మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, ఉక్రెయిన్‌పై యుద్ధం వ్యూహకర్త అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె కారు బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు. పుతిన్ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్ డుగిన్‌కు పేరుంది. అయితే.. ఈ దాడి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని చేయగా.. అతడి కుమార్తె డార్యా డుగిన్ మరణించినట్లు రష్యా మీడియాలు వెల్లడించాయి. శనివారం రాత్రి మాస్కో శివారు ప్రాంతంలో ఈ కారు బాంబు దాడి జరిగింది.
సీసీటీవీ కెమెరాల్లో డార్యా డుగిన్ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి. అలెగ్జాండర్ కుమార్తె డార్యా డుగిన్‌ను ఉక్రెయిన్ ఉగ్రవాదులే హత్య చేశారని ఆరోపించారు డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అధినేత డెనిస్ పుషిలిన్. ‘అలెగ్జాండర్ డుగిన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించి.. ఆయన కూతురిని హత్య చేశారు ఉక్రెయిన్ ప్రభుత్వ ఉగ్రవాదులు. ఆమె నిజమైన రష్యా యువతి.’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
డార్యా తన కారులో ఇంటికి బయల‍్దేరగా.. మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు సంభవించింది. దాడిలో ధ్వంసమైన కారు వాస్తవానికి అలెగ్జాండర్‌ది. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అలెగ్జాండర్ వాదన కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్ బాగా ప్రభావితం చేశారు. ఆయన కుమార్తె కూడా రచయిత. కొద్ది రోజుల క్రితం అమెరికా ట్రెజరీస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ ఆంక్షల జాబితాలో డార్యా కూడా ఉన్నారు.
⭕️🇷🇺#Russia: Alexander #Dugin at the scene pic.twitter.com/oyHMxnVHkc
— 🅻-🆃🅴🅰🅼 (@L_Team10) August 20, 2022
ఇదీ చదవండి: Russia - Britain: రష్యాకు ఆ నైతిక హక్కు లేదు.. జెలెన్‌స్కీ అన్ని విధాల అర్హుడు!
Comments
Please login to add a commentAdd a comment