మనం ఎందరో మిలియనీర్లు, బిలియనీర్ల గురించి తెలుసుకున్నాం.. కొందరు ఉన్నత వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందినవారైతే.. ఎటువంటి నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఎదిగినవారు మరికొందరు.
25 ఏళ్ల వయస్సులో స్థిరమైన సంకల్పం, మేధస్సుతో బిలియనీర్ అయ్యాడు అలెగ్జాండర్ వాంగ్. సాంప్రదాయ విద్య పరిమితులను అధిగమించి ఆవిష్కరణ శక్తితో సాంకేతిక ప్రపంచంలో ఎదిగి బిలియనీర్‌గా అవతరించిన ఇతన్ని తదుపరి ఎలోన్ మస్క్‌గా పిలుస్తున్నారు.
చిన్నప్పటి నుంచే గణితంలో విశేషమైన ప్రతిభ ఉన్న అలెగ్జాండర్ వాంగ్ గణిత, కోడింగ్ పోటీలలో పాల్గొనడానికి ఇష్టపడేవాడు. 25 ఏళ్ల వయసులో 2022వ సంవత్సరంలో వాంగ్ ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా అవతరించాడు.
ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా వాంగ్ స్థాపించిన ‘స్కేల్ ఏఐ’ సంస్థ అమెరికా వైమానిక దళం, సైన్యానికి ఆర్టిఫీషియల్ వినియోగంలో సహకారం అందిస్తోంది. దీనికి సంబంధించి 110 మిలియన్ డాలర్ల విలువైన మూడు ఒప్పందాలను ఆ సంస్థ కలిగి ఉంది.
చిన్న వయసు నుంచే..
అలెగ్జాండర్ వాంగ్ తల్లిదండ్రులు భౌతిక శాస్త్రవేత్తలు. యూఎస్ మిలిటరీ ఆయుధాల ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. వాంగ్ విద్యార్థిగా ఉన్నప్పుడే కెరియర్‌ను ప్రారంభించాడు. 17 ఏళ్ల వయసులో తోటి విద్యార్థులు ఉన్నత సిద్ధమవుతున్న సమయంలో వాంగ్.. అడేపర్ అనే కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అదే సంవత్సరం 2014లో కోరా సంస్థకి మారాడు. అక్కడ అతను టెక్, స్పీడ్ లీడ్‌గా పనిచేశాడు.
కాలేజీ డ్రాపౌట్
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ (మిట్)లో బీఎస్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేసిన వాంగ్ మొదటి సంవత్సరం పూర్తయ్యాక చదువును, హడ్సన్ రివర్ ట్రేడింగ్‌లో చేస్తున్న అల్గారిథమ్ డెవలపర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి స్నేహితుడు వాంగ్ లూసీ జియోతో కలిసి ‘స్కేల్ ఏఐ’ కంపెనీని ప్రారంభించాడు.
కోరాలో పనిచేస్తున్నప్పుడు వాంగ్, జియో కలుసుకున్నారు. యూఎస్ స్టార్టప్ యాక్సిలరేటర్ వై కాంబినేటర్ నుంచి పెట్టుబడితో ‘స్కేల్ ఏఐ’ని స్థాపించారు. వేసవి సెలవుల్లో భాగంగా ఈ స్కేల్ ఏఐని స్థాపించినట్లు తన తల్లిదండ్రులకు చెప్పినట్లుగా వాంగ్ ఫోర్బ్స్‌తో తెలిపాడు. అయితే అనుకోకుండా తాను మళ్లీ కాలేజీకి వెళ్లలేక పోయానని పేర్కొన్నాడు.
వాంగ్ కంపెనీ 2021లో 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. ఈ ఆర్థిక తోడ్పాటుతో మరింత ఎదిగిన స్కేల్ ఏఐ కంపెనీ 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ సంస్థ విలువను 7.3 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. ప్రస్తుతం అలెగ్జాండర్ వాంగ్ నికర సంపద విలువ 1 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.
Today, @scale_AI is launching our 2 major platforms to bolster government and enterprise:
— Alexandr Wang (@alexandr_wang) May 10, 2023
🎖 Scale Donovan, the AI copilot for defense
🏙 Scale EGP, full-stack generative AI for global enterprise
👇 See Donovan in action below
🧵 on our platforms and why they are so critical pic.twitter.com/RcdtnL0Btj
ఇదీ చదవండి: Virji Vohra: బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment