ్మ విధానం వేర్వేరు. అతడు క్రీ.శ. 232లో చనిపోయాడు. మౌర్యవంశ చివరి రాజైన బృహద్రదున్ని, అతని సేనాని పుష్యమిత్రశుంగుడు వధించి శుంగవంశ పాలనకు ఆద్యుడయ్యాడు. మౌర్యుల పాలన విధానాలను తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు.. కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం, మెగస్తనీన్ ‘ఇండికా’, విశాఖదత్తుడి ‘ముద్రరాక్షసం’ గ్రంథాలు. మౌర్యుల ఆదాయ శాఖకు ముఖ్య అధికారిగా ‘సమాహర్త’, భూమిశిస్తును వసూలు చేసే అధికారిగా ‘గోపుడు’ ఉండేవారు. ఆస్తి తగాదాల పరిష్కారానికి ‘ధర్మస్థియ’, నేర విచారణ కోసం ‘కంటకశోభన’ అనే న్యాయస్థానాలుండేవి. సంగం యుగం ‘సంగం’ అంటే పాండ్యరాజులు ‘మధురై’ (రాజధాని)లో నిర్వహించిన కవి పండిత పరిషత్. క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ. 300 సంవత్సరాల మధ్యలో భారత దక్షిణాపథాన్ని పాలించిన చేర, చోళ, పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతులను తెలిపే గ్రంథాల రచననను ఆ ‘సంగం’లోని పండితులు చేసేవారు. ఆ మూడు రాజ్యాలను కలిపి ‘తమిళకం’ అంటారు. చేర రాజ్యం: కేరళలోని కొచ్చిన్, తిరువాన్ కూర్ ప్రాంతాల్లో చేర రాజ్యం వర్థిల్లింది. సెంగుత్తువాన్ చేరరాజుల్లో ప్రసిద్ధుడు. అతనికి ‘ఎర్రచేర’ అన్న బిరుదు ఉంది. చేరుల రాజధాని ‘వంజి (కరూర్)’. ‘శిలప్పాధికారం’ అనే కావ్యం సెంగుత్తువాన్ విజయాలను వర్ణిస్తుంది. చోళరాజ్యం: ప్రాచీన చోళ వంశ స్థాపకుడు ‘ఎలార’. కరికాల చోళుడు గొప్పవాడు. వీరి రాజ్యం కావేరి డెల్టా ప్రాంతంలో విస్తరించింది. కరికాలుడు కావేరి పట్టణం (ప్రహార్)ను నిర్మించాడు. కావేరి నదికి ఆనకట్టలు కట్టించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. పాండ్యరాజ్యం: కన్యాకుమారి (తమిళనాడు) ప్రాంతంలో వీరి రాజ్యం వర్థిల్లింది. రాజధాని ‘మధురై’. స్థాపకుడు ముదుకుడిమి పెరువల్లుడి. తమిళ సాహిత్య రంగంలో సంగం యుగాన్ని ‘స్వర్ణయుగం’గా పేర్కొంటారు. ఆ కాలంలోని ప్రఖ్యాత గ్రంథాలు. గ్రంథాలు రచయితలు 1. శిలప్పాధికారం - ఇలాంగో అడిగిల్ - ఇతిహాసం 2. మణిమేఖలై - సుత్తన్నై సత్తనార్ - ఇతిహాసం 3. తొల్కప్పీయం - తోల్కప్పీయర్ - వ్యాకరణ గ్రంథం 4. జీవక చింతామణి - తిరుత్తక్కదేవార్ - వైద్య గ్రంథం 5. తిరుక్కురల్ - తిరువళ్లువార్ - నీతికావ్యంగతంలో వచ్చిన ప్రశ్నలు 1. మధురైను రాజధానిగా పాలించిన వారు? (కానిస్టేబుల్ - 2012) 1) పాండ్యులు 2) చోళులు 3) పల్లవులు 4) రాష్ర్టకూటులు 2. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేశాడు? (ఎస్ఐ- 2011) 1) క్రీ.పూ. 298 2) క్రీ.పూ. 303 3) క్రీ.పూ. 302 4) క్రీ.పూ. 327 3. మగధను మౌర్యులు పాలించిన వెంటనే పాలించిన వారెవరు? (ఎస్ఐ- 2011) 1) కుషాణులు 2) పాండ్యులు 3) శాతవాహనులు 4) సుంగులు 4. ఏ రాజవంశం అత్యంత ప్రాచీనమైంది? (ఎస్ఐ- 2011) 1) గుప్తులు 2) కుషాణులు 3) మౌర్యులు 4) శాతవాహనులు 5. ‘ముద్రరాక్షసం’ అనే గ్రంథాన్ని రాసినవారు? (ఎస్ఐ- 2011) 1) కాళీదాసు 2) శూద్రకుడు 3) వరాహమిహురుడు 4) విశాఖదత్తుడు 6. పురాతన భారత భవన నిర్మాణ రంగంలో ‘ఖరోష్టి’ అనే పదాన్ని ఏ దేశంతో పరిచయ ఫలితంగా ఉపయోగించారు? (డిప్యూటీ జైలర్‌స- 2012) 1) చైనా 2) మధ్య ఆసియా 3) ఇరాన్ 4) గ్రీస్ 7. అశోకుడి శాసనాల్లో తనకు తాను ఏమని సంబోంధించుకున్నాడు? (డిప్యూటీ జైలర్‌స- 2012) 1) ధర్మకీర్తి 2) ధర్మవేద 3) చక్రవర్తి 4) ప్రియదర్శి 8. సంగం యుగంలో రచించిన ప్రముఖ తమిళ నీతి కావ్యం? (ఎక్సైజ్ కానిస్టేబుల్ - 2012) 1) మణిమేఖలై 2) తిరుక్కురల్ 3) జీవక చింతామణి 4) ఇండికా సమాధానాలు 1) 1 2) 4 3) 4 4) 3 5) 4 6) 3 7) 4 8) 2 -
తాతలకే తాత
డాక్టర్ అలెగ్జాండర్‌కు 111 ఏళ్లు న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా అమెరికాకు చెందిన డాక్టర్ అలెగ్జాండర్ ఇమిచ్ రికార్డు సృష్టించారు. 111 ఏళ్ల ఇమిచ్ జీవించి ఉన్న వారిలో అత్యంత వృద్ధుడుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. గతంలో ఈ రికార్డు ఇటలీ వాసి ఆర్తురో లికాటా పేరుతో ఉంది. 111 ఏళ్ల 357 రోజుల వయసులో గత నెలలో ఆయన చనిపోయారు. గతంలో రష్యాలో భాగంగా ఉన్న పోలాండ్లోని జెస్తోచోవాలో ఇమిచ్ 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. 1951లో భార్య వేలాతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. 1986లో ఆమె చనిపోయిన అనంతరం మన్హట్టన్లో ఒంటరిగా ఉంటున్నారు. చక్కటి ఆహార అలవాట్లు, జన్యువులే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఇమిచ్ తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువ సంవత్సరాలు జీవించిన రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన జీన్ లూయిస్ కామెంట్ పేరుతో ఉంది. ఆయన 122 ఏళ్ల 164 రోజులు జీవించారు. -
ఎదురులేని అలెగ్జాండర్ పాటలు
‘‘మా తాతగారి ట్రైలర్‌తో సినిమా లాంచ్ చేశాం. దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. జోశ్యభట్ల మంచి సంగీతాన్నిచ్చారు.’’ అని తారకరత్న అన్నారు. ఆయన హీరోగా పీయల్కే రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎదురులేని అలెగ్జాండర్’. ఈ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘తారకరత్న హీరోగా తొలి సినిమా డెరైక్ట్ చేసింది నేనే. ఈ సినిమా ఘన విజయం సాధించాలి.’’ అన్నారు. చాలా మంచి టైటిల్ ఇదని సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌లతో పోటీపడుతూ తారకరత్న ఈ సినిమా బాగా చేశారని ప్రసన్న కుమార్ అన్నారు. కీరవాణి దగ్గర 70 సినిమాలకు, రెహమాన్ దగ్గర 9 సినిమాలకు పనిచేశానని జోశ్యభట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా బసిరెడ్డి, అశోక్ కుమార్, బాపిరాజు, రవీందర్, రమేష్ రెడ్డి తదితరులు మాట్లాడారు.